
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించడం ఖాయమని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడని, ఈటల గెలుపు బీజేపీ గెలుపని, బీజేపీ గెలుపు ఈటల గెలుపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పై ప్రజలకు విశ్వాసం లేదని, దళిత బంధు అమలు చేసినా ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. కాగా, ఇప్పటిదాకా వెలువడిన హుజూరాబాద్ ఫలితాల్లో బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది.
చదవండి: (రఘువీరా రెడ్డిని స్తంభానికి కట్టిపడేసింది...ఎవరు?ఎందుకు?)
Comments
Please login to add a commentAdd a comment