
కాంగ్రెస్, టీడీపీలపై ఈటల ఫైర్
హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీలపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రెండు పార్టీలు మిడ్మానేరు ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులను పట్టించుకోని చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఎద్దేవా చేశారు. రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. అయితే మా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకోవాలని ఆ రెండు పార్టీలకు ఈటల హితవు పలికారు.