
డీలర్లు తప్పు చేస్తే పీడీ యాక్ట్
హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాల శాఖ సమర్థమంతంగా పనిచేస్తుందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రేషన్ కార్డులు రెండు చోట్ల నమోదు చేసుకున్న వారి వివరాలను ఒక చోట తొలగించామని చెప్పారు. మే నెలలో ఆహార భద్రత కార్డుల పంపిణీ ఉంటుందని ఆయన చెప్పారు. సన్న బియ్యంతో సహా రేషన్ సరుకులను పక్కదారి పట్టించే డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని చెప్పారు. గ్యాస్ సబ్సిడీ తాను వదులుకున్నానని, అలాగే స్థమత ఉన్నవారంతా వదులుకోవాలని సూచించారు. జీఎస్పీపై కేంద్రం ప్రతిపాదనలకు తమ ప్రభుత్వం సానూకూలమని చెప్పారు.