Huzurabad Bypoll 2021: Amit Shah Make Phone Call To Bandi Sanjay - Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌ కౌంటింగ్‌: బండి సంజయ్‌కు అమిత్‌ షా ఫోన్‌

Published Tue, Nov 2 2021 4:00 PM | Last Updated on Tue, Nov 2 2021 7:00 PM

Huzurabad Bypoll 2021 Amit Shah Make Phone Call To Bandi Sanjay - Sakshi

హుజూరాబాద్‌ ఫలితాలపై అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఓట్ల కౌంటింగ్‌లో బీజేపీ దూసుకుపోయింది. టీఆర్‌ఎస్‌ కేవలం రెండు రౌండ్లలోనే ఆధిక్యం కనబర్చింది. 

ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్‌ చేశారు. హుజూరాబాద్‌ ఫలితాలపై అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని బండి సంజయ్‌ అమిత్‌షాకు తెలిపారు. ఇక హుజూరాబాద్‌ ఫలితాలపై అమిత్‌ షా టీం ఎప్పటికప్పుడు ఆరా తీసింది.
(చదవండి: కాంగ్రెస్‌లో హుజూరాబాద్‌ చిచ్చు: ‘బల్మూర్‌ వెంకట్‌ని బలి పశువు చేశారు’)

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజూరాబాద్ ఫలితాలపై సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తలు. బాణసంచా, డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో కార్యకర్తల సంబరాలు జరుపుకుంటున్నారు.  స్వీట్స్ పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు బీజేపీ శ్రేణులు.

చదవండి: Huzurabad Bypoll 2021: గెల్లు సొంత గ్రామంలో కారు పంక్చర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement