
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బండి సంజయ్ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆఫీసులో కూర్చుని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమన్నారు. సంజయ్, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతుగా జాగరణదీక్షకు దిగితే వారిపై విచక్షణారహితంగా పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని పేర్కొన్నారు.