జిల్లాలో నీటి వసతి కింద సాగు చేస్తున్న మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ పంట ఏపుగా పెరగాలంటే మంచి ఎరువులు, సరైన నీటి యాజమాన్య పద్ధతులు తప్పనిసరి. పంట దశను బట్టి నీటి తడులు ఇచ్చినట్లయితే పంటను కాపాడుకోవడమేకాక మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకుని పంటను కాపాడుకోవాలని నిజామాబాద్ డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ కే.పవన్‌చంద్రారెడ్డి సూచిస్తున్నారు. -నిజామాబాద్ వ్యవసాయం ఎరువుల యాజమాన్యం
ఖరీఫ్‌లో మొక్కజొన్న సంకర రకాలకు సిఫారసు చేసిన నత్రజని, భాస్వరము, పొటాష్ మోతాదు ఎకరానికి 72-80: 24:20 కిలోలు ఉండాలి.
నత్రజని
వర్షాధారం కింద సాగుచేసే పంటకు నత్రజని మూడు సమ దఫాల్లో వేసుకోవాలి. విత్తే సమయంలో 1/3వ వంతు నత్రజనిని, 1/3వ వంతు 30-35రోజుల మధ్య, మిగిలిన 1/3వ వంతు 50-55రోజుల మధ్య వేయాలి. అదే నీటి పారుదల కింద సాగు చేసే మొక్కజొన్న పంటకు నత్రజనిని నాలుగు సమ దఫాల్లో వేసుకోవాలి. 1/4వ వంతు నత్రజనిని విత్తే సమయంలో, 1/4వ వంతు 25-30 రోజుల మధ్య, 1/4వ వంతు 45-50రోజుల మధ్య మిగిలిన 1/4వ వంతు 60-65రోజుల మధ్య వేయాలి.
భాస్వరం
సిఫారసు చేసిన భాస్వరపు పూర్తి మోతాదును విత్తే సమయంలో వేసుకోవాలి.
పొటాష్
సిఫారసు చేసిన పొటాష్‌ను రెండు సమ దఫాల్లో వేసుకోవాలి. సగం పొటాష్‌ను విత్తే సమయంలో, మిగతా సగం పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి.
జింకు
ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను మూ డు పంటలకొకసారి దుక్కిలో వేయాలి. పై రుపై జింకు లోపం కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి పైరుపై పి చికారి చేయలి. ప్రధాన పోషకాలతోపాటు ద్వితీయ, సూక్ష్మ పోషకాలను కూడా అందించాలి.
కాల్షియం వల్ల గింజలు బాగా గట్టి పడతా యి. మెగ్నీషియం వల్ల కండెలో ఎక్కువ వ రుసల్లో గింజలు ఏర్పడతాయి. గంధకం నూనెశాతంపెరగడానికి దోహదపడుతుంది.
బోరాన్, మాంగనీస్ వల్ల కండెలో గింజలు సమృద్ధిగా ఏర్పడతాయి.
ఎకరానికి 5 కిలోల సీఏ, 5 కిలోల మెగ్నీషియం(ఎంజీ), 5 కిలోల-ఎస్, 250 గ్రాముల బీ-, ఎంఎన్‌ను మూడు దఫాలుగా వేసుకోవాలి.
దశలను బట్టి నీటి వినియోగం..
మొక్కజొన్నకు నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకునే శక్తి ఎక్కువ. అందువల్ల ఈ మొక్కలు చాలాత్వరగా, ధృడంగా పెరుగుతాయి.
గింజలు విత్తే ముందు నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి.
మొక్కజొన్న అధికనీరు లేదా బెట్టె పరిస్థితులను తట్టుకోలేదు. విత్తిన మొదటి రెండు రోజులు నీటి ముంపు తట్టుకోలేదు. పైరు విత్తిన 20 రోజుల వరకు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తేమకు సున్నిత దశలు- పంట మోకాలెత్తు దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ నిండే దశ.
విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి మొలక శాతం పొందవచ్చు.
పంట లేద దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పూలు పుష్పించే దశలు ఆలస్యమవుతాయి.
పూత దశలో నీటి వినియోగం అత్యధికంగా ఉండాలి. ఈ దశ మొక్కకు నీరు అత్యంత కీలమైనది. ఈ సమయంలో మొక్కజొన్న నీటి ఎద్దడికి గురైతే మగపూలు, పీచు ఎండిపోతాయి. పరాగ సంపర్కం సరిగ్గా జరగదు. పైఆకులు ఎండిపోతాయి. దీంతో కండెలో గింజల సంఖ్య, పరిమాణం తగ్గుతుంది. దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. పూత దశ నుంచి గింజపాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైనట్లయితే 40 నుంచి 80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి.
గింజ కట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే పెద్దగా నష్టం ఉండదు. అందువల్ల పంట పెరిగే దశలో ఎక్కువ వ్యవధితో, పూత దశలో తక్కువ వ్యవధితో నీరు పెట్టాలి.
సాధారణంగా పంట కాలంలో నల్లరేగడి నేలలో 5 నుంచి 8 తడులు, ఎర్రనేలలో 8 తడులు అవసరం.
ఒకవేళ ఆరు తడులు ఇవ్వటానికి అవకాశం ఉంటే, మొదటి తడి మొలక దశలో, రెండోది మోకాలెత్తు దశలో, మూడోది పూత దశలో, నాలుగు,ఐదు తడులను పూత దశ నుంచి గింజ పాలుపోసుకునే వరకు, ఆరో తడి గింజనిండే దశలో ఇవ్వాలి.
ఒకవేళ ఐదు తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే, పంట మొలక దశను త ప్పించి మిగతా దశలో ఇచ్చుకోవాలి.
కొన్నిసార్లు సాగునీరు 4 తడులు ఇవ్వాడానికి మాత్రమే సరిపోయేలా ఉంటే, మొదటి తడి పంట మోకాలెత్తు దశలో, రెండో తడి పూత దశలో, మిగతా రెండు తడులను పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఇవ్వాలి.
మొక్కజొన్న సాగు..రైతులకు బహుబాగు..
Published Fri, Aug 29 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement