Water source
-
తింటున్న నీరెంత ?
నీరు.. ఆహారమే జగతిలో ప్రతి జీవి మనుగడకూ ఆధారం... మనం తినే ఆహారం ఏదైనా..ఆ మాటకొస్తే వేసుకునే వస్త్రమైనా... అంతా నీటి మయమే! ఏ ఆహార పదార్థం తయారు కావాలన్నా నీరు చాలానే ఖర్చవుతుంది. ఏయే ఆహార పదార్థాలకు ఎంతెంత నీరు ఖర్చవుతుందన్నది ప్రశ్న! దీని గురించి శాస్త్రీయంగా తెలియజెప్పేదే ‘వాటర్ ఫుట్‌ప్రింట్’! ఇదంతా ఎందుకూ అంటే..? భూతాపం పెరిగి వాతావరణం అనూహ్యంగా మారిపోతూ ఉంది.. ప్రకృతిలో మమేకమై ఉండే అన్నదాతలకు కూడా పంటల సాగు కత్తి మీద సాములాగా మారిపోతూ ఉంది.. భూతలమ్మీద నీటి లభ్యత నానాటికీ తగ్గుతుంటే, జనాభా మటుకు పెరుగుతూ ఉంది.. మనందరమూ ‘ఆహార నీటి’ చైతన్యం పొందాల్సిన అవసరం ఉంది. అంటే.. ఎక్కువ నీటితో పండే ఆహారంపై నుంచి మనసు మళ్లించి... ఆహార వృథాను అరికట్టాలి. తక్కువ నీటితో పండే సమతుల్య ఆహారం వైపు దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితులు వస్తున్నాయి.. 5,000–7,000 వేల లీటర్ల సాగు నీటితో పండే కిలో వరి బియ్యం కన్నా.. ఇందులో సగం నీటితోనే.. అది కూడా కేవలం వాన నీటితోనే పండే చిరుధాన్యాలు నిజంగా సిరిధాన్యాలే కదా.. తినే వారిలో ‘ఆహార నీటి’ చైతన్యం వస్తే... పండించే వారిలోనూ వస్తుంది! అప్పుడిక ఆహార, పౌష్టికాహార భద్రతకు ఢోకా ఉండదు!! ఏ పంటకైనా లేదా ఏ ఆహార పదార్థానికైనా ఎంత నీరు ఖర్చవుతుందంటే ఠక్కున సమాధానం చెప్పడం అంత సులువేమీ కాదు. ఏయే పంటకు ఎంతెంత నీరు ఖర్చు అవుతుందనే విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆయా దేశ, కాల, వాతావరణ, భూమి స్థితిగతులను బట్టి.. ఇంకా చెప్పాలంటే, సాగు పద్ధతిని బట్టి.. ఉత్పాదకతను బట్టి కూడా నీటి ఖర్చు మారిపోతూ ఉంటుంది. కాబట్టి, కిలో వరి బియ్యం పండించడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చయ్యే నీటికీ, అమెరికాలో ఖర్చయ్యేనీటికీ, చైనాలో ఖర్చయ్యే నీటికీ మధ్య చాలా వ్యత్యాసమే ఉంటుంది. ఏటేటా భూతాపం, ఉష్ణోగ్రత, వాతావరణ ఉపద్రవాలు పెరిగిపోతున్న గడ్డు పరిస్థితుల్లో పౌరులందరూ ఆహారాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు, వినియోగించేటప్పుడు ‘ఆహార నీటి’ చైతన్యంతో వ్యవహరించగలగాలి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లోనూ ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత సాధించడానికి పాలకులు, ప్రజలు అందరూ ‘ఆహార నీటి’ చైతన్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం తరుముకొస్తోంది. ప్రజల్లో, విధాన నిర్ణేతల్లో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి నెదర్లాండ్స్‌కు చెందిన ‘వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్’ అనే సంస్థ ప్రపంచ దేశాల్లో వ్యవసాయ, ఆహార గణాంకాలను సేకరించి, క్రోడీకరించి ‘నీటి వినియోగ ముద్ర’(వాటర్ ఫుట్‌ప్రింట్)లను తయారు చేశారు. వర్షపాతం, కాలువ/చెరువుల ద్వారా పెట్టిన సాగు నీరు, బోరు/బావి ద్వారా తోడిన నీరు మొత్తాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అయ్యే నీటి ఖర్చును 2011 నాటి గణాంకాల ఆధారంగా లెక్కగట్టారు. ప్రతి ఒక్కరి ఆహారానికి 3,496 లీటర్ల నీటి ఖర్చు! ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషీ తింటున్న ఆహారోత్పత్తికి రోజుకు సగటున 3,496 లీటర్ల నీరు ఖర్చవుతున్నదని వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ తేల్చింది. అయితే, ప్రతి పూటా మాంసం తినే పాశ్చాత్య దేశాలతో పోల్చితే అప్పుడప్పుడూ మాంసం తినే అలవాటున్న భారతీయ పౌరుడు తినే ఆహారానికి ఇంతకన్నా తక్కువే ఖర్చవుతుందని చెప్పొచ్చు. ఇది కాకుండా.. తాగునీరు, ఇంటి అవసరాలకు తలసరి నీటి ఖర్చు రోజుకు 137 లీటర్లు కాగా, అనుదినం వాడే పారిశ్రామిక వస్తువుల నీటి ఖర్చు 167 లీటర్లు.ఆహార నీటి ఖర్చు ప్రపంచ సగటు కన్నా మన దేశంలో తక్కువగానే ఉంది. మొత్తం తలసరి నీటి వినియోగంలో 92% ఆహారోత్పత్తికే ఖర్చవుతున్నదని అంచనా. మన దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఆహార అవసరాల నిమిత్తం రోజుకు 3 వేల లీటర్ల నీటిని వాడుతున్నారు. చైనా పౌరులు సగటున రోజుకు 2,900 లీటర్ల నీటిని వాడుతున్నారు. అమెరికా పౌరులు సగటున రోజుకు 7,800 లీటర్ల నీటిని వాడుతున్నారు.ఒక దేశంలో పండించిన పంట లేదా శుద్ధిచేసి ప్యాక్ చేసిన ఆహారోత్పత్తిని మరో దేశంలో ప్రజలు దిగుమతి చేసుకొని తింటూ ఉంటారు. అంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి ఆహార పదార్థం/ వస్తువు ఎగుమతి అయ్యిందీ అంటే.. నీరే మరో రూపంలో ఎగుమతి అవుతున్నదన్న మాట. ఈ ప్రకారం చూస్తే.. అమెరికన్లు 20% విదేశాల్లో నీటితో తయారైన వస్తువులు, ఆహారాన్ని దిగుమతి చేసుకొని వాడుతుంటే.. చైనీయులు 10%, భారతీయులు 3% వాడుతున్నారు. కిలో వరి బియ్యం ఉత్పత్తికి 5,331 లీటర్లు! ఆహార ధాన్యాల్లో వరి సాగుకు అత్యధికంగా నీరు ఖర్చవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సగటున కిలో వరి ధాన్యం పండించడానికి 1,670 లీటర్లు, కిలో బియ్యం పండించడానికి 2,497 లీటర్ల నీరు ఖర్చవుతున్నదని (2011 నాటి గణాంకాల ప్రకారం) వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ చెబుతోంది. అయితే, మన దేశంలో రెట్టింపు నీరు ఖర్చవుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.ఐ.–న్యూఢిల్లీ)లోని వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కోకిల జయరామ్ 2007–08లో మన దేశంలో పంటలకు వాడిన నీటిపై అధ్యయనం చేసి.. 2016లో నివేదిక వెలువరించారు. ఆ ప్రకారం.. వరి సాగుకు 1250 ఎం.ఎం. నీరు అవసరమవుతుంది. మన దేశంలో సగటున టన్ను వరి ధాన్యం ఉత్పత్తికి 35,71,900 లీటర్ల నీరు ఖర్చవుతోంది. టన్ను వరి ధాన్యాన్ని మిల్లు ఆడిస్తే 670 కిలోల బియ్యం వస్తాయనుకుంటే.. కిలో వరి బియ్యానికి 5,331 లీటర్ల నీరు ఖర్చవుతోంది. చిరుధాన్యాల దిశగా.. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో వరి సాగవుతున్న ఉభయ గోదావరి డెల్టా ప్రాంతాల్లో సైతం రానున్న రోజుల్లో పెరిగే 2 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల వరి దిగుబడులు భారీగా తగ్గే పరిస్థితి వస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) అధ్యయనంలో తేలింది. అనివార్యంగా చిరుధాన్యాల సాగు వైపు దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏయూ హెచ్చరించడం గమనించ వలసిన సంగతి. చిరుధాన్యాల సాగుకు 400 ఎం.ఎం. నీరు సరిపోతుంది. అది కూడా వర్షాధారంగానే సాగవుతుంది. సగటున ఎకరానికి 5–10 క్వింటాళ్ల చిరుధాన్యాల బియ్యం దిగుబడి వస్తుంది. శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చిన ఉదంతాలున్నాయి. వరితో పోలిస్తే ‘నీటి వినియోగ ముద్ర’ మూడింట రెండొంతులకు తగ్గిపోతుంది. సిరిధాన్యాలను నగర, పట్టణ ప్రాంతవాసులు దైనందిన ప్రధానాహారంగా తీసుకోవడం ప్రారంభిస్తే.. అందరికీ సంతులిత ఆహారం అందుతుంది. ఆధునిక జీవనశైలి జబ్బులను పారదోలడంతోపాటు మెట్ట రైతుల ఆదాయాలూ అనేక రెట్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. 15,400 లీటర్ల నీరు = కిలో మాంసం! మాంసం ఉత్పత్తి కన్నా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి చాలా తక్కువ నీరు ఖర్చవుతున్నదన్నది నిజం. కిలో పశు మాంసం ఉత్పత్తికి 15,400 లీటర్ల నీరు ఖర్చవుతున్నది. పాశ్చాత్య దేశాల్లో ఆవులను, ఎద్దులను పారిశ్రామిక పద్ధతుల్లో పెంచి మూడేళ్ల వయసులో పశువును వధిస్తే.. ఎముకలు తీసేయగా 200 కిలోల మాంసం వస్తుంది. ఒక్కో పశువు సగటున మూడేళ్లలో 1,300 కిలోల ధాన్యాలతో తయారైన దాణా, 7,200 కిలోల గడ్డి తింటుంది. ఈ ధాన్యాలను పండించడానికి 30 లక్షల 60 వేల లీటర్ల నీరు ఖర్చవుతోంది. పశువు మూడేళ్లలో 24,000 లీటర్ల నీరు తాగుతుంది. దీని మాంసాన్ని శుద్ధి చేయడానికి 7 వేల లీటర్ల నీరు ఖర్చవుతుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పశుమాంసం ఉత్పత్తికన్నా చిన్న జీవాల మాంసం ఉత్పత్తికి తక్కువ నీరు ఖర్చవుతున్నది. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పండమేరుకు జలకళ
రాప్తాడు: పండమేరు వంకకు జలకళ వచ్చింది. గత నాలుగైదు రోజులుగా పై తట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పండమేరు పరవళ్లు తొక్కుతోంది. ఈ ఏడాదిలో మొదటిసారిగా పండమేరు పారుతుండటంతో అటు ప్రజలు, ఇటు రైతుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ భాగం నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో పండమేరు వంకలో ఐదు అడుగుల నీరు ప్రవహిస్తోంది. దీంతో వరిమడుగు, గాండ్లపర్తి, యర్రగుంట, బోమ్మేపర్తి, బుక్కచెర్ల, అయ్యవారిపల్లి గ్రామాల వద్ద రాకపోకలు స్తంభించాయి. ఇదేవిధంగా ఈ వంక మరో రెండు రోజులు ప్రవహిస్తే అనంతపురం చెరువులోకి నీరు చేరుతుందని రాప్తాడు గ్రామ ప్రజలు తెలిపారు. మండలంలో 16 పంచాయతీ గ్రామాల్లో వర్షం కురవడంతో వంకలు, వాగులు, కుంటలు, చెక్ డ్యామ్‌లు నిండాయి. -
‘బోరు’మంటున్నారు!
- రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలు - వేల సంఖ్యలో ఒట్టిపోయిన బోరుబావులు - కొత్త బోర్ల తవ్వకానికి రోజూ రూ.కోటిన్నర ఖర్చు - అయినా అన్నదాతలకు నిరాశే ధర్మవరం : ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లికి చెందిన రైతు రమణ తనకున్న పొలంలో రెండెకరాల మేర ద్రాక్ష పంటను సాగుచేశాడు. పంట దిగుబడి బాగా ఉన్న సమయంలో ఉన్నట్లుండి బోరులో నీరు తగ్గిపోయింది. పంట ఎండుముఖం పట్టడంతో కాపాడుకోవడానికి రైతు తన పొలంలోనే మరోచోట బోరు వేయించాడు. దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి.. వెయ్యి అడుగుల మేర తవ్వించాడు. అయినా చుక్కనీరు పడలేదు. అంతటితో ప్రయత్నం ఆపలేదు. మరో నాలుగు బోర్లు వేయించి దాదాపు రూ.6లక్షలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నాడు. అయితే.. పంట దిగుబడి మొత్తం బోర్లకు పెట్టిన ఖర్చుకే సరిపోయింది. చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన ముత్యాలరెడ్డి ఈ నెల 8వ తేదీన తన తోటలో 800 అడుగుల మేర బోరు వేయించాడు. నీళ్లు దాదాపు రెండున్నర ఇంచుల మేర పడ్డాయి. దీంతో ఆయన రూ.1.50 లక్షలు ఖర్చుపెట్టి కొత్త మోటారు తీసుకొచ్చి బిగించాడు.అయితే ఆ బోరులో నీరు కేవలం వారం రోజులు వచ్చి నిలిచిపోయాయి. రైతులు రమణ, ముత్యాలరెడ్డి మాత్రమే కాదు.. జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఇదేవిధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. రైతన్నలు తమ పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా పాతాళగంగను పైకి తేలేకపోతున్నారు. ప్రతిరోజూ జిల్లాలో సగటున వంద బోర్లు వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ధర్మవరం, రాప్తాడు, శింగనమల, కళ్యాణదుర్గం, కదిరి, రాయదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల్లో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో గత ఆరు నెలలుగా డీప్‌బోర్లు అధికంగా తవ్విస్తున్నారు. లోతులో నీరుపడితే చాలా రోజుల పాటు ఎండిపోకుండా ఉంటాయని భావిస్తున్న రైతులు చాలా మంది వెయ్యి అడుగుల మేర తవ్విస్తున్నారు. ఒక్కో డీప్ బోరు తవ్వకానికి రూ.1.30 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ లెక్కన రోజుకు వంద బోర్లు తవ్వించేందుకు రూ.1.50 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి దాకా బోర్లు తవ్వించడానికి జిల్లా రైతులు దాదాపు రూ.135 కోట్లు ఖర్చు చేశారు. ఈ మూడు నెలల్లో రైతులు పెట్టిన ఖర్చుతో ఒక చిన్న ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెయ్యి అడుగుల బోరు తవ్వకానికి రూ.1,22,000తో పాటు కేసింగ్ ఖర్చు ప్రతి అడుగుకు రూ.350 చొప్పున అవుతుంది. సాధారణ భూముల్లో అయితే 20 అడుగుల మేర కేసింగ్ వేస్తారు. ఇసుక నేలల్లో అయితే 50 నుంచి 100 మేర కేసింగ్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బోర్‌లారీ సిబ్బంది భోజనం, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు రూ.3 వేల వరకు వస్తాయి. ఇదీ భూగర్భ జలాల పరిస్థితి వర్షాలు పడితే భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. లేదంటే తగ్గుతుంది. అయితే వరుస కరువులతో జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ లోతుకు పడిపోతున్నాయి. ప్రస్తుతం 26.50 మీటర్ల లోతుకు పడిపోయాయి. డీప్ బోరు వేయడానికి అయ్యే ఖర్చు అడుగులు ధర (అడుగుకు) ఖర్చు 1–300 రూ.75 రూ.22,500 300–400 రూ.85 రూ.8,500 400–500 రూ.95 రూ.9,500 500–600 రూ.115 రూ.11,500 600–700 రూ.135 రూ.13,500 700–800 రూ.175 రూ.17,500 800–1000 రూ.195 రూ.39,000 -
‘ఉపాధి’ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు
11 వేల వంటగదులు, 7 వేల మరుగుదొడ్ల నిర్మాణం: నీతూ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి నిధులు వెచ్చించాలని సర్కారు నిర్ణయించింది. 30 జిల్లాల్లోని (హైదరాబాద్ మినహా) ప్రభుత్వ పాఠశాలన్నింటిలో 11,080 వంట గదులు, 7,080 మరుగుదొడ్లు అవసరమన్న ప్రతిపాద నలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ వెల్లడించారు. వీటితో పాటు నీటి వసతి కోసం బోరు, మోటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలను నెలలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణా భివృద్ధి శాఖలో సిబ్బంది కొరత ఉందని పలువురు తెలుపగా, దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటానన్నారు. -
వర్షాభావంతో జలాశయాలు వెలవెల
జల విద్యుత్ ఆశలు ఆవిరి హైదరాబాద్: జల విద్యుత్‌పై ఆశలు ఆవిరయ్యాయి. తీవ్ర వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జలాశయాల్లో చుక్క నీరూ రాలేదు. దీంతో జల విద్యుదుత్పత్తి ద్వారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను గట్టెక్కిద్దామనుకున్న ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. వాస్తవానికి జూలైలోనే జల విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని తెలంగాణ విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఆగస్టు నాటికి 1,000 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆశలు పెట్టుకుంది. జూలై నుంచి వచ్చే మార్చి వరకు 4,144 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి జరుగుతుందని అంచనా వేసింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సంవృద్ధిగా కురిసి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు నిండితేనే విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. సమీప భవిష్యత్తులో ఈ పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో లోటును పూడ్చుకోవడానికి బయటి రాష్ట్రాల నుంచి కరెంటును కొనుక్కోక తప్పని పరిస్థితి. అంచనాలు తలకిందులు 2015 జూలై నుంచి 2016 మార్చి వరకు రాష్ట్రంలో వినియోగం, లభ్యతపై విద్యుత్ శాఖ అంచనాలు సైతం సిద్ధం చేసుకుంది. ఆశించిన మేరకు జల విద్యుదుత్పత్తి జరిగితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కరెంటు డిమాండు పతాకస్థాయికి చేరినా మిగులు విద్యుత్ ఉండనుంది. దీని ఆధారంగానే ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాపై ధీమా వ్యక్తంచేస్తూ వచ్చింది. అయితే, జల విద్యుదుత్పత్తి లేకపోతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లలో మాత్రం విద్యుత్ లోటు తప్పదని ప్రభుత్వ అంచనాలే పేర్కొంటున్నాయి. తాత్కాలిక ఒప్పందాల ద్వారా 2,000 మెగావాట్లకు పైగా విద్యుత్ కొనుగోలు జరుగుతోంది. కొనుగోళ్లు, జెన్కో సొంత ఉత్పాదన ద్వారా గరిష్టంగా 6,000 మెగావాట్ల డిమాండును నెరవేర్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. అయితే, పెరుగుతున్న ఖరీఫ్ సాగు, ఉష్ణోగ్రతలతో విద్యుత్ డిమాండు గరిష్టంగా 8,000 మెగావాట్లకు తాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మరో 2,000 మెగావాట్లు కొనుగోళ్లు చేయక తప్పని పరిస్థితి. ఎంత ధరకైనా అవసరమైన కరెంటును కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తాత్కాలిక కొనుగోళ్లకు ప్రైవేటు సంస్థలతో కొత్త ఒప్పందాల కోసం విద్యుత్ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. -
మొక్కజొన్న సాగు..రైతులకు బహుబాగు..
జిల్లాలో నీటి వసతి కింద సాగు చేస్తున్న మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ పంట ఏపుగా పెరగాలంటే మంచి ఎరువులు, సరైన నీటి యాజమాన్య పద్ధతులు తప్పనిసరి. పంట దశను బట్టి నీటి తడులు ఇచ్చినట్లయితే పంటను కాపాడుకోవడమేకాక మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకుని పంటను కాపాడుకోవాలని నిజామాబాద్ డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ కే.పవన్‌చంద్రారెడ్డి సూచిస్తున్నారు. -నిజామాబాద్ వ్యవసాయం ఎరువుల యాజమాన్యం ఖరీఫ్‌లో మొక్కజొన్న సంకర రకాలకు సిఫారసు చేసిన నత్రజని, భాస్వరము, పొటాష్ మోతాదు ఎకరానికి 72-80: 24:20 కిలోలు ఉండాలి. నత్రజని వర్షాధారం కింద సాగుచేసే పంటకు నత్రజని మూడు సమ దఫాల్లో వేసుకోవాలి. విత్తే సమయంలో 1/3వ వంతు నత్రజనిని, 1/3వ వంతు 30-35రోజుల మధ్య, మిగిలిన 1/3వ వంతు 50-55రోజుల మధ్య వేయాలి. అదే నీటి పారుదల కింద సాగు చేసే మొక్కజొన్న పంటకు నత్రజనిని నాలుగు సమ దఫాల్లో వేసుకోవాలి. 1/4వ వంతు నత్రజనిని విత్తే సమయంలో, 1/4వ వంతు 25-30 రోజుల మధ్య, 1/4వ వంతు 45-50రోజుల మధ్య మిగిలిన 1/4వ వంతు 60-65రోజుల మధ్య వేయాలి. భాస్వరం సిఫారసు చేసిన భాస్వరపు పూర్తి మోతాదును విత్తే సమయంలో వేసుకోవాలి. పొటాష్ సిఫారసు చేసిన పొటాష్‌ను రెండు సమ దఫాల్లో వేసుకోవాలి. సగం పొటాష్‌ను విత్తే సమయంలో, మిగతా సగం పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి. జింకు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను మూ డు పంటలకొకసారి దుక్కిలో వేయాలి. పై రుపై జింకు లోపం కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి పైరుపై పి చికారి చేయలి. ప్రధాన పోషకాలతోపాటు ద్వితీయ, సూక్ష్మ పోషకాలను కూడా అందించాలి. కాల్షియం వల్ల గింజలు బాగా గట్టి పడతా యి. మెగ్నీషియం వల్ల కండెలో ఎక్కువ వ రుసల్లో గింజలు ఏర్పడతాయి. గంధకం నూనెశాతంపెరగడానికి దోహదపడుతుంది. బోరాన్, మాంగనీస్ వల్ల కండెలో గింజలు సమృద్ధిగా ఏర్పడతాయి. ఎకరానికి 5 కిలోల సీఏ, 5 కిలోల మెగ్నీషియం(ఎంజీ), 5 కిలోల-ఎస్, 250 గ్రాముల బీ-, ఎంఎన్ను మూడు దఫాలుగా వేసుకోవాలి. దశలను బట్టి నీటి వినియోగం.. మొక్కజొన్నకు నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకునే శక్తి ఎక్కువ. అందువల్ల ఈ మొక్కలు చాలాత్వరగా, ధృడంగా పెరుగుతాయి. గింజలు విత్తే ముందు నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి. మొక్కజొన్న అధికనీరు లేదా బెట్టె పరిస్థితులను తట్టుకోలేదు. విత్తిన మొదటి రెండు రోజులు నీటి ముంపు తట్టుకోలేదు. పైరు విత్తిన 20 రోజుల వరకు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమకు సున్నిత దశలు- పంట మోకాలెత్తు దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ నిండే దశ. విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి మొలక శాతం పొందవచ్చు. పంట లేద దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పూలు పుష్పించే దశలు ఆలస్యమవుతాయి. పూత దశలో నీటి వినియోగం అత్యధికంగా ఉండాలి. ఈ దశ మొక్కకు నీరు అత్యంత కీలమైనది. ఈ సమయంలో మొక్కజొన్న నీటి ఎద్దడికి గురైతే మగపూలు, పీచు ఎండిపోతాయి. పరాగ సంపర్కం సరిగ్గా జరగదు. పైఆకులు ఎండిపోతాయి. దీంతో కండెలో గింజల సంఖ్య, పరిమాణం తగ్గుతుంది. దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. పూత దశ నుంచి గింజపాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైనట్లయితే 40 నుంచి 80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజ కట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే పెద్దగా నష్టం ఉండదు. అందువల్ల పంట పెరిగే దశలో ఎక్కువ వ్యవధితో, పూత దశలో తక్కువ వ్యవధితో నీరు పెట్టాలి. సాధారణంగా పంట కాలంలో నల్లరేగడి నేలలో 5 నుంచి 8 తడులు, ఎర్రనేలలో 8 తడులు అవసరం. ఒకవేళ ఆరు తడులు ఇవ్వటానికి అవకాశం ఉంటే, మొదటి తడి మొలక దశలో, రెండోది మోకాలెత్తు దశలో, మూడోది పూత దశలో, నాలుగు,ఐదు తడులను పూత దశ నుంచి గింజ పాలుపోసుకునే వరకు, ఆరో తడి గింజనిండే దశలో ఇవ్వాలి. ఒకవేళ ఐదు తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే, పంట మొలక దశను త ప్పించి మిగతా దశలో ఇచ్చుకోవాలి. కొన్నిసార్లు సాగునీరు 4 తడులు ఇవ్వాడానికి మాత్రమే సరిపోయేలా ఉంటే, మొదటి తడి పంట మోకాలెత్తు దశలో, రెండో తడి పూత దశలో, మిగతా రెండు తడులను పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఇవ్వాలి.