ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు | Turmeric purchases under the auspices of government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు

Published Tue, Jun 16 2020 3:32 AM | Last Updated on Tue, Jun 16 2020 5:23 AM

Turmeric purchases under the auspices of government - Sakshi

సాక్షి, అమరావతి: పసుపు కొనుగోలు బాధ్యతలు పొందిన కొన్ని ఏజెన్సీలు అవకతవకలకు పాల్పడినట్టు తేలడంతో వాటన్నింటినీ రద్దు చేస్తూ మార్క్‌ఫెడ్‌ ఎండీ ఎస్‌.ప్రద్యుమ్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్‌ సిబ్బందిని నియమించనున్నట్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

► కొనుగోలు ఏజెన్సీలపై వచ్చిన అభియోగాలపై జిల్లాల జేసీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. 
► ఐదారేళ్లుగా ప్రైవేట్‌ వ్యాపారుల చేతిలో రైతులు నష్టపోతుండటంతో సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారిగా పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
► ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ అధికారులు క్వింటాల్‌ పసుపునకు రూ.6,850 మద్దతు ధరగా ప్రకటించారు. 
► రాష్ట్రంలో 16 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పసుపు కొనుగోలు బాధ్యతలను స్వయం సహాయక గ్రూపులు, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలకు అప్పగించారు. ఇవన్నీ ఇప్పటివరకు 19,054 టన్నులను సేకరించాయి. 
► ఇతర రాష్ట్రాల్లో పసుపు క్వింటాల్‌ రూ.4,500లోపే ఉండటంతో కొందరు వ్యాపారులు అక్కడి నుంచి రాష్ట్రానికి దిగుమతి చేసుకున్నారు. ఇక్కడి రైతుల పేరు మీద ఆ పసుపును రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌ రూ.6,850 చొప్పున విక్రయించి లాభాలు పొందారు. 
► కొనుగోలు కేంద్రాల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్టు, ఇందుకు పసుపు కొనుగోలు ఏజెన్సీలు సహకరించినట్టు ప్రభుత్వ విచారణలో తేలడంతో ఏజెన్సీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement