ఔషధాల సిరి ఉసిరి. దీని ద్వారా లభించేఆరోగ్య ప్రయోజనాల ఉగరించి ఎంత చెప్పుకునే తక్కువే.చర్మం, జుట్టు ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. విటమిన్ సీ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీవక్రియను, దీర్ఘాయువును పెంచడానికి ప్రతిరోజూ ఉసిరి తినాలని చెబుతారు.
మనస్సు , శరీరం రెండింటి పనితీరుకు సహాయపడే తీపి, పులుపు, చేదు, ఘాటైన ఐదు రుచులతో నిండిన 'దివ్యౌషధం ఇది. వసాధారణంగా అక్టోబర్ ,నవంబర్ మధ్య వచ్చే కార్తీక మాసంలోదీనికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యతుంది. శివుడికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు.
ఉసిరితో వాత, కఫ , అసమతుల్యత కారణంగా సంభవించే వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్ కేన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
ఉసిరికాయతో పచ్చళ్లు, స్వీట్ తయారు చేస్తారు. ఉసిరికాయ గింజలు కూడా మనకు ఎంతో మేలుస్తాయి. అయితే దీనిని పచ్చిగా, రసం, చూర్ణం, మిఠాయి, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు.
జుట్టుకు
ఆమ్లా ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా ఫోలికల్స్ బలపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నల్లగా నిగనిగ లాడే మెరుపు వస్తుంది. జుట్టును బలోపేతం చేయడమే కాదు తొందరగా తెల్లబడకుండా కూడా చేస్తుంది. స్కాల్ప్‌ను కూడా బలపరుస్తుంది. చుండ్రు రాకుండా కాపాడుతుంది.
చర్మం కోసం
సహజ రక్త శుద్ధిలా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను నివారణలో సహాయపడుతుంది. జీవనశైలి,కాలుష్యం, సూర్యరశ్మితో వచ్చే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరి కుష్టు వ్యాధి, సోరియాసిస్, చర్మ అలెర్జీలు , తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.
యాంటీ ఏజింగ్ పవర్‌హౌస్‌లా పనిచేస్తుంది. ఆమ్లా పేస్ట్ లేదా పౌడర్‌తో ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది, మృత చర్మ కణాలను,మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.మచ్చలపై ఉసిరి పేస్ట్‌ను అప్లయ్ చేయవచ్చు. ఉసిరి రసాన్ని వాడవచ్చు. లేదా ఫేస్ ప్యాక్‌గా కూడా అప్లై చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment