crop loan
-
రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
బ్యాంకులు ప్రదర్శిస్తున్న ఈ అసమానత వింత గొలుపుతుంది. ఒక ఆర్టీఐ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, 2014 ఏప్రిల్ 1 నుండి కార్పొరేట్ ఇండియాకు సంబంధించి రూ. 16.61 లక్షల కోట్ల మొండి రుణాలనుబ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. మరుసటి రోజు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పుడు రూ. 32 లక్షల కోట్లు దాటాయని అన్నారు. 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ అని బేనీ వాల్ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణ మాఫీ పథకం గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.కార్పొరేట్లకు రుణమాఫీదీనికి విరుద్ధంగా, గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్లు చేసిన మొత్తం రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) రద్దు చేశారు. గత ఐదేళ్లలో కార్పొరేట్లు చెల్లించని రుణా లలో రూ. 10.6 లక్షల కోట్లను రద్దు చేయడానికి భారతీయబ్యాంకులు ఏమాత్రం సందేహించలేదు. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. అదే కర్ణాటక, శివమొగ్గలోని ఒక రైతు కేవలం తన రూ. 3.46 పైసల బకాయి చెల్లించేందుకు సాధారణ బస్సు సర్వీస్ లేకపోతే, 15 కిలో మీటర్లు నడిచివెళ్లాల్సినంతటి ఆత్రుతను బ్యాంక్ ప్రదర్శించింది.2023–24 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 1.7 లక్షల కోట్లు మాఫీ చేశాయి. ఒక సంవత్సరం క్రితం, 2022–23లో రూ. 2.08 లక్షల కోట్లు మాఫీ చేశాయి. కానీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసే విషయానికి వస్తే, కేంద్రం రెండుసార్లు మాత్రమే ఆ పని చేసింది: 1990, 2008లో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యవ సాయ రుణాల మాఫీ చేశాయి. కానీ మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకు లకు రాష్ట్రాలు చెల్లిస్తున్నందున అది బ్యాంకులపై భారం కాదు. కార్పొ రేట్లు చెల్లించని బ్యాంకు రుణాలను అవి దేశ నిర్మాణానికి తోడ్ప డ్డాయనేంత జాగ్రత్తగా మాఫీ చేశారు. చిన్న రుణాలు మాఫీ చేయలేమా?పేద రైతులు, గ్రామీణ శ్రామికవర్గం చేసిన చిన్న చిన్న రుణా లను మాఫీ చేయడం అనేది జాతీయ బ్యాలెన్స్ షీట్‌ను కలవర పెట్టడానికి కారణంగా కనిపిస్తుంది. అదే ధనవంతులైన రుణమాఫీ దారులు సులభంగా తప్పించుకుంటారు. వీరిలో రూ.3.45 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించని 16,000 మందికి పైగా ఉద్దేశ పూర్వక రుణమాఫీదారులు ఉన్నారు. పైగా వారివద్ద డబ్బు ఉందని ఆర్బీఐ అంగీకరించినప్పటికీ వారు తిరిగి చెల్లించడానికి ఇష్టపడలేదు. కచ్చితంగా, వీరు సంపద సృష్టికర్తలు. దేశం వారిని అభినందించాలన్నమాట!ఇప్పుడు రాజస్థాన్‌లోని పీలీబంగాకు చెందిన ఒక రైతును చూడండి: ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 2.70 లక్షల రుణం తీసుకొని రూ. 2.57 లక్షలను తిరిగి చెల్లించాడు (మహమ్మారి సమయంలో రాష్ట్రం నుండి అందుకున్న రూ. 57,000 మద్దతుతో సహా). మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఆయన ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత, ఆగ్రహించిన గ్రామస్థులు ఆ తాళం పగలగొట్టారు.ఈ దురదృష్టకర సంఘటనను మరొకదానితో పోల్చి చూద్దాం. ప్రముఖ మిశ్రమ లోహ, ఉక్కు తయారీదారు అయిన ‘ఆధునిక్ మెటాలిక్స్’... 2018 జూలైలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా శాఖ తన పరిష్కార ప్రణాళికను ఆమోదించిన తర్వాత, తమ బకాయిలు రూ. 5,370 కోట్లకుగానూ కేవలం రూ. 410 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంటే 92 శాతం రుణమాఫీ! స్పష్టంగా, ఇంత పెద్ద ‘రుణమాఫీ’ తర్వాత, కంపెనీ ప్రమోటర్లు అన్ని కార్యకలాపాలను పూర్తి చేయడానికీ, ప్రధానసంస్థను పునరుద్ధరించి తిరిగి పని చేయడం ప్రారంభించడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు పరివర్తనాత్మక పరిష్కార యంత్రాంగంగా ప్రశంసలందుకున్న దివాళా కోడ్ ఇప్పుడు ఒక వైఫల్యంగా మారిపోయింది.అయితే, పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ. 20,000 మొత్తాన్ని తిరిగి పొందలేకపోయినందుకు రాజస్థాన్ రైతు ఇంటికి తాళం వేయగలిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 92 శాతం మాఫీ చేసి రాజమార్గాన పంపడానికి బదులుగా, ఆధునిక్ మెటాలిక్స్ వంటి సంస్థల ప్రాంగణాన్ని ఎన్సీఎల్టీ ఎందుకు తాళం వేయలేకపోయింది? రైతుల వంటి వారే అయిన ఆ యజమానులను ఎందుకు కటకటాల వెనుక ఉంచలేకపోయింది?చట్టాల్లో ఎందుకు తేడా?ఒక పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, రైతులు ఇలాంటి విధానంతో ప్రయోజనాన్ని, అది కూడా సాపేక్షంగా తక్కువ అయినాసరే ఎందుకు పొందకూడదు? వివిధ వర్గాల బ్యాంకు వినియోగదారులకు బ్యాంకింగ్ చట్టాలు ఎందుకు భిన్నంగాఉండాలి? గృహనిర్మాణం, కారు, ట్రాక్టర్ లేదా మోటార్ సైకిల్ రుణాలు తీసుకునే వారిని బ్యాంకులు ఎప్పుడైనా అదే రకమైన సున్ని తత్వంతో చూస్తాయా? ఆర్థిక వృద్ధి పేరుతో కంపెనీల మొండి బకాయిలను మాఫీ రూపంలో తమ సొంతం చేసుకోవాల్సిన అగత్యాన్ని బ్యాంకులు ఎంతకాలం సమర్థించుకోగలవు?పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో నిటారుగా నిలబడి ఉన్న తమ కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను తిరిగి దున్నడానికి ట్రాక్టర్లను నడుపుతున్న రైతుల బాధాకరమైన వీడియోలను; ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్లలో టమోటా ధరలు పతనమై రైతులు కుప్పగూలిపోవడాన్ని నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు తీవ్రంగా బాధపడ్డాను. టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంపల ధరలను స్థిరీకరించడానికి రూ. 500 కోట్ల వ్యయంతో 2018–19 బడ్జెట్లో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ పథకం నాకు ఇలాంటి సందర్భాల్లో గుర్తుకువస్తుంది. కోల్డ్ చైన్స్ నెట్‌వర్క్‌తో సహా వ్యవసాయ మౌలిక సదుపా యాలలో తగినంత పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవికత ఏమిటంటే, కూరగాయల ధరలను స్థిరీకరించడంలో ఆపరేషన్ గ్రీన్స్ పథకం ఘోరంగా విఫలమైంది. తగిన నిధుల మద్దతు లేకపోవడం ఒక కారణం కావచ్చు.రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్సీఐఎల్) దివాళా తీసిన తీర్మానాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 2023 డిసెంబర్లో ఆమోదించింది. ఈ సంస్థ క్లెయిమ్ చేసిన రుణంలో 99 శాతాన్ని మాఫీ చేయడం జరిగింది. చూడండి విచిత్రం: 2018–19లో ఆపరేషన్ గ్రీన్స్ కోసం కేటాయించిన రూ. 500 కోట్లతో పోలిస్తే, ఆర్సీఐఎల్ రూ. 47,251.34 కోట్ల క్లెయిమ్‌కు బదులుగా కేవలం రూ. 455.92 కోట్లు చెల్లించి బయటపడింది. మాఫీ చేసిన ఆ మొత్తాన్ని తిరిగి పొంది ఆపరేషన్ గ్రీన్స్ లో పెట్టుబడి పెడితే, పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక వనరుల కొరత ఏమాత్రం ఉండేది కాదు.- దేశంలో 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ.- గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్ల రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలవి.- ఒక పెద్ద కంపెనీకి పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, ఒక చిన్న రైతు అలాంటి ప్రయోజనం ఎందుకు పొంద కూడదు?- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు , ఈ–మెయిల్: hunger55@gmail.com- దేవీందర్ శర్మ -
కల్యాణలక్ష్మి డబ్బునుంచి పంట రుణం కోత
సిరికొండ: నిరుపేద ఆడపిల్లల పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు త్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుండగా, ఈ పథకం కింద వచ్చిన డబ్బు నుంచి బ్యాంకు అధికారులు పంట రుణాన్ని జమచేసుకున్నారు. దీంతో ఓ తల్లి తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని లచ్చింపూర్(బీ) గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందురు సోమ్బాయికి ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురుకు గత వేసవిలో వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా గతవారం ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 చెక్కు అందుకుంది.తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 17న వోచర్ రాసి ఇచ్చింది. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి శుక్రవారం బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు మాత్రమే జమ అయ్యాయి. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను అడిగితే.. ఆమె పంట రుణం రూ.1.60 లక్షలు ఉండగా, వడ్డీ రూ.60 వేలు అయిందని, దీంతో కల్యాణలక్ష్మి డబ్బుల నుంచి వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకున్నామని చెప్పగా, ఆమె అవాక్కయింది. తనకు వచ్చిన పూర్తి డబ్బులను ఇవ్వాలని ఎంత వేడుకు న్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదని ఆమె ఆవే దన వ్యక్తం చేసింది. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చాలని అనుకుంటే, పంట రుణం కింద జమ చేసుకోవడం అన్యాయమని బోరుమంది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నరేశ్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. -
పూచీకత్తు లేకుండా రైతులకు రూ.2 లక్షలు రుణం
చిన్న, సన్నకారు రైతులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద ఊరట కల్పించింది. రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని రూ.1.66 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం పూర్తయిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.“వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు రుణ లభ్యతను మరింత పెంచుతుంది.’’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితి పెంపునకు సంబంధించి ఆర్బీఐ త్వరలో ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేయనుంది. ఈ రుణాలను రుణాలు పొందడానికి రైతులు హామీగా ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో సెంట్రల్ బ్యాంక్ సవరించింది. అప్పట్లో రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచింది.రైతుల మేలు కోసం..చిన్న, సన్నకారు రైతుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం 2019 ఫిబ్రవరిలో రూ.3 లక్షల లోపు ఉన్న క్రాప్ లోన్లకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, లెడ్జర్ ఫోలియో ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అంతకు ముందు 2014లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సిఐసి) నుండి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లను (సిఐఆర్) పొందేందుకు తగిన నిబంధనలను తమ క్రెడిట్ అప్రైజల్ ప్రాసెస్లు/లోన్ పాలసీలలో చేర్చాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. తద్వారా క్రెడిట్ నిర్ణయాలు సిస్టమ్‌లో అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి. -
DK Aruna: రైతులను మోసం చేసిన సీఎం రేవంత్..!
-
రుణమాఫీకి రేషన్ కార్డుకు లింకుపెడితే గొడవలే..!
-
Fact Check: ‘సున్నావడ్డీ’ నడ్డి విరిచింది మీ బాబే..
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకంపై ఈనాడు మరోసారి విషం కక్కింది. రైతులను గందరగోళపర్చేలా.. వాస్తవాలకు ముసుగేసి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు సాగుకోసం తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడం ద్వారా వారిలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా అమలుచేస్తున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంపై తన అక్కసును వెళ్లగక్కింది. ‘పావలా తీసేసి.. సున్నా చుట్టేశారు’.. అంటూ అబద్ధాలను అచ్చేసింది. ఈ అవాస్తవ కథనంపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. ఆరోపణ : గతంలో తక్షణమే ప్రయోజనం.. వాస్తవం : సీజన్లో ప్రతీ రైతు వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునేవారు. రూ.లక్షలోపు రుణాన్ని తిరిగి చెల్లిస్తే బ్యాంకులు వసూలుచేసే ఏడు శాతం వడ్డీలో మూడుశాతం కేంద్రం రాయితీ ఇస్తోంది. మిగిలిన నాలుగు శాతం రైతులు భరించేవారు. గతంలో ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునే వారు. గతంలో క్లైయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్‌లకు మాత్రమే యాక్సెస్ ఉండేది. బ్రాంచ్‌లకు ఉండేది కాదు. ఎంతమంది అర్హత పొందారు.. వారికెంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. బ్యాంకులకు కూడా తెలిసేది కాదు. బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. ఆరోపణ : సవాలక్ష నిబంధనలు? వాస్తవం : వడ్డీలేని రుణ పథకానికి మరింత మెరుగులు దిద్ది ఖరీఫ్–2019 నుంచి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని’ అమలుచేస్తున్నారు. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటా ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించిన తర్వాత అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా https:// karshak.ap.gov.in/ysrsvpr/ వెబ్సైట్లోకి వెళ్లి హోంపేజి లో ‘ జుnౌఠీ yౌuట ట్ట్చ్టuట’’ అనే విండో ఓపెన్ చేసి ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ వడ్డీ రాయితీకి అర్హత పొంది, జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాçస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకంటే పారదర్శకత ఏముంటుంది? ఆరోపణ : కేవలం 12.3 శాతం మందికే వర్తింపు.. వాస్తవం : ఏటా 65 లక్షల మంది రుణాలు తీసుకుంటారు. వీరిలో ఏడాదిలోపు రుణాలు తీసుకునే వారికి ఏటా రూ.3వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.15వేల కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాలి కదా అంటూ ఈనాడు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. చంద్రబాబు హయాంలో రైతులు పొందిన రుణాలను బట్టి ఏటా రూ.2,500 కోట్ల చొప్పున కనీసం 12వేల కోట్లకు పైగా వడ్డీరాయితీ చెల్లించాలి కదా. కానీ, టీడీపీ ఐదేళ్లలో వడ్డీ రాయితీ చెల్లించింది ఎంతో తెలుసా అక్షరాలా 40.61 లక్షల మందికి కేవలం రూ.685.46 కోట్లు మాత్రమే. చెల్లించిన మొత్తం కంటే ఎగ్గొట్టిన బకాయిలే అధికం. ఏకంగా 39.08 లక్షల మందికి రూ.1,180.66 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. పోనీ ఐదేళ్ల పాలనలో ఇంత తక్కువ వడ్డీ రాయితీ ఎందుకు చెల్లించావని కానీ, బకాయిలు ఎందుకు ఎగ్గొట్టావ్ బాబు అని కానీ ఏనాడు రామోజీ సింగిల్ కాలమ్ వార్త రాసిన పాపాన పోలేదు కదా.. ఆరోపణ : అరకొరగా పథకం అమలు.. వాస్తవం : చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్ల చెల్లింపునకు ముందుకొచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పగ్గాలు చేపట్టిన వెంటనే అణాపైసలతో సహా బకాయిలు చెల్లించి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇక 57 నెలల్లో బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా 73.88 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.1,834.55 కోట్లు వడ్డీ రాయితీ సొమ్మును జమచేసింది. రబీ 2021–22, ఖరీఫ్ 2022 సీజన్లకు సంబంధించి అర్హత పొందిన 10.79 లక్షల మంది రైతులకు రూ.220 కోట్ల సున్నా వడ్డీ రాయితీ మొత్తాన్ని త్వరలో వారి ఖాతాలకు జమచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. బాబు హయాంలో సగటున ఏటా రూ.137 కోట్ల వడ్డిరాయితీ చెల్లిస్తే ఈ ప్రభుత్వం త్వరలో చెల్లించబోయే మొత్తంతో కలుపుకుంటే సగటున రూ.421 కోట్లు చెల్లించినట్లవుతుంది. ఎవరి హయాంలో వడ్డీ రాయితీ ఎక్కువగా చెల్లించారో ఇంతకంటే ఏం చెప్పాలి. నిజంగా అరకొరగా అమలుచేయాలని ఆలోచన చేస్తే బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాల్సిన అవసరమేముందో రామోజీకే తెలియాలి. ఆరోపణ : అంతంతమాత్రంగానే పంట రుణాలు.. వాస్తవం : బాబు ఐదేళ్ల పాలనలో 3.97 కోట్ల మందికి రూ.3.64 లక్షల కోట్ల రుణాలు అందిస్తే.. ఈ ప్రభుత్వ హయాంలో గడిచిన 57 నెలల్లో ఏకంగా 5.17 కోట్ల మంది రైతులకు రూ.8.59 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) ద్వారా ఇప్పటివరకు 14.13 లక్షల కౌలు రైతులకు రూ.8,346 కోట్ల వ్యవసాయ రుణాలు అందించారు. ప్రస్తుత 2023–24 సీజన్లో రికార్డుస్థాయిలో 8.31 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీలు జారీచేయగా, ఇప్పటికే వారిలో 5.48 లక్షల మందికి రూ1,907.8 కోట్ల వ్యవసాయ రుణాలు అందించారు. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించడమే కాదు.. రుణాల మంజూరులో కానీ, సున్నా వడ్డీ రాయితీ చెల్లింపుల్లో కానీ రైతు సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్తుంటే ఈనాడు మాత్రం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. -
రైతుబంధుకు బ్యాంకర్ల మోకాలడ్డు.. బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వానాకాలానికి సంబంధించి రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఐదెకరాల లోపు ఉన్న వారంతా చిన్న, సన్నకారు రైతులే ఉంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని అందుకోకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. పంట రుణం బకాయిలున్నాయంటూ ఈ రైతుబంధు డబ్బులను డ్రా చేసుకోనివ్వడం లేదు. ఆయా రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నారు. ఈ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఒక్క శాఖలోనే 500 ఖాతాలు హోల్డ్ ఏపీజీవీబీ బ్యాంకుకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 53 శాఖలు ఉన్నాయి. ఒక్క వట్పల్లి బ్రాంచ్‌లోనే సుమా రు 500 మంది రైతుల ఖాతాలను బ్యాంకర్లు హోల్డ్‌లో పెట్టారు. వీరి ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు, ధాన్యం డబ్బులను విత్‌డ్రా చేసుకోనివ్వడం లేదు. దీంతో రైతులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లగా.. ఫీల్డ్ ఆఫీసర్ లేడని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. సాగు ఖర్చుల కోసం.. ప్రస్తుతం వానాకాలం పంట సీజను ప్రారంభమైంది. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ కిరాయి ఇలా సాగు ఖర్చుల కోసం రైతులకు డబ్బులు అవసరం ఉంటుంది. వచ్చిన రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఖర్చుల కోసం తాము ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు. అధిక వడ్డీకైనా అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గత రబీ సీజనులో ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం డబ్బులను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేసింది. పంట రుణం రెన్యువల్ చేసుకోలేదంటూ ఈ డబ్బులను కూడా డ్రా చేసుకోనివ్వడం లేదని రైతులు వాపోతున్నారు. రెన్యువల్ చేసుకుంది 20 శాతం లోపే.. రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రుణాలను ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేస్తోంది. మాఫీ కాని చాలామంది రైతులు తమ పంట రుణా లను రెన్యువల్ చేసుకోలేదు. కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం ఎలాగైనా మాఫీ చేస్తుందని రెన్యు వల్ చేసుకోలేదు. రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతు లు 20 శాతంలోపే ఉంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో మిగిలిన 80 శాతం మంది రైతుల్లో చాలామందికి ఇలాంటి సమస్య ఎదురవుతోందని అంచనా. బదిలీపై వచ్చిన మేనేజర్లకు తెలియక కొన్ని బ్రాంచ్‌లకు మేనేజర్లు ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వస్తుంటారు. రైతుబంధు డబ్బులు ఆపొద్దని తెలియక వారు ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. రైతుబంధు డబ్బులు ఆపొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. రుణమాఫీ అవుతుందనే కారణంగా చాలామంది పంట రుణాలను రెన్యువల్ చేసుకోవడం లేదు. – గోపాల్‌రెడ్డి, లీడ్‌బ్యాంకు మేనేజర్, సంగారెడ్డి ఈ రైతు పేరు నరేందర్‌గౌడ్. సంగారెడ్డి జిల్లా నాగులపల్లి గ్రామం. తన 2.62 ఎకరాలకు సంబంధించి రైతుబంధు కింద రూ.13,100 బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఖరీఫ్ పంట సాగు ఖర్చుల కోసం డబ్బులు తీసుకునేందుకు వట్‌పల్లిలోని ఏపీజీవీబీ బ్యాంకుకెళ్లాడు. అయితే, బ్యాంకు అధికారులు రూ.1.60 లక్షల పంట రుణ బకాయి ఉందని, ఈ రుణాన్ని రెన్యువల్ చేసుకోనందున ఖాతాను హోల్డ్‌లో పెట్టామని చెప్పారు. దీంతో రైతుబంధు డబ్బులు డ్రా చేసుకోలేక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలపూర్ డీకే గ్రామానికి చెందిన అంబయ్యకు మూడెకరాల భూమి ఉంది. మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో రూ.80 వేల వరకు పంట రుణం ఉంది. ఇటీవల రైతుబంధు కింద ఖాతాలో జమ అయిన డబ్బులను పంట పెట్టుబడికి డ్రా చేసుకుందామంటే బ్యాంకర్లు అనుమతించడం లేదని అంబయ్య వాపోయాడు. -
రుణ ప్రణాళిక @ రూ. 8,713 కోట్లు
సుభాష్‌నగర్ : జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.8,713.34 కోట్లుగా నిర్ధేశించారు. అందులో పంట రు ణాల లక్ష్యం రూ.4,062.20 కోట్లు కాగా, ఏటీఎల్ (అగ్రికల్చ ర్ టర్మ్ రుణాలు) రూ.2,506 కోట్లు లక్ష్యంగా పెట్టుకు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లింకేజీ (ఐకేపీ) లక్ష్యం రూ.653 కోట్లు, అర్బన్ ప్రాంతంలో (మెప్మా) రూ.100 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ధేశించుకున్నారు. ఇతర విభాగాలు ఎంఎస్ఎంఈకు రూ.1,646.87 కోట్లు, ఓపీఎస్‌కు రూ.298.17 కోట్లు, ఎన్పీఎస్కు రూ.200 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా 2023–24వ ఆర్థిక సంవత్సరానికి రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వివిధ విభాగాలకు కలిపి రూ.914.96 కోట్లు (11.74శాతం) ప్రజలకు రుణాల రూపంలో అందజేశారు. గతేడాది 71.72 శాతం.. గతేడాది రుణ ప్రణాళిక లక్ష్యం రూ.7798.38 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రుణాలు రూ.13,690.37 కోట్లు (175. 56శాతం) అందజేశారు. కానీ పంట రుణాలు లక్ష్యం చేరలే దు. పంటరుణాలు రూ.3,846.9 కోట్లు లక్ష్యంగా పెట్టుకో గా, రూ.2,758.68 కోట్లు (71.72శాతం) మాత్రమే పంపిణీచేశారు. రూరల్ ప్రాంతాల్లో బ్యాంకు లింకేజీ 249.4 శాతం, అర్బన్ ప్రాంతంలో 187.47శాతం వరకు రుణాలిచ్చారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకరించాలి లక్ష్యం మేరకు పంట రుణాలు మంజూరు చేసి రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకరించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశమందిరంలో బ్యాంకుల వారీగా రుణాల మంజూరుపై బ్యాంకు మేనేజర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా చిత్రామిశ్రా మాట్లాడుతూ జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు బ్యాంకుల వారీగా పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు, రుణాలు సకాలంలో మంజూ రు చేయాలన్నారు. వీధి రుణాలు అర్హులందరికీ మంజూరు చేయాలన్నారు. ఈ సందర్భంగా 2023–24కు గాను జిల్లా రుణ ప్రణాళికను విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ చందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, మెప్మా పీడీ రాములు, ఆర్బీఐ అధికారి అనిల్‌కుమార్, నాబార్డు డీడీఎం ప్రవీణ్‌కుమార్, అన్ని బ్యాంకుల అధికారులు, గ్రా మీణాభివృద్ధిశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు దినోత్సవం రసాభాస!
