turmeric crop
-
గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలు
ఇరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతు కరుటూరి పాపారావు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ ఆయన స్వగ్రామం. 8 ఎకరాల్లో పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. అరెకరంలో వివిధ రకాల పసుపు, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 2012లో బాసరలో సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొని స్ఫూర్తి పొందిన పాపారావు 2015 నుంచి 8.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పంట వ్యర్థాలను కాలబెట్టకుండా జనుము, జీలుగతో కలిపి కుళ్లబెట్టి భూమిని సారవంతం చేస్తున్నారు ΄ పాపారావు. తన వ్యవసాయ క్షేత్రంలో 5వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసి బెల్లం, మజ్జిగ, మదర్ కల్చర్ కలిపి గోకృపామృతం.. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి పైప్లైన్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు.ఏడాది పాత బియ్యం..పంట నూర్పిడి అనంతరం నిల్వ, ప్రాసెసింగ్ అంతా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పోషక సంపన్న ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం రైతు పాపారావు మరో ప్రత్యేకత. వరి పొలం గట్ల మీద కందిని కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. కందులను ఇసుర్రాయితో ఆడించి సహజ విధానంలో పప్పుగా మార్చుతున్నారు. ధాన్యం దిగుబడి రసాయన సాగుతో పోలిస్తే సగమే వస్తోంది. కూలీల అవసరమూ ఎక్కువే. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి గన్నీ బ్యాగుల్లో నింపి ఏడాది పాటు నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలో పురుగు పట్టకుండా ఉండేందుకు వావిలాకు, గానుగ ఆకు, సీతాఫలం ఆకు ధాన్యం బస్తాల వద్ద ఉంచుతున్నారు. ఏడాది దాటిన తరువాత ధాన్యాన్ని ముడి బియ్యం ఆడించి 10 కిలోల సంచుల ద్వారా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతున్నారు.పచ్చి పసుపు ముక్కలు..పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి, పాలిష్ చేసి అమ్మటం సాధారణ పద్ధతి. అలాకాకుండా, పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి, నీడలో ఎండబెట్టి పసుపు పొడిని తయారు చేయిస్తున్నారు. ఉడకబెడితే పోషకాలు తగిపోతాయని ఇలా చేస్తున్నానని అంటున్నారు పాపారావు. నల్ల పసుపు, సేలం, కృష్ణ సేలం రకాల పసుపును సాగు చేస్తున్నారు. మునగాకును నీడలో ఆరబెట్టి ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆయన 50 రకాలకు పైగా కూరగాయలు, సుగంధ, ఔషధ, పండ్ల రకాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తు న్నారు. తాను పండించే పంటలతో పాటు పప్పులు, బెల్లం, పల్లీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల సేంద్రియ రైతుల నుంచి సేకరించి వాట్సప్ ద్వారా విక్రయిస్తున్నారు. పలువురు ప్రకృతి వ్యవసాయదారులను కలుపుకొని వాట్సప్‌లో‘నేచురల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్ గ్రూపు’ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయక ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాపారావును ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు పురస్కారంతో అనేక ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రకృతి సాగుకు మరింత తోడ్పాటునివ్వాలి అన్ని రకాల పంటలను రైతు పండించి, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వినియోగదారుడికి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో నా వంతు కృషి చేస్తున్నాను. రైతులు అన్ని రకాల పంటలు పండించాలి. అన్ని పనులూ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవాలి. ప్రతి రైతూ ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలి. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలి. – కరుటూరి పాపారావు (96188 11894), జైతాపూర్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
నల్లతామరకు విరుగుడు.. ఈ కుంకుడు ద్రావణం!
నల్గొండ జిల్లా చందంపేట మండలంపోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్ట ్రపాంత రైతు సాగు చేస్తున్న 12 ఎకరాల కుంకుడు తోట కొత్త ఆవిష్కరణలకు పురుడుపోసింది. మొదటిది... చెట్టుకు ఏడాదికి 400 కిలోల వరకు కుంకుడు కాయల దిగుబడినిచ్చే సరికొత్త రైతు వంగడం ఆవిష్కారమైంది. కుంకుడు ద్రావణం రెండోది.కుంకుడు కాయల పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని చేర్చి.. ఆ పొడితో తయారు చేసిన ద్రావణం సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వినియోగిస్తూ పద్మారెడ్డి, ఆయన మిత్రులైన కొందరు రైతులు చక్కటి ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సేంద్రియ పురుగుమందుగా, శిలీంధ్రనాశనిగానే కాక పంట పెరుగుదలకు కూడా కుంకుడు ద్రావణం దోహదం చేస్తోందని ఆయన చెబుతున్నారు. పండ్ల తోటలు, వరి, కూరగాయలు తదిరత పంటల సేంద్రియ సాగులో ఉపయోడపడుతోందన్నారు.200 లీ. డ్రమ్ముకు 2 కిలోలు...2 కిలోల కుంకుడు పొడిని 200 లీటర్ల డ్రమ్ములో 2 గంటలు నానబెట్టి, పిసికి, వడకడితే సిద్ధమయ్యే ద్రావణాన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. మళ్లీ నీరు కలపాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా తాము ప్రయోగాత్మకంగా ఈ ద్రావణాన్ని వాడుతున్నామని చెబుతూ.. ఎన్ని రోజులైనా నిల్వ ఉంచి వాడుకోవచ్చు అన్నారు.ఇంటిపంటలకు...లీటరు నీటికి 10 గ్రాముల కుంకుడు పొడిని కలిపిన ద్రావణం ఇంటిపంటలు/ మిద్దె తోటల రైతులకూ కుంకుడు పొడి ఎంతో ఉపయోగకరంగా ఉందని పద్మారెడ్డి తెలిపారు.వరిలో తెగుళ్లకు...కుంకుడు ద్రావణాన్ని ఆకుకూరలకు ఒక్కసారి చాలు. పంటలు ఏపుగా పెరగడానికి కూడా ఈ ద్రావణం దోహదపడుతుందని పద్మారెడ్డి తెలిపారు. బత్తాయి తదితర పండ్ల తోటలకు 30 రోజుల వ్యవధిలో వాడుకోవచ్చు. కూరగాయల సాగులో 15 రోజులకోసారి పిచికారీ చేయొచ్చు. వరి పంట కాలంలో 3 దఫాలు.. నాటేసిన 15–25 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు చల్లాలి. ఊస తెగులు/కాండం తొలిచే పురుగును ఈ ద్రావణం పూర్తిగా నివారిస్తుందని పద్మారెడ్డి స్వానుభవంగా చెప్పారు.మిరపలో నల్లతామరకు...మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బ్లాక్ త్రిప్స్ (నల్లతామర)ను కూడా కుంకుడు ద్రావణం 70–80% నియంత్రిస్తున్నట్లు సేంద్రియ మిరప తోటలో రుజువైందని పద్మారెడ్డి చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా కుంకుడు ద్రావణాన్ని ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తే సేంద్రియ మిరప రైతులకు మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గ్రోత్ ప్రమోటర్‌గా, ఫంగిసైడ్‌గా ఇది పనిచేస్తుందని, మిరపకాయలపై మచ్చలు కూడా రావని పద్మారెడ్డి(99481 11931) చెబుతున్నారు. -
పంట తెగుళ్ల బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో సాగు
-
పసుపు సాగు విధానం మరియు లాభాలు
-
పసుపు రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు
-
పసుపే.. పోచమ్మ తల్లి..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ కర్మభూమిగా పేరున్న భారత ఉప ఖండంలో పసుపును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తుంటారు. శుభకార్యాల నుంచి పూజల దాకా అన్నింటా పసుపును ప్రత్యేకంగా వినియోగిస్తారు. మరి అలాంటి పసుపు పంటను పండించే రైతులు కూడా ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. పసుపు పంటను పోచమ్మ తల్లిగా భావిస్తూ కచ్చితమైన పద్ధతులు, జాగ్రత్తలను పాటిస్తారు. ఉదయమైనా, సాయంత్రమైనా స్నానం చేశాకే పంట చేనులోకి వెళతారు. చెప్పులను కూడా చేను బయటే వదిలేస్తారు. అంటు, ముట్టు వంటివి పాటించే సమయంలో సదరు రైతు కుటుంబాల వారు చేనులోకి అడుగుకూడా పెట్టరు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ తదితర జిల్లాల్లో తరతరాలుగా ఇలా పసుపును సాగు చేస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆశించిన లాభాలు రాకున్నా ‘పోచమ్మ తల్లి’పంటగా భావిస్తూ సంప్రదాయంగా సాగు చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. తాతముత్తాతల నాటి నుంచీ పండిస్తున్నాం.. మేం తాతముత్తాతల నాటి నుంచీ పసుపు పంట సాగు చేస్తున్నాం. పసుపు మా తల్లి పంట. పుట్టి పసుపు (రెండు క్వింటాళ్లు) అమ్మితే తులం బంగారం వచ్చేదని మా తాతలు చెప్పేవారు. ఇప్పటికీ ఇతర పంటల ఆదాయం ఖర్చులకు పోయినా పసుపుపై మిగులు ఉంటుందనే నమ్మకంతో సాగు చేస్తుంటాం. ధర లేకపోవడంతో ఈ సాగు కొంత తగ్గించాం. కానీ అసలు సాగు చేయకుండా మాత్రం ఉండలేం. తల్లి పంట కావడంతో ఒకసారి లాభం రాకున్నా మరోసారి వస్తుంది. –గడ్డం కళావతి, మహిళా రైతు, రెంజర్ల, ముప్కాల్ మండలం, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మార్కెట్‌కు ఏటా 10 లక్షల క్వింటాళ్లు రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ఏటా సుమారు 10 లక్షల క్వింటాళ్ల వరకు పసుపు పంట వస్తుంది. ఇక రాష్ట్రంలో మొత్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. ఇందులో అత్య ధికంగా నిజామాబాద్ జిల్లాలో 35 వేల ఎకరా లు, జగిత్యాలలో 25,000, నిర్మల్‌లో 20,000, వరంగల్‌లో 6,000, మహబూబాబాద్ 4,500, వికారాబాద్‌లో 3,500, హన్మకొండ 2,800, భూపాలపల్లి 1,200 ఎకరాల్లోనూ, ఆదిలాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరుగా పసుపు సాగవుతోంది. సాధార ణంగా ఎకరానికి 120 నుంచి 140 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడి వస్తుంది. దానిని ఉడకబెట్టి పాలిష్ చేస్తే 22–25 క్వింటాళ్లు అవుతుంది. రాష్ట్రంలో సాధారణంగా పండించే పసుపు లో 3% వరకు ‘కర్క్యుమిన్’ (ఔషధ లక్షణా లున్న రసాయనం) ఉంటోంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లిలో 30 ఎకరాల్లో వ్యవసాయ వర్సిటీకి అనుబంధంగా పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయించారు. ఆ పరిశోధన కేంద్రంలో 4% ‘కర్క్యుమిన్’వచ్చే దుగ్గిరాల ఎరుపు, పీసీటీ పసుపు వంగడాలను అభివృద్ధి చేశారు. పోచమ్మ తల్లిగా భావిస్తాం.. పసుపు పంటను పోచమ్మ తల్లిగా భావిస్తాం. ఈ పంట ఉంటేనే మిగతా వ్యవసాయం కలసి వస్తుందనేది మా నమ్మకం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పసుపు సాగు చేయని ఏడాది లేదు. అంటు ముట్టు ఉన్నప్పుడు పసుపు తోటలోకి వెళ్లం. – కాశారం లత, మహిళా రైతు, మెండోరా మార్కెట్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నా ఎనిమిదేళ్లుగా కొత్త వంగడాల పసుపు సాగు చేస్తున్నా. మార్కెట్ డిమాండ్‌కు తగినట్టుగా కర్క్యుమిన్ శాతం అధికంగా 4–5 శాతం ఉండే రాజేంద్ర సోనియా, ఏసీసీ–79, ప్రగతి, పీతాంబర్, రాజేంద్ర సోనాల, రాజపురి, బీఎస్సార్–2 రకాలను వేస్తున్నా. తెగుళ్లు సోకకుండా ఎత్తు మడుల పద్ధతి పాటిస్తున్నా. – నలిమెల చిన్నారెడ్డి, యువరైతు, మగ్గిడి, ఆర్మూర్ మండలం రాష్ట్రంలో పెద్ద పసుపు మార్కెట్ ఇక్కడే.. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపు వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సీజన్లో భారీగానే పసుపు వస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా ధర లభిస్తోంది. – వెంకటేశం, మార్కెటింగ్ శాఖ ఉప సంచాలకుడు -
క్వింటాల్ పసుపు రూ. 6,850
సాక్షి, అమరావతి: పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 2022–23 సీజన్ కోసం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,850లుగా పేర్కొంది. రాష్ట్రంలో పసుపు 30,518 హెక్టార్లలో సాగవుతోంది. ఏటా 3.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కకపోవడంతో 2019–20లో రూ.342.75 కోట్ల విలువైన 50,035 టన్నుల పసువును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు మంచి రేటు పలుకుతోంది. గడిచిన సీజన్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ రూ.7,900కు పైగా పలికింది. ప్రస్తుతం క్వింటాల్ రూ.6,500కు పైగా పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో మార్కెట్లో పసుపునకు రేటు పెరిగే అవకాశం కన్పిస్తోంది. రైతుకు అండగా ఉండేందుకే: మంత్రి కాకాణి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మద్దతు ధర ప్రకటిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. పసుపు కొనుగోలు కోసం కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.6,850లుగా ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. పసుపు రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. -
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: పసుపు కొనుగోలు బాధ్యతలు పొందిన కొన్ని ఏజెన్సీలు అవకతవకలకు పాల్పడినట్టు తేలడంతో వాటన్నింటినీ రద్దు చేస్తూ మార్క్‌ఫెడ్ ఎండీ ఎస్.ప్రద్యుమ్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ సిబ్బందిని నియమించనున్నట్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► కొనుగోలు ఏజెన్సీలపై వచ్చిన అభియోగాలపై జిల్లాల జేసీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ► ఐదారేళ్లుగా ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు నష్టపోతుండటంతో సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ► ఈ మేరకు మార్క్‌ఫెడ్ అధికారులు క్వింటాల్ పసుపునకు రూ.6,850 మద్దతు ధరగా ప్రకటించారు. ► రాష్ట్రంలో 16 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పసుపు కొనుగోలు బాధ్యతలను స్వయం సహాయక గ్రూపులు, జిల్లా మార్కెటింగ్ సొసైటీలకు అప్పగించారు. ఇవన్నీ ఇప్పటివరకు 19,054 టన్నులను సేకరించాయి. ► ఇతర రాష్ట్రాల్లో పసుపు క్వింటాల్ రూ.4,500లోపే ఉండటంతో కొందరు వ్యాపారులు అక్కడి నుంచి రాష్ట్రానికి దిగుమతి చేసుకున్నారు. ఇక్కడి రైతుల పేరు మీద ఆ పసుపును రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ రూ.6,850 చొప్పున విక్రయించి లాభాలు పొందారు. ► కొనుగోలు కేంద్రాల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్టు, ఇందుకు పసుపు కొనుగోలు ఏజెన్సీలు సహకరించినట్టు ప్రభుత్వ విచారణలో తేలడంతో ఏజెన్సీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
పసుపు పంటకు లాభాల పారాణి
సాక్షి, అమరావతి: ఐదేళ్ల తరువాత పసుపు రైతులు లాభాలు పొందుతున్నారు. వారి కష్టానికి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు తోడు కావడంతో ఎకరానికి కౌలు, సాగు ఖర్చులు పోను ప్రతి రైతు కనీసం రూ.50 వేలకు పైగా లాభం పొందుతున్నాడు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల క్రితమే పసుపు పంట క్వింటాకు రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. పంట చేతికి వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచింది. పంటను కొనుగోలు చేసిన వారంలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. దీంతో మరో మార్గం లేక ప్రైవేట్ వ్యాపారులు సైతం రైతుల నుంచి పోటీపడి పంటను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటు పంటను పరిగణనలోకి తీసుకుని ఎకరా పొలం కలిగిన రైతు నుంచి 24 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని, రెండు ఎకరాల్లోపు భూమి కలిగిన రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్క రైతు నుంచి గరిష్టంగా 40 క్వింటాళ్లను కొనుగోలు చేస్తోంది. సాగుకు ముందే ధర ప్రకటించి.. ► సీఎం వైఎస్ జగన్ పసుపు, మిర్చి, చిరు ధాన్యాలకు సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించారు. ► దీంతో తాము పండించిన పంటను అమ్ముకోగలమనే ధీమా రైతులకు ఏర్పడింది. ► గతంలో వ్యాపారులు రైతుల నుంచి క్వింటా పసుపును రూ.5 వేల నుంచి రూ.5,500 లోపే కొనుగోలు చేశారు. 2017–18లో రూ.5,450, 2018–19లో రూ.5,500లకు కొనుగోలు చేశారు. ► రాష్ట్రంలో 29,654 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో అధికంగా ఈ పంట సాగయ్యింది. ► మొత్తంగా 1.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరాకు సగటున 35 క్వింటాళ్ల దిగుబడి వస్తే శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ► ఎకరా కౌలుకు రూ.50 వేలు, సాగుకు రూ.80 వేలు, మొత్తంగా రూ.1.30 లక్షల ఖర్చు అవుతోంది. ► 30 క్వింటాళ్ల పంటను కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్ముకుంటే రూ.2.05 లక్షల వరకు నగదు వస్తోంది. అన్ని ఖర్చులు పోను రైతుకు ఎకరాకు రూ.65 వేల వరకు ఆదాయం లభిస్తోంది. ► గతంలో రెండు, మూడు జిల్లాలకు ఒక పసుపు కొనుగోలు కేంద్రం ఉండేది. ఈ ఏడాది 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ► రైతుల నుంచి 10,200 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుని, ఇప్పటివరకు 3 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసింది. దళారులు లేకుండా చేశాం పసుపు క్వింటాకు రూ.6,850 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు పంటను అమ్ముకోవచ్చనే ధీమా ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోగా మిగిలిన పంటకు కూడా ప్రైవేట్ మార్కెట్లోనూ రైతులకు మంచి ధర లభిస్తోంది. గరిష్ట సేకరణను 30 నుంచి 40 క్వింటాళ్లకు పెంచడంతో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతోంది. – ఎస్.ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
పసుపు పంటను దగ్ధం చేసిన రైతులు
సంగారెడ్డి: పసుపు పంటకు కనీస మద్దతు ధరగా రూ.15000 లను ప్రకటించాలనీ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారేపల్లి తాజొద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలంలోని మారేపల్లిలో సీపీఐ అనుబంద సంఘాలైన వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పసుపు పంటను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతున్నప్పటికీ ఆ తర్వాత వారి గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. పంటకు గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో ఎంతోమంది యువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే పార్టమెంటులో వ్యవసాయరంగంపై సమగ్ర ప్రణాళికలు రూపొందించి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మిర్చి పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, గాల్‌రెడ్డి, సురేష్, రమేష్,వెంకట్‌రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. -
మానుకోట ముంగిట్లో పసుపు గడప
పసుపు పంటకు కేరాఫ్ కేసముద్రం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కొత్త జిల్లాతోమార్కెంటింగ్పై చిగురిస్తున్న ఆశలు ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన క్రయవిక్రయాలు కేసముద్రం: పసుపు శుభసూచిక.. తెలుగింటి ప్రతి గడపలో స్వాగత గీతిక.. రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద గుళిక.. సౌందర్యాన్ని పెంచే స్వదేశీ ఫేస్ క్రీమ్.. గాయాలకు నిఖార్సయిన ఇంటి మందు. అలాంటి పసుపును మండలంలోని రైతులు దశాబ్దాల కాలంగా సంప్రదాయ పంటగా వేలాది ఎకరాల్లో సాగుచేస్తున్నారు. కేసముద్రం మార్కెట్లో ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన పసుపు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నూతనంగా ఏర్పాౖటెన మానుకోట జిల్లాలో కేసముద్రం మండలం వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో కీలకంగా మారింది. పసుపు సాగులో మానుకోట జిల్లాకే మణిహారంగా మారింది. ఇక్కడ పసుపు సంబంధిత పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటవుతాయని, ఎంతోమందికి ఉపాధి కలుగుతుందనే కొత్త ఆశలు ఈ ప్రాంతవాసుల్లో చిగురిస్తున్నాయి. కొనుగోళ్లు మొదలైంది ఇలా.. 1965 కంటే ముందు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు పండించిన పసుపు పంటను ఎడ్లబండ్లపై మండల కేంద్రానికి తీసుకొచ్చి స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో, అప్పుడున్న రైస్ మిల్లు వద్ద రాశులుగా పోసి వ్యాపారులకు అమ్మేవారు. సరుకును బట్టి వ్యాపారి ధర నిర్ణయించి తర్వాత వెంటనే సదరు రైతు డబ్బులను తీసుకుని వెళ్లేవారు. ఈ క్రమంలోనే కల్వల గ్రామానికి చెందిన ఘంటా సత్తిరెడ్డి చొరవతో మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ను 1965 జనవరి 3న ఏర్పాటు చేశారు. మార్కెట్ ఏర్పడిన తర్వాత కూడా అదే పద్ధతుల్లో ప్రత్యక్ష పద్ధతిలో కొనుగోళ్లను కొనసాగించారు. దీంతో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేసముద్రం మార్కెట్లో నేటికి ప్రత్యక్ష కొనుగోలు పద్ధతి కొనసాగుతోంది. మొదట ఆహర పంటలనే పడించడంలో శ్రద్ధవహించిన రైతులు, ఆ తర్వాత సాగులో వచ్చిన మార్పులతో 1970లో వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపారు. ఆ రకంగా ఈ ప్రాంతంలో నేల స్వభావాన్ని బట్టి పసుపు సాగు చేయడం మొదలుపెట్టారు. 1980లో మార్కెట్లో పసుపు క్వింటాకు ధర రూ.200 పలికేది. రానురాను 2010లో క్వింటా పసుపునకు గరిష్ట ధర రూ.16 వేలు పలకడం పసుపు రైతుల ఇంట సిరులు కురిశాయి. వందల క్వింటాళ్ల నుంచి మొదలుకుని దాదాపు లక్షల క్వింటాళ్ల వరకు క్రయవిక్రయాలు జరగడం, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ప్రత్యక్ష పద్ధతిలో కోట్లాది రూపాయల్లో పసుపు కొనుగోళ్లు చేపట్టారు. ఇక్కడ 12 పాలిషింగ్ యూనిట్లు, 3 పౌడర్ మిల్లులు పనిచేస్తున్నాయి. సాగువిస్తీర్ణంలో పైచేయి వరంగల్జిల్లాలో ఉన్నప్పుడు జిల్లావ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పసుపును సాగుచేయగా, ఒక్క మానుకోట డివిజ¯ŒSలోనే 10 వేల ఎకరాల్లో పసుపును సాగుచేస్తున్నారు. ఇక డివిజ¯ŒSవ్యాప్తంగా చూస్తే ఒక్క కేసముద్రం మండలంలోనే 5 నుంచి 6 వేల ఎకరాల్లో పసుపును సాగుచేస్తుండటం విశేషం. మానుకోట జిల్లాలో పసుపు సాగులో కేసముద్రం మండలానిదే పైచేయిగా ఉంది. కాగా ప్రస్తుతం ఈ ఖరీఫ్‌లో 5 వేల ఎకరాల్లో పసుపు పంటను సాగుచేశారు. మానుకోట జిల్లాతో కొత్త ఆశలు పసుపును అధికంగా పండిస్తున్న కేసముద్రంలో పసుపు పంటకు వచ్చే తెగుళ్లు, నివారణ, ఆధునీకరణ సాగు పద్ధతులతోపాటు ఇతరాత్ర అంశాలపై అవగాహన కల్పించడానికి పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ముఖ్యంగా మార్కెట్లో ధర హెచ్చుతగ్గులను బట్టి, రైతులు పండించిన పసుపును భద్రపరచడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. గదుల్లో పసుపు నిల్వలు ఉంచడంతో వాటికి పురుగు పట్టే అవకాశం ఉంది. రక్షణ నిమిత్తం నెలనెలా రూ. 1000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా పసుపు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానుకోట జిల్లా ఏర్పాటుతో ఇక్కడ పసుపును భద్రపరుచుకునేందుకు కోల్డ్‌స్టోరేజ్‌లు, రాయితీలపై పరిశ్రమల ఏర్పాటు, పసుపు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. -
అంతర్ పంటతో ‘అసలు’కు దెబ్బ
బాల్కొండ: పసుపు పంటలో మొక్కజొన్న పంటను అంతర్ పంటగా సాగు చేస్తారు. కేవలం పసుపు పంటకు మర్రిఆకు తెగులు సోకకుండ కాపాడుకోవడానికి మొక్కజొన్నను పలుచగా సాగు చేయాలని ఉద్యాన అధికారులు సూచిస్తారు. కానీ కొందరు రైతులు రెండు పంటలలో అధిక దిగుబడి సాధించాలన్న ఆశతో పసుపు పంటలో మొక్కజొన్నను అధికంగా సాగుచేస్తుంటారు. దీంతో పసుపు పంట పూర్తిగా దెబ్బతింటుంది. బాల్కొండ మండలంలోని చాలా గ్రామాల్లో ఇలాగే పసుపు పంట దెబ్బతింది. పసుపు మధ్యలో వేసిన మొక్కజొన్న కోసిన తరువాత పసుపు పూర్తిగా తెలుపు రంగులో మారి ఎండినట్లు అయింది. ఇలా పసుపు పంట దెబ్బతినే అవకాశం ఉందని హర్టికల్చర్ అధికారులు అంటున్నారు. మొక్కజొన్న ఎక్కువగా ఉండటం వలన సరైన గాలి, సూర్యరశ్మి లభించక పసుపు పంట ఆకులపై మచ్చలు ఏర్పాడుతాయని వారు పేర్కొంటున్నారు. పసుపుపంట ఆకుపై హరితాన్ని మొత్తం చీడలు వ్యాపించి తినేస్తాయి. దీంతో పసుపు పంట వేళ్లు వదులుగా మారి ఎండుతాయి. పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్నను తక్కువ మోతాదులో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నివారణ చర్యలు అంతరపంటగా మొక్కజొన్నను అధికంగా సాగు చే య డం వల్ల పసుపు పంట పత్ర హరితం కోల్పోయి.. ఎండిపోతుంది. ఇలా జరిగినప్పుడు.. పొటాష్ హెక్టార్‌కు 60 కిలోలు వెదజల్లాలి. కాపర్ ఆక్సైడ్ 3 గ్రా ములు లీటర్ నీటిలో, 19 :19: 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేయాలి. లేదా ఎకరానికి 10 లీటర్ల వేపనూనెను పిచికారి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
పసుపు పంట..తెగుళ్లను నివారిస్తే సిరులే రైతు ఇంట
దుంప, వేరుకుళ్లు తెగులు దీనిని కొమ్ముకుళ్లు, అడుగు రోగం అనికూడా అంటారు. దీనివల్ల దిగుబడి 50 నుంచి 60 శాతం తగ్గుతుంది జులైలో మొదలై అక్టోబర్, నవంబర్‌లో తీవ్రమవుతుంది. తెగులు సోకడానికి కారణాలు. తెగులు ఆశించిన పొలం నుంచి విత్తనం వాడటం. విత్తన శుద్ధి చేయకపోవడం. విత్తన పసుపును లోతుగా నాటడం. మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలల్లో సాగుచేయటం. ఎడతెరపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండటం. పొటాష్, వేప పిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం. తెగులు లక్షణాలు పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల లేక, ఆకులు పసుపు రంగుకు మారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కల్లో తొలుత ముదురు ఆకులు(పైనుంచి 3వ ఆకు) వాడిపోయి, గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది. మొక్క కాండంపై నీటితో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. వేర్లు నల్లబడి కుళ్లిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు, కొమ్ములు మళ్లీ పుట్టవు. దుంపలు, కొమ్ములు కుళ్లి మెత్తబడతాయి. లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఉంటుంది. ఈ తెగులు తల్లి దుంపల నుంచి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. పసుపు దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్ములతో పాటు తేలికగా వస్తాయి. తెగులు నివారణ తెగులను తట్టుకునే రకాలను(సుగుణ, సుదర్శణ, ప్రతిభ) మాత్రమే సాగుచేసుకోవాలి. చీడపీడలు, తెగులు సోకని పొలం నుంచి విత్తనాన్ని సేకరించి వాడాలి. విత్తనశుద్ధి ముందుగా లీటరు నీటికి 3 గ్రాముల మెటలీక్సిల్+మాంకోజెబ్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్+2 మిల్లీలీటర్ల మెనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని మార్చి లీటరు నీటికి 5 గ్రాముల ట్రైకోదర్మా విరిడి కలిపి, ఆ ద్రావణంలో 30 నిమిషాలపాటు కొమ్ములను నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కి లోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్థితు ల్లో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా విత్తిన నెల రోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. ఏటా ఒకే నేలలో పసుపు వేయరాదు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి పసుపు విత్తిన తర్వాత నేలపై పచ్చి ఆకులతో లేదా ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తేగులు ఉధృతి కొంత వరకు తగ్గించవచ్చు వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి 1 గ్రాము మేటాలాక్సిల్+మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను కలిపి తెగులు సోకిన మొక్కలు, వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లు తడిచేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల ఫోరేట్ 10జీ గుళికలను 1 కిలో సైమాక్సోనిల్+మాంకోజెబ్ పొడి, తగినంత యూరియా(10 నుంచి 20 కిలోలు)లో కలుపుకొని పొలం అంతటా చల్లుకోవాలి. తాటాకు మచ్చ తెగులు దీనిని పక్షి, బెబ్బల, మర్రి ఆకు తేగులు అని కూడా అంటారు. సెప్టెంబర్ నుంచి ఈ తెగులు కనిపిస్తుంది. తెగులు సోకడానికి కారణాలు ఈ తెగులు విత్తనం, గాలి, వర్షం, పంట అవశేషాల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండడం తెగులు సోకిన పొలం నుంచి విత్తనం వాడటం, విత్తన శుద్ధి చేయకపోవడం పంట అవశేషాలు పొలంలో, పొలం చుట్టు ఉండటం. తెగులు లక్షణాలు ఆకులపై అండాకారపు పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడుతాయి. మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టు పసుపు రంగు వలయం ఉంటుంది. తర్వాత ఈ మచ్చలు క్రమేపీ పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు కిందికి వాలుతుంది. తెగులు తీవ్రమైతే మొక్కల్లో ఎదుగుదల, దిగుబడి, నాణ్యత తగ్గుతాయి. నివారణ తెగులు సోకని పొలం నుంచి మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి విత్తన శుద్ధి లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 3 గ్రాముల మెటలీక్సిల్+మాంకోజెబ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి, తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తెగులతో మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి వెంటనే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ లేదా 1 గ్రాము థయోఫానేట్ మిథైల్ లేదా 2 గ్రాముల కార్బెండజిమ్+మాంకోజెబ్ కలిపి ఉన్న మందు లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్, 0.5 మి.లీ సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధితో సెప్టెంబర్ నుంచి 3 నుంచి నాలుగు సార్లు పిచికారి చేయాలి. -
మక్కను కోశాక..పసుపులో సస్యరక్షణ
పసుపులో అంతర పంటగా వేసిన మొక్కజొన్నను కోయగానే కలుపు తీయాలి. పసుపులో ఉండే కలుపుతో పాటు మొక్కజొన్న ఆకులను, కొయ్యలను తీసేయాలి. 20 రోజులకొకసారి చొప్పున మూడుసార్లు కలుపు తీయాలి. కలుపు తీసిన ప్రతిసారి పొటాష్ వెదజల్లాలి. కలుపు తీసిన తర్వాత పంటకు తడి అందించాలి. తేమ ఉన్నప్పుడు ఒక హెక్టార్ పసుపు పంటకు 60 కేజీల పొటాష్ వెదజల్లాలి. లేదా లీటర్ నీటికి కార్బండైజమ్ 1.5 మి.లీటరు, కాపర్ ఆక్సైడ్ 3 గ్రాములు, 19:19 10 గ్రాములు కలిపి 400 లీటర్ల మందును పిచికారి చేయాలి. పసుపు ఆకుపై మచ్చలు ఉంటే మర్రి ఆకు తెగులు సోకిందని గుర్తించి 400 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్ల మోనో క్రొటోఫాస్, వంద గ్రాముల కాపర్ ఆక్సైడ్ కలిపి ఆకులపై పిచికారి చేయాలి. మొక్కజొన్న కోసిన తర్వాత రైతులు కాంప్లెక్స్ ఎరువు 20:20 ను పొటాష్‌తో కలిపి వేస్తారు. కానీ ప్రస్తుత దశలో పసుపు పంటకు కాంప్లెక్స్ ఎరువుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులు వేయరాదు. పసుపు పంటకు దుంపకుళ్లు సోకితే పసుపు ముదురు ఆకులు పూర్తిగా ఎండి పోతాయి. ఆకులను తీస్తే దుర్వాసన వస్తుంది. పసుపులో నీటి నిలువ ఎక్కువగా ఉంచరాదు. నీరు తక్కువ మోతాదులోనే పంటకు అందించాలి. దుంప కుళ్లను ప్రస్తుత దశలో పూర్తిగా నివారించలేం. కేవలం వ్యాపించకుండా చర్యలు చేపట్టవచ్చు. -
మన మార్కెట్‌కు ఆంధ్రా పసుపు
మోర్తాడ్ : ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పండించిన పసుపు పంట నిజామాబాద్ మార్కెట్‌కు తరలివస్తోంది. అక్కడ డిమాండ్ లేకపోవడం వల్లే ఇందూరు మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుగ్గిరాల, కడప ప్రాంతాలనుంచి వ్యాపారులు పసుపు పంటను తీసుకు వస్తున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పసుపు పంట ఆర్మూర్ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కడప, దుగ్గిరాల, తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతాలలో విస్తారంగా సాగవుతుంది. అయితే ఆర్మూర్ ప్రాంతంలో పండించిన పసుపునకు మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. నిజామాబాద్, సాంగ్లీ మార్కెట్లకు జాతీయ స్థాయి వ్యాపారులు వచ్చి పసుపు పంటను కొనుగోలు చేస్తారు. దీంతో కడప, దుగ్గిరాల ప్రాంతాలలోని వ్యాపారులు పసుపును ఇక్కడికి తరలించి విక్రయిస్తున్నారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా పసుపు దిగుబడులు అంతగా ఉండే అవకాశం లేదని వ్యాపారులు భావిస్తున్నారు. పసుపు మార్కెట్ ఆరంభం అయిన తర్వాత పంటకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పసుపు పంట లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు. క్వింటాలుకు రూ. 5 వేలనుంచి రూ. 5,500 వరకు చెల్లిస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇలా కొనుగోలు చేసిన పంటను కోల్‌కతా, ముంబయి ప్రాంతాలలోని పారిశ్రామిక సంస్థలకు విక్రయిస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు విక్రయాలు సాగుతున్నాయని గుర్తించిన కడప, దుగ్గిరాల వ్యాపారులు అక్కడి రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి మన మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు ఐదు లారీల్లో పసుపు పంట పొరుగు రాష్ట్రం నుంచి మన మార్కెట్‌కు తరలివచ్చిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. నిజామాబాద్ మార్కెట్లో క్రయవిక్రయాలు స్తబ్ధంగా ఉన్న సమయంలో పొరుగు రాష్ట్రం నుంచి పసుపు తరలిరావడంపై వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పసుపునకు తెగుళ్ల బెడద
ఆదిలాబాద్ (నిర్మల్) : పసుపు పంటను పసిడితో పోల్చుతారు. అధిక పెట్టుబడి, దీర్ఘకాలిక పంట అయిన పసుపు సాగులో రైతులు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కంటికి రెప్పలా పం టను కాపాడుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. అయితే పంటకు సోకే తెగుళ్లు ఏటా రైతులకు తీవ్ర కష్టనష్టాలు తెచ్చి పెడుతున్నాయి. జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. పంటకు సోకే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను నిర్మల్ ఏడీఏ వినయ్‌బాబు వివరించారు. దుంప ఈగ దుంప ఈగ ఆశిస్తే.. పసుపు సుడి ఆకు, దాని దగ్గరలోని లేత ఆకులు వాడిపోయి గోధుమరంగులోకి మారి ఎండిపోతాయి. మువ్వ సులువుగా ఊడి వస్తుంది. దుంపలోని కణజాలం దెబ్బతింటుంది. పుచ్చిన దుంపలో బియ్యపు గింజలను పోలిన పురుగులు ఉంటాయి. దీని నివారణకు తోటలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దుంప పుచ్చు లక్షణాలు కనిపించగానే ఎకరాకు 100 కిలోల వేపపిండిని తోటంతా సమంగా చల్లాలి. లేనిచో ఎకరాకు పది కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను అదే పరిమాణంలో ఇసుకలో కలిపి పొలమంతా సమంగా చల్లాలి. అల్లిక రెక్కలనల్లి అల్లిక రెక్కలనల్లి పురుగు ఆశిస్తే.. ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మొక్కలు పేలవంగా కనిపిస్తాయి. చీడ ఎక్కువైతే ఆకులు ఎండిపోయి పసుపు దిగుబడి.. నాణ్యత తగ్గుతుంది. దీని నివారణ కోసం లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. దుంపకుళ్లు, వేరుకుళ్లు తెగులు నీరు ఇంకని పల్లపు భూముల్లో దుంపకుళ్లు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మొక్కలలో ముదురు ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. ఈ లక్షణం క్రమేణా కింది భాగంలో ఉన్న ముదురు ఆకుల నుంచి పైన ఉన్న లేత ఆకులకు సంక్రమిస్తుంది. మొక్క కాండంపై నీటిలో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. తెగులు లక్షణాలు కనిపించగానే మొక్కలకు, వాటి చుట్టూ ఉన్న వాటికి లీటరు నీటికి ఒక గ్రాము రిడోమిల్ ఎంజడ్ లేదా రెండు గ్రాముల క్యాప్టాను లేదా మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క చుట్టూ తడిచేలా పోయాలి. తాటాకు మచ్చ తెగులు గాలిలో ఎక్కువ తేమ, గాలితో కూడిన వర్షాలు ఉన్నప్పుడు ఈ తెగులు పసుపు పంటను ఆశిస్తుంది. అండాకారపు పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడి మచ్చలు పెరిగి గోధుమ రంగుకు మారుతాయి. మచ్చ చుట్టూ పసుపు వలయం ఉంటుంది. మచ్చలు పెద్దవై, పెరిగి ఆకులు మాడిపోతాయి. ఈ తెగులు నివారణకు తెగులు ఎండిన ఆకుల్ని, వ్యాపించిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. వెంటనే లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాలి. -
ఇప్పటి నుంచే జాగ్రత్తలు అవసరం
పాడి-పంట: జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న పసుపు పైరు ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. ఈ పం టను తొలి దశ నుంచే పలు రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. అనుకూల వాతావరణంలో వీటి ఉధృతి మరింత ఎక్కువగా ఉం టుంది. వీటి నివారణకు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేలైన, నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జగిత్యాల ఉద్యానవన శాఖాధికారి నర్సయ్య. ఆ వివరాలు... ఆకులు ఎండిపోతాయి రైతులు ఏ రకాన్ని వేసినప్పటికీ పసుపు పంటకు మర్రి ఆకు తెగులు తాకిడి తప్పడం లేదు. దీని ఉనికి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఉధృతి అధికమవుతుంది. బల హీనంగా ఉన్న నేలలు తెగులుకు త్వరగా లోనవుతుంటాయి. అంతేకాదు... పసుపును ఏకపంటగా వేసిన భూముల్లో దీని తాకిడి ముందుగానే మొదలవుతుంది. మర్రి ఆకు తెగులు సోకిన మొక్కలోని లేత ఆకుల మీద గోధుమ రంగు, మధ్యలో తెలుపు లేదా బూడిద రంగు చుక్కలున్న కండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమేపీ పెద్దవై ఆకు మొత్తానికీ వ్యాపిస్తాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రావుుల వూంకోజెబ్ లేదా ఒక మిల్లీలీటరు ప్రాపికొనజోల్ లేదా 2 గ్రావుుల సిక్సర్/కంపానియున్/సాఫ్ చొప్పున కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఈ మందు ద్రావణాన్ని ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకూ 4-6 సార్లు ఆకులు తడిసేలా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మందు ద్రావణం ఆకులను పట్టుకొని ఉండటానికి తగిన మోతాదులో జిగురు మందు కలపాలి. వేర్లు-దుంపలు కుళ్లుతాయి పసుపు పంటకు సోకే చీడపీడల్లో దుంప-వేరుకుళ్లు తెగులు అత్యంత ప్రమాదకరమైనది. ఇది పంట దిగుబడిని దారుణంగా దెబ్బతీసి, రైతును ఆర్థికంగా కుంగదీస్తుంది. ఈ తెగులు అన్ని రకాల నేలల్లోనూ కన్పిస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కల చుట్టూ నీరు చేరితే తెగులు వేగంగా వ్యాప్తి చెందుతుంది. మురుగు నీటి పారుదల సౌకర్యం సరిగా లేకపోవడం కూడా తెగులు వ్యాప్తికి కారణమే. ఈ తెగులు ముందుగా తోటలో అక్కడక్కడా కన్పిస్తుంది. వుుదురు ఆకులు ఎండిపోతాయి. మొక్కలు కుంచించుకుపోతాయి. కొన్నిసార్లు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారి చుట్టుకుపోతాయి. మొక్క వాడిపోతుంది. వేర్లు, దుంప కుళ్లిపోతాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు తల్లి దుంపల నుంచి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. క్రమేపీ కాండం మెత్తబడి, మొక్క చనిపోతుంది. తెగులు సోకిన మొక్కల మధ్య కొన్ని ఆరోగ్యవంతమైన మొక్కలు కూడా కన్పిస్తుంటాయి. ఈ తెగులు నివారణకు సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి. విత్తనశుద్ధి తప్పనిసరి. చేలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గతంలో వేసిన పంట ఈ తెగులు బారిన పడి ఉంటే అదే చేలో మళ్లీ పసుపు వేయకూడదు. వేరే పైరుతో పంట మార్పిడి చేయాలి. ఈ తెగులు నివారణకు... కిలో ట్రైకోడెర్మా విరిడెను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజుల పాటు అనువైన పరిస్థితుల్లో అభివృద్ధి చేయాలి. ఆ మిశ్రమాన్ని ఆఖరి దుక్కిలో కానీ లేదా నెల రోజులకు మొదటి తవ్వకం చేసిన తర్వాత కానీ నీటి తడి ఇచ్చి వెంటనే చల్లాలి. చివరిగా... లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్లు తడిసేలా పాదులో పోయాలి. ఈ పురుగులు కూడా... గండు చీమ ఆకారంలో ఉండే నల్లని ఈగలు కాండం మొదలులో (భూమి పైపొరలో) గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి బయటికి వచ్చిన తెల్లని పురుగులు భూమిలోని దుంపలను తొలుచుకుంటూ లోపలి పదార్థాన్ని తినేస్తాయి. చివరి దశ వరకూ ఈ పురుగు పైరును నష్టపరుస్తూనే ఉంటుంది. దీనివల్ల దిగుబడి 45-50 శాతం తగ్గుతుంది. నాణ్యత కూడా దెబ్బతింటుంది. పురుగులు ఆశించిన మొక్క సుడి ఆకు, దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడిపోయి గోధుమ రంగుకు మారతాయి. ఆ తర్వాత ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. దుంపలో కణజాలం దెబ్బతింటుంది. పురుగు ఆశించిన దుంపలను వండితే తొర్ర మాదిరిగా కన్పిస్తుంది. సాధారణంగా దుంప-వేరుకుళ్లు తెగులు సోకిన మొక్కలను ఈ పురుగులు కూడా ఆశించి మరింత నష్టాన్ని కలిగిస్తాయి. పురుగు ఆశించిన లక్షణాలు కన్పించగానే మొక్కల మధ్య వేపపిండిని వేయాలి. లేకుంటే 8-10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను మొక్కలకు 10-15 సెంటీమీటర్ల దూరంలో, 5-7 సెంటీమీటర్ల లోతున భూమిలో వేసి మట్టి కప్పాలి. వేపపిండితో చెక్ పసుపు పంటను ఆశించే చీడపీడల్లో దుంపపుచ్చు, దుంపకుళ్లు అత్యంత ప్రమాదకరమైనవి. వీటి నివారణకు వేపపిండి వినియోగం తప్పనిసరి. చేలో దుంపపుచ్చుకు కారణమైన ఈగ కన్పించగానే నీటి తడి ఇచ్చి, ఎకరానికి 250-300 కిలోల వేపపిండిని మొక్కల మొద ళ్ల చుట్టూ ఉన్న నేలపై చల్లాలి. ఆ తర్వాత చేనుకు తడిపెట్టిన ప్రతిసారీ వేపపిండి ఊట భూమిలోకి దిగుతూ తెగుళ్లకు కారణమైన క్రిమికీటకాలను మొక్కల దగ్గరికి రానీయదు. -
పసిడి పంట ధర పైపైకి..
పసిడి పంటగా పేరుగాంచిన పసుపు ధర క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సుగంధ ద్రవ్యాల ధరను నియంత్రించే కమోడిటీలో పసుపునకు డిమాండ్ ఏర్పడటంతో గడచిన సీజన్లో ఉన్న పరిస్థితికి భిన్నంగా ఈ సీజన్లో ధరలో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ధర మరింతగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మోర్తాడ్, న్యూస్‌లైన్ : పసుపు ధరలకు రెక్కలొచ్చాయి. మహారాష్ట్ర లోని సాంగ్లీ మార్కెట్లో క్వింటాలు పసుపు రూ. 10 వేలు పలుకుతోంది. నిజామాబాద్ మార్కెట్లో రూ. 7,500 నుంచి రూ. 8,500 మధ్య ధర లభిస్తోంది. సీజన్ ఆరంభంలో క్వింటాలు పసుపు రూ. 4,500 నుంచి రూ.5 వేలు మాత్రమే పలికింది. జిల్లాలో మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాల్లో పసుపు ఎక్కువగా సాగు అవుతోంది. నిజామాబాద్ మార్కెట్‌కు సాంగ్లీ మార్కెట్‌కు ధరలో వెయ్యి రూపాయల నుంచి రూ. 2 వేల వరకు తేడా ఉంటుంది. దీంతో చాలా మంది రైతులు సాంగ్లీ మార్కెట్‌కు పంటను తరలిస్తున్నారు. వర్షాకాలంలో భారీగా వర్షాలు కురియడంతో పసుపు పంట తెగుళ్లు సోకాయి. దీంతో దిగుబడి తగ్గింది. గతంలో నిజామాబాద్ మార్కెట్‌కు రోజుకు 10 వేల సంచుల నుంచి 15 వేల సంచుల పసుపును రైతులు తరలించేవారు. ఈ సీజన్లో రోజుకు ఐదు వేల సంచుల పసుపు మాత్రమే వస్తోంది. సరఫరా తక్కువగా ఉండడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొంది. దీనికి తోడు కమోడిటీలో పసుపునకు డిమాండ్ ఏర్పడడంతో ధర పెరుగుతోంది. నిజామాబాద్ మార్కెట్‌కు ఈరోడ్, బసుమతినగర్ మార్కెట్ల వ్యాపారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. ఈరోడ్ మార్కెట్‌కు పసుపు సరిగా సరఫరా కాకపోవడంతో అక్కడి వ్యాపారులు ఇక్కడి వ్యాపారులతో పసుపును కొనుగోలు చేయించి తీసుకెళ్తున్నారు. బసుమతి నగర్ ప్రాంతంలో పసుపు సాగు తక్కువ కావడంతో అక్కడి వ్యాపారులు కూడా నిజామాబాద్ మార్కెట్‌పై కన్నేశారు. దీంతో ధర పెరుగుతోంది. వారం వ్యవధిలో పసుపు ధర క్వింటాలుకు రూ. 12 వేలకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. తొందరపడి పంట విక్రయించవద్దని సాంగ్లీకి చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాపారులు మార్కెట్‌ను అంచనా వేయడంతో పాటు రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ప్రచారం నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
కళ తప్పిన పసుపు
తెనాలిటౌన్, న్యూస్‌లైన్ ఈ ఏడాది పసుపు పంట సాగు చేసిన రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. అక్టోబరు, సెప్టెంబరు నెలల్లో సంభవించిన తుపానుల దెబ్బకు పసుపు చేలల్లో వారం రోజలపాటు నీరు నిల్వ ఉండి పైరు ఉరకబారి దెబ్బతింది. ఆ తరువాత దుంప, వేరుకుళ్ళు, ఎండు తెగులు వ్యాపించి పంట ముందుగానే ఎండిపోయింది. దీంతో దిగుబడులు కూడా తగ్గుతున్నాయి. సాధారణంగా మార్చి నెలలో రైతులు పసుపు పంటను దున్నుతారు. తెగుళ్లు ఆశించడంతో మొక్కలు ఎండిపోయాయి. దుంపకు కుళ్ళు రావడంతో చేసేదేమీ లేక రైతులు పంట దున్నే పనిలో పడ్డారు. కొల్లిపర, కొల్లూరు, దుగ్గిరాల మండలాల్లో రైతులు పసుపును దున్నుతుండగా, మరి కొన్ని మండలాల్లో ఆకులను తొలగిస్తున్నారు. కొల్లిపర మండలంలో 3వేలఎకరాలు, కొల్లూరులో 2500, తెనాలి మండలంలో 200, దుగ్గిరాలలో 1250, భట్టిప్రోలులో 1600 , వేమూరులో 100 , అమర్తలూరులో 100 , చుండూరు మండలంలో 200 ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేస్తున్నారు. తుపానులు, భారీ వర్షాల కారణంగా ఈ ఏడాది దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎకరం పొలం కౌలుకు రూ.30 వేలు, విత్తనం నాటడానికి రూ.25వేలు, ఎరువులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.50వేలు రైతులు ఖర్చు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పసుపు ధర రూ.5వేలు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే రోజుల్లో రూ.6వేలు పలికింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలు రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ధరలు ఇలాగే కొనసాగితే ఎకరాకు కౌలు రైతులకు రూ.50 వేలు నష్టం వచ్చే పరిస్థితి నెలకొంది. ధరలు ఆశాజనకంగా లేకపోవడం, పంట దిగుబడులు కూడా ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ళ మేరకే రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొల్లిపర మండలం తూములూరు, కొల్లిపర, పిడపర్తిపాలెం గ్రామాల పరిధిలో, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పసుపు దున్నుతున్నారు. దున్నిన పొలాల్లో రైతులు మొక్కజొన్న నాటుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలి ఎకరం పొలం కౌలుకు తీసుకుని పసుపు సాగు చేశా. తుపానులకు పైరు ఉరకబారింది. కేవలం 12 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మార్కెట్లో ధర లేక ఎకరాకు రూ.50వేలు నష్టం వచ్చింది. ప్రభుత్వం పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. క్వింటా ధర రూ.8 వేల వరకు ఉంటే రైతులకు కొంత ఊరట కలిగింది. - కేశన సాంబశివరావు, కౌలుైరె తు, కొల్లిపర -
పోరాడితేనే గిట్టుబాటు
ఆర్మూర్, న్యూస్‌లైన్: రైతులంతా సంఘటితంగా పోరాడి పసుపు పంటకు గిట్టుబాటు ధరను సాధిం చుకోవాలని తమిళనాడులోని ఈరోడు పార్లమెంటు సభ్యుడు గణేష్ మూర్తి పిలుపుని చ్చారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో పసుపు రైతుల గర్జన బహిరంగ సభను మం గళవారం నిర్వహించారు. అంతకుముందు ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాం గణం నుంచి సభాస్థలి వరకు సుమారు పది వేల మంది పసుపు రైతులతో భారీ ర్యాలీ సాగింది. పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అధ్యక్షతన జరిగిన సభలో బీజేపీ, సీపీఐ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు ఉత్తర భారత దేశానికి చెందిన పలువురు ఉద్యమ నాయకులు అతి థులుగా హాజరై ప్రసంగించారు. భారత దేశంలో పండిస్తున్న పసుపు పంటలో ఆంధ్రప్రదేశ్‌ది 45 శాతం ఉంటుందన్నారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌తో కలిపి 80 శాతం పంట ఉత్పత్తి జరుగుతోందన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్ నుంచి మాత్రమే అధిక శాతం పంట విదేశాలకు ఎగుమతి అవుతోందన్నారు. కాని పంట పండిం చిన రైతులు మాత్రం గిట్టుబాటు ధర లభించక తీవ్రం గా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వానికి స్వామినాధన్ కమిషన్ సూచించిన సిఫార్సుల ఆధారంగా రైతులు పండించిన పంటకు పెట్టుబడి వ్యయంపై 50 శాతం లాభం కలిపి గిట్టుబాటు ధరను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ విధానాన్ని బట్టి పసుపు రైతులకు క్వింటాలకు రూ. 15 వేల ధర లభించాల్సి ఉందన్నారు. ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి పసుపు రైతుల సమస్యల గురించి పలు మార్లు నివేదించినా ఫలితం లేదన్నారు. అందుకే రైతులంతా ఏకమై ఉద్యమం చేపట్టాలన్నారు. ఎరువుల సబ్సిడీని రైతులకు నేరుగా ఇవ్వాలి -భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ తికాయత్ రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించాలంటే ఎరువులపై ఫ్యాక్టరీ యజమానులకు కా కుండా నేరుగా రైతులకు సబ్సిడీని అందజేయాలి. రైతులు ఉద్యమాలు, ఓటు విలువ తెలుసుకున్నపుడే వారి అధికారాలను కైవసం చేసుకుంటారు. దేశంలో ఉన్న రైతులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తలే. వారికి ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర ఇస్తే చాలు ప్రభుత్వం కోరిన పంటలను పండిస్తారు. ఉత్తర భారత దేశంలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఢిల్లీని ముట్టడిస్తూ ఎన్నో ఉద్యమాలు చేశాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. రాష్ట్ర ఏర్పాటుకు ఢిల్లీ ముట్టడి అవసరం వస్తే తెలంగాణ నుంచి పది వేల మంది వచ్చినా చాలు 50 వేల మందిమి అండగా నిలుస్తాము. ప్రభుత్వాన్ని మార్చడమే ఈ సమస్యకు పరిష్కారం.. -జాతీయ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు పీకే దైవసిగామని పసుపు రైతుల సమస్యల పరి ష్కారానికి కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడమొక్కటే పరి ష్కారం. దశాబ్ద కాలంగా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం మా త్రం శూన్యం. ఒక్కసారి రైతులంతా సంఘటితమైతే ప్రభుత్వాలు కూలిపోతాయని నిరూపించాలి. త్వరలో పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో భారీ సభ నిర్వహించనున్నాము. రైతుల పక్షాన నిలిచే రాజకీయ పార్టీల వెంటే రైతులు నిలుస్తారు. రైతులకు నష్టం చేకూర్చే నిర్ణయాలే.. -సాంగ్లి శెట్కార్ సంఘటన్ అధ్యక్షుడు రఘునాధ్ దాదా పాటిల్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ బడా వ్యాపారులకు లాభం చేకూరుస్తూ రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలే తీసుకుం టూ అమలు చేస్తోంది. గోధుమలు, చక్కెర ఎగుమతులను ప్రోత్సహిస్తే రైతులకు నేరుగా లాభం చేకూర్చవచ్చు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎగుమతులను నిలిపి వేసి గోధుమలు, చక్కెరతో ఇక్కడ తయారు చేసి న బిస్కట్లు, చాక్లెట్ల ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. తద్వారా బడా వ్యాపారులకు లాభాలు రావడానికి సహకరిస్తోంది. రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులు సంఘటితంగా ఉంటే మార్పు అనివార్యం. -
ఆజన్మం: సాయంత్రపు వాలులో ఒక తారసపాటు
అప్పుడు చిలుమూరులో ఉన్నాను. కృష్ణానది పాయ ‘అదిగో, ఆ ముందునుంచే’ పారుతుందంటే బయల్దేరాం. ఎవరి వ్యవహారం తెమలడాన్ని బట్టి వాళ్లు జట్లు కడుతూ వెళ్లారు. నేను కారణం తెలియకుండా ఒంటరినై ఆ గుంపులను వెతుక్కుంటూ నడుస్తున్నా. బహుశా, వెయ్యేళ్ల నాటి శివాలయంలో కనబడిన అర్థంకాని తెలుగు రాతల్ని చదవడంలో మునిగిపోయి, అందరూ నన్ను దాటి వెళ్లిపోయినట్టు చూసుకుని ఉండను! పొద్దు గుంకుతోంది. రాత్రి కురిసిన వాన ఆనవాలు తెలుస్తోంది. చేలలో పని ముగించుకుని వస్తున్నవాళ్లు ఎక్కడైనా ఎదురవుతున్నారు. మట్టిబాట, పసుపు గాలి, తమలపాకుల తీగలు సాయంత్రాన్ని మరింత సార్థకం చేస్తున్నాయి. ఒక మలుపు తిరుగుతూనే, నాకు ముందున్న తక్షణ కూటమి కనబడింది. కొంతదూరంలో రఘోత్తమ్ సర్, అక్కిరాజు, ముళ్లపూడి కొబ్బరిబోండాల కోసం నిలిచిపోయినట్టుగా అర్థమవుతోంది. ఎదురుగా సైకిల్ మీద గంపతో వస్తున్నాయన ఆగాడు, ‘‘మూడా?’’ అనుకుంటూ. సరిగ్గా ఆ సమయానికే నేను వాళ్లను అందుకుంటున్నాను. మిన్నకుండా వెళ్లిపోదాం అనిపించింది. ఆగకపోతే వాళ్లేమైనా అనుకుంటారా? తెలిసినవాళ్లు అయినప్పుడు కిమ్మనకుండా, అక్కడ ఎవరూ లేనంత మామూలుగా వెళ్లిపోవడం ఎలా? అలా దాటి పోవడం సబబేనా? మరి ఉంటే వాళ్లు ముగ్గురుగా అనుభవించగలిగే ఏకాంతానికి నేను మధ్యలో దూరి భంగం వాటించినవాణ్ని అవుతానా? ‘రా, తీసుకో’ అనే అనివార్యమైన ఆహ్వానపు ఒత్తిడిని కలిగిస్తాననే స్పృహ నన్ను మరింత కలవరపరిచింది. ఈ అసౌకర్యమైన స్థితికి నన్ను నేను నెట్టుకోవడంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను వెళ్లేసరికి వాళ్లు అక్కడ ఉండటం యాక్సిడెంట్. ఒక్క నిమిషం ఆలస్యమైనా బోండాలతను వెళ్లిపోయుండేవాడు కావొచ్చు. అప్పుడు ఈ అనుకోని అతిథితో ఎలా రియాక్టవ్వాలో తెలియని డైలమాలోకి వాళ్లను నేను నెట్టివేసేవాణ్ని కాకపోవచ్చు. ఎవరూ దేనికీ బాధ్యులు కారు. అయినా విధివశాత్తూ అలా తారసపడ్డాం. ఒక్క క్షణంలోనే నా మొహమాటాన్ని చొరవగా కన్వర్ట్ చేసుకుని వాళ్లతో కలిశాను; ‘‘ఇంకోటి కొట్టు,’’ అన్నాను. నిజానికి ఇదంతా వాళ్లు ఆలోచించివుండరు. నన్ను చాలా ప్రేమగానే ఆ తాత్కాలిక సమూహంలోకి ఆహ్వానించివుంటారు. అయినా, వాటికి డబ్బులు చెల్లించడం ద్వారా నా గిల్టును తగ్గించుకోవడానికి ప్రయత్నించాను. అప్పటికీ అది సరైనపని అని మాత్రం అనుకోలేకపోయాను. ఒకవేళ వాళ్లు నిజంగా ఆశించివుంటే, వాళ్ల ప్రైవసీకి అది పరిహారం ఎలా కాగలదు? చిన్న శివుడు - పెద్ద శివుడు ఒక సందర్భంలో, ఒక కామెంట్ కోసం, ఈ ఫోన్ చేయడం తప్పనిసరైంది. రింగ్‌టోన్ చాలా బాగుంది. ‘నాలోన శివుడు గలడు... నీలోన శివుడు గలడు...’ పాట విన్నకొద్దీ వినబుద్ధేస్తోంది. తనికెళ్ల భరణి గొంతు దీనికి బాగా సూట్ అయ్యింది. ఎదుటివ్యక్తి ఫోన్ తియ్యడంలేదనే విషయాన్ని గుర్తించలేనంతగా అందులో లీనమైపోవచ్చు. నిజంగా కూడా ఆయన తీయలేదు. శివుడు నాకూ ఇష్టమే. నా చిన్నప్పటి ప్రియమైన దేవుడు శివుడే! కాళికాదేవి శివుణ్ని కిందపడేసి తొక్కుతున్న చిత్రపటం ఎవరింట్లోనో చూసి విలవిల్లాడిపోయాను. శివుడినేమిటి? ఈమె తొక్కడమేమిటి? ఆ అవమానానికి నా నరాలు కోపంతో పొంగిపోయాయి; పళ్లు పటపటలాడాయి; ఇక నేను పైకి వెళ్లి, ఆమెతో యుద్ధం చేసేద్దామనుకున్నాను. ఇంతలో మా రాంరెడ్డి మల్లయ్య మామ అన్నాడు: ‘‘ఏ నిజం శంకరుడు గాదు రాజూ! వాడెవడో రాక్షసుడు శంకరుని లెక్క వేషం ఏసుకుంటే, వాణ్ని దొక్కింది.’’ అమ్మయ్య! మనసు తేలికైపోయింది. పెద్ద యుద్ధం తప్పిపోయింది. కాబట్టి శివుడంటే నాకు అంత ఇష్టం. అయితే, నాలోనూ శివుడు ఉంటే, నాలోని శివుడు ఆయనలోని శివుడితో ఎందుకు మాట్లాడ్డానికి ప్రయత్నించినట్టు? పోనీ ఆయనలోని శివుడు నాలోని శివుడేదో మాట్లాడాలనుకుంటున్నాడని ఎందుకు గుర్తించలేదు? అంటే, ఇద్దరిలోనూ ఉన్న శివులు ఒక్కరు కారు. ఆయన తనికెళ్ల శివుడు, ఈయన పూడూరి శివుడు. అంటే దేవుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు దేవుడు. దేవుడు దేవుడికే సమానం కానప్పుడు, మనిషితో మనిషి మాత్రం ఎలా సమానం అవుతాడు? - పూడూరి రాజిరెడ్డి