upma
-
డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రాగుల ఉప్మా
బరువు తగ్గాలనే ఆలోచనలోఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ డైటింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొవ్వుపదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభించే ఆహారాలను దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్, లేదా రాత్రికి అన్నం మానేసి ఏం తినాలి అనేది పెద్ద సమస్య. ఇడ్లీ, దోసలు, నూనెతో నిండిన పూరీలు కూడా రాగులతో ఉప్మాఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్ బెస్ట్ ఆప్షన్. కడుపు నిండుగా ఉంటుంది. పోషకాలు లభిస్తాయి కూడా. రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మకాయ –1 (పలుచగా తరగాలి).తయారీ: ∙రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙ రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. వేడి వేడి ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇలాగే ఓట్స్తోగానీ, గోధుమ రవ్వతో గానీ చేసుకోవచ్చు. ఇందులో మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని, బఠానీలను కూడా యాడ్ చేసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. -
రాగులతో దూదుల్లాంటి ఇడ్లీ, రుచికరమైన ఉప్మా : ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదా!
తృణధాన్యాల్లో ప్రముఖమైనవి రాగులు (finger millets). రాగులతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాల ఉన్నాయి. రాగులలో ప్రోటీన్ , ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్ ,అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి చిన్న పిల్లలతోపాటు, వృద్ధులకూ ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులతో రకరకాలుగా వంటకాలను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.ఇడ్లీని సాధారణంగా బియ్యం ,మినప్పప్పుతో తయారు చేస్తారు.కానీ హెల్తీగా రాగులతో కూడా ఇడ్లీ తయారు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగుల పిండి ఒక కప్పు సూజీ/రవ్వ) ఒక కప్పు పుల్లని పెరుగుతాజా కొత్తిమీర (సన్నగా తరిగినవి)ఉప్పు (రుచి కి తగినంత ) అర టీస్పూన్ బేకింగ్ సోడాపోపుగింజలుకావాలంటే ఇందులో శుభ్రంగా కడిగి తురిమిన క్యారెట్ ,ఉల్లిపాయకూడా కలుపుకోవచ్చు.తయారీ : పిండి తయారీ వెడల్పాటి గిన్నెలో పిండి, రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎర్ర/ఎండు మిరపకాయలు, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పపిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి.ఇడ్లీ తయారీ: దీన్ని ఇడ్లీ కుక్కర్లేదా, ఇడ్డీపాత్రలో ఆవిరి మీదకొద్దిసేపు హైలో , తరువాత మీడియం మంటమీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోని, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రాగి ఇడ్లీ రెడీ. అల్లం, పల్లీ, పుట్నాల చట్నీతోగానీ,కారప్పొడి నెయ్యితోగానీ తింటే మరింత రుచిగా ఉంటుంది. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివే΄ాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఒక నిమ్మకాయతయారీ: రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙. రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. అంతే వేడి వేడి రాగి ఉప్మా రెడీ. ఈ ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇవీ చదవండి : రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో -
టొమాటో ఉప్మా రెసిపి.. ఇలా ఈజీగా చేసుకోండి
టొమాటో ఉప్మా తయారీకి కావల్సినవి: బొంబాయి రవ్వ›– ఒక కప్పు,టొమాటో ముక్కలు – పావు కప్పు, క్యారట్ తరుగు – పావు కప్పు,ఉల్లిపాయ తరుగు – అర కప్పు, బఠాణీ – అర కప్పు (నానబెట్టుకోవాలి), పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, కొత్తిమీర తరుగు– కొద్దిగా, జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి), ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె –2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – సరిపడా, నీళ్లు– 3 కప్పులు తయారీ విధానమిలా: ముందుగా చిన్న సెగ మీద.. రవ్వను నేతిలో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. తాలింపు సామాన్లు వేసుకుని ఆ వెనుకే ఉల్లిపాయ ముక్కలూ వేసి వేయించుకోవాలి. అనంతరం టొమాటో ముక్కలు, క్యారట్ తరుగు, ఆ తర్వాత బఠాణీలు వేసి మగ్గనివ్వాలి. కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత పసుపు వేసుకుని మరోసారి గరిటెతో తిప్పాలి. క్యారట్ ముక్క 80 శాతం ఉడికిన తర్వాత నీళ్లు పోసుకుని.. ఎసరు మరగనివ్వాలి. అనంతరం రవ్వ వేసుకుంటూ ఉండలు కాకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గరపడే సమయంలో కొత్తిమీర తురుము, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. -
ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి!
Recipes In Telugu- Upma Bonda: కొంతమందికి ఉప్మా తినడం పెద్దగా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లకు రుచికరమైన ఉప్మా బోండా చేసిపెడితే బాగుంటుంది. నిజానికి ఉప్మా మిగిలిపోయినపుడు ఈ రెసిపీ చేసుకుంటే వెరైటీకి వెరైటీ.. రుచికి రుచి కూడా! ఉప్మా బోండా తయారీకి కావలసినవి: ►ఉప్మా – ఒకటిన్నర కప్పులు ( నచ్చిన ఫ్లేవర్‌లో.. నచ్చిన విధంగా చేసుకోవచ్చు.. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి) ►శనగపిండి – ఒక కప్పు, బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ ►కారం, వాము – అర టీ స్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ఉప్మా బోండా తయారీ విధానం: ►ముందుగా శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, కారం, వాము (నలిపి వేసుకోవాలి), ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. ఉండలు లేకుండా తోపు సిద్ధం చేసుకోవాలి. ►అభిరుచిని బట్టి పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకు వంటివి అందులో కలుపుకోవచ్చు. ►అనంతరం ఉప్మా ఉండల్ని ఆ తోపులో రెండు మూడు సార్లు ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి. చదవండి👉🏾Green Dosalu Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్ దోసెలు! సాస్‌తో తింటే! -
తేటగుంట పెసరట్టు ఉప్మా తింటే లొట్టలేయాల్సిందే
అందాలరాముడు సినిమాలో నాగభూషణం ‘పెసరట్టు కావాలి’ అంటాడు. ‘పెసలు నానాలండీ’ అంటాడు సెక్రటరీ. అందుకు సమాధానంగా ‘నాను’ అంటాడు నాగభూషణం. ముళ్లపూడి రాసిన ఈ డైలాగులు అందరినీ బాగా నవ్వించాయి. పెసరట్టుని తెలుగువారు అంత ప్రీతిగా అక్కున చేర్చుకుంటారు.పెసరట్టు తెలుగువారి రుచికి చిరునామా...పెసరట్టును ఒంటరిగా కాకుండా జంటగా తినటం మరో ఆనందం. తేటగుంట పెసరట్టు ఉప్మా అంటే లొట్టలు వేయాల్సిందే. అదే ఈ వారం ఫుడ్ ప్రింట్స్ అల్పాహారంలో పెసరట్టు ఉప్మా కాంబినేషన్ లేనిదే చాలా మందికి రుచించదు. అంతటి ప్రీతికరమైన, పసందైన టిఫిన్ అది. తూర్పుగోదావరి జిల్లా తునికి సమీపాన తేటగుంట జంక్షన్లో కెనరా బ్యాంకుని ఆనుకుని ఉన్న విజయలక్ష్మీ హోటల్లో తయారయ్యే పెసరట్టు ఉప్మా రుచి చూసినవారు, ఇరుగుపొరుగులకు చెప్పకుండా ఉండలేరు. బోడ నాని, విజయలక్ష్మి దంపతులు తయారుచేసే ఈ పెసరట్టు ఉప్మాకు ప్రత్యేక ఆదరణ ఉంది. పెసలు నానబెట్టి రుబ్బడం దగ్గర నుంచి పెసరట్టు కాల్చి అందులోకి అనువైన పచ్చడితో వడ్డించే వరకు ఈ దంపతులు చూపించే శ్రద్ధే ఇంత రుచికి కారణం అంటారు. తక్కువ ధరకే ఎక్కువ రుచి: తునికి 13 కిలో మీటర్లు, అన్నవరానికి ఐదు కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన తేటగుంట జంక్షన్లో కెనరా బ్యాంకుకు దగ్గరగా, తేటగుంటకు చెందిన బోడ నాని ఈ హోటల్‌ను 2000లో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు పెసలు నానబెట్టి, ఏడు గంటల నుంచి కట్టెల పొయ్యి మీద పెసరట్లు తయారుచేస్తుంటారు. పెసరట్టు మీద అల్లం తురుము, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగుతో పాటు నూనె లేదా నెయ్యి వేస్తారు. ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉప్మా వేసి ఘుమఘుమలాడే పెసరట్టు అందచేస్తారు. అందులోకి కారం పొడి, అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి, వేరుసెనగ పచ్చడి, కొబ్బరి చట్నీ, దబ్బకాయ చట్నీలలో ఏది కావాలంటే అది వేసి ప్రేమగా అందిస్తారు. అన్నీ స్వయంగా: గొల్లప్రోలు నుంచి నెలకొకసారి నేరుగా చేలల్లో నాణ్యమైన పెసలు కొనుగోలు చేస్తున్నారు. పెసరట్టు ఉప్మాను రూ.35లకే అందిస్తున్నారు. స్టార్ హోటళ్లలో కంటే ఇక్కడి పెసరట్టు ఉప్మా రుచికరంగా ఉందంటున్నారు ఈ టిఫిన్ రుచిచూసినవారు. అడిగినవారి ఎదురుగానే ఎన్ని పెసరట్లైనా కాల్చి అందిస్తున్నారు. పెసలు నానబెట్టడం నుంచి పెసరట్లు వేయడం, సర్వ్ చేయడం వరకు అన్నీ స్వయంగా చేస్తున్నారు. రోజుకి సుమారు ఐదు వేలు ఖర్చు చేస్తున్నారు. లాభం వస్తుందనే నమ్మకం ఉండదు. ఒకరోజు వస్తుంది, ఒక రోజు రాదు, అయినా చేస్తున్నామని, దేవుడి దయ వల్ల ఇంతవరకు నష్టం రాలేదని, నాణ్యత విషయంలో రాజీ పడమని, అందుకే అందరూ వస్తుంటారని.. సంతోషంగా చెబుతారు నాని. ముఖ్యంగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నవాళ్లు, ఆలయ దర్శనం అయ్యాక ఇక్కడకు వచ్చి తింటున్నారు. ముందుగానే ఫోన్ చేసి, ఏ సమయానికి వస్తారో చెప్పడం వల్ల వారు ఇబ్బంది పడట్లేదు.. అంటారు నాని. ఎలా అడిగితే అలా చేస్తాం... మా తాత సన్యాసిరావుగారు సుమారు అరవై సంవత్సరాల క్రితం తేటగుంట గ్రామంలో టిఫిన్ల వ్యాపారం ప్రారంభించా రు. ఆయన మరణింన కొన్నాళ్లకి నేను హైవే మీద ఈ వ్యాపారం పారరంభించాను. ఇప్పటికి 20 సంవత్సరాలుగా నడుస్తోంది. నేను, మా ఆవిడ, మా అబ్బాయి సాయి.. మేం ముగ్గురమే పనిచేస్తాం. మా దగ్గర పెసరట్టు ఉప్మా బాగా ఫేమస్ అయ్యింది. టిఫిన్ తినడానికి వచ్చినవారు మూడునాలుగు తింటారు. అందుకే మా వ్యాపారంలో ఉప్మా పెసరట్టుకి ప్రాధాన్యత ఇచ్చాం. నేను ప్రారంభించిన ఐదు సంవత్సరాలకి మా హోటల్‌కి మంచి పేరు వచ్చింది. ఒకళ్లు తిని పది మందికి చెప్పడం వల్ల మా వ్యాపారం పెరిగింది. ఇప్పుడు మా మీద మాకు నమ్మకం కలిగింది. ప్రతివాళ్లు తృప్తిగా తిని, డబ్బుల గురించి ఆలోచించకుండా, పది రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్తుంటారు. అదే మాకు సంతోషం. పెసరట్టు కాల్చేటప్పుడు ఒకరు నెయ్యి, ఒకరు బటర్, ఒకరు ఆయిల్, ఒకరు జీడిపప్పు... ఇలా రకరకాలుగా అడుగుతుంటారు. ఉన్నంతలో చేస్తాను, లేదంటే వారు తెచ్చుకుని, అడిగి చేయించుకుంటారు. మా దగ్గర దబ్బకాయ పచ్చడి ప్రత్యేకం. ఇక్కడకు వచ్చినవారు సంతోషంగా ఆనందంగా వెళ్లాలన్నదే మా లక్ష్యం. –నాని, విజయలక్ష్మి – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఇన్పుట్స్, ఫొటోలు: మేళాసు సూర్యనారాయణ, తుని రూరల్ -
టమాటాబాత్ తిని అస్వస్థత
కర్ణాటక, మాలూరు: టమాటాబాత్ తిని 40మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. ఈఘటన తాలూకాలోని రాజేనహళ్లి గ్రామంలో ఉన్న కిత్తూరు రాణి చన్నమ్మ వసతి పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. పాఠశాలలో 195 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రోజులాగానే శుక్రవా రం ఉదయం కూడా టమాటా బాత్ వడ్డిం చారు. అల్పాహారం తీసుకున్న తర్వాత విద్యార్థినులు తరగతులకు వెళ్లారు. ఆ సమయంలో 40మందికిపైగా వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని సమీపంలోని తోరలక్కి ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పడకల కొరత ఉండటంతో 20 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోషకులు తమ పిల్లలకు ఏమైందోనని ఆం దోళనతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశా రు. తహసీల్దార్ నాగరాజ్, ఈఓ ఆనంద్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, పో లీసులు ఆస్పత్రికి వెళ్లి పరిశీలన జరిపారు. ప్రిన్సిపాల్, సిబ్బంది, వంట సిబ్బంది మధ్య సమన్వయలోపం కిత్తూరు రాణి చన్నమ్మ వసతి పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, వంట వారి మధ్య సమన్వయం కొరవడిందని, ప్రభుత్వం సౌలభ్యాలు విద్యార్థులకు అందడం లేదనే ఆరోపణలున్నాయి. భోజనం కూడా సక్రమంగా వడ్డించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో జెడ్పీ అధ్యక్షురాలు గీతా ఆనందరెడ్డి, ఉపాధ్యక్షురాలు యశోధా కృష్ణమూర్తిలు వసతి పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ నెలక్నొ అవ్యవస్థను పరిశీలించి ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోషకుల ప్రతిఘటన :తహసీల్దార్ నాగరాజ్ కిత్తూరు రాణి చన్న మ్మ పాఠశాలను సందర్శించిన సమయంలో పోషకులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. ఘటనపై సమగ్ర తనిఖీ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ నాగరాజ్ మాట్లాడుతూ ఆహారాన్ని పరీక్షకు పంపుతామని, అది కలుషితమైనట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
టేస్టీ దోస్త్
భిన్న అభిరుచులు ఉన్నవారే మంచి దోస్తులు అవుతారంటారు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా టేస్టీ దోస్తుల్ని లాగించి ఎంజాయ్ చేయండి. ఉప్మా పెసరట్టు ఉప్మా కోసం కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూన్; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూన్; మినప్పప్పు – ఒక టీ స్పూన్; నూనె – ఒక టేబుల్ స్పూన్ తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి నీళ్లు మరిగించాలి ∙మంట బాగా తగ్గించి బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా పోస్తూ ఆపకుండా కలపాలి ∙జీడి పప్పులు జత చేసి బాగా కలిపి ఉడికించి, దింపేయాలి. పెసరట్టు కోసం కావలసినవి: పెసలు – రెండు కప్పులు; బియ్యం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ: ∙ముందు రోజు రాత్రి ఒక గిన్నెలో పెసలు, బియ్యం, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, పెసల మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి గరిటెతో పెసరపిండిని దోసెలా వేసి, చుట్టూ నూనె వేసి పెసరట్టును దోరగా కాల్చాలి ∙కొద్దిగా ఉప్మాను పెసరట్టు మీద ఉంచి, మధ్యకు మడిచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙పెసరట్టుతో జత కలిసిన ఉప్మా పెడితే, మరో ఉప్మా పెసరట్టు అని అడగకుండా ఉండలేరు ∙భిన్న రుచుల స్నేహమంటే ఇదే. ఐస్ క్రీమ్ దోసె దోసెకు కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు; బియ్యం – 2 కప్పులు; మెంతులు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నూనె – తగినంత; తేనె – కొద్దిగా; నట్స్ – కొద్దిగా తయారీ:ముందురోజు రాత్రి ఒక పాత్రలో బియ్యం, మినప్పప్పు, మెంతులు వేసి తగిన న్ని నీళ్లు పోసి నానబెట్టాలి ∙మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, బియ్యం మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి ∙ఉప్పు జత చేసి మరోమారు గ్రైండ్ చేయాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక దోసెలు వేయాలి ∙పైన కొద్దిగా తేనె, నట్స్ వేయాలి. ఐస్ క్రీమ్: ∙మార్కెట్లో మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను తెచ్చుకోవాలి ∙దోసె కాలగానే, ఐస్ క్రీమ్‌ను దోసె మీద వేసి సమానంగా పరిచి మధ్యకు మడిచి, చల్లటి దోసెను వేడివేడిగా అందించాలి ∙కోపమనే వేడిని చల్లబరిచే స్నేహం అంటే ఇదేనేమో. కోవా కజ్జికాయ కావలసినవి :స్టఫింగ్ కోసంనెయ్యి – ఒక టేబుల్ స్పూన్; కొబ్బరి తురుము – 2 కప్పులు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూన్పైభాగం కోసంకోవా – పావు కేజీ; పంచదార పొడి – 6 టేబుల్ స్పూన్లు తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙బెల్లం తరుగు జత చేసి బాగా కలపాలి ∙ఏలకుల పొడి జత చేసి, మిశ్రమం కొద్దిగా గట్టిపడేవరకు కలుపుతుండాలి. (ఎక్కువ గట్టిపడకూడదు. అలా చేయడం వల్ల తినడానికి బావుండదు) ∙మందపాటి అడుగు ఉన్న పాత్రలో పచ్చి కోవా వేసి సన్నని మంట మీద కలుపుతుండాలి ∙కొద్దిగా వేడిగా అయిన తరవాత పంచదార పొడి జత చేసి మరోమారు కలపాలి ∙పంచదార బాగా కలిసి కోవా గట్టిపడిన తరవాత ఒక పళ్లెంలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారిన తరవాత చేతితో బాగా కలపాలి ∙తియ్యటి కోవా తయారవుతుంది ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙కోవాను నిమ్మకాయ పరిమాణంలో చేతిలోకి తీసుకుని, ఒక కొబ్బరి ఉండను అందులో ఉంచి, కొబ్బరి ఉండ కనిపించకుండా కోవాతో మూసేయాలి ∙కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుని నునుపుగా మెరిసేలా ఉండ చేయాలి ∙తియ్యటి కోవా, తీపి కజ్జికాయతో చేసిన స్నేహంతో రెండింతల రుచి అందుతుంది. బ్రెడ్ ఆమ్లెట్ కావలసినవి :బ్రెడ్ స్లయిసెస్ – 4; నెయ్యి – కొద్దిగా; కోడి గుడ్లు – 4; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూన్; ఉప్పు – కొద్దిగా; మిరప కారం – కొద్దిగా; నూనె – తగినంత తయారీ: ముందుగా స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక బ్రెడ్ స్లయిసెస్‌ను దోరగా కాల్చి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనలు వేసి బాగా గిలకొట్టాలి ∙ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, మిరప కారం జత చేసి బాగా గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కోడి గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా వేయాలి ∙పచ్చిగా ఉండగానే బ్రెడ్ స్లయిస్ దాని మీద ఉంచి, మరి కాస్త ఆమ్లెట్ మిశ్రమం బ్రెడ్ మీద వేయాలి ∙చుట్టూ నూనె వేసి కాలాక, రెండో వైపు కూడా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ∙బ్రెడ్‌తో జత కట్టడంతో ఆమ్లెట్ డిమాండు పెరిగింది. గంగ – జమున గంగ (కలాకండ్) కోసం కావలసినవి: స్వీట్ కండెన్స్డ్ మిల్క్ – ఒకటిన్నర కప్పు (400 గ్రాములు); పనీర్ – 2 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూన్; పంచదార – టేబుల్ స్పూన్; రోజ్ వాటర్ – టేబుల్ స్పూన్; పిస్తా పప్పు – 12; జీడిపప్పు లేదా బాదం పప్పు – 12; కుంకుమపువ్వు – కొద్దిగా తయారీ: ∙ బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, వేడయ్యాక సన్నగా తరిగిన పిస్తా పప్పు, సన్నగా తరిగిన జీడిపప్పు లేదా బాదం పప్పు, కుంకుమ పువ్వు రేకలు వేసి కొద్దిగా వేయించి, దించాలి ∙పనీర్ తురుముతుంటే విరిగిపోతుంటుంది. అందుకని డీప్ ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి తీసి, తురిమి పక్కనుంచాలి ∙మందపాటి పాత్రలో స్వీట్ కండెన్స్డ్ మిల్క్ పోసి, తరిగిన పనీర్ వేసి బాగా కలపాలి ∙దీంట్లో పంచదార వేసి మళ్లీ కలపాలి ∙సన్నని మంట మీద ఈ మిశ్రమం ఉన్న పాత్ర పెట్టాలి ∙కండెన్స్డ్ మిల్క్‌లో పనీర్ కరిగి, అడుగు అంటకుండా మిశ్రమం చిక్కబడేలా ఉడకనివ్వాలి ∙మిశ్రమం చిక్కపడుతుందనగానే, కిందకు దింపి చల్లారనివ్వాలి ∙నోట్: గట్టి కలాకండ్ను స్పూన్‌తో అదిమి, కొద్దిగా పాలు పోసి తయారు చేసుకోవచ్చు. జమున (జామూన్) కోసం కావలసినవి: పాల పొడి – ఒక కప్పు; మైదా – పావు కప్పు; నెయ్యి – ఒక టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బేకింగ్ సోడా – చిటికెడు; పెరుగు – ఒక టేబుల్ స్పూన్; పిస్తా పప్పులు – కొద్దిగా (అలంకరించడానికి) తయారీ: ∙ఒక పాత్రలో పాల పొడి, మైదా పిండి, బేకింగ్ సోడా వేసి కలపాలి ∙నెయ్యి జత చేయాలి ∙కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ, మిశ్రమం మెత్తగా వచ్చేలా బాగా కలపాలి ∙మిశ్రమం మృదువుగా వచ్చేలా జాగ్రత్త పడాలి ∙మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి సన్నని మంట మీద కాగనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న జామూన్లను నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. పంచదార పాకం కోసం: నీళ్లు – 2 కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – ఒక టీ స్పూన్; కుంకుమ పువ్వు – చిటికెడు; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను పాకం తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచాలి ∙పంచదార కరిగేవరకు కలపాలి (తీగ పాకం కూడా రాకూడదు) ∙రోజ్ వాటర్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙తయారుచేసిన జామూన్లను పాకంలో వేసి గంటసేపు పక్కన ఉంచాలి ∙వెడల్పాటి కప్పులో స్పూన్‌తో ఒకవైపు జామూన్, మరోవైపు కలాకండ్ వేసి సర్వ్ చేయాలి. తెల్లగా ఉంటుంది కాబట్టి కలాకండ్‌ని గంగ అని బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి జామూన్‌ని జమున అని అంటారు. ఈ రెండూ ఒకేసారి తినడంలో ఉండే తియ్యదనం, రుచి మధురంగా ఉంటుంది. -
కొత్తదనానికి ఉప్మానం
ఉప్మాలో ఏముంటుంది చెప్మా అనుకోవద్దు.ఇవి ఒట్టి ఉప్మాలు కావు. చెమ్చాతో కొంచెం కొంచెం కొరుక్కుతినాలనిపించే కొత్తతరహా పలహారాలు.ఓట్స్, మరమరాలు, అటుకులు... రొటీన్‌గా రవ్వతో కాకుండా కొత్తగా ట్రై చేసిన డిష్‌లు ఇవి.మసాలా ఇడ్లీతో ఉప్మా, దోసె ఉప్మా ఎప్పుడైనా చూశారా?వానలు పడుతున్నాయి.కొంచెం వెరైటీగా పోండి. వేడివేడిగా ఎంజాయ్ చేయండి. ఓట్స్ ఉప్మా కావలసినవి:ఓట్స్ – 2 కప్పులు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూన్; ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); పచ్చి మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – పావు కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; పంచదార – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత అలంకరణ కోసం; కొత్తిమీర – కొద్దిగా తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక, ఓట్స్, పసుపు వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించి తీసేయాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ∙అదే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి ∙ఎండు మిర్చి, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙క్యారట్ తురుము, పచ్చి బఠాణీ జత చేసి రెండు నిమిషాలు వేయించాలి ∙చివరగా ఓట్స్, పంచదార, ఉప్పు వేసి పసుపు జత చేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేగాక, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి ∙బాగా ఉడికిన తరవాత స్టౌ ఆపేసి, బాణలి దింపేసి, కొత్తిమీరతో అలంకరించి, వేడివేడిగా అందించాలి. స్పైసీ మసాలా ఇడ్లీ ఉప్మా కావలసినవి:ఇడ్లీలు – 10; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేయాలి)గ్రైండ్ చేయడం కోసం పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంతఈ పదార్థాలన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.పోపు కోసం... ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – తగినంత తయారీ: ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి ∙బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙మిక్సీలో మెత్తగా చేసిన మిశ్రమం, పావు కప్పుడు నీళ్లు జత చేసి బాగా కలిపి, రెండు మూడు నిమిషాలు కలపాలి ∙చివరగా ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలిపితే ఇడ్లీ ఉప్మా సిద్ధమైనట్లే ∙కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా అందించాలి. దోసె ఉప్మా కావలసినవి: బియ్యం – 2 కప్పులు; కొబ్బరి తురుము – అర కప్పు; పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత పోపు కోసం... నూనె – తగినంత; ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: బియ్యాన్ని సుమారు రెండు గంటలపాటు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙కొబ్బరి తురుము జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పాత్రలోకి తీసుకోవాలి ∙రెండు కప్పుల నీళ్లలో మిక్సీ జార్‌ను శుభ్రంగా కడిగి, ఆ నీటిని బాణలిలో పోసి, స్టౌ మీద ఉంచి, దగ్గరపడేవరకు కలిపి, బియ్యప్పిండి మిశ్రమానికి జత చేసి, రవ్వ దోస పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక, మిశ్రమాన్ని దోసెగా వేసి రెండువైపులా కాల్చి తీసేయాలి ∙కుకర్‌లో తగినన్ని నీళ్లు, కందిపప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ∙దోసెలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉడికించిన కంది పప్పు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలపాలి ∙నీళ్లు మరుగుతుండగా దోసె ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙దోసె ఉప్మా రెడీ అయినట్లే ∙వేడివేడిగా అందించాలి. బ్రెడ్ ఉప్మా కావలసినవి: బ్రెడ్ స్లయిసెస్ – 10; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టీ స్పూను; పోపు కోసంఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – ఒక రెమ్మ; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – ఒక టీ స్పూను తయారీ: ముందుగా బ్రెడ్ స్లయిసెస్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, బ్రెడ్ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, అల్లం తురుము వరుసగా వేసి వేయించాలి ∙సెనగ పప్పు బంగారు వర్ణంలోకి వచ్చాక ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙టొమాటో తరుగు, మిరప కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙టొమాటో ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక, బ్రెడ్ ముక్కలు వేసి అన్నీ కలిసేవరకు జాగ్రత్తగా కలియబెట్టి దింపేసి, వేడివేడిగా అందించాలి. అవలక్కి ఉప్మా కావలసినవి: అటుకులు – 2 కప్పులు; వేయించిన సెనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత పోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; నూనె – వేయించడానికి తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను తయారీ: అటుకులను తగినన్ని నీళ్లల్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా ఒంపి, పావు గంటసేపు పక్కన ఉంచాలి వేయించిన సెనగ పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కొబ్బరి తురుము జత చేసి తడిపోయే వరకు వేయించాలి ∙కడిగిన అటుకులను జత చేసి బాగా కలపాలి ∙చివరగా వేయించిన సెనగపప్పు పొడి, ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙ఆవకాయ లేదా మాగాయలో నంచుకుని తింటే రుచిగా ఉంటుంది. పోరి ఉప్మా కావలసినవి: మరమరాలు – 5 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – 3 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; పసుపు – చిటికెడు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత పోపు కోసం ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి, మరమరాలు వేసి సుమారు మూడు నిమిషాలు నానబెట్టాక, మరమరాలను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి వేయించాక, కొత్తిమీర వేసి కలియబెట్టాలి ∙వేయించిన పల్లీలు, మిరప కారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙మరమరాలు జత చేసి రెండు మూడు నిమిషాలు వేయించి వేడి వేడిగా అందించాలి. (దీనినే మరమరాల ఉప్మా అని కూడా అంటారు). రాగి సేమ్యా ఉప్మా కావలసినవి: రాగి సేమ్యా – పావు కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; ఎండు మిర్చి – 4 (చిన్న ముక్కలు చేయాలి); ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; నూనె – తగినంత; ఉప్పు – తగినంత తయారీ: రాగి సేమ్యాను తగినన్ని నీళ్లల్లో సుమారు రెండు మూడు నిమిషాలు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, సేమ్యాను ఇడ్లీ ప్లేట్లో ఉంచి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండు మిర్చి వేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ∙చివరగా ఉడికించిన సేమ్యా జత చేసి బాగా కలిపి వేడివవేడిగా అందించాలి. పెరుగు ఉప్మా కావలసినవి: బియ్యం – ఒక కప్పు; కొబ్బరి తురుము – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పుల్ల పెరుగు – ముప్పావు కప్పు; సెనగ పప్పు – టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు–అర టీ స్పూన్; కరివేపాకు – రెమ్మ తయారీ: బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ మిశ్రమం తయారుచేసుకోవాలి (మరీ చిక్కగాను, మరీ పల్చగాను ఉండకూడదు) ∙ఒక గిన్నెలో సెనగ పప్పును రెండు గంటలసేపు నానబెట్టుకొని, బియ్యప్పిండి మిశ్రమంలో కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙మినప్పప్పు, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙బియ్యప్పిండి, పెరుగు మిశ్రమం వేసి బాగా కలపాలి ∙మిశ్రమం ఉప్మాలా విడివిడిలాడే వరకు సుమారు అరగంట సేపు ఉడికించి దించేసుకుని వేడివేడిగా అందించాలి. ఉప్మా.. ఉత్తమం... కాలాలు మారినా, తరాలు మారినా, మానవుని శక్తికి యుక్తికి మూలాధారం ఆహారమే. నాగరికత పరిణామ క్రమంలో ప్రకృతి ప్రసాదించిన అపక్వ (వండని) ఆహార సేవన నుండి, పదార్థాలను కాల్చి, ఉడికించి తినటం, అనంతరం వివిధ ద్రవ్యాలతో పచనం (వండి) చేసి తినటం వరకు మార్పు చోటుచేసుకుంది. అంతవరకు ‘ప్రగతి’గానే భావించవచ్చు. కాని ప్రస్తుతం మితిమీరుతున్న ‘క్షణాల్లో వంటలు, అధిక కాలం నిల్వచేసిన భక్ష్యాలు’ పరిశీలిస్తే అర్ధరహితమైన వ్యాపారకోణం మాత్రమే ప్రస్ఫుటమౌతోంది. పోషక విలువలు లేని, శరీరానికి హానికరమైన ఆహారాలకు, ఆ రుచులకు సమాజం బానిసైపోతోంది. ఈ నేపథ్యంలో సనాతన వంటకాలకు ఆదరణ పెరుగుతోందనేది నిర్వివాదం. విజ్ఞులంతా ఆ పోకడలకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి వాటిలో అత్యంత ఉత్తమమైనది ‘ఉప్మా’. రోజులో ప్రధాన ఆహారాన్ని ‘భోజనం’అనీ, ఇతర సమయాల్లో తక్కువ పరిమాణాలలో తినేవాటిని ‘ఉపాహారం లేదా అల్పాహారం’ అనీ పిలుస్తుంటాం. ఉప్మా మనం ఉదయం పూట తినే అల్పాహారాలలో ప్రధానమైనది. దీనికి కారణం అప్పటికప్పుడు సునాయాసంగా తయారుచేసుకోగలగటం. కొంతమంది రాత్రిపూట భోజనానికి బదులు ఉప్మాను ఆస్వాదిస్తారు. దీనిని ‘బోంబే రవ్వ’గా పిలవబడే ‘నూక’ లేదా ‘మొరుము’ తో తయారుచేస్తారు. దీని మూలం గోధుమలు. వాస్తవానికి పాత రోజుట్లో వరి నూక (రవ్వ)తో ఉప్పుడు పిండిని తయారుచేసుకునేవారు. ఈ రెండింటి తయారీలో చాలా సారూప్యత ఉంది. రుచి భేదం కూడా సుస్పష్టం. బొంబాయి రవ్వ ఉప్మా:గోధుమల పై పొట్టు తీసేసి పాలిష్ చేసి మిల్లులో ఆడి రవ్వ తయారుచేస్తారు. (పూర్తిగా మెత్తగా చేస్తే పిండి అంటాం). ఈ రవ్వ అతి సన్నం, కొంచెం పెద్ద సైజులలో రెండు రకాలుగా ఉంటుంది. ఈ పెద్ద సైజునే ‘సెమోలినా’ అంటారు. హిందీలో ‘సూజీ’ అంటారు. తయారీ విధానం: ఇది అందరికీ తెలిసిందే. ముందుగా రవ్వను పొడిగా (తడి తగలకుండా) వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంత పప్పులు, కరివేపాకు, ఆవాలు, మిర్చిలతో కూడిన పోపును తైల సంస్కారంతో (నూనెలో వేయించి) తయారుచేసుకుని, దానిలో కావలసిన నీరు పోసి, మరిగించి, ఈ రవ్వను మెల్లమెల్లగా కలుపుతూ (తగినంత ఉప్పుతో సహా) ఉడికిస్తే ఉప్మా సిద్ధమౌతుంది. చివరి దశలో కొంతమంది ‘నేతిని’ కలుపుతారు. ఇవి ఉప్మాకు కావలసిన ప్రాథమిక ద్రవ్యాలు. అభిరుచిని బట్టి వేగిన పోపులో జీడిపప్పు, వేరుసెనగ పలుకులు కొందరు కలుపుకుంటారు. మరికొందరు వీటికి తోడు రకరకాల కూరముక్కలు (క్యారట్, మటర్, బంగాళదుంప, క్యాబేజీ, బిరియానీ బీన్సు వంటివి) కూడా జత చేస్తారు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం సాధారణమైపోయింది. కొన్ని ప్రాంతాలలో (ఉత్తర భారతంలో) తయారైన పోపులో వేయించిన రవ్వను కలిపి, అనంతరం మరిగించిన నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుతారు. దీనివలన ఉండలు కట్టదు. పోషక విలువలు: రవ్వలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు తగినంతగాను, కొవ్వులు అత్యంత తక్కువగాను ఉంటాయి. పీచు సమృద్ధిగా ఉంటుంది. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింకులు కూడా ఉంటాయి. బి కాంప్లెక్సు విటమిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ – ఇ, సెలీనియం కూడా ఉంటాయి. ఆరోగ్య ఫలితాలు:ఉప్మా చాలా నిదానంగా అరుగుతుంది కనుక వేరే చిరుతిళ్ల మీద ధ్యాస ఉండదు. రక్తహీనతను తగ్గించి, ఎముకల బలాన్ని పెంచి, వ్యాధినిరరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. సుఖవిరేచనం జరుగుతుంది. మూత్రపిండాలకు, గుండెకు కూడా బలకరం. మనం కలుపుకునే జీడిపప్పు లేదా వేరుసెనగ పలుకులు, ఇతర కూరగాయల యొక్క పోషకవిలువ వలన అధిక ప్రయోజనం ఉంటుంది. మితంగా సేవిస్తే బరువును కూడా తగ్గించే గుణం గోధుమకు ఉంది. పిల్లలకైనా, పెద్దలకైనా నీరసాన్ని తగ్గిస్తుంది. ఇతర ద్రవ్యాలతో ఉప్మాలు: వరి రవ్వ (నూక): ఇది అసలైన సనాతన సాంప్రదాయక అల్పాహారం. దీని పేరు ఉప్పుడు పిండి. దీనిలో ఉండే ప్రధాన ప్రత్యేక ఇంగువను పోపులో తగినంత వేస్తారు. స్వచ్ఛమైన నువ్వులనూనెను వాడతారు. ఉప్మాలో మాదిరి ఇతరమైన అధికపదార్థాలను కలపరు. మిగిలిన తయారీ విధానం సమానమే. ఈ నూకను దంపుడు బియ్యం నుండి కూడా తయారుచేస్తారు. వరిలో ఉండే అన్ని పోషకవిలువలూ లభిస్తాయి. ఇంగువ జీర్ణాశయాన్ని శుద్ధి చేసి, ఆకలి పెంచుతుంది. దలియా: ఇది పొట్టు తీయని గోధుమల నుండి తయారయ్యే కొంచెం పెద్ద సైజులో ఉండే రవ్వ. పొటాషియం, విటమిన్ బి 6 సమృద్ధిగా లభిస్తుంది. అటుకులు: వరి ధాన్యం నుండి తయారవుతాయి. సన్నని, దⶠసరి రకాలు లభిస్తాయి. గోధుమలలో ఉండే గ్లూటెన్ దీంట్లో ఉండదు. ఐరన్, క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. సునాయాసంగా జీర్ణమై బలాన్ని సమకూరుస్తుంది. మొక్కజొన్న రవ్వ: ఇది బజారులో లభిస్తుంది. దీని పోషక విలువలను అనుగుణంగా ప్రయోజనం సమకూరుతుంది. కొర్ర బియ్యం: ఇవి చాలా సన్నగా చిన్న పరిమిణంలో ఉంటాయి కనుక దీనిని ర్వగా చేయనవసరం లేదు. ఓ గంటసేపు నీటిలో నానబెట్టిన తరువాత ఆ నీటిని తొలగింఇచ ఉప్మాను తయారుచేసుకోవచ్చు. దీనిలో పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి కనుక మధుమేహం ఉన్నవాళ్లకి కూడా చాలామంచిది, బలకరం కూడా. గమనిక: ఓట్సు, సేమ్యాలతో కూడా ఉప్మా చేస్తారు. ఇవి కడుపులో వాయువును వృద్ధి చేస్తాయి. శరీరానికి మైదా మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి భారతీయుల ఉప్మాలలో ఇవి అంత శ్రేష్ఠం కావు. తినేటప్పుడు పైన చెప్పిన ఏ రకం ఉప్మా లేక ఉప్పుడుపిండిలోనైనా కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే రుచి పెరుగుతుంది. విటమిన్ ‘సి’ సమకూరుతుంది.గుర్తుంచుకోవలసిన సారాంశం:ఉప్మ చేయుట సులభమ్ము ఉత్తమమ్ముపాత ఉప్పుడుపిండియున్ బలకరమ్ముఅటుకులు దలియ గోధుమల్ పటుతరమ్మెఅన్ని వయసులవారికిన్ ఆప్తబంధు – డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు జై ఉప్మా .. జై సేమ్యా ఉప్మా జనాలు ఉత్తి పుణ్యానికి ఉప్మా మీద పడి ఏడుస్తుంటారు కానీ అసలూ ... ఉప్మా ఎంత బావుంటుందో తెల్సా! మండే ఎండల్లో వండివార్చలేని పూట ఆకలితో మాడకుండా ఆదుకునే అమృతమేరా ఉప్మా అంటే అన్నంపప్పుకూరలు ఇప్పుడేం చేస్తామని బద్ధకించే ప్రాణానికి అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణేరా ఉప్మా అంటే ముగ్గురికి సరిపోయే రవ్వకి ఓ గ్లాసుడు ఎక్కువ నీళ్లు పోస్తే ఐదుగురికి సరిపోయే అద్భుతమేరా ఉప్మా అంటే కూరముక్కలేసినా పొంగిపోక వేయకపోతే కుంగిపోక స్ధితప్రజ్ఞతతో మన కడుపులో సర్దుకుపోయేదేరా ఉప్మా అంటే ఎర్రరవ్వైనా ఏడిపించక తెల్లరవ్వైనా పోజుకొట్టక చిటికెలో తయారై చింత తీర్చేదేరా ఉప్మా అంటే సేమ్యాతో చేస్తే సూపర్ హిట్‌గా బియ్యపురవ్వతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచే మినిమం గ్యారంటీ వున్న ఏకైక డిష్రా ఉప్మా అంటే .. నేతితో చేసినా.. నూనెతో చేసినా రుచిలో మాత్రం సాటిరాదు దీనికేదైనా చట్నీ లేకపోయినా చింతించక, ఆవకాయతో అమాంతం జతకట్టేస్తుంది .. ఊరగాయ అందుబాటులో లేకపోయినా.. నిమ్మచెక్క పిండితే చాలు నోరూరించేలా సిద్ధమైపోతుంది జీడిపప్పు వేయకున్నా ఏమనుకోదు కరివేపాకు వేయకున్నా కలవరపడదు కొత్తిమీర చల్లితేనే పొంగిపోయి ఘుమఘుమలాడే ఆత్మీయ నేస్తమురా ఉప్మా అంటే ... అకాల క్షుద్బాధకు చెక్ చెబుతూ... సకాలంలో తయారైపోయే డిష్... ఉదయమైనా సాయంత్రమైనా... అర్ధరాత్రైనా .. ఉన్నట్టుండి బంధువులొస్తే... ఉప్మారవ్వ ఉంటే ఇంట్లో కొండంత నిశ్చింత ఉన్నమాట ఒప్పుకోవాలి ఎప్పుడో ఒకప్పుడు తప్పదు... అందుకే మరి చెప్పేదేంటంటే .,, ఉప్మాని ఆరగిస్తూ వుంటే మీకు అన్నీ ఇట్టే కలిసొచ్చేస్తాయి... (చాలా బాగా టేస్టీగా వచ్చిందన్న ఆనందంతో ) – కాత్యాయని ఇటీవల కొంతకాలంగా వాట్సాప్‌లో వీరవిహారం చేస్తోన్న కొన్నింటికి ఉపమాలంకారమిది. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
నీ చేతులతో టీ పెట్టివ్వమ్మా
మన దేశంలో ‘చాయ్‌వాలా’ కు చాలా పాపులారిటీ ఉంది. 26 ఏళ్ల ఉప్మా విర్ది ఆ పాపులారిటీని ప్రపంచ వ్యాప్తం చేస్తోంది. విషయం ఏంటంటే ఆమె చాయ్వాలీ! వాళ్ల తాత ఆయుర్వేద వైద్యుడు. చాయ్ కాచడంలో దిట్ట.విర్ది చిన్నపిల్లగా ఉన్నప్పుడు హెర్బల్ టీ కాచడం ఎలాగో నేర్పాడట. ఇష్టంగా నేర్చుకుంది కాని దాని మీద శ్రద్ధ పెట్టే అవకాశం తాను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడూ రాలేదట. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి, ‘లా’లో అడ్మిషన్ దొరికాక అప్పుడొచ్చింది ఆమెకు ఆలోచన. పార్ట్‌టైమ్ జాబ్‌గా టీ లా చదువుతూనే పార్ట్ టైమ్‌గా టీ కాచడం మొదలుపెట్టింది విర్దీ. ఆస్ట్రేలియన్స్కి ఈ ఇండియన్ గర్ల్ చేస్తున్న దేశీ చాయ్ పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఆమె లా పూర్తయ్యేలోపు చాయ్‌వాలీగా ఫేమస్ అయిపోయింది. చిత్రంగా లాయర్‌గా ప్రాక్టీసే పార్ట్ టైమ్ అయిపోయి చాయ్‌వాలీగా ఫుల్‌టైమ్ బిజీ అయింది. ఇంకేముందీ ఆన్లైన్లో చాయ్ బిజినెస్ ప్రారంభించింది. వెరైటీ టీలను కాచడమెలాగో నేర్పిస్తోంది. టీ, దానికి సంబంధించిన అనుబంధ ఉత్పత్తులను. అంటే పాట్స్, కెటిల్స్, టీతో తయారైన చాక్లెట్స్ వంటివి అమ్ముతోంది. వీటికి ఎంత డిమాండ్ అంటే యూరప్ నుంచి కూడా ఆమె ఆర్డర్స్ వస్తుంటాయి. వర్క్‌షాప్స్ కండక్ట్ చేయమని రిక్వెస్టులూ అందుతుంటాయి. చేస్తోంది కూడా. అన్న పెళ్లికి వేల కప్పులు ఉప్మా విర్ది స్వస్థలం చండీగఢ్. ఇంటికి ఎవరు వచ్చినా టీ ఇచ్చే బాధ్యత తీసుకునేదట. తన అన్న పెళ్లప్పుడు ఇంటికి వచ్చిన అతిథులందరికీ వేల కప్పుల టీ కాచి అందించిందట. ‘‘మా పేరెంట్స్ అలసిపోయి ఇంటికి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్.. ‘ఉప్మా.. నీ చేతులతో టీ పెట్టివ్వవా?’ అనే. స్కాలర్షిప్ మీద ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ మా హాస్టల్లో ఉన్న వాళ్లందరికీ టీ పెట్టిచ్చేదాన్ని. నా టీ కోసమే వాళ్లంతా ఒక చోట గ్యాదర్ అవడం మొదలుపెట్టారు. అంతకుముందు ఎవరికి వారే యమునా తీరే’’ అంటుంది విర్ది. అన్నట్టు.. బిజినెస్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ (2016), ఇండియన్ ఆస్ట్రేలియన్ బిజినెస్ అండ్ కమ్యూనిటీ అవార్డ్స్(ఐఏబిసిఏ)కు కూడా ఎంపికైంది ఉప్మా విర్ది. మెల్బోర్న్ టీ ఫెస్టివల్‌కు ప్రత్యేక అతిథిగా ఆమెకు ఆహ్వానం అందింది. ‘‘మన దేశ చాయ్ రుచిని ప్రపంచమంతటికీ తెలియజేయాలన్నదే నా లక్ష్యం’’ అంటోంది ఉప్మా విర్ది. – శరాది -
జాతీయ వంటకంగా ఉప్మా.....
న్యూఢిల్లీ: తెలుగులో ఉప్పిండి, కన్నడలో ఉప్పిట్టు, తమిళంలో ఉప్మా (ఇప్పుడు తెలుగులో కూడా ఉప్మా అని పిలుస్తున్నారు)ను జాతీయ వంటకంగా ప్రకటించాలంటూ ప్రచారం గురువారం ట్విట్టర్లో జోరుగా సాగింది. ప్రముఖ భారతీయ చెఫ్లైనా ఫ్లాయిడ్ కార్డోజ్, ఆరతి సంపత్‌ల కారణంగా అమెరికాలో కూడా డిష్‌కు ఎంతో పేరు వచ్చింది. ఉప్మాకున్న ప్రత్యేక గుణమేమంటే ఎలా చేసినా బాగుంటుంది. అందుకని వంటల వల్లభులు తమదైన శైలీలో ఉప్మా చేసి ఇతరులను మెప్పించాలనుకుంటారు. కొందరు ఉప్మాను పొపు గింజలు, మసాల దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, పశ్చి మిరపకాయలు, ఉల్లిపాయలతో సాదా సీదాగా చేస్తే, మరికొందరు పల్లీలు, కాజు, బఠానీలు జోడిస్తారు. ఇంకొందరు వాటికి టమోటా, బీన్స్, పుట్టగొడుగులు కలిపి చేస్తారు. కొందరు మామూలు నూనెతో చేస్తే మరికొందరు నెయ్యితో చేస్తారు. పచ్చి కొబ్బరి పాలతో కూడా చేస్తారు. ఇంకొందరు మాంసం, చేపలతో ఉప్మా చేస్తారు. మన చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ అమెరికాలో జరిగిన రెండు రియాలిటీ కుకింగ్ షోలో చికెన్, పుట్టగొడుగులు, కొబ్బరి పాల మిశ్రమంతో ఉప్మా చేసి రెండుసార్లు మొదటి ప్రైజ్ కొట్టేశారు. ధాన్యంతో చేసిన బ్రెడ్, చేపలతో ఉప్మా చేసిన ఆరతి సంపత్ వెనకబడ్డారు. ఆమె చేసిన డిష్‌ను కూడా ఆవురావురు మని తిన్నారట. ఉప్మాను గోధమ, బియ్యం తదితర రవ్వలతో చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవమైన ఈ రోజున ఉప్మాను భారత జాతీయ డిష్‌గా ప్రకటించాలనే విషయం ఎందుకొచ్చిందంటే...తమిళ నటుడు, దర్శకుడు రాధాకష్ణన్ ప్రతిబన్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప్మాను జాతీయ డిష్‌గా ప్రకటిస్తే బాగుంటుందని మొదట ప్రతిపాదించారు. తాను సహాయ దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు కాలే కడుపును ఉప్మాతోని ఎలా నింపుకునేదో చెప్పారు. ఆరోజుల్లో ఎంతోమంది సహాయ దర్శకులు ఆర్థిక స్థోమత అంతగాలేక ప్రతిరోజు ఉప్మాతోనే జీవించే వారట. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో ఆ పరిస్థితి ఉందని చెబుతారు. ఇది వెంటనే ట్విట్టర్లో వైరల్ అయింది. కొందరు జాతీయ డిష్‌ను ప్రకటించాల్సిన అవసరం లేదంటే కొందరు ఉప్మా కాకుండా ప్రత్యామ్నాయాలు సూచించారు. జాతీయ డిష్ అవసరం లేదంటూ దేశభక్తులు కూడా సెటైర్లూ వేశారు. బిర్యానీలను, పులిహోరాను, అటుకులతో చేసిన డిష్‌లను వంటకాలను జాతీయ వంటగా గుర్తించాలన్నారు. ఉప్మాకు కూడా ఎక్కువ మందే మద్దతు పలికారు. అయితే ఉప్మాను జాతీయ వంటకంగా గుర్తించడం వల్ల ఇడ్లీ, దోశ, పూరి లాంటివి చిన్నబోయాయని కూడా వ్యాఖ్యలు చేశారు. -
ధర్మేచ... అర్థేచ... ఉప్మేచ!
హ్యూమర్ ‘‘ఉపమాలంకారం అంటే ఉప్మా అనే టిఫిన్‌తో మన డైనింగ్ టేబుల్ అందాలను మరింత ఇనుమడింపజేయడం అన్నమాట. అందుకే దాన్ని ఉపమాలంకారం అన్నారు’’ అంటూ ఏదో లెక్చర్ ఇస్తున్నాడు మా రాంబాబు గాడు. ‘‘నీ ముఖం ఉపమాలంకారం అనేది ఒక వ్యాకరణ ప్రక్రియ అనుకుంటా. పోలికలు అందంగా చెప్పే అనేక తరహా రకాల్లో అదీ ఒకటి అనుకుంటా. నీకు తెలియకపోతే నోర్మూసుకో... కానీ ఇలా అడ్డమైన వ్యాఖ్యానాలు చెయ్యకు’’ అంటూ మరింతగా కోప్పడ్డాను నేను. నా కోపానికి అసలు కారణం వేరే ఉంది. ఉదయం టిఫిన్‌లోకి మా ఆవిడ ఉప్మా చేయడంతో కాస్త ధుమధుమలాడుతూ బయటకు వచ్చేశా. మామూలుగా అయితే ఇడ్లీ పట్ల నాది కాస్త ఫ్రెండ్లీ ధోరణి. ఉప్మా అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ టిఫిన్లలోకెల్లా కాస్త త్వరగానూ, వీజీగానూ చేసేయవచ్చని మా ఆవిడ మాటిమాటికీ ఉప్మా చేస్తుంటుంది. ‘‘ఒరేయ్... అసలే ఇష్టమైన టిఫినూ దక్కలేదు. పైగా నీ గోల ఏమిట్రా’’ అంటూ వాడిపై మరింత విరుచుకుపడ్డాను. ఆ కోపమూ, ఈ కోపమూ కలిపి రాంబాబు గాడి మీద వెళ్లదీశాన్నేను. అంతే... వాడు ఉప్మా గురించి నాకు హితబోధ మొదలుపెట్టాడు. ‘‘ఒరేయ్ నాయనా... ఎప్పుడైనా టిఫిన్ల ప్రస్తావన వచ్చినప్పుడు ఉప్మా-పెసరట్ అద్భుతంగా ఉంటుందన్న మాట విన్నావా?’’ అడిగాడు. ‘‘విన్నాను’’ ‘‘అందుకే మరి... కేవలం ఒక్క డైనింగ్ టేబుల్‌కు మాత్రమే ఉప్మా తలమానికం కాదురా... దోసెనూ ఉప్మాతోనే అలంకరిస్తారు. అందుకే ఇలా పలహారబల్లలనూ, దోసెల్నీ... మరెన్నింటినో ఉప్మాతో అలంకరించే అవకాశం ఉంది కాబట్టే అలంకార శాస్త్రంలో ఉప్మాకు టిఫిన్లలో పెద్దపీటకు బదులు పెద్దటేబుల్ వేశార్రా. అంతేకాదు... మనం పరిశ్రమ పరిశ్రమ అంటూ అభివర్ణించుకునే సినిమా రంగం అంతా మూవీ హిట్టు కొట్టాలంటే ఉప్మా మీదే ఆధారపడి ఉంది’’ అంటూ తన జిహ్వాగ్రం మీది ఉప్మాగ్ర చర్చలతో వాతావరణాన్ని మరింతగా వేడెక్కించాడు. ‘‘ఒరేయ్... నన్ను మరీ ఇంత వేధించకు రా... ఉప్మాకూ సినిమా హిట్స్కూ సంబంధం ఏమిట్రా?’’ అడిగాన్నేను. ‘‘మొన్న బ్లాక్‌బస్టర్ అయిన మహేశ్‌బాబు పోకిరి సినిమా చూశావా? అందులో హీరోయిన్ ఎప్పుడూ బాక్స్‌లో ఉప్మా పెట్టుకు తిరుగుతుంటుంది. హీరోయిన్ తమ్ముడు కూడా ఉప్మానే బాక్స్ కట్టించుకుంటాడట. దాంతో హీరో ‘ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినే బతికేస్తున్నార్రా’’ అని సరసమాడతాడు’’ అన్నాడు రాంబాబు గాడు. ‘‘కరెక్టే రా’’ అన్నాన్నేను. ‘‘నిన్నా మొన్నా మాత్రమే కాదురా బాబూ... దాదాపు 40 ఏళ్లకు ముందు అడవి రాముడు అన్న సినిమాలో రాజబాబు అనే మహనీయ కమేడియన్ ఉప్మా తయారు చేస్తే అడవిలో పెద్దపులి తనకు నోరూరించే దుప్పులూ, జింకలూ వంటి వాటిని వేటాడటం మానేసి ఉప్మా గిన్నెను శుబ్బరంగా ఊది పారేసింది. అంటే పులికి సైతం ఇష్టమైన వంటకం ఉప్మాయే అన్నమాట. అంతెందుకు... సదరు ఉప్మా వండిన రాజబాబు సైతం ‘పులి ఉప్మా తిందేమిటి చెప్మా’ అంటూ ఆశ్చర్యపడిపోతాడు. మొన్నటి బజ్‌వర్డ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినేసి బతికేస్తున్నార్రా అయితే ... నలభై ఏళ్లకిందట ఫేమస్ డైలాగ్ ’పులి ఉప్మా తిందేమిటి చెప్మా’. నీకో సీక్రెట్ చెప్పనా? ఏదైనా సినిమాలో ఉప్మాకు సంబంధించిన డైలాగ్ బజ్‌వర్డ్ అయ్యిందంటే ఆ సినిమా అప్పటి అడవిరాముడు లాగో, మొన్నటి పోకిరీ లాగో సూపర్, డూపర్, బంపర్ హిట్టన్నమాట’’ అంటూ వాక్రుచ్చాడు వాడు. అంతకు ముందు నేనెప్పుడూ ఎరగని సెంటిమెంట్ ఇది. ఫలానా అక్షరంతో సినిమా మొదలవ్వాలనీ, ఫలానా నటుడే తప్పనిసరిగా ఉండాలనీ... ఇలా సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువే అన్న విషయం నాకు తెలుసు. కానీ... ఇలాంటి సెంటిమెంట్ అంటూ ఒకటి ముందుకొస్తే... ఉప్మాకు ప్రాధాన్యం పెరిగి, అది ఉప్మా పెసరట్ టిఫిన్‌లో కేవలం మెగాపవర్ పెసరట్టు సరసన మాత్రమే హీరోయిన్గా కాకుండా... అనేక టిఫిన్ల సరసన ఉప్మాయే హీరోయిన్ అయి జతకడితే ఎలా అన్న ఆందోళన మొదలైంది నాకు. ‘‘ఒరేయ్... అలా అడ్డదిడ్డంగా మాట్లాడి నీ మాటలు సినిమా వాళ్లు వినకుండా చూసుకో’’ ‘‘నోనో... ఐయాం సారీ. కొన్ని సిన్మాలలో ఉప్మాకు తగినంత ప్రాధాన్యం దొరికినా... దాని పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. నిజానికి కుట్టుపిండి, రవ్వ ఉప్మా, మసాలా ఉప్మా, టమాటా బాత్ అంటూ వివిధ రకాలుగా చిన్నా చితకా వేషాలు వేస్తున్నప్పటికీ ఉప్మాకు తగినంత బ్రేక్‌థ్రూ రాలేదు రా. అందుకే నాకు గనక అవకాశం దొరికితే సినిమా ఇండస్ట్రీ వారికి ఉప్మాతో హిట్ కొట్టడం ఎలా అన్నది వివరంగా తెలియజెబుతాను. ప్రస్తుతం నా జీవితలక్ష్యం ఒకటే రా?’’ ‘‘ఏమిటది?’’ అడిగాను నేను బితుకు బితుకుమంటూ. ‘‘అన్నట్టు ఇవ్వాళ్ల టిఫిన్‌లో మీ ఆవిడ ఉప్మా చేసిందన్నావు కదా. మీ ఇంటికెళ్లి అలా కాస్త టిఫిన్ తినేసి వస్తా. నీ ఫ్యామిలీ ఏమిటీ... నా ఫ్యామిలీ ఏమిటి. వసుధైక కుటుంబం అంటారే... ఆ స్టైల్లో మనదంతా ఉపమైక కుటుంబం? అన్నట్టు నీకో మాట చెబుతా విను. ధర్మేచ... అర్థేచ... ఉప్మేచ అని ఆర్యోక్తి. కాబట్టి ఉప్మా వండినందుకు నిరసనగా భార్య మీద అలిగి బయటకు రాకూడదన్నది మంత్రాల అంతరార్థం రా బాబూ ’’ అంటూ మా ఇంటి వైపునకు కదిలాడు రాంబాబుగాడు. - యాసీన్ -
కరివేపాకు తీసిపారేయకండి
ఉప్మాలో కరివేపాకులా అంటూ ఉంటారు కానీ, కరివేపాకు లేకుంటే ఉప్మా చెయ్యడమే మానేస్తారు గృహిణులు. పులుసు, కూర, చారు, పులిహోర, సాంబారు, పచ్చడి... వీటిలో ఏ ఒక్కదానిలోనూ కరివేపాకు లేనిదే రుచి పుట్టదు, సువాసన రాదు. సుగంధ ద్రవ్యాలలో దీని తర్వాతి స్థానమే దేనిదైనా సరే! ఒకప్పుడు పల్లెటూళ్లలో ఇంచుమించు ప్రతి ఇంటి పెరట్లోనూ కరివేపాకు చెట్టు ఉండేది. అన్నట్టు కరేపాకులో ఎన్నో ఔషధ విలువలున్నాయి. ఆయుర్వేదంలో అయితే దీని ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, బెరడు, వేరు... అన్నింటినీ ఉపయోగిస్తారు. ఇటీవలకాలంలో సౌందర్యసాధనంగానూ దీనిని ఉపయోగిస్తున్నారు. స్థూలకాయంతో బాధపడేవారు రోజూ ఓ టేబుల్ స్పూన్ కరేపాకు పొడిని లేదా ముద్దను మజ్జిగతో పాటూ తీసుకుంటూ ఉంటే స్థూలకాయమే కాదు... దానిమూలంగా వచ్చే మధుమేహం కూడా తగ్గుతుందట. ఇండియా, శ్రీలంకలలో విరివిగా కనిపించే కరివేప... తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అడవులలో విపరీతంగా కనిపిస్తుంది. అన్నట్టు ఆంగ్లంలో దీన్ని కర్రీ లీవ్స్ అంటారని అందరికీ తెలుసు కానీ, స్వీట్ నీమ్ లీవ్స్ అనీ, చైనీస్ బాక్స్ ట్రీ అని కూడా అంటారు. అలాగే తెలుగులో దీన్ని పూల వెలగ అని కూడా అంటారట. తిండి గోల -
పరీక్షల ఫలహారం
పిల్లల పరీక్షలొస్తుంటే చదువుల మాట ఏమో కాని, వారి ఆహారం పూర్తిగా నిర్లక్ష్యమవుతుంది. జంక్ ఫుడ్, కప్పుల కొద్దీ కాఫీ, టీ వంటివి నిరంతరం తీసుకునేవారు సైతం పరీక్షల సమయంలో ఆహారాన్ని దూరం పెట్టేస్తారు. అందుకే పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే ముందు నుంచే వారి ఆహారం గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.ముందుగానే పిల్లలతో చర్చించి, వారు ఏ ఆహారానికి ఎక్కువ... ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకుని వాటితోనే వారికి కావలసిన పోషకాలను అందిస్తే మంచిదని కూడా సూచిస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా ఓట్స్, ముసిలి, ఉప్మా, ఖిచిడీ, ఇడ్లీ... వంటివాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకోవడం మంచిది. ఈ పదార్థాలన్నీ శరీరానికి కావలసిన గ్లూకోజ్‌ను సక్రమంగా అందిస్తాయి. స్మూతీస్, డ్రై ఫ్రూట్స్ రోజులో నాలుగుసార్లు పెద్ద మొత్తంలో ఆహారం అందించడం వల్ల పిల్లలు వెంటనే నిద్రపోయే అవకాశం ఉంటుంది. రక్తప్రసరణ మెదడు కంటే ఎక్కువగా ఉదరానికి చేరడం వల్ల వారు త్వరగా నిద్రపోతారు. అందువల్ల తరచుగా కొద్దికొద్దిగా పోషకాహారం అందేలా ప్రణాళిక వేసుకోవాలి. ఫలితంగా వారు నిద్రపోకుండా మెలకువగా ఉండగలుగుతారు. తాజా పళ్లు, స్మూతీలు, తేనె కలిపిన డ్రై ఫ్రూట్స్, పిల్లలు ఇష్టపడే సలాడ్లు... ఇవి మంచిది. మజ్జిగ, గ్రీన్ టీ పిల్లలు వారికి సౌకర్యంగా ఉండే చోట కూర్చుని, మరీ ముఖ్యంగా ఏసీల ముందు కూర్చుని, దాహం వేయకపోవడంతో, మంచినీళ్లు తాగడం మర్చిపోతారు. దాంతో వారిలో నీటి శాతం తగ్గిపోతుంది. శరీరం, మెదడు సక్రమంగా పనిచేయడం మానేస్తాయి. కళ్లు తిరిగినట్లవుతుంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతారు. పిల్లలు ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్తపడాలి. ఒకవేళ వాళ్లు ఎక్కువ నీళ్లు తాగడానికి సుముఖత చూపకపోతే, తాజా పండ్ల రసాలు, పల్చటి మజ్జిగ, గ్రీన్ టీ వంటివి తరచుగా అందిస్తూండాలి. అల్లం, చెక్క ఎక్కువ మోతాదులో కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, టీ, కోలాల... వంటివి పరీక్షల సమయంలో తాగడం మంచిది కాదు. వాటిని తీసుకోవడం వల్ల పిల్లలు సక్రమంగా నిద్రపోలేకపోతారు. అందువల్ల పిల్లలను అలాంటి వాటి నుంచి దూరంగా ఉంచాలి. వాటి స్థానంలో పల్చటి మజ్జిగలో అల్లం, దాల్చినచెక్క పొడి వంటివి జత చేసి ఆరోగ్యకరంగా, రుచికరంగా తయారుచేసి పిల్లలకు తరచు అందచేయాలి. గుడ్లు, పండ్లు ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొనే పరీక్షల సమయంలో, శరీరానికి నీటిలో బాగా కలిసిపోయే విటమిన్ బి కాంప్లెక్స్, సి, మినరల్స్, జింక్... వీటి మోతాదు పెరిగిపోతుంది. దాంతో అడ్రెనల్ హార్మోన్ల పని తీరు తగ్గిపోతుంది. ఇవి ఉంటేనే మనిషిలో ఒత్తిడి ఏర్పడినప్పుడు వాటితో తీవ్రంగా పోరాడి, ఒత్తిడి పోగొడతాయి. దంపుడు బియ్యం, నట్స్, కోడిగుడ్లు, తాజా కూరలు, పండ్లు వంటివి ఒత్తిడిని నిరోధిస్తాయి. చేపలు, ఆకుకూరలు విటమిన్ ఎ, సి, ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు ఒత్తిడికి గురవకుండా కాపాడతాయి. కోడిగుడ్లు, చేప, క్యారట్లు, గుమ్మడికాయ, తాజా ఆకు కూరలు, తాజా పండ్లు... వంటివి వాడటం వల్ల మెదడు చురుకుగా పనిచేయడం మొదలుపెడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అందువల్ల పిల్లలు పరీక్షల సమయంలో అనారోగ్యం పాలు కాకుండా ఉండగలుగుతారు. ఇన్పుట్స్: డా. వైజయంతి -
మాటలకందని రుచులు
అలా ప్లేటు లాగేయకండి. కందే కదా అని చిందేయకండి. చాలా ఉంది కందలో!కంద గారెలు తిన్నారా ఎప్పుడైనా? కంద దోసెలు? కంద కట్లెట్, కంద కుర్మా, కంద ఉప్మా...? అబ్బబ్బబ్బబ్బబ్బా... ఒక్కసారి తింటే, వండిపెట్టేవారి దుంప తెగినట్టే! ‘ఇవాళ కంద లేదా’ అంటారు, తొందరపడి. ‘రేపు కందే కదా’ అంటారు, ముందే జాగ్రత్తపడి. అక్కడితో ఆగుతారా! కందకోసం రైతుబజారులో కవాతు చేస్తారు. వంద వెరైటీలున్నా... కందెక్కడని చూస్తారు. ఇన్ని మాటలెందుకు, తిని చూడండి. ‘చాలిక’ అంటే ఒట్టు. ఇది ‘ఫ్యామిలీ’ బెట్! కంద గారెలు కావలసినవి: కంద - పావు కేజీ మినప్పప్పు - 50 గ్రా. పెసర పప్పు - 50 గ్రా. ఉప్పు - తగినంత ఉల్లి తరుగు - అర కప్పు అల్లం - చిన్న ముక్క పచ్చి మిర్చి - 8 కొత్తిమీర - చిన్న కట్ట నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరగాలి మినప్పప్పు, పెసరపప్పులను సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి మిక్సీలో కంద ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, అల్లం ముక్క, ఉప్పు, కొత్తిమీర వేసి మెత్తగా పట్టి పక్కన ఉంచాలి మినప్పప్పు + పెసరపప్పులో ఉన్న నీళ్లు ఒంపేసి మిక్సీలో వేసి గారెల పిండి మాదిరిగా పట్టాలి ఒక పెద్ద గిన్నెలో కంద మిశ్రమం, మినప్పప్పు మిశ్రమం వేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక, గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీయాలి. కంద అటుకుల ఉప్మా కావలసినవి: అటుకులు - పావు కేజీ ఉప్పు - తగినంత ఉల్లి తరుగు - కప్పు పంచదార - అర టీ స్పూను నూనె - 5 టేబుల్ స్పూన్లు ఆవాలు - టీ స్పూను ఇంగువ - చిటికెడు కరివేపాకు - 2 రెమ్మలు పచ్చి మిర్చి - 7 పసుపు - అర టీ స్పూను కంద - 100 గ్రా. (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి) నిమ్మ రసం - టేబుల్ స్పూను; పచ్చి బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ:ముందుగా అటుకులను తగినన్ని నీళ్లలో వేసి శుభ్రంగా కడిగి నీరు తీసేసి, ఉప్పు, పంచదార వేసి కలపాలి (ముద్దయిపోకుండా చూసుకోవాలి) బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చి బఠాణీ, ఉల్లి తరుగు వేసి వేయించి, పచ్చి మిర్చి, పసుపు వేసి కలియబెట్టాక, కంద ముక్కలు, అటుకులు వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి నిమ్మరసం వేసి మరోమారు కలిపి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా అందించాలి. కంద పచ్చడి కావలసినవి: కంద తురుము - అర కప్పు; మినప్పప్పు - టీ స్పూను చింతపండు పులుసు - టీ స్పూను (చిక్కగా ఉండాలి); బెల్లం తురుము - టీ స్పూను; ఎండు మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను నూనె - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, జీలకర్ర, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాలి కంద తురుము జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి, ఉప్పు, చింతపండు పులుసు, బెల్లం తురుము జత చేసి మెత్తగా చేయాలి విడిగా పోపు వేయించి కలిపితే బాగుంటుంది. కంద - బచ్చలి కూర కావలసినవి: కంద - పావు కేజీ; బచ్చలి - రెండు కట్టలు; అల్లం తురుము - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 8 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఎండు మిర్చి - 6; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; నిమ్మరసం - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; బెల్లం తురుము - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట; ఉప్పు - తగినంత తయారీ: కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి బచ్చలి ఆకును కడిగి, శుభ్రం చేసి తరగాలి ఒక గిన్నెలో కంద, బచ్చలి, తగినన్ని నీళ్లు పోసి, కుకర్‌లో మెత్తగా ఉడికించాలి బాణలిలో నూనె వేసి కాగాక, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి ఉడికించిన కంద బచ్చలి వేసి బాగా కలియబెట్టాలి అల్లం తురుము, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి మరోమారు కలిపి, నిమ్మరసం, బియ్యప్పిండి, బెల్లం తురుము, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. కంద కూర కావలసినవి: కంద ముక్కలు - 2 కప్పులు; ఉల్లి తరుగు - అర కప్పు; సాంబారు పొడి - ఒకటిన్నర స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; సెనగ పప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కారం - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను తయారీ: కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి పెద్ద గిన్నెలో కంద ముక్కలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి (మరీ మెత్తగా ఉడికించకూడదు) బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక, కరివేపాకు వేసి వేయించాలి ఉల్లి తరుగు జత చేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాక, ఉడికించిన కంద ముక్కలు, కారం, సాంబారు పొడి వేసి బాగా కలపాలి కొద్దిగా నీళ్లు చిలకరించి, మూత పెట్టకుండా సుమారు 10 నిమిషాలు ఉడికించాలి. కంద దోసె కావలసినవి: కంద - పావు కేజీ; బియ్యప్పిండి - 100 గ్రా.; పెసరపప్పు - 50 గ్రా.; అల్లం - చిన్న ముక్క; పచ్చి మిర్చి - 8; కొత్తిమీర - చిన్న కట్ట; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; ఇంగువ - పావు టీ స్పూను; జీలకర్ర - టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి కొబ్బరి తురుము - కప్పు; నూనె - తగినంత తయారీ: కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి పెసర పప్పును సుమారు గంట సేపు నానబెట్టి నీరు ఒంపేయాలి మిక్సీలో... కంద ముక్కలు, నానిన పెసర పప్పు, అల్లం, పచ్చి మిర్చి, కొత్తిమీర, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి ఒక పాత్రలో కంద మిశ్రమం, బియ్యప్పిండి, తగినన్ని నీళ్లు వేసి దోసెల పిండి మాదిరిగా చేసుకోవాలి స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక, కలిపి ఉంచుకున్న పిండిని గరిటెతో దోసె మాదిరిగా వేసి, పైన జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము జల్లి, చుట్టూ నూనె వేసి, కాలాక రెండో వైపు తిప్పి, కొద్దిగా నూనె వేసి బాగా కాల్చి తీసేయాలి. కంద కట్లెట్ కావలసినవి: కంద - అర కేజీ; ఎండు మిర్చి - 6; ఉప్పు -తగినంత; నూనె - కప్పు; ఉల్లి తరుగు - కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 4; కారం - టీ స్పూను తయారీ: కంద చెక్కు తీసి, శుభ్రంగా కడిగి, ముక్కలు తరగాలి మిక్సీలో కంద ముక్కలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కారం, ఉప్పు, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా పట్టి తీసేయాలి బియ్యప్పిండి, కరివేపాకు, జీలకర్ర జత చేసి బాగా కలిపి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేయాలి స్టౌ మీద పెనం వేడయ్యాక నూనె వేసి ఒక్కో ఉండను పెనం మీద ఉంచి చేతితో జాగ్రత్తగా ఒత్తి చుట్టూ కొద్దిగా నూనె వేసి మంట తగ్గించాలి బాగా కాలిన తర్వాత రెండవ వైపు కూడా బంగారు రంగులోకి వచ్చాక తీసేయాలి. కంద మన దేశంలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. తెలుగు నాట వివాహాలలో కంద బచ్చలి కూర తప్పనిసరి. బీహార్‌లో మామిడి, అల్లం, కంద... సమాన భాగాలుగా తీసుకుని ఊరగాయ చేస్తారు. దీన్ని బరాబర్ చట్నీ అంటారు. సేకరణ: డా. వైజయంతి -
కలెక్టర్‌కు తెచ్చిన ఉప్మాలో మిడత
మహబూబ్ నగర్ : తనకు తెచ్చిన అల్పాహారంలో మితడను చూసిన ఓ జిల్లా కలెక్టర్ విస్తుపోయారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శినికి తీసుకొచ్చిన ఉప్మాలో మిడత దర్శనం ఇచ్చింది. దాంతో హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే పొదుపు భవనంలో నివాసం ఉంటున్న కలెక్టర్‌కు నిన్న ఉదయం స్థానిక గురుప్రసాద్ హోటల్ నుంచి ఉప్మాను పార్శిల్‌గా తీసుకొచ్చారు. తెచ్చిన పార్శిల్‌ను తెరిచిన కలెక్టర్... అందులో మిడత పురుగు కనిపించటంతో ఒకింత షాక్‌కు గురయ్యారు. వెంటనే హోటల్ యాజమాన్యపై చర్యలు తీసుకోవటంతో పాటు, సీజ్ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు హోటల్ ను తనిఖీ చేసి ఉప్మాను హైదరాబాద్‌లోని ఫుడ్ ఇన్విస్టిగేషన్ ల్యాబ్‌కు పరీక్ష నిమిత్తం పంపించారు. ఇక కలెక్టర్‌కు పంపిన ఉప్మాలోనే మిడత ఉంటే, ఇక సామాన్యులకు ఏయే పురుగులు వస్తున్నాయోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
వెజిటబుల్ ఉప్మా