telangana finance minister
-
కాంగ్రెస్, టీడీపీలపై ఈటల ఫైర్
హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీలపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రెండు పార్టీలు మిడ్‌మానేరు ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులను పట్టించుకోని చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఎద్దేవా చేశారు. రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. అయితే మా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకోవాలని ఆ రెండు పార్టీలకు ఈటల హితవు పలికారు. -
చంద్రబాబు ఆ పనులు ఆపట్లేదు: ఈటల
తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే పనులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా ఆపడం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ పంట పొలాలకు నీళ్లు రాకూడదని ఢిల్లీలో సమావేశం ఏర్పాటుచేశారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తే మాత్రం ప్రజలు వాళ్లను క్షమించరని రాజేందర్ చెప్పారు. ఇక చేనేత కార్మికుల రుణాలన్నింటినీ రద్దు చేస్తామని తెలిపారు. -
'అమిత్ షా చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే'
హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర శనివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. అమిత్ షా నల్గొండ జిల్లా సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే అని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదన్నారు. కేంద్రం... తెలంగాణకు 90 వేల కోట్లు ఇచ్చామని చెప్పడం అబద్ధమన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం రూ. 36 వేల కోట్లు మాత్రమే అని ఈటల చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే పేర్కొన్నారని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గుర్తు చేశారు. -
'సీఎం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా బడ్జెట్'
హైదరాబాద్: వాస్తవిక అంచనాలతో కొత్త రూపంలో తెలంగాణ బడ్జెట్ తీసుకువస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ఈటల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షి మీడియాతో రాజేందర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ... తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నది మేము కాదని... ఆర్థిక సంఘమే ఆ విషయాన్ని వెల్లడించిందని చెప్పారు. తమ ప్రభుత్వం దుబారా తగ్గించుకుంటుందన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను పెంచుతామని వెల్లడించారు. సీఎం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఈ బడ్జెట్ రూపొందించినట్లు ఈటల పేర్కొన్నారు. భూముల విక్రయం ద్వారా గతేడాది అనుకున్న ఆదాయం రాలేదన్నారు. కానీ, ప్రస్తుతం బూమ్ పెరిగిందని.... ఈసారి మరింత ఆదాయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాలను సమీక్షిస్తామన్నారు. తెలంగాణలో వేలాది ఎకరాలు ఆక్రమిత భూములున్నాయని... వాటిని అన్నింటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఎన్నుల ఎగవేతను తగ్గిస్తాం.. ఆదాయాన్ని భారీగా పెంచుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంగా విడిపోయి అభివృద్ధి సాధిస్తామని గతంలో అన్న మాట నిజమైందన్నారు. ఏపీ అభివృద్ధి చెందితే తమకు సంతోషమే అని చెప్పారు. ఉద్యమ సమయంలో వేగంగా ఉన్నా... ప్రస్తుతం ఆలోచనతో పని చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం లేదని ఈటల రాజేందర్ తెలిపారు. -
గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద స్టోర్
హైదరాబాద్: ఈ కామర్స్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలంగాణలో భారీ స్టోర్‌ను ప్రారంభించింది. మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి గ్రామంలో ఫ్లిప్ కార్ట్ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ బ్రాంచ్ ను ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్ స్టోర్ ల సంఖ్య 17కు చేరాయి. మొత్తం 2.2లక్షల చదరపు అడుగుల వెడల్పులో 5.89లక్షల క్యూబిక్ అడుగుల సామర్థ్యంతో భారీ స్థాయిలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్లిప్ కార్డ్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ మాట్లాడుతూ తెలంగాణ ఈ కామర్స్ ను విస్తరింపజేయడానికి అనువైన ప్రాంతమని, అందుకే తాము కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించామని చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 17 వేలమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇక ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థ తన బ్రాంచీని స్థాపించడం సంతోషంగా ఉందని, ఈ సంస్థను చూసి మరిన్ని సంస్థలు తెలంగాణలో వ్యాపార సంస్థలు స్ధాపించేందుకు అనుకూలంగా ఉందని వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
'రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి డోఖా లేదని ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ బుధవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని వస్తున్న వార్తలు కేవలం కట్టుకథలే అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఉన్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో గుజరాత్ ఉంటే ఆ తర్వాత స్థానం తెలంగాణదే అని ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి భేష్‌గా ఉందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిందన్న విషయాన్ని మంత్రి ఈటల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆదాయ పన్ను శాఖ ఒకేసారి రూ. 1250 కోట్లను జమ చేసుకోవడం కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. ఆ నగదు వెనక్కి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కేంద్రంలో సంప్రదిస్తున్నామని ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందంటూ ఇటీవల మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దాంతో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బుధవారం పైవిధంగా స్పందించారు. -
ఈటెల రాజేందర్ కారు బోల్తా.. గాయాలు
-
ఈటల రాజేందర్ కారు బోల్తా.. గాయాలు
మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా... శనివారం సాయంత్రం మానకొండూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఓ టిప్పర్‌ను ఓవర్టేక్ చేయబోతూ దాన్ని తాకడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి రాజేందర్‌కు కాలుకి, ఛాతీ భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్‌మెన్ కూడా గాయపడ్డారు. వారిని ఎస్కార్ట్ వాహనంలో కరీంనగర్‌లోని అపోలో రిచ్ ఆస్పత్రికి తరలించారు. హుజూరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కరీంనగర్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మరో పది నిమిషాల్లో కరీంనగర్ చేరుకుంటారనగా మానకొండూరు సమీపంలో ప్రమాదం జరిగింది. ముందు సీట్లో కూర్చున్న మంత్రికే ఎక్కువ గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఏ విషయమూ ఇంకా స్పష్టంగా చెప్పడంలేదు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాత్రమే అంటున్నారు. కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆస్పత్రికి కేవలం ఈటెల రాజేందర్ ఒక్కరినే తరలించారు. మిగిలినవారిని వేరే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న వాహనం.. ఎదురుగా ఉన్న టిప్పర్‌ను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురైంది. కాగా, మంత్రి వాహనానికి నెల రోజుల్లో ఇది రెండో ప్రమాదం. నెల రోజుల క్రితం ఇదే వాహనం ప్రమాదానికి గురైంది. తాడిచెట్టును ఢీకొన్న వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ సమయానికి మంత్రి రాజేందర్ ఆ వాహనంలో లేరు. ఎంపీ వినోద్ వాహనంలో ప్రయాణిస్తుండటంతో ఆయన అప్పట్లో ప్రమాదం తప్పించుకున్నారు. -
డీలర్లు తప్పు చేస్తే పీడీ యాక్ట్
హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాల శాఖ సమర్థమంతంగా పనిచేస్తుందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రేషన్ కార్డులు రెండు చోట్ల నమోదు చేసుకున్న వారి వివరాలను ఒక చోట తొలగించామని చెప్పారు. మే నెలలో ఆహార భద్రత కార్డుల పంపిణీ ఉంటుందని ఆయన చెప్పారు. సన్న బియ్యంతో సహా రేషన్ సరుకులను పక్కదారి పట్టించే డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని చెప్పారు. గ్యాస్ సబ్సిడీ తాను వదులుకున్నానని, అలాగే స్థమత ఉన్నవారంతా వదులుకోవాలని సూచించారు. జీఎస్పీపై కేంద్రం ప్రతిపాదనలకు తమ ప్రభుత్వం సానూకూలమని చెప్పారు. -
'మావోయిస్టుల ఎజెండానే అమలు చేస్తున్నాం'
-
'మావోయిస్టుల ఎజెండానే అమలు చేస్తున్నాం'
హైదరాబాద్: వరంగల్‌లో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు శుభపరిణామనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుత్తూ.... గత ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. వచ్చే బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని విమర్శించారు. 2017 లోగా రాష్ట్రంలో కోతలు లేని కరెంట్ అందిస్తామన్నారు. అలాగే 2018 నాటికి రాష్ట్రంలో సరిపడ విద్యుత్ ఉంటుందన్నారు. పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్తున్నామన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ అనవర రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు ఈటెల రాజేందర్ హితవు పలికారు. విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం సూచన మేరకే మావోయిస్టులపై నిషేధం పొడిగించామన్నారు. తాము మావోయిస్టుల ఏజెండానే అమలు చేస్తున్నామన్నారు. మావోల అంశంపై అంతర్గత వేదికల్లో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.