టొమాటో ఉప్మా తయారీకి కావల్సినవి:
బొంబాయి రవ్వ›– ఒక కప్పు,టొమాటో ముక్కలు – పావు కప్పు,
క్యారట్ తరుగు – పావు కప్పు,ఉల్లిపాయ తరుగు – అర కప్పు,
బఠాణీ – అర కప్పు (నానబెట్టుకోవాలి), పచ్చిమిర్చి – 1,
అల్లం తరుగు – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, కొత్తిమీర తరుగు– కొద్దిగా,
జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి), ఆవాలు, శనగపప్పు,
మినప్పప్పు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున, పసుపు – అర టీ స్పూన్,
ఉప్పు – తగినంత, నూనె –2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – సరిపడా, నీళ్లు– 3 కప్పులు
తయారీ విధానమిలా:
ముందుగా చిన్న సెగ మీద.. రవ్వను నేతిలో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. తాలింపు సామాన్లు వేసుకుని ఆ వెనుకే ఉల్లిపాయ ముక్కలూ వేసి వేయించుకోవాలి. అనంతరం టొమాటో ముక్కలు, క్యారట్ తరుగు, ఆ తర్వాత బఠాణీలు వేసి మగ్గనివ్వాలి.
కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత పసుపు వేసుకుని మరోసారి గరిటెతో తిప్పాలి. క్యారట్ ముక్క 80 శాతం ఉడికిన తర్వాత నీళ్లు పోసుకుని.. ఎసరు మరగనివ్వాలి. అనంతరం రవ్వ వేసుకుంటూ ఉండలు కాకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గరపడే సమయంలో కొత్తిమీర తురుము, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment