ఆర్మూర్, న్యూస్‌లైన్: రైతులంతా సంఘటితంగా పోరాడి పసుపు పంటకు గిట్టుబాటు ధరను సాధిం చుకోవాలని తమిళనాడులోని ఈరోడు పార్లమెంటు సభ్యుడు గణేష్ మూర్తి పిలుపుని చ్చారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో పసుపు రైతుల గర్జన బహిరంగ సభను మం గళవారం నిర్వహించారు. అంతకుముందు ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాం గణం నుంచి సభాస్థలి వరకు సుమారు పది వేల మంది పసుపు రైతులతో భారీ ర్యాలీ సాగింది. పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అధ్యక్షతన జరిగిన సభలో బీజేపీ, సీపీఐ, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు ఉత్తర భారత దేశానికి చెందిన పలువురు ఉద్యమ నాయకులు అతి థులుగా హాజరై ప్రసంగించారు.
భారత దేశంలో పండిస్తున్న పసుపు పంటలో ఆంధ్రప్రదేశ్‌ది 45 శాతం ఉంటుందన్నారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌తో కలిపి 80 శాతం పంట ఉత్పత్తి జరుగుతోందన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్ నుంచి మాత్రమే అధిక శాతం పంట విదేశాలకు ఎగుమతి అవుతోందన్నారు. కాని పంట పండిం చిన రైతులు మాత్రం గిట్టుబాటు ధర లభించక తీవ్రం గా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వానికి స్వామినాధన్ కమిషన్ సూచించిన సిఫార్సుల ఆధారంగా రైతులు పండించిన పంటకు పెట్టుబడి వ్యయంపై 50 శాతం లాభం కలిపి గిట్టుబాటు ధరను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ విధానాన్ని బట్టి పసుపు రైతులకు క్వింటాలకు రూ. 15 వేల ధర లభించాల్సి ఉందన్నారు. ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి పసుపు రైతుల సమస్యల గురించి పలు మార్లు నివేదించినా ఫలితం లేదన్నారు. అందుకే రైతులంతా ఏకమై ఉద్యమం చేపట్టాలన్నారు.
ఎరువుల సబ్సిడీని రైతులకు నేరుగా ఇవ్వాలి
-భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ తికాయత్
రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించాలంటే ఎరువులపై ఫ్యాక్టరీ యజమానులకు కా కుండా నేరుగా రైతులకు సబ్సిడీని అందజేయాలి. రైతులు ఉద్యమాలు, ఓటు విలువ తెలుసుకున్నపుడే వారి అధికారాలను కైవసం చేసుకుంటారు. దేశంలో ఉన్న రైతులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తలే. వారికి ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర ఇస్తే చాలు ప్రభుత్వం కోరిన పంటలను పండిస్తారు. ఉత్తర భారత దేశంలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఢిల్లీని ముట్టడిస్తూ ఎన్నో ఉద్యమాలు చేశాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. రాష్ట్ర ఏర్పాటుకు ఢిల్లీ ముట్టడి అవసరం వస్తే తెలంగాణ నుంచి పది వేల మంది వచ్చినా చాలు 50 వేల మందిమి అండగా నిలుస్తాము.
ప్రభుత్వాన్ని మార్చడమే ఈ సమస్యకు పరిష్కారం..
-జాతీయ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు పీకే దైవసిగామని
పసుపు రైతుల సమస్యల పరి ష్కారానికి కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడమొక్కటే పరి ష్కారం. దశాబ్ద కాలంగా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం మా త్రం శూన్యం. ఒక్కసారి రైతులంతా సంఘటితమైతే ప్రభుత్వాలు కూలిపోతాయని నిరూపించాలి. త్వరలో పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో భారీ సభ నిర్వహించనున్నాము. రైతుల పక్షాన నిలిచే రాజకీయ పార్టీల వెంటే రైతులు నిలుస్తారు.
రైతులకు నష్టం చేకూర్చే నిర్ణయాలే..
-సాంగ్లి శెట్కార్ సంఘటన్ అధ్యక్షుడు రఘునాధ్ దాదా పాటిల్
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ బడా వ్యాపారులకు లాభం చేకూరుస్తూ రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలే తీసుకుం టూ అమలు చేస్తోంది. గోధుమలు, చక్కెర ఎగుమతులను ప్రోత్సహిస్తే రైతులకు నేరుగా లాభం చేకూర్చవచ్చు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎగుమతులను నిలిపి వేసి గోధుమలు, చక్కెరతో ఇక్కడ తయారు చేసి న బిస్కట్లు, చాక్లెట్ల ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. తద్వారా బడా వ్యాపారులకు లాభాలు రావడానికి సహకరిస్తోంది. రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులు సంఘటితంగా ఉంటే మార్పు అనివార్యం.
పోరాడితేనే గిట్టుబాటు
Published Wed, Jan 1 2014 5:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement