![How To Make Chinese Sweet Rice Cake Recipe In Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/27/Chinese-Sweet-Rice-Cake-Recipe.jpg.webp?itok=m1Ux52jY)
స్వీట్ రైస్ కేక్ తయారీకి కావల్సినవి:
బియ్యప్పిండి –100 గ్రాములు
మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున
బ్రౌన్ షుగర్ – 60 గ్రాములు,నీళ్లు – 1 కప్పు (గోరువెచ్చగా చేసుకోవాలి)
నూనె – 2 టేబుల్ స్పూన్లు,గుడ్డు – 1
తయారీ విధానమిలా:
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్‌ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా కలుపుకోవాలి.
తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని.. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్ పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment