ఆర్మూర్ మండలం ఫత్తేపూర్‌లో సోయాబీన్ విత్తుకోవడానికి సిద్ధం చేసుకున్న క్షేత్రం
ఆర్మూర్ : వర్షాకాలం ప్రారంభ దినమైన మిరుగు దాటి రెండు వారాలు గడుస్తున్నా తొలకరి వర్షాలు ముఖం చాటేయడంతో జిల్లా రైతాంగం సోయాబీన్ లేదా మొక్కజొన్న పంటల్లో ఏ పంట విత్తుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అందుబాటులో ఉండి సలహాలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ సిబ్బంది జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేధింపుల కారణంగా క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండలేకపోతున్నామని అంటున్నారు.
మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా సోయాబీ న్ పంటను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించారు. ఈ వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా 58,715 ఎకరాల్లో సోయాబీన్, 32,185 ఎకరాల్లో మొక్కజొన్న పంటను పండించడానికి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వాతావరణ పరిస్థితులు అందుకు తగినట్లుగా లేకపోవడంతో రైతులకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.
సోయాబీన్ పండించే రైతులు..
వర్షాధార పంట అయిన సోయా పండించడానికి తొలకరి వర్షం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభంతోనే విత్తనాలు విత్తుకోవడానికి రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేసుకున్నారు. మొక్కజొన్న పంటతో పోలిస్తే కూలీల ఖర్చు తక్కువ కావడమే కాకుండా సాగుకు శ్రమ తక్కువగా ఉంటుంది. మొక్కజొన్న పండించడానికి పడిన శ్రమలో సగం శ్రమిస్తే అదే లాభం ఆర్జించడంతో పాటు వర్షాధార పంట కావడంతో రైతులు సోయాబీన్ పండించడానికి ఆసక్తి చూపుతున్నారు.
మొక్కజొన్న పండించే రైతులు..
మే చివరి వారం రోహిణి నుంచి జూలై 15 వరకు మొక్కజొన్న విత్తవచ్చు. ఇది వర్షాధార పంట. నీటి వసతి ఉన్నవారు సైతం వేయవచ్చు. 120 రోజుల పంట. నీటి వసతి ఉన్న వారు పచ్చి మక్కబుట్ట కోసం ఆర్మూర్ మండలంలో 500 ఎకరాల్లో పండిస్తున్నారు. పచ్చి బుట్ట పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. బోరు బావుల్లో నీటి వసతి ఉన్న రైతులు మాత్రం ధైర్యంగా మొక్కజొన్న విత్తుకొని సాగునీటిని అందిస్తున్నారు. వర్షంపై ఆధారపడ్డ రైతులు మాత్రం ఆకాశం వైపు వర్షం కోసం చూస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తొలకరి కోసం ఎదురుచూపు..
ప్రతి ఏడాది లాగే సోయాబీన్ విత్తుకుందామని అనుకున్నాము. కాని తొలకరి సకా లంలో రాకపోవడంతో బో రు బావిలో ఉన్న నీటితో రెండు మడులు మొక్కజొ న్న విత్తాను. మొక్కజొన్నకు కూడా వర్షం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు. భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో లేవు. చేసేది లేక తొలకరి కోసం ఎదురు చూస్తున్నాము.
– చిన్నయ్య, రైతు, (శ్రీరాంపూర్) ఫత్తేపూర్, ఆర్మూర్ మండల
Comments
Please login to add a commentAdd a comment