ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? ఉద్దేశ పూర్వకమా? | Lack Of Coordination Revealed In The BJP Booth Assembly | Sakshi
Sakshi News home page

ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? ఉద్దేశ పూర్వకమా?

Published Sat, Jan 7 2023 2:06 PM | Last Updated on Sat, Jan 7 2023 3:01 PM

Lack Of Coordination Revealed In The BJP Booth Assembly - Sakshi

హైదరాబాద్‌: బీజేపీ బూత్‌ సమ్మేళనంలో సమన్వయలోపం బయటపడింది. బండి ప్రసంగం సమయంలోనే మరో పక్క బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కూడా ప్రసంగించారు. వర్చువల్‌గా జరిగిన బీజేపీ బూత్‌ సమ్మేళనం కార్యక్రమంలో సమన్వయం లోపం కనిపించింది.

ఈటల వరంగల్‌ ఈస్ట్‌ నుంచి ప్రసంగించగా, వరంగల్‌ ఈస్ట్‌ మినహా 118 నియోజకవర్గాల్లో బండి ప్రసంగించారు. సాంకేతిక లోపం కారణంగా అలా జరిగిందా.. కావాలనే చేశారా అనే దానిపై పార్టీ ఆరా తీయనుంది. 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోలింగ్‌ బూత్‌ సమ్మేళనాలను ఏర్పాటు చేసింది. 119 నియోజకవర్గాల్లో బూత్‌ సమ్మేళనాలు ఏర్పాటు చేయగా, బండి 118 నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ వర్చువల్‌గా ప్రసంగించారు. వరంగల్‌ ఈస్ట్‌ నియోజవర్గం నుంచి ఈటల మాట్లాడారు.  ఈ సమయంలో సమన్వయం లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇలా ఎందుకు జరిగిందనేపై పార్టీ వర్గాలు దృష్టి సారించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement