తృణధాన్యాల్లో ప్రముఖమైనవి రాగులు (finger millets). రాగులతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాల ఉన్నాయి. రాగులలో ప్రోటీన్ , ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్ ,అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి చిన్న పిల్లలతోపాటు, వృద్ధులకూ ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులతో రకరకాలుగా వంటకాలను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.
ఇడ్లీని సాధారణంగా బియ్యం ,మినప్పప్పుతో తయారు చేస్తారు.కానీ హెల్తీగా రాగులతో కూడా ఇడ్లీ తయారు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఒక కప్పు రాగుల పిండి
ఒక కప్పు సూజీ/రవ్వ)
ఒక కప్పు పుల్లని పెరుగు
తాజా కొత్తిమీర (సన్నగా తరిగినవి)
ఉప్పు (రుచి కి తగినంత )
అర టీస్పూన్ బేకింగ్ సోడా
పోపుగింజలు
కావాలంటే ఇందులో శుభ్రంగా కడిగి తురిమిన క్యారెట్ ,ఉల్లిపాయకూడా కలుపుకోవచ్చు.
తయారీ : పిండి తయారీ వెడల్పాటి గిన్నెలో పిండి, రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎర్ర/ఎండు మిరపకాయలు, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పపిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి.
ఇడ్లీ తయారీ: దీన్ని ఇడ్లీ కుక్కర్‌లేదా, ఇడ్డీపాత్రలో ఆవిరి మీదకొద్దిసేపు హైలో , తరువాత మీడియం మంటమీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోని, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రాగి ఇడ్లీ రెడీ. అల్లం, పల్లీ, పుట్నాల చట్నీతోగానీ,కారప్పొడి నెయ్యితోగానీ తింటే మరింత రుచిగా ఉంటుంది. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)
రాగి ఉప్మా
కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్‌లు; కరివే΄ాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్‌లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్‌లు; ఒక నిమ్మకాయ
తయారీ: రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙. రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. అంతే వేడి వేడి రాగి ఉప్మా రెడీ. ఈ ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.
ఇవీ చదవండి : రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!
రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో
Comments
Please login to add a commentAdd a comment