సాక్షి నెట్వర్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన రైతు దినోత్సవ కార్యక్రమం పలుచోట్ల రసాభాసగా మా రింది. ధాన్యం కొనుగోళ్లు సరిగా చేపట్టక ఇబ్బందుల పాలయ్యామని.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి ఇస్తామన్న పరిహారం ఏమైపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా రైతు దినోత్సవ కార్యక్రమాల వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని.. రూ.లక్ష రుణమాఫీ చేయలేదేమని నిలదీశారు. రైతు వేదికపై వడ్లు కుమ్మరించి.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో రైతువేదికపై భిక్షపతి అనే రైతు మొలకెత్తిన వడ్లను కుమ్మరించి నిరసన వ్యక్తం చేశారు. తన ధాన్యాన్ని సమీపంలోని సర్దార్‌నగర్ మార్కెట్‌కు తీసుకెళ్లినా.. కొనుగోలు కేంద్రం తెరుచుకోలేదని, వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని వాపోయారు. మరికొందరు రైతులు కూడా అకాల వర్షాలకు పంట నష్టం, పరిహారం అందని తీరు, కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై నిలదీశారు. మంత్రి క్యాంపు ఆఫీసు ఎదుట ధాన్యం పోసి.. తేమ, తాలు పేరిట ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు మిల్లర్లు దోచుకుంటున్నారన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా కమలాపూర్‌కు చెందిన రైతు సట్టంశెట్టి రాజన్న ధర్మపురిలోని మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం కుప్పపోసి నిరసన తెలిపాడు. రైతులకు ఏం చేశారని సంబురాలు? యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదిక వద్ద కాంగ్రెస్ నేతలు, రైతులు రైతు దినోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా.. ఏం చేశారని రైతు సంబరాలు జరుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగాయి. ఎంపీ కవితను నిలదీసిన రైతులు మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండలో రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవితను పలువురు రైతులు ధాన్యం కొనుగోళ్లపై నిలదీశారు. ఎంపీ ప్రసంగిస్తుండగా లేచి.. కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, కొన్నా లారీలు రాక బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయని.. వానలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసేదెప్పుడు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని రుణమాఫీపై రైతులు నిలదీశారు. ‘రైతుబంధు వస్తోంది కదా..’అని ఎమ్మెల్యే పేర్కొనగా రుణాలపై తాము కట్టే వడ్డీకే ఆ డబ్బులు సరిపోవడం లేదని రైతులు మండిపడ్డారు. ధాన్యం కొ నుగోళ్లలో అక్రమాలనూ ప్రస్తావించారు. దీనితో ఎ మ్మెల్యే అసహనంతో వెళ్లిపోయారు. కార్యక్రమాలను బహిష్కరించి నిరసన ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, పంట నష్టపరిహారం అందకపోవడానికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రైతులు నిరసనలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సభను బహిష్కరించగా, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో రైతువేదికకు తాళం వేశారు. చందుర్తి మండల వ్యాప్తంగా రైతు సభలను బహిష్కరించారు. నష్టపరిహారం అందేదెప్పుడు? వరంగల్ తూర్పుకోటలో జరిగిన కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రసంగిస్తుండగా.. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటనష్టంపై పరిహారం ఏదంటూ నిలదీశారు. రైతుబంధు రావట్లేదా? సిగ్గు లేదా? రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అబాది జమ్మికుంట రైతు దినోత్సవ కార్యక్రమంలో ఓ రైతుపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇస్తామని మూడు నెలలైనా.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని బుర్ర కుమార్ అనే రైతు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు రెండు కిలోలు కోత పెడుతున్నారని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కౌశిక్‌రెడ్డి.. ‘నీకు రైతుబంధు రావడం లేదా? నీకు సిగ్గు, శరం లేదా?’అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
పంటలకు రుణ పరిమితి...'వరి, పత్తికి ఎకరాకు రూ. 45 వేలు'
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) పెరిగింది. కొన్ని కొత్త రకాల పంటలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. రానున్న వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 123 రకాల పంటలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.45 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి 2022–23లో రూ.36 వేల నుంచి రూ.40 వేల పంట రుణాలను ఇవ్వగా ఈసారి రూ. 42 వేల నుంచి రూ. 45 వేలకు పెంచింది. అలాగే శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ. 36 వేల నుంచి రూ. 38 వేలుగా ఖరారు చేసింది. ఇక వరి విత్తనోత్పత్తికి కూడా రూ.5 వేలు అదనంగా పెంచింది. 2022–23లో రూ. 45 వేలుండగా, ఇప్పుడు రూ. 50 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ. 38 వేల నుంచి రూ. 40 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ. 42 వేల నుంచి రూ. 45 వేల వరకు పెంచింది. ఆయిల్‌పాంకు ఎకరానికి రూ. 42 వేల రుణం... ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఆయిల్‌పాం పంటలు సాగు చేసే రైతులకు రుణ పరిమితి ఖరారు చేసింది. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 42 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి కూడా అంతే ఖరారు చేసింది. ఇక కీలకమైన మిర్చికి రూ. 75 వేల నుంచి రూ. 80 వేల వరకు పెంచింది. సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రీయ పద్ధతిలో పండించే మినుముకు రూ. 18–21 వేలు ఖరారు చేశారు. శనగకు రూ. 24 నుంచి రూ. 26 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 30–34 వేలుగా, నీటి వసతి లేనిచోట రూ. 26–28 వేలు ఖరారైంది. కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ. 21–24 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 18–21 వేలు ఖరారు చేశారు. సోయాబీన్‌కు రూ. 26 వేల నుంచి రూ. 28 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 34 వేల నుంచి రూ. 36 వేల వరకు ఇస్తారు. ఉల్లి సాగుకు రూ.45 వేలు ఉల్లిగడ్డ సాగుకు గతంలో ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ. 40 వేల నుంచి రూ. 45 వేలకు పెంచారు. పట్టుకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలుగా ఖరారు చేశారు. ఇక పత్తి విత్తనాన్ని సాగు చేసే రైతులకు గణనీయంగా పెంచారు. గతంలో రూ. 1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు రూ. 1.30 లక్షల నుంచి రూ. లక్షన్నరకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 80 వేల నుంచి రూ. 85 వేల వరకు ఇస్తారు. టస్సర్ కల్చర్ (ఒకరకమైన పట్టు) సాగుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తారు. -
రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది
తప్పనిసరిగా నమోదు చేసుకోండి ఇప్పుడు 6.28 లక్షల మంది రైతుల్లో దాదాపు 2.50 లక్షల మంది వివరాలు ఈ–క్రాప్‌లో లేకపోయినా వారి పట్ల ఉదారంగా ఉండేందుకు అందరికీ సున్నా వడ్డీ ఇస్తున్నాం. ఏ ఒక్క రైతుకూ సున్నా వడ్డీ అంద కుండా ఉండొద్దు. ప్రతి అడుగులోనూ ఒక మంచి జరుగుతున్నప్పుడు రైతన్నలు సహకరించాలి. ప్రభుత్వం ఏ సహాయం చేయాలన్నా ఈ–క్రాపింగ్ చాలా అవసరం. దీన్ని ఏ ఒక్క రైతు కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏడాది జూన్ నుంచి మళ్లీ ఈ–క్రాపింగ్ నమోదు ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి ఈ–క్రాపింగ్‌లో నమోదు చేయించుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. – ముఖ్యమంత్రి జగన్ రైతుబిడ్డగా చెబుతున్నా... నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లను స్వయంగా చూశా. వారికి ఎలా మేలు చేయాలన్నది ఆనాడే ఆలోచించా. రైతుల కష్ట నష్టాలకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. ఒకటి... పెట్టుబడి ఖర్చు బాగా పెరగడం. రెండో కారణం.. రైతు కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో దళారుల ప్రమేయం. మూడో కారణం... పంటలకు తగిన గిట్టుబాటు ధర రాకపోవడం. నాలుగో కారణం... ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ 22 నెలల కాలంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు అండగా నిలబడ్డామని ఒక రైతు బిడ్డగా, మీ అందరి బిడ్డగా, ఒక అన్నగా సగర్వంగా చెబుతున్నా. – సీఎం వైఎస్ జగన్ ఒకరోజు ముందే రైతులకు పండుగ రెండు ఎకరాల్లో పత్తి, రెండున్నర ఎకరాల్లో కంది సాగు చేస్తున్నాను. బ్యాంకు నుంచి రూ.90 వేలు రుణం తీసుకున్నా. సకాలంలో చెల్లించినందుకు నాకు సున్నా వడ్డీ కింద రూ.3,600 జమ అవుతున్నట్లు ఆర్బీకేలోని జాబితాలో ఉంది. శ్రీరామనవమి ఈరోజే వచ్చినంత సంతోషంగా ఉంది. 2సార్లు రైతు భరోసా కూడా అందింది. పంటల బీమాకు మీరు ఒక్క రూపాయి కడితే చాలన్నారు. మొదటి ఏడాది పత్తి, కందికి కట్టా. పంటనష్ట పరిహారం కూడా అందింది. – సీహెచ్ శ్రీనివాస్, దువ్వల, ప్రకాశం జిల్లా సాక్షి, అమరావతి: ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.65 వేల కోట్లకు పైగా అన్నదాతల సంక్షేమం కోసం ఖర్చు చేశామని మీ అందరి బిడ్డగా, ఒక రైతు బిడ్డగా సగర్వంగా చెబుతున్నానని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విత్తనం సరఫరా మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతులు ఏ పరిస్థితుల్లో నష్టపోతారో గ్రహించడమే కాకుండా వాటిని నివారించేలా సాగుదారుల కోసం పలు చర్యలను తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు వీలుగా ప్రతి రైతు తమ పంటల వివరాలను ఈ–క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 2019 – 20 రబీ సున్నా వడ్డీ రాయితీని సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. అర్హులైన 6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్లను జమ చేశారు. లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వర్తింపచేస్తోంది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని రైతులు, అధికారులనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ.. రైతు బాగుంటేనే.. ఏప్రిల్‌లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. వారిద్దరూ బాగుంటేనే రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడ్డ దాదాపు 62 శాతం జనాభా బాగా బతికే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎఫ్అండ్ఏ) సర్వే ప్రకారం భూమి మీద ఉన్న దాదాపు 780 కోట్ల మంది ప్రజల్లో 60 శాతం మంది వ్యవసాయం, అనుబంధ విభాగాలపై ఆధారపడి ఉన్నట్లు తేలింది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందుకే చెబుతున్నాం. ప్రతి అడుగులో రైతన్నల సంక్షేమం.. రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 22 నెలల్లో ప్రతి అడుగులో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశాం. రాష్ట్రంలో 18.70 లక్షల పంపుసెట్లు ఉండగా వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలని ఏటా దాదాపు రూ.8,800 కోట్ల చొప్పున రెండేళ్లలో దాదాపు రూ.17,600 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్ల నాణ్యత కోసం అదనంగా మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని ఒక రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నా. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంకో నాలుగు అడుగులు.. నాన్న వైఎస్సార్ రైతుల కోసం కొన్ని అడుగులు వేస్తే ఇప్పుడు ఆయన కంటే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నా. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నాం. రాష్ట్రంలో అర హెక్టారు (1.25 ఎకరాలు) ఉన్న రైతులు 60 శాతం, ఒక హెక్టారు (2.5 ఎకరాలు) ఉన్న రైతులు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. రైతులకు ఏటా మనం ఇస్తున్న రూ.13,500 పెట్టుబడి సాయం వారికి దాదాపు 80 శాతం వరకు ఉపయోగపడుతోంది. రైతులకు ఏటా మూడు విడతల్లో ఆ సాయం అందిస్తున్నాం. ఇప్పటికే రెండేళ్లు ఇచ్చాం. మూడో ఏడాది కూడా ఇవ్వబోతున్నాం. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండేళ్లలో 51.59 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున మొత్తం రూ.13,101 కోట్లు ఖర్చు చేశామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సంతోషంగా తెలియజేస్తున్నా. ఆర్బీకేలు.. విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతు ఎక్కడా ఇబ్బంది పడకుండా రాష్ట్రవ్యాప్తంగా 10,601 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. అవి ప్రతి విషయంలో రైతులకు అండగా నిలుస్తున్నాయి. రైతుల చేయి పట్టుకుని నడిపిసున్నాయి. ఆ విధంగా గ్రామ స్థాయిలోనే సేవలు అందిస్తున్నాం. ఉచిత బీమా.. కేవలం ఒక్క రూపాయి కడితే చాలు రైతులకు బీమా సదుపాయం కల్పిస్తున్నాం. అన్ని ఆర్బీకేలలో ఈ–క్రాప్ డేటాలో నమోదు చేసుకునే సదుపాయం ఉంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతులకు 22 నెలల వ్యవధిలో రూ.1,968 కోట్లకు పైగా బీమా పరిహారం చెల్లించాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఆ మేరకు దాదాపు రూ.1,056 కోట్లు ఇవ్వగలిగామని మీ బిడ్డగా చెబుతున్నా. సున్నా వడ్డీ.. సున్నా వడ్డీకి సున్నా చుట్టి గత సర్కారు వదిలేసిన బకాయిలు దాదాపు రూ.850 కోట్లు (బ్యాంకులు అప్లోడ్ చేసినవి) మన ప్రభుత్వం చెల్లించింది. ఇది కాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2019 – 20 ఖరీఫ్‌కు సంబంధించి రూ.289 కోట్లు ఇచ్చా. అదే ఏడాది రబీకి సంబంధించి ఇవాళ రూ.128.47 కోట్లు ఇస్తున్నాం. ప్రత్యేక నిధితో సహాయం.. ఇవి కాకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధికి రూ.2 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయించడమే కాకుండా కనీస మద్దతు ధర లేని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రూ.4,761 కోట్లు ఖర్చు చేసి పలు పంటలు కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు కోసం రూ.18,344 కోట్లు ఖర్చు చేశాం. పాడి రైతులకు అండ.. పాడి ద్వారా రైతులు బాగు పడాలని చర్యలు తీసుకున్నాం. లీటరు పాలు, మినరల్ వాటర్ ధరల మధ్య తేడా లేదని రైతులు చెప్పారు. అందుకే పాడి రైతులు, అక్క చెల్లెమ్మలను ఆదుకునేందుకు ఏపీ–అమూల్ పాలవెల్లువ ద్వారా నాలుగు జిల్లాలలోని దాదాపు 600 గ్రామాలలో పాల సేకరణ చేపట్టాం. ఒక్కో లీటరుపై పాడి రైతులకు దాదాపు రూ.7 ఎక్కువ గిట్టుబాటు అవుతోంది. జగనన్న జీవక్రాంతి పథకంలో దాదాపు 1.20 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూతలో పాడి గేదెలు అందచేస్తున్నాం. ఆ కుటుంబాలను ఆదుకున్నాం.. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ఏటా దాదాపు రూ.780 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం ఎలా బతుకుతుందనే ఆలోచన చేయకుండా గత సర్కారు దాదాపు 434 కుటుంబాలను వదిలేస్తే మన ప్రభుత్వం వచ్చాక ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసింది. ఇంకా మన ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్య చేసుకున్న 82 మంది రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశాం. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి, ఎస్సెల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డితో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి అధికారులు, పెద్ద సంఖ్యలో రైతుల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఏటా రూ.46 వేలు సంతోషంగా ఇస్తున్నాం.. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం ద్వారా వారికి చాలా లాభం కలుగుతుంది. ఉదాహరణకు ఒక రైతు 7.5 హెచ్‌పీ మోటారు వినియోగిçస్తుంటే గంటకు 5 యూనిట్ల విద్యుత్ కావాలి. అలా రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా ప్రకారం చూస్తే రోజుకు 45 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. అంటే నెలకు ఆ రైతు వినియోగించే విద్యుత్ 1,350 యూనిట్లు. ఇవాళ మార్కెట్లో మనం సేకరిస్తున్న యూనిట్ విద్యుత్ సగటు ధర రూ.5.20 చొప్పున లెక్క వేస్తే నెలకు దాదాపు రూ.7,020 అవుతుంది. ఏటా సగటున 200 రోజులు రైతులు విద్యుత్ వినియోగిస్తారని లెక్కిస్తే ఆ మొత్తం వ్యయం దాదాపు రూ.46 వేలు అవుతుంది. ఆ మొత్తాన్ని కూడా రైతుల కోసం సంతోషంగా వ్యయం చేస్తున్నాం. ప్రతి రైతుకు మంచి జరగాలి.. రైతులు అప్పులపాలు కాకుండా వారికి సున్నా వడ్డీ రుణాలు అందాలి. ప్రతి ఒక్క రైతు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. ఏ పంట, ఏ రైతు, ఎన్ని ఎకరాల్లో వేశారన్న పూర్తి సమాచారం ఉంటుంది. పంట రుణాలు, సున్నా వడ్డీ, బీమా, చివరకు గిట్టుబాటు ధర కోసం కూడా ఈ–క్రాప్ డేటా అవసరం. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆర్బీకేకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారే నమోదు చేస్తారు. వచ్చే నెలలో రైతు భరోసా, ఖరీఫ్ 2020కి సంబంధించి బీమా పరిహారం విడుదల ఉంటుంది. ఆ డబ్బు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ప్రతి రైతుకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. మనసా వాచా కర్మణా.. మేనిఫెస్టోలో నవరత్నాల తొలి వాగ్దానాలన్నీ రైతులకు సంబంధించినవే. అందులో చెప్పిన ప్రతిదీ మనసా వాచా కర్మణా ఈ రెండేళ్లలో అమలు చేశానని ఒక రైతుబిడ్డగా సగర్వంగా చెబుతున్నా. ఇవాళ దాదాపు 6.28 లక్షల మంది రైతులకు రూ.128.47 కోట్లను గత ఏడాది (2020) రబీకి సంబంధించి సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. గత ఏడాది పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతులందరికీ ఈ పథకంతో మేలు కలుగుతోంది. 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 61,22,588 మంది రైతులకు రూ.1,132.54 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టి పోయిన బకాయిలతో కలిపి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తంతో పాటు ఇవాళ ఇస్తున్న మొత్తం కూడా కలిపితే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద రైతులకు దాదాపుగా రూ.1,300 కోట్లు ఇచ్చినట్లు అవుతుంది. రైతులకు ఇచ్చిన ప్రతి మాట అమలు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి అమలు చేస్తున్నారు. దీంతో హరిత విప్లవం సాకారమవుతోంది. గోదావరి జిల్లాలో రెండో పంటకు సీలేరు నుంచి నీరు విడుదల చేయడంతో ఎక్కడా పంటలు ఎండిపోవడం లేదు. ఏ సీజన్‌కు సంబంధించి అదే సీజన్లో అన్నీ అందిస్తున్నారు. దీంతో రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇవాళ దాదాపు 6.28 లక్షల మంది రైతులకు దాదాపు రూ.129 కోట్లు సున్నా వడ్డీ రాయితీ కింద ఇస్తున్నాం. 2014 – 15 నుంచి 2018 – 19 వరకు గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు దాదాపు రూ.1,180 కోట్లు సైతం ఎన్ని కష్టాలు వచ్చినా సీఎం ఇచ్చారు. సామాజిక తనిఖీ, సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన వల్ల పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
పాస్‌బుక్, టైటిల్ డీడ్ లేకుండానే..పంట రుణం
గత నెలలోనే ఆర్డినెన్స్ జారీ ⇒ అయినా పట్టించుకోని బ్యాంకులు ⇒ ఆర్డినెన్స్‌కు ప్రచారం లేకపోవడమే కారణం ⇒ ఇకపై టైటిల్‌డీడ్ కమ్ పాస్‌బుక్ ఒకటే రికార్డు ⇒ ఆన్లైన్లోనే ఆర్వోఆర్ రికార్డుల నిర్వహణ సాక్షి, హైదరాబాద్ పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ లేకుండానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. నెల రోజుల కిందే ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చింది. ‘తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ (అమెండ్మెంట్)’పేరుతో గత నెల 17న జారీ చేసిన ఆర్డినెన్స్‌లో దీనితో సహా పలు కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటి ప్రకారం రాష్ట్రంలో బ్యాంకులు రైతుల వద్ద పూచీకత్తు పత్రాలేవీ తీసుకోకుండానే రుణాలు మంజూరు చేయాలి. కానీ ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయిలో అమల్లోకి రాలేదు. పట్టాదారు పాస్ పుస్తకం లేదా టైటిల్ డీడ్, సంబంధిత వ్యవసాయ అధికారి ధ్రువీకరణ ఉంటే తప్ప రుణం ఇచ్చే ప్రసక్తే లేదంటూ బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తగినంతగా ప్రచారం చేయకపోవడం, విధి విధానాల అమలుపై దృష్టి కేంద్రీకరించక పోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. టీఎల్ఆర్ఎంఎస్లో భూముల వివరాలు ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలో భూముల యా జమాన్య సంబంధిత రెవెన్యూ రికార్డులన్నీ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) ఎలక్ట్రానిక్ నమూనాలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ సర్వే నంబర్లో ఉన్న భూమి అయినా ఏ రైతుకు చెందినదో తెలుసుకునేందుకు వీలుగా ‘తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టీఎల్‌ఆర్‌ఎంఎస్)’ను రూపొందించారు. టీఎల్ఆర్ఎంఎస్తో పాటు మీసేవ పోర్టల్‌లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. బోగస్ పాస్‌బుక్‌లు, టైటిల్డీడ్లకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పాత పద్ధతి వీడని బ్యాంకులు కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకర్లు టీఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లోని లోన్ మాడ్యుల్ ద్వారా రైతుకు సంబంధించిన భూమి వివరాలు పరిశీలించి.. వారికి ఇవ్వగలిగిన స్థాయిలో పంట రుణాన్ని మంజూరు చేయాల్సి ఉంది. అంతేతప్ప రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లను తమ వద్ద పెట్టుకోవద్దు. కానీ ఈ ఆర్డినెన్స్ అమలుపై ప్రభుత్వం ఇంకా దృష్టి సారించకపోవడంతో.. బ్యాంకులు పాత పద్ధతిలోనే పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లను తనఖాగా పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో దాదాపు 8.15 లక్షల మంది రైతుల పంట రుణాలు రెన్యువల్ చేయగా... కేవలం 1,712 మందికి మాత్రమే లోన్ మాడ్యుల్ పద్ధతిలో రుణాలు మంజూరు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇకపై ఒకటే ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు వేర్వేరుగా ఉండకుండా.. వాటి స్థానంలో టైటిల్ డీడ్–పాస్‌బుక్ పేరుతో ఒకటే రికార్డు ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా అత్యంత భద్రమైన ఎలక్ట్రానిక్ కార్డు రూపంలో దీనిని అందజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు బోగస్ రిజిస్ట్రేషన్లు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు కళ్లెం చేసేందుకు టీఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో ఉన్న వివరాలతోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
అధికారుల చేతుల్లో రైతుల వివరాలు
► ఇంటింటా నిర్వహిస్తున్న సర్వే ► పూర్తి వివరాలు సేకరణ జైనథ్ : మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లోని 55 గ్రామాల్లో రైతుల వారీగా పక్క వివరాలు నమోదుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యవసాయాధికారి ఏవో వివేక్, కొత్తగా విధుల్లోకి చేరిన ఏఈవోలు ఈ పనులను ప్రారంభించారు. ప్రత్యేకంగా రూపొందిన ప్రొఫార్మాలతో ఏఈవోలు వారి సెక్టార్ పరిధిలోని గ్రామాల్లో సర్వేలను ప్రారంభించారు. రైతుల పూర్తి సమాచారం.. ప్రత్యేకంగా చేపడుతున్న ఈ సర్వేలో రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వేల కోసం ప్రత్యేకంగా రూపొందిన ప్రొఫార్మాలో ఏఈవో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. దీంట్లో రైతుల పేర్లు, తండ్రి పేరు, గ్రామం, శివారం, ఆధార్ నంబర్, సర్వే నంబర్‌తో పాటు ముబైల్ నంబర్ కూడ నమోదు చేస్తున్నారు. ఇవే కాకుండా రైతులు ప్రస్తుతం వేసిన, వేస్తున్న పంటల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. రైతులకు పంట రుణం ఉందా? బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉందా? అనే అంశాలు కూడా సేకరిస్తున్నారు. వీటితో పాటు రైతులకు అతి ముఖ్యమైన నీటి పారుదల అంశంపై ఈ సర్వేలు వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులకు నీటి పారుదల వసతి ఉందా? ఉంటే బావుల ద్వారా ఎంత? కాల్వల ద్వారా ఎంత ఉంది? అనే కోణంలో వివరాలు నమోదు చేస్తున్నారు? కాగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం కోసం యంత్ర పరికరాలు, డ్రిప్ సిస్టమ్, ట్రాక్టర్లు వంటివి ఎంత మందికి అందుబాటులో ఉన్నాయనే అంశాలను సైతం ప్రాధాన్యంగా సర్వే చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై ఎంతమంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు? ఎంత మందికి వర్మీ కంపోస్ట్, నాడెం కంపోస్ట్ యూనిటులు ఉన్నాయి? వంటి రైతుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు ఈ సర్వేలు నిర్వహిస్తున్నట్లు ఆధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సర్వే ద్వారా రైతుల సమగ్ర సమాచారం అందుబాటులోకి రావడంతో వ్యవసాయ శాఖ సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంది. 15రోజుల్లో సర్వే పూర్తి... మండలంలో గత కొన్ని రోజులుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాము. ఒక్కొక్క ఏఈవో పరిధి లో 2వేల మంది రైతులు ఉన్నారు. ఈ లెక్క న 15రోజుల్లో సర్వే పూర్తి చేసి, తుది నివేదికలు సిద్ధం చేస్తాం. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం పథకలు అర్హులైన రైతులకు మాత్రమే అందేలా చూడటంతో పాటు, రైతులకు మరింత వేగవంతంగా, నాణ్యతతో సేవలిందవచ్చు. – వివేక్, ఏవో -
కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి
మచిలీపట్నం (చిలకలపూడి) : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కౌలు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు టీవీ లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో డెల్టా ప్రాంతంలో 80 శాతం, మెట్ట ప్రాంతంలో 50 శాతానికి పైగా భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏప్రిల్‌లోనే గుర్తింపుకార్డులు ఇవ్వటం కోసం గ్రామసభలు నిర్వహించినప్పటికీ కార్డులు ఇవ్వలేదన్నారు. జిల్లాలోని కౌలు రైతులందరికీ గుర్తింపుకార్డులు, పంట రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు మిత్ర, జాయింట్ లయబులిటీ గ్రూప్, కౌలు దారులకు వెంటనే రుణమాఫీ చేయాలని కోరారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కౌలుదారులకు వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నరసింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.రామచంద్రరావు, సీహెచ్ భాస్కర్, పి.రంగారావు, జిల్లా కమిటీ సభ్యులు సలీం, రామారావు, చలపతిరావు, ఎం.హరిబాబు, జి.నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు సీహెచ్ రవి, కేవీపీఎస్ నాయకుడు సాల్మన్‌రాజు పాల్గొన్నారు. -
రుణమాఫీ పేరిట దగా
అర్హులకు చేకూరని లబ్ధి ఉద్యానవన రైతులకు దక్కని ‘మాఫీ’ నూజివీడు రూరల్ : ఉద్యానవన రైతులకు రుణామాఫీ వర్తించకుండా ప్రభుత్వం నిబంధనల పేరిట మోసం చేస్తోందని పలువురు ఉద్యానవన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి, జామ, అరటి, బొప్పాయి, సపోట, దానిమ్మ, కూరగాయలు సాగు చేసిన రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేసినట్లు పాలకులు పదేపదే చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో తమకు న్యాయం జరగలేదని రైతులు అంటున్నారు. జిల్లాలో 6,897 మంది రైతులకు 15.05 కోట్ల మేర రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో ఉద్యాన రైతులకు ఆర్థిక ఇబ్బందులతో సావాసం తప్పడం లేదు. కొందరికే లబ్ధి 2013 ఏడాది లోపు ఉద్యానవన పంటలకు పంటరుణాలు తీసుకున్న వారందరూ రుణమాఫీకి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసిన ప్పటికీ లబ్ధిదారులకు న్యాయం జరగలేదు. జిల్లాలో కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే రుణమాఫీ వర్తింపజేసింది. లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో ఇబ్బందులు వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ రెండూ వేరు వేరు శాఖలు అయినప్పటికీ కుటుంబానికి లక్షన్నర లోపు రుణమాఫీ చేయడంతో చాలమంది రైతులు రుణమాఫీకి అనుర్హులయ్యారు. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను మాత్రమే ఉన్నతాధికారులు తమకు పంపారని, అర్హుల సమాచార సేకరణ పని తమకు అప్పగించలేదని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. -
పంట రుణమేదీ ?
ఇంకా ఖరారు కాని ప్రణాళిక ఖరీఫ్ సాగుకు రైతుల సమాయత్తం {పభుత్వ సాయం కోసం ఎదురుచూపులు హన్మకొండ: రోహిణి కార్తె ప్రవేశంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. వర్షం పడితే విత్తనాలు వేసేందుకు సమాయత్తమయ్యారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో ఇంకా ఖరీఫ్ పంట రుణ ప్రణాళిక సిద్ధం కాలేదు. జిల్లాలో దాదాపు ఏడు లక్షల మంది రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 5,02,819 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన వ్యవసాయ శాఖ.. ఈ మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా అధికార యంత్రాంగం, లీడ్ బ్యాంకు ఇప్పటికీ ఖరీఫ్ పంట రుణ ప్రణాళిక రూపొందించలేదు. ఏయే బ్యాంకులు ఎంత మంది రైతులకు, ఎంత విస్తీర్ణం మేరకు రుణాలిస్తాయో ఇప్పటి వరకు ప్రకటించలేదు. వర్షాలు సకాలంలో పడితే విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవడానికి, దుక్కులు దున్నడానికి డబ్బులు అవసరం కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అరుుతే బ్యాంకుల రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఏడాదికి 25 శాతం చొప్పున ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతల్లో 50 శాతం రుణ మాఫీ చేసింది. ఖరీఫ్ నాటికి మరో 25 శాతం రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరువు మండలాలు 11.. జిల్లాలోని 11 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అరుుతే వాస్తవానికి జిల్లా అంతటా కరువు నెలకొంది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయూరు. ఈ ఏడాదైనా వ్యవసాయానికి ఆర్థిక చేయూతనందించాల్సిన ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రుణ ప్రణాళిక ప్రకటించాలని, రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఖరీఫ్‌లో వరి 1.66 లక్షల హెక్టార్లు, జొన్న 168 హెక్టార్లు, మొక్కజొన్న 55 వేలు, పెసర 23 వేలు, మినుములు 1000 హెక్టార్లు, కందులు 12 వేలు, పత్తి 2.10 లక్షల హెక్టార్లు, మిర్చి 12 వేలు, పసుపు 15 వేల హెక్టార్లు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే పత్తి సాగును సగానికి తగ్గించి, ఇతర పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీంతో ఖరీఫ్ పంట అంచనా ప్రణాళికలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
దండిగా రుణం!
అన్నదాతకు శుభవార్త. యేటా రైతులకిచ్చే పంటరుణ లక్ష్యంలో తాజాగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అడిగిన ప్రతి రైతుకు రుణమివ్వాలనే ఉద్దేశంతో నాబార్డ్ కొత్తగా భారీ మొత్తాన్ని రుణ రూపంలో ఇచ్చేందుకు ఉపక్రమించింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. 2015- 16 వార్షిక సంవత్సరంలో జిల్లా రైతాంగానికి ఏకంగా రూ.2,185.16 కోట్ల రుణాలు ఇవ్వనుంది. వాస్తవానికి వార్షిక సంవత్సరం ప్రారంభంలో ఈ ఏడాది రుణలక్ష్యం రూ.730 కోట్లుగా జిల్లా యంత్రాంగం ఖరారుచేయగా.. తాజాగా నాబార్డ్ రూ.1,455.16 కోట్లను రుణ లక్ష్యానికి జోడిస్తూ.. వార్షిక రుణ ప్రణాళికను తిరిగి రూపొందించింది. - పంటరుణాల టార్గెట్ రూ.2,185.16 కోట్లు - వార్షిక రుణ ప్రణాళికను సవరించిన యంత్రాంగం - రూ.1,455.16 కోట్ల లక్ష్యాన్ని జోడించిన నాబార్డ్ సాక్షి, రంగారెడ్డి జిల్లా : పంట రుణ లక్ష్యాన్ని సవరించడంతో బ్యాంకుల టార్గెట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. రూ.2,185.16 కోట్ల రుణాలివ్వాల్సి ఉండడంతో రైతుల సంఖ్య, బ్యాంకుల పరిమితిని గణిస్తూ బ్యాంకుల వారీగా లక్ష్యాల్ని నిర్దేశించాయి. ఇందులో అధికంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు రూ.530.79 కోట్ల రుణాలివ్వాల్సిందిగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆతర్వాతి స్థానంలో జిల్లా కేంద్ర సహకారబ్యాంకు (హెచ్‌డీసీసీబీ)కి రూ. 509.77కోట్లు, ఆంధ్రాబ్యాంకు లక్ష్యం రూ. 479.07కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) రూ. 408.21 కోట్లు, కెనరా బ్యాంకు లక్ష్యం రూ.106.95 కోట్లుగా నిర్దేశించింది. ఇతర బ్యాంకులు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఖరీఫ్‌కు అందని ‘సవరణ’ ఫలం తాజాగా సవరించిన రుణలక్ష్యం తాలుకు ఫలాలు ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి పెద్దగా ప్రయోజనం చేకూరేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాగు చివరిదశకు చేరింది. మరోవైపు వార్షిక సంవత్సరం రెండో త్రైమాసికం కూడా ఈనెలాఖరుతో ముగియనుంది. ఈక్రమంలో సెప్టెంబర్ రెండో పక్షంలో రుణ వితరణ స్తబ్దుగా సాగుతుంది. దీంతో రుణాల పంపిణీ నెమ్మదించనుంది. ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ. 1,380.24 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా.. పావువంతు కూడా పురోగతి లేకపోవడం గమనార్హం. -
వడ్డీ వెనక్కి ఇప్పిస్తాం
రైతులకు మంత్రులు ఈటల, పోచారం హామీ సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలలోపు పంట రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తే వెనక్కి ఇప్పిస్తామని మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. పంట రుణాలపై కేంద్రం ఇచ్చే వడ్డీ రాయితీకి తోడు 4 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని... ఈ వడ్డీని రైతుల నుంచి వసూలు చేయవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వారు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో బ్యాంకర్ల కమిటీ భేటీ అనంతరం ఈటల, పోచారం మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు 80 శాతం పంట రుణాలు పంపిణీ చేయాలని తీర్మానం చేశామని, దీని పురోగతిపై ప్రతి వారం నివేదికలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించామని చెప్పారు. ఈ ఏడాది మొత్తం పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.25వేల కోట్లు కాగా.. ఖరీఫ్ లక్ష్యం రూ.18వేల కోట్లు అని, ఇందులో ఇప్పటివరకు రూ.7 వేల కోట్ల పంపిణీ జరిగిందని తెలిపారు. రుణమాఫీ పొందిన 35 లక్షల మందిలో 16 లక్షల మంది రైతులు తమ రుణాలు రెన్యువల్ చేసుకున్నట్లు చెప్పారు. రుణ మాఫీ పొందిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగం తరఫున రుణమాఫీ పత్రాలను అందజేసిందని... అదే తరహాలో రుణ విముక్తి పొందినట్లు ధ్రువీకరిస్తూ బ్యాంకుల నుంచి అనెక్సర్-ఎఫ్ పత్రాన్ని జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి మరింత ఆస్కారమున్నట్లుగా గుర్తించిన బ్యాంకర్లు ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళికను రూ.72,112 కోట్ల నుంచి రూ.78,776 కోట్లకు పెంచారని మంత్రి ఈటల చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని... రుణాల మంజూరుకే కాకుం డా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని కోరారు. వర్షాధారంపై వరి నాట్లు వేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారని... రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన వైపు బ్యాంకర్లు దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమలను ప్రోత్సాహించేం దుకు ప్రభుత్వం చేపడుతున్న సింగిల్ విండో విధానం, రాయితీలకు తోడుగా బ్యాంకర్లు సైతం రుణసాయం అందించాలని, అవసరమైతే రీ ఫైనాన్స్ చేయాలని అన్నారు. -
అంకెల్లో ఘనం...అందని రుణం
♦ బ్యాంకర్ల శల్యసారథ్యం ♦ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్‌కు నోచుకోని రైతులు ♦ అప్పుల కోసం తిప్పలు అంతా అంకెల గారడి..కాగితాల మీద అట్టహాసంగా రుణ ప్రణాళిక. రూ. వందలకోట్లు ఇచ్చినట్టు వివరాలు. బ్యాంకర్ల శల్యసారథ్యంతో అరక పట్టిన రైతుకు మాత్రం మిగులుతున్నది అప్పుల తిప్పలు. ప్రైవేటు వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు. ఇది జిల్లాలో అన్నదాతల దుస్థితి. ఎటువంటి అడంగల్ పత్రాలు లేకుండానే లక్ష వరకు పంట రుణం ఇవ్వాలని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఈ ఏడాది 2.65లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. జూన్‌లోనే తొలకరి పలుకరించడంతో కాడెపట్టిన రైతన్నపై కొంతకాలం వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో కమ్ముకొచ్చిన కరవును చూసి కలతచెందాడు. పదిరోజులుగా అడపాదడపా వర్షాలతో వ్యవసాయపనులు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు 75శాతం విస్తీర్ణంలో నాట్లుపడ్డాయి. వచ్చేనెల మొదటివారానికల్లా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు ఒక్కో రైతు రూ.10 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పంటచేతికొచ్చే సమయానికి మరో రూ. పదివేలవరకు అవసరమవుతుంది. తొలకరి జల్లుపడిన మొదలు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలుచేస్తూనే ఉన్నారు అన్నదాతలు. ఖరీఫ్‌లో రూ.840కోట్ల రుణాలు ఇవ్వాలని జిల్లా అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గతంలో ఎన్నడూలేని రీతిలో కేవలం రెండు నెలల్లోనే ఏకంగా రూ.605 కోట్లరుణాలిచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో రెండున్నర లక్షలమంది రైతులుండగా ఇప్పటి వరకు లక్ష మందికి ఈ రుణాలందినట్టు తెలుస్తోంది.పైగా ఇటీవల స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ రూ.24వేలకు పెంచినందున ఆ మేరకు గతంతో ఖరీఫ్‌తో పోలిస్తే ప్రతీరైతుకు రూ.ఐదు వేలకు పైగా అదనంగా రుణం అందిందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. గణాంకాలు ఇలా ఉంటే వాస్తవపరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీ వర్తించిన రైతుల్లో 70 శాతం మందికి తొలి విడత జమైన 20శాతం మాఫీ సొమ్ము పోను మిగిలిన అప్పు వడ్డీతో కలిసి తడిసి మోపడైంది. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో 85శాతం రుణమాఫీ వర్తించిన రైతులకు మిగిలిన బకాయిల రెన్యువల్‌కే సరిపోయాయి. పూర్తిగా రుణమాఫీ అయిన రైతులకు మాత్రమే కొత్త రుణాలు చేతికందాయి. కేవలం 15శాతం మాత్రమే కొత్త రైతులకు రుణాలందాయి. అంటే రుణాలు పొందిన లక్షమంది రైతుల్లో కేవలం 15వేల మందికి మాత్రమే ఫలితం దక్కింది. మిగిలిన వారిలో ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా చేతికంద లేదు. కాగితాల మీద మాత్రం వారికి రుణమిచ్చినట్టుగా చూపిస్తున్నప్పటికీ చేతికి చిల్లిగవ్వ అందని పరిస్థితి.. దీంతో వీరంతా అప్పుల కోసం వడ్డీవ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలుచేయాల్సిన దుస్థితి.ఎటువంటి అడంగల్ పత్రాలు లేకుండానే లక్ష వరకు పంట రుణం ఇవ్వాలని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నాయి. పైగా పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ తనఖా పెట్టుకునే కేవలం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.24వేలకు మించి రుణం ఇవ్వడం లేదు. బంగారు ఆభరణాలు కుదవపెట్టుకున్నా సరే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు మించి ఇవ్వడం లేదు. దీంతో ఇతర ఖర్చుల కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఉదాహరణకు..తనకు మాఫీ కాగా రూ.55వేల వరకు అప్పు ఉందని..ప్రస్తుతం తనకున్న రెండెకరాలకు కొత్త రుణం కోసం దరఖాస్తు చేస్తే రూ.48వేలుమంజూరు చేశారని..ఆ మొత్తం రెన్యువల్‌కే సరిపోయిందని. చేతికి రూపాయి రాలేదని చీడికాడకు చెందిన కొండబాబు అనే రైతు వాపోయాడు. తాను రూ.5ల వడ్డీకి 50వేలు అప్పు చేసి సాగు చేయాల్సి వస్తుందని వాపోయాడు. -
రైతుకు అప్పు పుట్టలేదు...
* చంద్రబాబు నిర్వాకంతో పడిపోయిన బ్యాంకు రుణాలు * రుణ మాఫీపై చంద్రబాబు సర్కారు మెలికలతో ఏపీ రైతులకు అప్పుల తిప్పలు * ఈ ఏడాది రుణాల లక్ష్యంలో నాలుగో వంతైనా ఇవ్వలేకపోయిన బ్యాంకర్లు * ఖరీఫ్, రబీ రుణ లక్ష్యం రూ. 56,019 కోట్లు.. ఇచ్చింది రూ. 13,789 కోట్లే * గత ఏడాది ఇదే సమయానికి రుణ లక్ష్యంలో 57.26 శాతం పంపిణీ * కౌలు రైతుల పరిస్థితి దారుణం.. రూ. 58.87 కోట్లే పంట రుణం * మహిళా సంఘాలకు రుణ లక్ష్యం రూ.13 వేల కోట్లు.. ఇచ్చింది 2 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణ మాఫీ మెలికల కారణంగా బ్యాంకు రుణాలకు రైతులు దూరమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సర్కారు ఇప్పటికి కూడా రైతుల రుణాల మాఫీ చేయకపోవడంతో.. బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేయడం లేదు. ఖరీఫ్ ముగిసిపోయి రబీ వచ్చినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. బ్యాంకులు గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసేవి. అలాంటిది ఇప్పుడు నిర్దేశించుకున్న వ్యవసాయ రుణ లక్ష్యంలో నాలుగో వంతైనా ఇవ్వలేకపోయారు. రుణ మాఫీ మాట దేవుడెరుగు.. గత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్‌లో రైతుల రుణాలకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ బ్యాంకులకు విడుదల చేయలేదు. అంతేనా.. కౌలు రైతులకు కానీ, మహిళా సంఘాలకు కానీ ఈ ఏడాది బ్యాంకుల నుంచి అందిన రుణాలు నామమాత్రంగానే ఉన్నాయి. చేనేత కార్మికులకు క్రెడిట్ కార్డుల జారీ పరిస్థితి కూడా అంతే. ఇక చేతి వృత్తుల సంఘాలకు, బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా మార్జిన్ మనీ పథకం, మత్స్యకారులకు రుణాలు వంటివేవీ ఈ ఏడాది ఒక్క పైసా కూడా ఆయా వర్గాలకు అందలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన 188వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. ఆ వివరాలివీ... లక్ష్యంలో పావు వంతైనా ఇవ్వలేదు.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలో కలిపి వ్యవసాయ రంగానికి 56,019 కోట్ల రూపాయలు రుణాలుగా మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ. 13,789 కోట్లు మాత్రమే బ్యాంకులు రుణాలుగా మంజూరు చేశాయి. ఖరీఫ్ రుణాలు సగమైనా అందలేదు..: ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట రుణాలుగా రూ. 25,888 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఖరీఫ్ ముగిసే నాటికి కేవలం రూ. 10,108 కోట్లు బ్యాంకులు మంజూరు చేశాయి. చంద్రబాబు సర్కారు రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలను మంజూరు చేయడం లేదు. కౌలు రైతులకు ఇచ్చింది రూ. 58 కోట్లే.. కౌలు రైతులకు రుణ మంజూరు మరీ దారుణంగా పడిపోయింది. డిసెంబర్ 4వ తేదీ నాటికి 33,979 మంది కౌలు రైతులకు కేవలం రూ. 58.87 కోట్ల మేర రుణాలే మంజూరయ్యాయి. ఈ రంగాలకు పైసా రుణమూ ఇవ్వలేదు... చేతి వృత్తుల సంఘాలకు బ్యాంకు రుణాలు మంజూరు కాలేదు. పది చేతి వృత్తుల సంఘాలకు రూ. 669 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో 2,349 మంది మత్య్సకారులకు రూ. 28.69 కోట్లు రుణంగాను రూ. 19.55 కోట్లు సబ్సిడీగాను ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ ద్వారా బ్యాంకు పథకాలకు నిధుల విడుదలను రాష్ట్ర విభజన నేపథ్యంలో నిలుపుదల చేసినట్లు బ్యాంకర్ల సమితి సమావేశంలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆర్థిక సహకార సంస్థల ద్వారా ఆయా వర్గాలకు రుణాలు మంజూరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. మహిళా సంఘాలకు ఐదో వంతే రుణాలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ మహిళా సంఘాలకు రూ. 13,791 కోట్లు రుణంగా మంజూరు చేయాలనేది లక్ష్యం కాగా.. కేవలం రూ. 2,028 కోట్లే మంజూరు చేశారు. 31,339 మంది చేనేత కార్మికులకు క్రెడిట్ కార్డులు జారీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా.. కేవలం 2,116 మందికే కార్డులు జారీ చేశారు. ‘వడ్డీ’ సొమ్ము ఇవ్వని సర్కారు చంద్రబాబు రుణ మాఫీ హామీతో చాలా మంది రైతులు రుణాలను చెల్లించకపోగా కొంత మంది మాత్రం రుణాలను సకాలంలో చెల్లించారు. అలాంటి రైతుల్లో లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుని తిరిగి సకాలంలో చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. లక్ష రూపాయలకుపైగా రుణం తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే పావలా వడ్డీ వర్తిస్తుంది. ఇలా తిరిగి చెల్లించిన వారికి బ్యాంకులు పావలా వడ్డీ, వడ్డీలేని నిధులను ఇవ్వాల్సిందిగా బ్యాంకులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరాయి. అయినా ప్రభుత్వంఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. బ్యాంకర్ల సమావేశం అంత గోప్యమా? భేటీకి మీడియాను దూరం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనలో తనను మించిన వారు లేరని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం బ్యాంకర్ల సమావేశం నిర్వహించిన తీరు అందుకు భిన్నంగా సాగింది. గతంలో జరిగిన సమావేశాలకు ఈసారి జరిగిందానికి పొంతనే లేకుండా పోయింది. వాస్తవానికి ఇది రొటీన్ సమావేశం. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మొదలు ఉన్నతాధికారుల వరకు అందరూ అదే మాట చెప్పినా గతానికి భిన్నంగా ఈసారి ఆ మీటింగ్ ఛాయలకే మీడియాను రానివ్వలేదు. అందరికీ అందజేసిన బ్యాంకు పత్రాలను గానీ, నివేదికను గానీ, చివరకు మాట్లాడిన అంశాలను గానీ మీడియాకు అందజేయలేదు. ఒక్క చంద్రబాబు ప్రసంగాన్నే ప్రసారం చేసుకోవాలని మీడియా పాయింట్ వద్ద ట్రాన్స్మిషన్ ఏర్పాటు చేసి, అది పూర్తయిన వెంటనే కనెక్షన్‌ను తీసివేశారు. గతంలో మీటింగ్ హాలులో స్థలం లేకపోవడంతో మీడియాను ఐదో అంతస్తులోని సైబర్ గంగ హాలులో కూర్చోమని చెప్పి బ్యాంకర్ల సమితి ప్రచురించిన నివేదికలను అందజేశారు. ఈసారి అదీ లేదు. మీటింగ్‌లోకి వస్తామంటే అభ్యంతరం చెప్పారే తప్ప ఎటువంటి సమాచారాన్ని అందజేయకుండా గోప్యత పాటించారు. -
ఇది మాఫీయా!
మాఫీ పత్రాల్లో మాయాజాలం రుద్రిపేట గ్రామానికి చెందిన ఖండాపు సుందరమ్మ ఆంధ్రా బ్యాంకులో రెండున్నర ఎకరాల భూమిపై రూ.50 వేల పంట రుణం తీసుకున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన రైతు సాధికార సదస్సులో ఆమెకు అధికారులు రుణ విముక్తి పత్రం అందజేశారు. రూ.50 వేల వరకు ఉన్న రుణం పూర్తిగా ఒకేసారి మాఫీ అవుతుందని అందులో ఉంది. అయితే తర్వాత పేరాలో మాత్రం సుందరమ్మకు రూ.3,749.21 రుణ విముక్తి లభించిందని.. అందులో మొదటి విడతగా రూ.749.50 బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు అదే పత్రంలో పేర్కొన్నారు. రూ.50 వేల లోపు ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించి పత్రంలోనే మొదటి విడతంటూ కేవలం రూ.750 జమచేయడం ఏమిటో అర్థం కాక ఆమె అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారూ సమాధానం చెప్పలేకపోతున్నారు. పాలకొండ: రుణమాఫీకి సంబంధించి మా వద్ద ఎలాంటి వివరాలు లేవు. ప్రభుత్వం నుంచి ఆదేశాలూ రాలేదు. రైతు సాధికార సదస్సుల్లో రుణమాఫీ పత్రాలు అందజేయమన్నారు. అంతకుమించి వివరాలు తెలియదు... - ఇది ఓ తహశీల్దార్ మాట జాబితాలు ఎలా తయారు చేశారో తెలియదు. మాకు వచ్చిన జాబితాలనే ప్రకటిస్తున్నాం. దీనిపై మార్గదర్శకాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం గ్రామాలకు వెళ్లాం. ఆన్లైన్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు.. - ఇవి ఓ వ్యవసాయాధికారి వ్యాఖ్యలు మా వద్ద ఆధార్ నమోదు చేసుకొనే అవకాశం లేదు. రుణమాఫీకి సంబంధించి వెబ్‌ల్యాండ్ సైట్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు వచ్చిన జాబితాలు ఎలా ఇచ్చారన్నది తెలియదు. రుణమాఫీ ఎవరికి వచ్చిందన్నది చెప్పలేం. ఇప్పటికే పలుమార్లు మేము ఆధార్, రేషన్ కార్డులు రుణ ఖాతాలకు అనుసంధానం చేశాం.. ఓ బ్యాంక్ మేనేజర్ స్పందన ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ విషయంలో అధికారుల్లో నెలకొన్న గందరగోళానికి పై వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. అనర్హుల జాబితాలో చేరిన మాట అటుంచితే.. మాఫీ వర్తించిన వారు కూడా ప్రభుత్వం చెబుతున్నదేమిటో.. తమకు అందుతున్న మాఫీ మొత్తం ఎంతో చూసుకొని కళ్లు తేలేస్తున్నారు. అధికారులు సైతం వీరికి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. రూ.50 వేల లోపు రుణాలు పూర్తిగా మాఫీ చేసేశామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం ఆన్లైన్లో జాబితాలు పెట్టింది. రైతు సాధికార సదస్సులు పెట్టి రుణవిముక్తి పత్రాలు అందజేయాలని ఆదేశించింది. ఆరు రోజులపాటు జరిగిన ఈ సదస్సులు మంగళవారంతో ముగిశాయి. ఈ సదస్సులతో అయినా రుణమాఫీపై స్పష్టత వచ్చిందా అంటూ అధికారుల నుంచి లబ్ధిదారులు, బాధితుల వరకు అందరి ముఖాల్లోనూ ప్రశ్నార్థకాలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ ఎవరికి ఇచ్చా రో, మిగతా వారికి ఎందుకివ్వలేదో ఎవరికీ అర్థం కాలే దు. అట్టహాసంగా తొలి విడత రుణమాఫీ జాబితా ప్రకటించినా.. అందులో 60 శాతం మంది రైతుల పేర్లు లేకపోవడంతో గత శుక్రవారం రాత్రి జాబితాలో చోటు ఎందుకు లేదో తెలియజేస్తూ మరో జాబితాను ఆన్లైన్లో పెట్టారు. దాన్ని పరిశీలిస్తే అంతా మాయగా కనిపిస్తోంది. రేషన్, ఆధార్ కార్డుల నెంబర్ల నుంచి రుణ మొత్తాల వరకు అన్నీ తప్పుల తడకలే. ఒకే రేషన్ కార్డు నెంబర్‌తో వందల మంది రైతుల పేర్లు ఉన్నా యి. ఒకే ఆధార్ నెంబర్‌తో పెద్ద సంఖ్యలో రైతుల పేర్లు నమోదై ఉన్నాయి. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే అంతా ఆన్లైనే. మా వద్ద ఎటువంటి వివరాలు లేవని సమాధానం వస్తోంది. మరికొంతమంది అకౌంట్లు నాట్ ఫౌండ్ అంటూ ఆన్లైన్లో పెట్టారు. వీటన్నింటిపైనా రైతులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సాధికార సదస్సుల్లో ఎక్కడికక్కడ అధికారులను నిలదీశారు. అయితే అప్పటికప్పుడు ఏదో సర్దిచెప్పడం తప్ప స్పష్టత గానీ, నిర్ధిష్ట హామీ గానీ ఇచ్చే స్థితిలో లేక అధికారులు సైతం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. టోల్‌ప్రీ ఎర్రర్ ఆన్లైన్లో మాఫీ జాబితా లు పెట్టిన ప్రభుత్వం రైతు ల సందేహాలు నివృత్తి చే యడానికంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రకటించింది. అయితే ఈ నెంబర్(1800-100322066) ఒక్కసారైన పని చేస్తే ఒట్టు. ఎన్నిసార్లు చేసినా ‘ఎర్రర్ ఇన్ కనెక్షన్’ అనే సమాధానమే వస్తోంది. దీంతో బాధిత రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
మంత్రులపై చంద్రబాబు ఫైర్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణమాఫీ ప్రక్రియపై సీఎం చంద్రబాబు మంగళవారం మంత్రివర్గ సహచరుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో చంద్రబాబు తన కేబినెట్లోని పలువురు మంత్రులతో భేటీ అయి... రుణమాఫీ అంశంపై చర్చించారు. అధికారంలోకి వచ్చి అరు నెలలవుతున్నా రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితా సిద్ధంకాక పోవడంపై చంద్రబాబు తన మంత్రులపై ఆగ్రహించారు. రుణమాఫీపై జాబితా సిద్ధమైందా అని ప్రశ్నించగా.... మంత్రుల నుంచి సరైన సమాధానం రాలేదు. దాంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ తొలి విడతలో రైతులకు ఎంత మొత్తం చెల్లించాలనే విషయంపై యనమల నేతృత్వంలో మంత్రులు సమావేశం కావాలని ఆదేశించారు. ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుని తన వద్దకు రావాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశంపై చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం మంత్రులతో అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేయనున్నారు. తాము అధికారంలోకి వస్తే... రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చారు. ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు అయినా ఆ హామీ అమలుకాకపోవడంపై ప్రతిపక్షాలు, రైతులు ప్రజల చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
'రుణమాఫీ జాప్యంతో రైతులు పంట బీమా కోల్పోయారు'
హైదరాబాద్ : రుణమాఫీ అమలు జాప్యం కావడంతో రైతులు పంట బీమాను కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... తెలంగాణలో ఇప్పటివరకు బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ కింద చెల్లించాల్సిన నగదు జమ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అన్నారు. ఓ వేళ ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఆ నిధులు విడుదల చేసిన వాటిని ప్రాసెస్ చేయడానికి 10 రోజులు పడుతుందన్నారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల వల్ల మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. ప్రభుత జాప్యం చేయడం వల్ల రైతులు పంట నష్టపరిహారాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఈ సమస్యపై బ్యాంకర్లతోనూ, కేంద్రంతోనూ మాట్లాడి రైతు లబ్ది చేకూర్చాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. రైతాంగాన్నితీవ్రంగా కుదిపేస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. -
'మావోయిస్టుల ఎజెండానే అమలు చేస్తున్నాం'
-
'మావోయిస్టుల ఎజెండానే అమలు చేస్తున్నాం'
హైదరాబాద్: వరంగల్‌లో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు శుభపరిణామనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుత్తూ.... గత ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. వచ్చే బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని విమర్శించారు. 2017 లోగా రాష్ట్రంలో కోతలు లేని కరెంట్ అందిస్తామన్నారు. అలాగే 2018 నాటికి రాష్ట్రంలో సరిపడ విద్యుత్ ఉంటుందన్నారు. పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్తున్నామన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ అనవర రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు ఈటెల రాజేందర్ హితవు పలికారు. విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం సూచన మేరకే మావోయిస్టులపై నిషేధం పొడిగించామన్నారు. తాము మావోయిస్టుల ఏజెండానే అమలు చేస్తున్నామన్నారు. మావోల అంశంపై అంతర్గత వేదికల్లో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. -
'నందిగామ ఉప ఎన్నిక ... టీడీపీకి ఓ హెచ్చరిక'
విజయవాడ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో రఘువీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై టీడీపీ ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామన్ని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో షరతు విధిస్తుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజూకు విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు. నందిగామ ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీకి 2 వేల నుంచి 24 వేల ఓట్లు పెరిగాయని అన్నారు. ఇది టీడీపీకి ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనున్న జన్మభూమి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పథకాలన్నింటికీ ప్రభుతం ఆధార్‌తో లింకు చేస్తోందని.... ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు తగ్గిస్తే ఊరుకోమని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరారెడ్డి హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సి.రామచంద్రయ్యలతోపాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎంత రుణం ఇవ్వొచ్చో అంతకే మాఫీ
-
ఎంత రుణం ఇవ్వొచ్చో అంతకే మాఫీ
బంగారం రుణాల మాఫీలో ఏపీ సర్కారు మరో మెలిక హైదరాబాద్: బంగారంపై పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షరతు విధించిం ది. మాఫీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రెండు రోజులకోసారి కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లా ల్లో పంట రుణాలకన్నా బంగారం కుదవపెట్టి తీసుకున్న పంట రుణాలు అత్యధికంగా ఉండటంతో వీలైనంతగా ఆ రుణ మాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తాజాగా మరో నిబంధన విధించారు. ఈ నేపథ్యంలో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న రైతులకు మాఫీ వెసులుబాటు అంతంత మా త్రంగానే దొరుకుతుందని, ప్రభుత్వంపై మాఫీ భారం తగ్గిపోతుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నారుు. ఏ పంటకు ఎంత మేర రుణం ఇవ్వాలో (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) అనే అంశంపై బ్యాంకర్లకు స్పష్టమైన నిబంధనలున్నారుు. ఈ నిబంధనల మేరకు తీసుకున్న రుణ మెుత్తాలకే మాఫీ వర్తింపజేయనున్నారు. అంటే బంగారం కుదవ పెట్టి ఎకరం వరి పంటకు లక్ష రూపాయలు రుణం తీసుకున్నప్పటికీ.. నిబంధనల ప్రకారం ఎకరం వరి పంటకు ఎంతమేరకు రుణం ఇవ్వవచ్చో.. అంత మేరకే రుణ మాఫీ వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. ఒకవేళ ఎకరం వరి పంటకు రూ.25 వేలు మాత్రమే రుణం మంజూరు చేయాలనే నిబంధన ఉండి.. రైతు లక్ష రూపాయల రుణం తీసుకున్నాడనుకుంటే.. రూ.25 వేల రుణం మాత్రమే మాఫీ అవుతుంది. మిగతా రూ.75 వేలు రైతులే బ్యాంకులకు చెల్లించుకోవాల్సి ఉంటుం దని అధికార వర్గాలు వివరించాయి. ఇతర పంటల విషయంలోనూ ఇదే నిబంధన అమలవుతుంది. ఈ నేపథ్యంలో బంగారం కుదవపెట్టి ఎన్ని ఎకరాల్లో ఏ పంటపై రుణం తీసుకున్నారు, ఆ పంటకు ఎకరానికి ఎంత రుణం మంజూరు చేయాలి.. వివరాలను రుణమాఫీ నమూనా పత్రంలో నింపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు నమూనా పత్రంలో భూ విస్తీర్ణం, సర్వే నంబరు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర అంశాలను చేర్చారు. బ్యాంకులు ఈ నెల 25వ తేదీ వరకు వివరాలు ఇచ్చేందుకు వీలుగా గడువును పొడిగించారు. -
ఫాక్స్ మెసేజ్‌లతో రుణమాఫీ ఆగుతుందా?
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు ఫ్యాక్స్ మెసేజ్‌లు పంపితే రుణమాఫీ ఆగుతుందా అని ఆయన ప్రశ్నించారు. చేతకానమ్మకు చేష్టలు మొండు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రఘువీరా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రైతులపై బాబుకు కనికరం లేదా అని ఆయన ప్రశ్నించారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో రైతులు నలిగిపోతున్నారని, రాష్ట్రంలో 2003 పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని రఘువీరా అన్నారు. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని రఘువీరా అభిప్రాయపడ్డారు. రుణాలు కట్టొద్దని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారని, ఇప్పుడెందుకు రుణమాఫీ నుంచి జారుకుంటున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు, కేసీఆర్‌ల వైఖరిని రఘువీరా ఖండించారు. ఎంసెట్ వ్యవహారంలో రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇద్దరు సీఎంలు తమ మంత్రులను అదుపులో ఉంచుకోవాలని రఘువీరా సూచించారు. ఎవరెవరికి ఫీజులు కట్టాలో రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా ఉందన్నారు. సమైక్య ఉద్యమంలో ధ్వంసమైన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. -
ఖరీఫ్ ఖతమేనా?
* కరుణించని వరుణుడు * రుణాలపై నోరు మెదపని సర్కారు * రైతులపై దయచూపని బ్యాంకులు * ఖరీఫ్ ఖతమేనా? తొందరగా పలకరిస్తుందని ఊరించిన తొలకరి చినుకులు రోజులు గడుస్తున్నా జాడలేదు. అపుడపుడు కారుమబ్బులు దోబూచులాడుతున్నాయి కానీ వరుణుడు కరుణించలేదు. మరోవైపు బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటం లేదు... ఫలితంగా ఇప్పటికీ కూడా జిల్లాలో నారుమళ్లు ఊపందుకోలేదు. మొత్తంగా ఖరీఫ్ ఆలస్యమయ్యే పరిస్ధితి. సాగు ఆలస్యమైతే దిగుబడులు తగ్గడం ఖాయమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ఉత్తరాంధ్ర జిల్లా, ఒక మధ్యకోస్తా జిల్లా, ఒక దక్షిణ కోస్తా జిల్లా, ఒక రాయలసీమ జిల్లాల్లో పరిస్థితేమిటో చూద్దాం. పశ్చిమ గోదావరిః గత అయిదేళ్లగా పశ్చిమ గోదావరి రైతులకు కష్టాలే కష్టాలు. ప్రతీ ఏటా ఖరీఫ్ సాగు నష్టాల పాలవుతోంది. నీలం తుఫాన్ తాలూకు నష్ట పరిహారం నేటికీ రైతులకు పూర్తిగా అందలేదు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 2.5 లక్షల హెక్టార్లలో వరిపంట పండించాల్సి ఉంది. జూలై నెలాఖరు వచ్చినా సాగు ముందుకు సాగటం లేదు....జూన్ మొదటి వారంలో ప్రవేశించవలసిన తొలకరి రుతుపవనాలు ముఖం చాటేయడంతో సాగు ఆలస్యమయ్యే స్ధితి వచ్చింది. ఇప్పటి వరకు 40 వేల హెక్టర్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. విజయనగరం: జిల్లాలో సాధారణం కంటే 16 శాతం తక్కువ వర్షపాతంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే జిల్లాలో ఎనభైశాతానికి పైగా కేవలం వర్షాధార భూములే. ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.06 లక్షల హెక్టార్లలో వరి పండిస్తారు. ప్రకాశం: జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి ప్రతికూలతతో పంటలు సాగుచేయలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా జూన్‌లో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే... ఈ ఏడాది కేవలం 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది జూలైలో 89.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈ ఏడాది 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేయలే పరిస్థితి నెలకొంది. అనంతపురం: జిల్లాలో మరోసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కోటి ఆశలతో ఖరీఫ్ పనులు ప్రారంభించిన రైతన్నలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 16 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 47 మండలాల్లో ఏరువాక ముందుకు సాగటం లేదు. జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో సుమారు 25 లక్షల ఎకరాల్లో వేరుసెనగ పంట సాగు చేస్తారు. ఇప్పటిదాకా కేవలం అన్ని పంటలు కలిపి మూడు లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవగా... 2. 32 లక్షల హెక్టార్ల వేరుసెనగ పంట మాత్రమే సాగైంది. -
తొలిసంతకం ..తూచ్చేనా..?
‘కాకి బావా ... నీ అరుపే ఆహ్లాదం ... నీవు రాగం అందుకుంటే ఆహా అద్భుతం ... ఇక పాట పాడితే మైమరిచిపోవల్సిందే ... ఈ అడవిలో నీ కేకే కోకిల రాగం ... ఒక్కసారి గొంతెత్తి కొంగొత్త ఆలాపన చేయు మిత్రమా’ అని చెట్టుపైనున్న కాకినుద్దేశించి నక్క బావ అనడంతో పాపం ఆ కాకి ‘కావ్’ మంటూ కర్ణకఠోరంగా అడవి అదిరిపోయేట్టు అరిచింది. అంతే అడవంతా తిరిగి సంపాదించికున్న మాంసం ముక్క నోటి నుంచి జారిపడి కిందపడిపోయింది. కింద పడిన మాంసం ముక్కను నోట కరుచుకొన్న నక్క ఎంచక్కా గంతులేస్తూ అడవి దాటిపోయింది. ఈ కథ చందమామ పుస్తకంలో చదివినట్టుగా ఉంది కదూ. ఔనండీ ... ఈ ముచ్చటనే మన చంద్రన్న పాలనకు అన్వయించుకుందాం. నక్క బావలానే చంద్రబాబు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుణమాఫీ అనే మాయమాటలు చెప్పి ... ఎండమావుల్లాంటి హామీలిచ్చారు. కాకినోటనన్ను మాంసం ముక్కలాంటి ఓట్లను రైతన్నల వద్ద నుంచి దండుకొని ఆచరణకు వచ్చేసరికి మాట మార్చి కష్టాల్లో ఉండే కర్షకులకు కన్నీళ్లనే మిగుల్చుతున్నారు. బ్యాంకు నుంచి నోటీసులు వచ్చినా ... బెదిరింపులకు దిగుతున్నా అవసరం తీరాక తెప్ప తగలేసిన చందంగా నారా వారు నోరు తెరవడం లేదు. సాక్షి, ఒంగోలు: దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం దారంవారిపాలేనికి చెందిన మంచాల నారాయణరెడ్డి రెండెకరాల సాగు కోసం తూర్పుగంగవరం ఆంధ్రా బ్యాంకు బ్రాంచిలో పంటరుణం రూ.60 వేలు తీసుకున్నాడు. టీడీపీ నేతల మాటలు నమ్మి బ్యాంకు రికవరీ చెల్లించకపోవడంతో, నేడు కోర్టు నుంచి నోటీసు అందుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే బయట తెచ్చిన అప్పులు తీర్చలేక నానాయాతన పడుతోన్న క్రమంలో... బ్యాంకు కోర్టు నోటీసులివ్వడంతో తన పరిస్థితేంటని దిగాలు పడుతున్నాడు. * కనిగిరి నియోజకవర్గం పిల్లివారిపల్లెకు చెందిన రైతు మేకల బాలయ్య కూడా పంట రుణానికి సంబంధించి బ్యాంకు నోటీసు అందుకున్నాడు. ఎకరా పొలం సాగు పెట్టుబడికి ఏడు సవర్ల బంగారం తనఖాపెట్టి రుణం తీసుకున్నాడు. వర్షాభావ పరిస్థితులతో పంట చేతికి రాలేదు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ పథకంతో బాకీ తీరుతుందనుకున్నాడు. ఆ రైతు భవిష్యత్ ప్రణాళిక తిరగబడింది. బాబు తొలిసంతకం తూఛ్..అంటూ రికవరీ లేకుంటే ఆభరణాలు వేలం వేస్తామని పినాకినీ బ్యాంకు నోటీసు పంపింది. ఉన్న ఒక్క బర్రెను అమ్మి వడ్డీనైనా చెల్లించి.. అసలు మొత్తానికి వాయిదా కోరుదామనే ఆలోచనలో ఉన్నాడు. ఇలా ఒక్కో రైతుది ఒక్కో ఆవేదన. చంద్రబాబు శుష్క వాగ్దానాలు నమ్మి ఓటేసిన పాపానికి..ఇంతకాలం పరువుగా బతికిన కుటుంబాలు వీధికెక్కుతున్నాయి. ఓటేసి గెలిపిస్తే..పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పడంతో..రుణాలు కట్టకుండా మాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు రుణాలు వెంటనే తీర్చాలంటూ వస్తున్న బ్యాంకు నోటీసులు షాకిస్తున్నాయి. ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ అమలుపై పూటకోమాట చెబుతుండటంతో పాటు... బ్యాంకర్ల నోటీసుల జారీ దూకుడును నియంత్రించలేకపోతోంది. పొగాకు రైతుల పంట అమ్మకం డబ్బులు వారి ఖాతాల నుంచి అప్పులకింద జమ చేసుకుంటున్నట్టు బ్యాంకులు ప్రకటిస్తున్నా... కనీసం, రైతులపక్షాన ప్రభుత్వం నిలబడి బ్యాంకర్లతో మాట్లాడి భరోసానిచ్చే ధైర్యం చేయలేకుంది. రుణమాఫీ అమలుపై కమిటీలు వేశామంటూ కాలయాపన చేస్తూనే.. ఈసారికి రుణాల రీషెడ్యూల్ చేద్దామనే ప్రకటనలతో రైతులు నిండామునిగే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే కిందటి ఆర్థిక సంవత్సరం తీసుకున్న పంటరుణాల రికవరీ గడువు తీరిపోవడంతో.. ప్రభుత్వ వడ్డీరాయితీ వర్తించకపోగా, 7 శాతం వడ్డీకాస్తా 11.75 శాతం రుణం తీసుకున్న నాటినుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలో అన్ని మండలాల్లో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, పినాకినీ, యూనియన్ బ్యాంకు తదితర శాఖలు రైతులకు నోటీసులిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుండగా, ప్రస్తుతం బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు సగానికిపైగా ఉన్నారు. జిల్లాలో జాతీయ బ్యాంకుల రుణాలు మొత్తం రూ.5,600 కోట్లు మాఫీకావాల్సి ఉండగా, సహకారబ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మరో రూ.488.67 కోట్ల మేర మాఫీకావాల్సి ఉంది. బంగారం ఆభరణాలు తాకట్టుపెట్టి పంటరుణాలు తీసుకున్న వారు జిల్లాలో 1.30 లక్షల మంది రైతులుండగా, మాఫీకావాల్సిన రుణ మొత్తం రూ.1300 కోట్లుగా బ్యాంకర్లు తేల్చారు. వేలంలో ఆభరణాలు పోతాయని రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. నోటీసుల వెల్లువ.. * యర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లో దాదాపు 45 వేల మంది రైతులు పంట, బంగారం తాకట్టు రుణాలు తీసుకున్నారు. బంగాం తాకట్టుపెట్టి లక్ష రూపాయలకు పైబడి రుణాలు తీసుకున్న రైతులకు పెద్దారవీడు, పుల్లలచెరువు మండలాల్లో 66 మందికి బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. * సంతనూతలపాడు నియోజకవర్గంలో రైతుల బకాయిలన్నీ కలుపుకొని దాదాపు రూ.160 కోట్లు ఉంటాయని అంచనా. పంట రుణాలు, డ్వాక్రామహిళల రుణాలు, బంగారం రుణాలు తీసుకున్న వారు నాలుగు మండలాల్లో సుమారు 18 వేల మంది వరకు ఉంటారు. వారిలో ఇప్పటికే చీమకుర్తి ఆంధ్రాబ్యాంక్ గత నెల 16వ తేదీన 119 మంది రైతులకు రూ.80 లక్షల విలువ చేసే రుణాలను చెల్లించాలని నోటీసులిచ్చింది. * కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోనే ఐఓబీ బ్యాంకు 300 మంది రైతులకు, పినాకినీ బ్యాంకు 500 మందికి నోటీసులు జారీ చేసింది. ఇదేవిధంగా దర్శి, పర్చూరు, చీరాల, కందుకూరు, కొండపి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో పాటు ఒంగోలు రూరల్ ప్రాంత రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. బాధితులంతా ఈ నోటీసులకు సమాధానం చెప్పలేక, తమ తరఫున భరోసానిచ్చే నాథుడు లేక.. గోదాముల్లో పంట నిల్వలు, బంగారం ఆభరణాలు వేలంలో పోగొట్టుకోవాల్సి వస్తోందని బెంబేలెత్తుతున్నారు. -
ఆంధ్రా సర్కార్ తొండాట
-
ఏదీ ఆ ‘ధీమా’?
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: జాతీయ వ్యవసాయ భీమా పథకం 2000-01 నుంచి కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్నప్పటికీ దానికి కొత్త ఊపిరినిచ్చింది మాత్రం దివంగత మహానేత వైఎస్ రాజశే ఖరరెడ్డే. ఎప్పుడైతే వైఎస్ఆర్ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని దేశంలోనే తొలిసారి మనరాష్ట్రంలో అమలు చేశారో అప్పటి నుంచి ఈ పథకం సత్ఫలితాలు ఇవ్వసాగింది. నేటి పాలకులు ఈ బీమా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కరువుకాటకాలొచ్చినా బీమా పొందలేని స్థితికి ఈ పథకాన్ని దిగజార్చారు. గ్రామం యూనిట్‌గా చేసిన తర్వాత లక్షలాది మంది రైతులు అదనంగా బీమా పరిహారం పొందారు. బ్యాంకులు, కో-ఆపరేటివ్ సంఘాల నుంచి పంటల బీమా పథకంలో ప్రతిపాదించిన పంటలకు రుణం తీసుకున్న రైతులందరికీ బీమా వర్తిస్తుంది. పంట రుణం మంజూరు చేసేటప్పుడు బీమా ప్రీమియం మినహాయిస్తారు. పంట రుణం తీసుకోని రైతులు, కౌలు రైతులు కూడా పంటల బీమా చేసుకోసుకునే విధంగా నిర్ణయించారు. తొలుత మండలం యూనిట్‌గా బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ విధానంలో ప్రతిపాదించిన ప్రకారం కనీసం 2000 హెక్టార్లలో పంట సాగు చేయాలి. అప్పుడే దాన్ని ఒక యూనిట్‌గా పరిగణలోకి తీసుకునేవారు. అంతకన్నా తక్కువ ఉంటే పక్క మండలాన్ని కలుపుకొని బీమా యూనిట్‌గా నిర్ణయించారు. ఈ విధానంతో పంట నష్టపోయిన రైతులకు సరైన న్యాయం జరిగేది కాదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పథకంలో విధానపరమైన మార్పులు తెచ్చారు. పంట బీమా చేసుకున్న రైతు ఆ బీమాపై నమ్మకం ఉండే విధంగా గ్రామాన్ని యూనిట్‌గా చేస్తూ పథకంలో మార్పు తీసుకువచ్చారు. ఈ పథకం అమలులో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. మహానేత కృషి ఫలితంగా పథకం అమల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. బీమా చేసిన పంటల విస్తీర్ణంలోనూ తొలిస్థానాన్ని ఆక్రమించింది. అత్యధిక మొత్తం బీమా పరిహారం చెల్లింపుల్లోనూ మొదటిస్థానమే. మహానేత మరణం తరువాత పథకానికి తూట్లు పడ్డాయి. 2010-11 సంవత్సరంలో ఈ పథకంలో సవరణలు చేశారు. బీమా వర్తింపునకు అనేక ని‘బంధనాలు’ విధించారు. జిల్లాలో ఒక ముఖ్యమైన పంటను గ్రామం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయించారు. అదికూడా అనావృష్టి సంభవిసే..్త పంట వేయలేక పోతే కేవలం 25 శాతం బీమా వర్తింప చేసే విధానాన్ని ముందుకు తెచ్చారు. ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టం సంభవిస్తే వచ్చే పరిహారంలో 25 శాతం రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని పథకంలో మార్పు తెచ్చారు. పంట నష్టాలను గత ఏడు సీజన్లకు సంబంధించి సరాసరి దిగుబడులను తీసుకొని లెక్కించే విధానాన్ని అమలు చేసే విధంగా మార్పులు తీసుకొచ్చారు. జాతీయ వ్యవసాయ బీమా పథకం పరిధిలోని పంటలు.. ఖరీఫ్: వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుములు, కందులు, పెసలు, సోయాచిక్కుడు, వేరుశనగ (నీటి ఆధారం), వేరుశనగ వర్షాధారం, పొద్దుతిరుగుడు, ఆముదం, చెరకు (మొక్క), చెరకు (కార్శి), పత్తి (వర్షాధారం), పత్తి (నీటి ఆధారం), మిరప (వర్షాధారం), మిరప (నీటి ఆధారం), పసుపు, కొర్ర రబీ: వరి, జొన్న, మొక్కజొన్న, మినుములు, పెసలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఎర్ర మిరప, ఉల్లి, శనగలు గ్రామం యూనిట్‌గా బీమా పథకాన్ని వర్తింప చేయకుండా జిల్లాలో ప్రధాన పంటను మాత్రమే గ్రామం యూనిట్‌గా పరిగణలోకి తీసుకొని మిగిలిన పంటలను గతంలో మాదిరిగానే మండలం యూనిట్‌గా అమలు చేసేలా పథకాన్ని సవరించారు. ఈ విధానం అమల్లోనూ అనేక మార్పులు తీసుకురావటంతో పథకంపై రైతులకు నమ్మకం పోయింది. ఖరీఫ్ పంట విస్తీర్ణం దాదాపు నాలుగు లక్షల హెక్టార్లు కాగా 1.67 లక్షల హెక్టార్లలో పత్తి, 1.38 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. గ్రామం యూనిట్‌గా కేవలం వరి పంటను మాత్రమే ఎంపిక చేశారు. మండలం యూనిట్‌గా మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, చెరకు పంటలను ఎంపిక చేశారు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిని గ్రామం యూనిట్లో గానీ, మండలం యూనిట్లో గానీ పరిగణించలేదు. రబీ సీజన్లో గ్రామం యూనిట్‌గా ఏ ఒక్క పంటా లేదు. మండలం యూనిట్‌గా జిల్లాలో వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, వేరుశనగ మిరప పంటలను మాత్రమే ఎంపిక చేశారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం పంట దిగుబడి ఆధారంగా కాకుండా వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలి ఉధృతి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని వాతావరణ బీమా పథకాన్ని రైతు ప్రయోజనం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 2009 ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రస్తుత పాలకులు ఈ పథకంపై అంత శ్రద్ధ చూపటం లేదు. కాగితాల్లో మాత్రం లెక్కలు చూపుతోంది. వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఖరీఫ్కాలంలో జిల్లా నుంచి పత్తి, మిరప, ఆయిల్ఫామ్ను ఎంపిక చేశారు. ఇదే పథకం కింద మామిడిని రబీ సీజన్‌కు ఎంపిక చేశారు. బీమా పథకం అమలు విధానం.. నష్ట పరిహారం అంచనాలను నిర్దేశించిన ప్రాంతాల (మండలం/గ్రామం) ఆధారంగా అంచనా వేస్తారు. బీమా చేసిన పంట హామీ దిగుబడి కన్నా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన సరాసరి దిగుబడి తగ్గితే..తగ్గుదల శాతాన్ని బట్టి ఆ మండలంలో బీమా చేసిన రైతుల పంటలకు నష్టపరిహారం లభిస్తుంది. ఈ నష్టపరిహారాలను బ్యాంకు ఖాతాలోనే వేయాలి. జిల్లా సహకారబ్యాంక్, గ్రామీణ వికాసబ్యాంక్, వాణిజ్యబ్యాంక్ల నుంచి ప్రతిపాదిత పంటకు రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం తప్పనిసరిగా వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి 2005లో మహానేత ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం రైతుల్లో మనోస్థైర్యాన్ని నింపింది. పంటనష్టాలు సంభవిస్తే రెండు నెలల్లో పంట నిర్దిష్టమైన హామీ దిగుబడి కన్నా తగ్గితే నష్టపరిహారం చెల్లించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీమా చెల్లింపుల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి. 2005 నుంచి 2009 వరకు నిర్దేశించిన విధంగా బీమా మొత్తాన్ని చెలించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. రైతుల నుంచి ప్రీమియం నిర్దేశించిన ప్రకారం వసూలు చేస్తున్నారు కానీ చెల్లింపులో వివిద సాకులు చూపుతూ తక్కువగా చెల్లిస్తున్నారు. బీమా చెల్లింపుల్లో బాగా జాప్యం అవుతోంది. 2008-09లో జిల్లాలో పంటనష్టాలు అంతగా లేవు. అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన వారికి బీమాను వర్తింపచేశారు. ఆ ఏడాది రూ.72.76 లక్షలు బీమా కింద పంట నష్టపోయిన రైతులకు అందించారు. 2009-10లో జిల్లాలో రూ.10.79 కోట్లు రైతులకు చెల్లించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి మరణానంతరం 2011-12 లో అనావృష్టి నెలకొంది. అయినా జిల్లాలో పంటల బీమా నష్టాన్ని అతి తక్కువగా చేసి చూపించారు. కేవలం 10,749 మంది రైతులను మాత్రమే బీమా పథకానికి ఎంపిక చేశారు. ఈ రైతులకు కూడా నిబంధనల ప్రకారం బీమా మొత్తాలు చెల్లించకుండా అందులో నాల్గో వంతును మాత్రమే చెల్లించారు. రూ.41.60 కోట్లు బీమా మొత్తం కాగా వీటిలో కేవలం రూ.12.55 కోట్లు మాత్రమే చెల్లించారు. 2012 తరువాత బీమా లెక్కలను ఇంకా తేల్చలేదు. పంట ఎండినా రైతు నష్టపోకుండా మహానేత గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రూపొందించిన పంటల బీమా పథకం నీరుగారిపోతుంది. -
తిరకాసు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లించిన రైతులకు వడ్డీ మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై తర్జనభర్జనలు పడి ఖరీఫ్ సీజన్‌కు బ్యాంకర్లు అమలు చేశారు. నిబంధనల ప్రకారం సీజన్‌తో సంబంధం లేకుండా రైతులందరికీ దీనిని వర్తింపజేయాలి. అయితే ఇక్కడే బ్యాంకర్లు తిరకాసు పెడుతున్నారు. రబీసీజన్‌కు సంబంధించి అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి బ్యాంకర్ల నిబంధనల ప్రకారం రబీ సీజన్ మొదలైంది. ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు, పెద్దశెట్టిపల్లె, దొరసానిపల్లె, రేగుళ్లపల్లె, తాళ్లమాపురం, ఎర్రగుంట్లపల్లె, రంగసాయిపురం, కొత్తపేట, నంగనూరుపల్లె, కాకిరేనిపల్లె, శంకరాపురం, నరసింహాపురం, చౌటపల్లె, సీతంపల్లె, సోములవారిపల్లె, బొల్లవరం గ్రామాలతోపాటు ప్రొద్దుటూరులోని 36, 38 వార్డులు కూడా ఎస్బీఐ వ్యవసాయాభివృధ్ది బ్యాంకు పరిధిలో ఉన్నాయి. పట్టణంలో వ్యవసాయాభివృద్ధి శాఖ ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ బ్యాంక్ పరిధిలో సుమారు 6వేల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ కే భూషణంను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తమకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మాత్రమే ఆదేశాలు వచ్చాయని తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి మళ్లీ ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. కడపలోని బ్యాంక్ రీజినల్ కార్యాలయం అధికారులను వివరణ కోరగా ఇదే విషయాన్ని తెలిపారు. జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ వీరారెడ్డిని ఫోన్లో వివరణ కోరగా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.