'మావోయిస్టుల ఎజెండానే అమలు చేస్తున్నాం' | etela-rajender-takes-on-opposition-parties-due-to-crop-loan-and-electricity-power-cut | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 26 2014 6:23 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

వరంగల్లో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు శుభపరిణామనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుత్తూ.... గత ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. వచ్చే బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని విమర్శించారు. 2017 లోగా రాష్ట్రంలో కోతలు లేని కరెంట్ అందిస్తామన్నారు. అలాగే 2018 నాటికి రాష్ట్రంలో సరిపడ విద్యుత్ ఉంటుందన్నారు. పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్తున్నామన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ అనవర రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు ఈటెల రాజేందర్ హితవు పలికారు. విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం సూచన మేరకే మావోయిస్టులపై నిషేధం పొడిగించామన్నారు. తాము మావోయిస్టుల ఏజెండానే అమలు చేస్తున్నామన్నారు. మావోల అంశంపై అంతర్గత వేదికల్లో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement