హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. అమిత్ షా నల్గొండ జిల్లా సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే అని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదన్నారు. కేంద్రం... తెలంగాణకు 90 వేల కోట్లు ఇచ్చామని చెప్పడం అబద్ధమన్నారు.
ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం రూ. 36 వేల కోట్లు మాత్రమే అని ఈటల చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే పేర్కొన్నారని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గుర్తు చేశారు.