Ragulu
-
కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?
శరీరానికి కాల్షియం అనేక రోజువారీ పనులు చేసేందుకు ఉపకరిస్తుంది. అందువల్ల మన డైట్లో కాల్షియంని చేర్చుకోవడం ముఖ్యం. జున్ను, బొప్పాయి, మల్బరీ, లిచీ, కివి, బచ్చలికూర, బ్రకోలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పాలు, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే...పాలు, రాగులు రెండూ ఒకదానికి మించి లాభాలని అందిస్తాయి. ఉదాహరణకి..100 మి.లీ పాలు తాగితే 110 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. అదే 100 గ్రాముల రాగులని తీసుకుంటే, దాదాపు 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచితే, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి రాగులు మంచిది. రాగుల్లో ఉండే పొటాషియం వంటి ఇతర పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యానికి సాయపడతాయి. పాలలో పోషకాలతో పాటు ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీని హైడ్రేట్ చేస్తాయి. రాగులు షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని నియంత్రిస్తుంది కాబట్టి, మీ అవసరాలని బట్టి ఏది మంచిదో నిర్ణయించుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!రాగులు, ఆరోగ్య ప్రయోజనాలుభారతదేశంలోని చాలా ప్రాంతాలలో రాగిగా ప్రసిద్ధి చెందిన ఫింగర్ మిల్లెట్ అతి ముఖ్యమైన చిరుధాన్యాలలో ఒకటి ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి దీనిని తరచుగా శిశువులకు , వృద్ధులకు ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులలో ప్రోటీన్ ,ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సంతృప్తిగా ,కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది.ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందిగ్లూటెన్ రహితం కాబట్టి గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది , అసంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది.కాల్షియం మూలమైన రాగులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయిమొలకెత్తిన రాగులు విటమిన్ బి 12 అవసరాలను తీరుస్తాయి.శీతాకాలంలో ఇది బెస్ట్ ఫుడ్. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.ఇది మలబద్దకానికి సహాయపడుతుంది.ఎవరు తీసుకోకూడదుమూత్రపిండాల్లో రాళ్ళు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారురాగులలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక హైపర్కలేమియా లేదా సీరం పొటాషియం స్థాయిలు పెరిగినవారు. అలాగే రాగులు రాత్రి పూట తినకుండా ఉండటం మంచిది.ఇదీ చదవండి : ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి? -
‘దేవర’ బ్యూటీ ఫేవరెట్ : రాగి–చిలగడ దుంప పరాఠా
రోజంతా పని చేయాలంటే శక్తి ఉండాలి. అందుకోసం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్ర΄ోవాలి. ఈ రొటీన్లో ఏం తింటున్నామో తెలియకపోతే స్లిమ్‌గా ఉండడం కష్టం. ఆహారం బలాన్ని పెంచాలి కానీ బరువును పెంచకూడదు. నాజూగ్గా ఉండే జాన్వి కపూర్... అంత స్లిమ్ గా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఏం తింటుంది? డిన్నర్లో రాగి – చిలగడ దుంప (స్వీట్ పొటాటో) పరాఠా తింటానని చెప్పింది. ఆమె షెఫ్ ఎలా వండుతున్నారో చూద్దాం.రాగి–చిలగడ దుంప పరాఠాకావలసినవి: చిలగడ దుంప – ఒకటి (పెద్దది); రాగి పిండి – 250 గ్రాములు; నువ్వులు– టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి); జీలకర్ర పొడి– అర టీ స్పూన్; మిరప పొడి– అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మిరియాల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్;తయారీ∙ఒక పాత్రలో పావు లీటరు నీటిని పోసి వేడి చేయాలి. అందులో నెయ్యి (సగం మాత్రమే), నువ్వులు, కొద్దిగా ఉప్పు, రాగి పిండి వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో అదుముతూ పూరీల పిండిలా కలిపి పాత్ర మీద మూత పెట్టి పక్కన పెట్టాలి.ఈ లోపు ప్రెషర్ కుక్కర్లో నీటిని పోసి గెణుసుగడ్డను ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్కు వలిచి మరొక పాత్రలో వేసి చిదమాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, మిరప పొడి, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి.రాగి పిండి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని చపాతీల పీట మీద వేసి కొద్దిగా వత్తి అందులో గెనుసు గడ్డ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. ఆ తరవాత జాగ్రత్తగా (లోపలి మిశ్రమం బయటకు రాకుండా) పరాఠా చేసి వేడి పెనం మీద వేసి నెయ్యి రాస్తూ కాల్చాలి. -
మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా!
రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.రాగుల మొలకలతో పిండి తయారీరాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్‌గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్‌బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.రాగి ఇడ్లీరాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.రాగులతో ఉపయోగాలురాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి -
డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రాగుల ఉప్మా
బరువు తగ్గాలనే ఆలోచనలోఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ డైటింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొవ్వుపదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభించే ఆహారాలను దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్, లేదా రాత్రికి అన్నం మానేసి ఏం తినాలి అనేది పెద్ద సమస్య. ఇడ్లీ, దోసలు, నూనెతో నిండిన పూరీలు కూడా రాగులతో ఉప్మాఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్ బెస్ట్ ఆప్షన్. కడుపు నిండుగా ఉంటుంది. పోషకాలు లభిస్తాయి కూడా. రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మకాయ –1 (పలుచగా తరగాలి).తయారీ: ∙రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙ రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. వేడి వేడి ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇలాగే ఓట్స్తోగానీ, గోధుమ రవ్వతో గానీ చేసుకోవచ్చు. ఇందులో మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని, బఠానీలను కూడా యాడ్ చేసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. -
Diwali 2024 పండగొస్తోంది.. ఈజీగా చేసుకునే స్వీట్లు, కుకీస్!
పండుగ వస్తోందంటే గృహిణులకు ఒకటే పని. ఇంటి శుభ్రంనుంచి పిండి వంటల దాకా ఎడతెగని పనులతో బిజీగా ఉంటారు. పెద్దగా హడావిడిగా లేకుండా, సులభంగా, ఆరోగ్యంగా తయారు చేసుకునే కొన్ని వంటల్ని ఇపుడు చూద్దామా.రాగి కుకీస్ కావలసినవి: రాగిపిండి – కప్పు; గోధుమపిండి – కప్పు; చక్కెర పొడి – కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – 15 టేబుల్ స్పూన్లు; పాలు – 4 టేబుల్ స్పూన్లు (అవసరమైతేనే వాడాలి).తయారీనెయ్యి కరిగించి పక్కన పెట్టాలి. వెడల్పు పాత్రలో రాగిపిండి, గోధుమ పిండి, చక్కెర పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి అన్నీ సమంగా కలిసేటట్లు గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి వేసి మళ్లీ కలపాలి. చపాతీల పిండిలా ముద్దగా వస్తుంది. తగినంత తేమలేదనిపిస్తే పాలు కలపాలి. ఈ పిండి మీద మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒవెన్‌ను 170 డిగ్రీలు వేడి చేయాలి. పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీసి పెద్ద నిమ్మకాయంత గోళీలు చేయాలి. ఒక్కో గోళీని అరచేతిలో వేసి వత్తాలి. ఫోర్క్‌తో నొక్కి గాట్లు పెట్టి బేకింగ్ ట్రేలో సర్దాలి ∙ట్రేని ఒవెన్‌లో పెట్టి 12 నిమిషాల సేపు ఉంచాలి. కుకీ మందంగా ఉందనిపిస్తే మరో నిమిషం అదనంగా ఉంచాలి ∙ఒవెన్ లేక పోతే ప్రెషర్ కుకర్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. కుకర్‌లో ఉప్పు చల్లి గాస్కెట్, వెయిట్ తీసేసి మూత పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత కుకీలను అమర్చిన ట్రేని జాగ్రత్తగా కుకర్‌లో పెట్టి సన్న మంట మీద 15 నిమిషాల సేపు ఉంచాలి. అయితే కుకర్‌లో ఒకేసారి అన్నింటినీ బేక్ చేయడం కుదరక పోవచ్చు. కుకర్ సైజ్, ట్రే సైజ్‌ను బట్టి నాలుగైదు సార్లుగా చేయాలి ఈ బిస్కట్లను గాలి చొరబడని బాటిల్లో నిల్వ చేస్తే మూడు వారాల పాటు తాజాగా ఉంటాయి. మిల్క్ బర్ఫీకావల్సిన పదార్ధాలుపాలపొడి – రెండున్నర కప్పులుపంచదార – ముప్పావు కప్పుపాలు – కప్పునెయ్యి – పావు కప్పుపిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లుతయారీ విధానంగిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి.స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి.10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి.ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తా పలుకులు వేసి మరోసారి వత్తుకోని, గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి.రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. -
రాగులతో దూదుల్లాంటి ఇడ్లీ, రుచికరమైన ఉప్మా : ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదా!
తృణధాన్యాల్లో ప్రముఖమైనవి రాగులు (finger millets). రాగులతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాల ఉన్నాయి. రాగులలో ప్రోటీన్ , ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్ ,అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి చిన్న పిల్లలతోపాటు, వృద్ధులకూ ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులతో రకరకాలుగా వంటకాలను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.ఇడ్లీని సాధారణంగా బియ్యం ,మినప్పప్పుతో తయారు చేస్తారు.కానీ హెల్తీగా రాగులతో కూడా ఇడ్లీ తయారు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగుల పిండి ఒక కప్పు సూజీ/రవ్వ) ఒక కప్పు పుల్లని పెరుగుతాజా కొత్తిమీర (సన్నగా తరిగినవి)ఉప్పు (రుచి కి తగినంత ) అర టీస్పూన్ బేకింగ్ సోడాపోపుగింజలుకావాలంటే ఇందులో శుభ్రంగా కడిగి తురిమిన క్యారెట్ ,ఉల్లిపాయకూడా కలుపుకోవచ్చు.తయారీ : పిండి తయారీ వెడల్పాటి గిన్నెలో పిండి, రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎర్ర/ఎండు మిరపకాయలు, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పపిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి.ఇడ్లీ తయారీ: దీన్ని ఇడ్లీ కుక్కర్లేదా, ఇడ్డీపాత్రలో ఆవిరి మీదకొద్దిసేపు హైలో , తరువాత మీడియం మంటమీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోని, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రాగి ఇడ్లీ రెడీ. అల్లం, పల్లీ, పుట్నాల చట్నీతోగానీ,కారప్పొడి నెయ్యితోగానీ తింటే మరింత రుచిగా ఉంటుంది. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివే΄ాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఒక నిమ్మకాయతయారీ: రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙. రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. అంతే వేడి వేడి రాగి ఉప్మా రెడీ. ఈ ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇవీ చదవండి : రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో