ఫైల్ ఫోటో
బీజేపీ నేత, మల్కాజ్‌గిరి లోక్ సభ ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో తెలంగాణ నుంచి ఎద్దరు ఎంపీలకు మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి
కిషన్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చని కథనాలు వస్తున్నాయి.
అయితే కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆశాభంగం తప్పలేదు. ఆయన్ని బుజ్జగించేందుకుగానూ కాషాయపార్టీ బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవిని ఈటలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన అమిత్ షాను కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment