అటుకుల పోహాతో కేక్‌..ఎప్పుడైనా ట్రై చేశారా? | How To Make Poha Cake Recipe In Telugu | Sakshi
Sakshi News home page

అటుకుల పోహాతో కేక్‌..ఎప్పుడైనా ట్రై చేశారా?

Published Thu, Dec 28 2023 10:55 AM | Last Updated on Thu, Dec 28 2023 3:58 PM

How To Make Poha Cake Recipe In Telugu - Sakshi

పోహా కేక్‌ తయారీకి కావల్సినవి: 

మైదా పిండి – 3 కప్పులు
అటుకులు – ఒకటిన్నర కప్పులు (నానబెట్టి గుజ్జులా  చేసుకోవాలి)
అరటి పండు – 1 (ముక్కలు చేసుకోవాలి),పంచదార – 2 కప్పులు
పీనట్‌ బటర్, బటర్‌ – పావు కప్పు చొప్పున
బేకింగ్‌ సోడా – 2 టీ స్పూన్లు,పాలు – 2 కప్పులు
వెనిలా ఎసెన్స్‌ – అర టీ స్పూన్‌



తయారీ విధానమిలా:
ముందుగా మిక్సీ బౌల్లో పంచదార వేసుకుని పొడి చేసుకుని, అందులో బటర్, పీనట్‌ బటర్, అరటిపండు ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో  బేకింగ్‌ సోడా, పాలు, మైదాపిండి, అటుకుల పేస్ట్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌లో కేక్‌ మేకర్‌ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం వేసుకుని సుమారు 45 నిమిషాల పాటు ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. ఆ కేక్‌ని కాస్త చల్లారనిచ్చి.. నచ్చిన విధంగా క్రీమ్, ఫ్రూట్స్‌తో డెకరేట్‌ చేసుకుని, కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement