hotel seize
-
యూనిటెక్ గ్రూప్ కేసులో లండన్ హోటల్ జప్తు
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ యునిటెక్, ఆ గ్రూప్ ప్రమోటర్ల సంజయ్ చంద్ర, అజయ్ చంద్రపై జరుగుతున్న అక్రమ ధనార్జనా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్య తీసుకుంది. లండన్‌లోని రూ.58.61 కోట్ల విలువచేసే ఒక హోటల్‌ను జప్తు చేసినట్లు ప్రకటించింది. ఈ హోటెల్ పేరు ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’. ఐబోర్న్‌షోర్న్‌కు చెందిన హోటెల్ ఇది. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కార్నౌస్టీ గ్రూప్‌కు అనుబంధ సంస్థగా ఐబోర్న్‌షోర్న్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈడీ తెలిపిన సమాచారం ప్రకారం, గృహ కొనుగోలుదారులకు చెందిన రూ.325 కోట్లను యూనిటెక్ గ్రూప్ కార్నౌస్టీ గ్రూప్‌కు బదలాయించింది. కార్నౌస్టీ గ్రూప్‌కు చెందిన కార్నౌస్టీ మేనేజ్మెంట్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఐబోర్న్‌షోర్న్‌లో షేర్ల కొనుగోలుకు ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని (రూ.41.3 కోట్లను) వినియోగించడం జరిగింది. ఈ కేసులో జరిగిన మోసం మొత్తం రూ.5,063.05 కోట్లని ఇప్పటి వరకూ అంచనా. -
డ్రైనేజీ నీళ్లతో ఏం చేశారంటే...
సాక్షి, తిరువనంతపురం: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో, కేరళ అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. హోటల్ సిబ్బంది మురుగు నీటితో ప్లేట్లు కడుగుతుండటం గమనించిన ఓ యువకుడు.. వీడియో తీసి వైరల్ చేశాడు. వివరాల్లోకి వెళ్లితే.. అలప్పుజా మున్సిపాలిటీ పరిధిలోని ఓ హోటల్ ప్రాంగణం వర్షాల కారణంగా వరద నీటితో నిండిపోయింది. పైగా హోటల్ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినటంతో ఆ నీరు కూడా వరద నీటిలో కలిసిపోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ థియేటర్‌కు.. ఓ యువకుడు సినిమా చూసేందుకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దృశ్యం కనిపించేసరికి వీడియో తీసి.. వాట్సాప్ గ్రూప్‌లకు పంపించాడు. అది కాస్త వైరల్ కావటం.. ఆ వీడియో మున్సిపాలిటీ అధికారుల దృష్టికి రావటంతో హోటల్‌ను సీజ్ చేసి.. యాజమానికి జరిమానా విధించారు. -
మురుగునీటితో హోటల్ సిబ్బంది చేసిన నిర్వాకం
-
కలెక్టర్‌కు తెచ్చిన ఉప్మాలో మిడత
మహబూబ్ నగర్ : తనకు తెచ్చిన అల్పాహారంలో మితడను చూసిన ఓ జిల్లా కలెక్టర్ విస్తుపోయారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శినికి తీసుకొచ్చిన ఉప్మాలో మిడత దర్శనం ఇచ్చింది. దాంతో హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే పొదుపు భవనంలో నివాసం ఉంటున్న కలెక్టర్‌కు నిన్న ఉదయం స్థానిక గురుప్రసాద్ హోటల్ నుంచి ఉప్మాను పార్శిల్‌గా తీసుకొచ్చారు. తెచ్చిన పార్శిల్‌ను తెరిచిన కలెక్టర్... అందులో మిడత పురుగు కనిపించటంతో ఒకింత షాక్‌కు గురయ్యారు. వెంటనే హోటల్ యాజమాన్యపై చర్యలు తీసుకోవటంతో పాటు, సీజ్ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు హోటల్ ను తనిఖీ చేసి ఉప్మాను హైదరాబాద్‌లోని ఫుడ్ ఇన్విస్టిగేషన్ ల్యాబ్‌కు పరీక్ష నిమిత్తం పంపించారు. ఇక కలెక్టర్‌కు పంపిన ఉప్మాలోనే మిడత ఉంటే, ఇక సామాన్యులకు ఏయే పురుగులు వస్తున్నాయోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
కత్రియ హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు
హైదరాబాద్ : సోమాజిగూడలోని కత్రియ హోటల్‌ను గురువారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. గత మూడేళ్లుగా ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో అధికారులు ఈ మేరకు చర్య తీసుకున్నారు. కార్పొరేషన్‌కు పన్ను చెల్లించకపోడవంతో పలుసార్లు నోటీసులు జారీ చేశామని, అయినప్పటికీ బకాయిలు చెల్లించకపోవటంతో హోటల్‌ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ బకాయిలు చెల్లించాలంటూ హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.