కలెక్టర్కు తెచ్చిన ఉప్మాలో మిడత
మహబూబ్ నగర్ : తనకు తెచ్చిన అల్పాహారంలో మితడను చూసిన ఓ జిల్లా కలెక్టర్ విస్తుపోయారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శినికి తీసుకొచ్చిన ఉప్మాలో మిడత దర్శనం ఇచ్చింది. దాంతో హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే పొదుపు భవనంలో నివాసం ఉంటున్న కలెక్టర్కు నిన్న ఉదయం స్థానిక గురుప్రసాద్ హోటల్ నుంచి ఉప్మాను పార్శిల్గా తీసుకొచ్చారు. తెచ్చిన పార్శిల్ను తెరిచిన కలెక్టర్... అందులో మిడత పురుగు కనిపించటంతో ఒకింత షాక్కు గురయ్యారు.
వెంటనే హోటల్ యాజమాన్యపై చర్యలు తీసుకోవటంతో పాటు, సీజ్ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు హోటల్ ను తనిఖీ చేసి ఉప్మాను హైదరాబాద్లోని ఫుడ్ ఇన్విస్టిగేషన్ ల్యాబ్కు పరీక్ష నిమిత్తం పంపించారు. ఇక కలెక్టర్కు పంపిన ఉప్మాలోనే మిడత ఉంటే, ఇక సామాన్యులకు ఏయే పురుగులు వస్తున్నాయోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.