వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, అధికారులు
సుభాష్‌నగర్ : జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.8,713.34 కోట్లుగా నిర్ధేశించారు. అందులో పంట రు ణాల లక్ష్యం రూ.4,062.20 కోట్లు కాగా, ఏటీఎల్ (అగ్రికల్చ ర్ టర్మ్ రుణాలు) రూ.2,506 కోట్లు లక్ష్యంగా పెట్టుకు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లింకేజీ (ఐకేపీ) లక్ష్యం రూ.653 కోట్లు, అర్బన్ ప్రాంతంలో (మెప్మా) రూ.100 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ధేశించుకున్నారు.
ఇతర విభాగాలు ఎంఎస్‌ఎంఈకు రూ.1,646.87 కోట్లు, ఓపీఎస్‌కు రూ.298.17 కోట్లు, ఎన్‌పీఎస్‌కు రూ.200 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా 2023–24వ ఆర్థిక సంవత్సరానికి రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వివిధ విభాగాలకు కలిపి రూ.914.96 కోట్లు (11.74శాతం) ప్రజలకు రుణాల రూపంలో అందజేశారు.
గతేడాది 71.72 శాతం..
గతేడాది రుణ ప్రణాళిక లక్ష్యం రూ.7798.38 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రుణాలు రూ.13,690.37 కోట్లు (175. 56శాతం) అందజేశారు. కానీ పంట రుణాలు లక్ష్యం చేరలే దు. పంటరుణాలు రూ.3,846.9 కోట్లు లక్ష్యంగా పెట్టుకో గా, రూ.2,758.68 కోట్లు (71.72శాతం) మాత్రమే పంపిణీచేశారు. రూరల్ ప్రాంతాల్లో బ్యాంకు లింకేజీ 249.4 శాతం, అర్బన్ ప్రాంతంలో 187.47శాతం వరకు రుణాలిచ్చారు.
రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకరించాలి
లక్ష్యం మేరకు పంట రుణాలు మంజూరు చేసి రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకరించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశమందిరంలో బ్యాంకుల వారీగా రుణాల మంజూరుపై బ్యాంకు మేనేజర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా చిత్రామిశ్రా మాట్లాడుతూ జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు బ్యాంకుల వారీగా పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు, రుణాలు సకాలంలో మంజూ రు చేయాలన్నారు.
వీధి రుణాలు అర్హులందరికీ మంజూరు చేయాలన్నారు. ఈ సందర్భంగా 2023–24కు గాను జిల్లా రుణ ప్రణాళికను విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ చందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, మెప్మా పీడీ రాములు, ఆర్‌బీఐ అధికారి అనిల్‌కుమార్, నాబార్డు డీడీఎం ప్రవీణ్‌కుమార్, అన్ని బ్యాంకుల అధికారులు, గ్రా మీణాభివృద్ధిశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment