Ration dealers
-
రేషన్ డీలర్లకు జగన్ సర్కార్ తీపి కబురు
-
రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్‌ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్‌ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం అందించే కమీషన్కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ను అదనంగా అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్ఎఫ్ఎస్సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. కమీషన్ టన్నుకు 700 నుండి 1400 రూపాయలకు పెంపుదల చేసింది. కమీషన్ పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.245 కోట్ల భారం పడనుంది. డీలర్ల కమీషన్ పెంపు జీవోను జేఏసీ ప్రతినిధులకు మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. 17 వేలకు పైగా రేషన్ డీలర్ల కుటుంబాకు లబ్ధి కలుగనుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
కాంగ్రెస్ నేతలవి పిచ్చి మాటలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కాంగ్రెస్ నాయకులు వీఆర్ఏలను, పంచాయతీ కార్యదర్శులను రెచ్చగొట్టాలని చూశారు.. కానీ వారిని రెగ్యులరైజ్ చేశాము.. రేషన్‌డీలర్ల సమస్యనూ పరిష్కరించాం.. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఇంటింటికీ మంచినీరు వంటి పథకాలతో మహిళలు సీఎం కేసీఆర్‌కు జైకొడుతున్నారు.. ఇక ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారు’’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన బీసీ బంధు లబ్ధిదారులకు రూ.లక్ష సాయం పంపిణీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారానికి సంబంధించిన డబ్బులను బ్యాంకు వెబ్సైట్లపై స్వయంగా మీట నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ సభలకు ప్రజలు రాకపోవడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదన్నారు. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు తిరిగి బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తారా అని నిలదీశారు. రైతులే తేల్చుకోవాలి.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న కాంగ్రెస్ కావాలో.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీ కావాలో.. మూడు పంటలు పండించేలా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కావాలో రైతులే తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని, ఆ ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా అయ్యేదని, ఎరువుల బస్తాల కోసం పోలీస్స్టేషన్లలో క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు రావాల్సిన రూ.35 వేల కోట్లు నిలిపివేసిందని, ఆ నిధులను కేంద్రం ఎందుకు ఆపిందో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. -
రేషన్ డీలర్లపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రేషన్ డీలర్లపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బియ్యం పంపిణీకి గాను వారికిచ్చే కమీషన్‌ను మెట్రిక్ టన్నుకు రూ.900 నుంచి రూ.1,400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే డీలర్లు డిమాండ్ చేస్తున్న మరో 13 అంశాలపై కూడా సానుకూలంగా స్పందించింది. రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సచివాలయంలో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రభుత్వానికి, రేషన్ డీలర్లకు ఆమోదయోగ్యమైన విధంగా కమీషన్‌ను పెంచడంతో పాటు మరో 13 డిమాండ్లను పరిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్‌షిప్‌ను మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడన్నల బీమా తరహాలో రేషన్ డీలర్లకు రూ.5 లక్షల బీమా వర్తింప చేయడం, ప్రతి డీలర్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంపు తదితర 13 అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.200 గా ఉన్న డీలర్ల కమీషన్‌ను దశలవారీగా పెంచుతూ రూ.1400కు చేర్చినట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీర్ఘకాల డిమాండ్లకు పరిష్కారం రాష్ట్రంలోని పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యానికి సంబంధించి ప్రస్తుతం డీలర్లకు మెట్రిక్ టన్నుకు రూ.900 చొప్పున కమీషన్ అందుతోంది. దీనిని పెంచాలని గత కొంతకాలంగా డీలర్లు ఆందోళన చేస్తున్నారు. గత నెలలో సమ్మెలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయితే మంత్రి గంగుల ఇచ్చిన హామీ మేరకు గత నెలలో బియ్యం పంపిణీ చేసిన డీలర్లు, ఈ నెలలో తమ సమస్యలు పరిష్కారమైతేనే బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఈనెల 5 నుంచి ప్రారంభం కావలసిన బియ్యం పంపిణీని 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మంత్రులు హరీశ్, గంగులతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 17,227 మంది డీలర్లకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో మొత్తం 90.05 లక్షల ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వాటిలో 35.56 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులు కాగా మిగతా 54.5 లక్షల కార్డులు కేంద్రం మంజూరు చేసినవి. ఈ కార్డులకు గాను 2.82 కోట్ల మంది లబ్ది దారులకు ప్రతినెలా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వంపై రూ.138.73 కోట్ల భారం డీలర్ల కమీషన్‌ను రూ.1,400కు పెంచడం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.138.73 కోట్ల భారం పడనుంది. కమీషన్ మొన్నటివరకు రూ.700 ఉండగా రెండు నెలల క్రితం కేంద్రంతో జరిగిన సర్దుబాటు వల్ల రూ.200 పెంచి రూ.900 కమీషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.700 ఉన్నప్పుడు రూ.45.36 కోట్ల కేంద్రం వాటా పోగా, రాష్ట్రం వాటా రూ.106.33 కోట్లతో డీలర్లకు మొత్తం రూ.151.69 కోట్లు ఏటా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం కమీషన్‌ను రూ.1,400కు పెంచడంతో ఏటా మొత్తం రూ.303.38 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో కేంద్రం వాటా రూ.58.32 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.245.06 కోట్లకు పెరిగింది. అంటే రూ.138.73 కోట్ల అదనపు భారం పడుతోందన్నమాట. డీలర్లకు మరికొన్ని ప్రభుత్వ వరాలు ♦ ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వే బ్రిడ్జిల ఏర్పాటు ♦ డీలర్షిప్ రెన్యువల్‌ను ఐదేళ్ల కాలపరిమితికి పెంచడం ♦ డీలర్ మరణిస్తే అంత్యక్రియల నిర్వహణకు రూ.10 వేల తక్షణ సాయం ♦ 1.5 క్వింటాళ్ల వేరియేషన్ (తేడా)ను కేసుల పరిధి నుంచి తీసివేయడం ♦ హైదరాబాద్‌లో రేషన్ భవన్ నిర్మాణానికి భూ కేటాయింపు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన డీలర్లు కమీషన్ పెంపు సహా తమ ఇతర సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేషన్ డీలర్లు కృతజ్ఞతలు తెలిపారు. తమ వినతులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ వి.అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన రేషన్ డీలర్లు దిగివచ్చారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో మంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయికోటి రాజు, కన్వినర్ రవీందర్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి సమక్షంలో వెల్లడించారు. వచ్చే నెలలోగా పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో.. డీలర్ల కమీషన్ పెంపు, గౌరవ వేతనం అమలు తదితర 22 డిమాండ్ల కోసం డీలర్లు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లకు సమ్మె నోటీసులు ఇచ్చారు. దీంతో అదే నెల 22న మంత్రి కమలాకర్ డీలర్ల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. 22 డిమాండ్లలో 20 డిమాండ్లు పరిష్కరించేందుకు మంత్రి కమలాకర్ పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ సమక్షంలో హామీ ఇచ్చారు. ప్రధాన డిమాండ్లు అయిన కమీషన్ పెంపు, గౌరవ వేతనం అమలు అంశాలు ముఖ్యమంత్రి పరిధిలోనివని మంత్రి సర్ది చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లు డీలర్ల సంఘం నాయకులు ప్రకటించారు. కానీ ఆకస్మికంగా సోమవారం నుంచి రాష్ట్రంలోని 17,284 రేషన్ దుకాణాలను మూసివేసి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల మంగళవారం డీలర్ల జేఏసీ నాయకులు నాయికోటి రాజు, రవీందర్, మల్లికార్జున్ గౌడ్, అనంతయ్య, పుస్తె శ్రీకాంత్ తదితరులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల తరువాత సమావేశం ముగియగా, చర్చలు సఫలమైనట్లు డీలర్లు ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు డీలర్ల డిమాండ్ల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు మంత్రి కమలాకర్ సమక్షంలోనే ప్రకటించారు. జూలై లోపు తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని, గౌరవ వేతనం, ఇన్సూరెన్స్ అంశాలు ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నందున సమ్మెను విరమించి, రేషన్ దుకాణాలు తెరుస్తున్నట్లు స్పష్టం చేశారు. డీలర్లకు గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం: గంగుల గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. డీలర్లతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ 2 కోట్ల 83 లక్షల పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, జాయింట్ కమిషనర్ ఉషారాణి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
'ఇది రేషన్ దుకాణమా.. బూత్ బంగ్లానా..?'
నారాయణపేట: నారాయణపేట జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ రేషన్ డీలర్ల ఆలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నుంచి జూన్ నెలకు సంబంధించి ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం అయింది. దీంతో ఆయన ఆదివారం జిల్లాలోని మరికల్, సమీప గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీలర్లు నిర్వహిస్తున్న రేషన్ కేంద్రాలు బూజు, చెత్త చెదారంతో ఉండడం చూసి .. '' బాబు ఇది రేషన్ దుకాణమా.. లేక బూత్ బంగ్లానా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. దుకాణాల నిర్వహణ విషయం లో అలసత్వం ఏమాత్రం ఉపెక్షించేది లేదన్నారు. మాట వినక పోతే వేటు తప్పదని హెచ్చరించారు. నిత్యం ఎంతో మంది ప్రజలకు నిత్యావసర సరుకులను అందించే చౌక దుకాణాల ను అపరిశుభ్ర వాతావరణం లో నడపడం డీలర్లకు భావ్యం కాదని స్పష్టం చేశారు. సూక్ష్మ విషయాలే కొన్ని సందర్భాల్లో ప్రధాన అంశాలుగా పరిగణించాల్సి వస్తుందని, అందుకే డీలర్లు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకునే ఆలోచన చేయకూడదని స్పష్టం చేశారు. -
రేషన్ డీలర్ల సమ్మె ఆలోచన విరమణ
సాక్షి, హైదరాబాద్: డిమాండ్లు నెరవేర్చాలంటూ రేషన్ డీలర్లు మంగళవారం నుంచి సమ్మె నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి గంగుల కమాలకర్ రేషన్ డీలర్ల సంఘం నేతలతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఫలితంగా రేషన్ డీలర్ల సమ్మె ఆలోచన విరమించుకునేందుకు సిద్ధమయ్యారు. చర్చల్లో భాగంగా రేషన్ డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ పాత బకాయిలు రూ.28 కోట్లు విడుదల చేస్తామని.. కరోనాతో మరణించిన రేషన్ డీలర్ల స్థానంలో ఎటువంటి నిబంధనలు లేకుండా.. వారి కుటుంబ సభ్యులకే రేషన్ డీలర్ పోస్టు ఇస్తామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. -
ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు తినే రేషన్‌లో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చే వాటికన్నా..క్వాలిటీతో ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వంపై 350 కోట్ల భారం పడ్డా నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలపై భారం పడకుండా డీలర్లకు 22 కోట్లు కమీషన్ రూపంలో ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. ఉచిత రేషన్ రూపంలో డీలర్లు ఇచ్చే కమీషన్ 270 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించిందని, రేషన్ డీలర్లకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని కొడాలి నాని తెలిపారు. (చదవండి: ‘అది తెలిసే మొహం చాటేశారు’) -
రేషన్ అక్రమార్కులపై కొరడా
సాక్షి, అమరావతి: పేదల ఆకలి తీర్చడం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. కొందరు రేషన్ డీలర్లు పేదలకు అందాల్సిన సరుకుల్ని నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలలో రెండుసార్లు ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కార్డుదారులకు పంపిణీ చేసింది. కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారుల్ని ప్రలోభపెట్టి వారికిచ్చే బియ్యాన్ని కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ముమ్మరంగా తనిఖీలు ► రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు పౌర సరఫరాలు, విజిలెన్స్, తూనికలు, కొలతల శాఖ అధికారులు విడివిడిగా రేషన్ షాపులను తనిఖీ చేస్తున్నారు. ► అవకతవకలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకునేందుకు తనిఖీ అధికారులు లిఖిత పూర్వకంగా రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం పంపుతున్నారు. ► రాష్ట్రంలో 29,783 రేషన్ షాపులు ఉన్నాయి. వీరిలో 1,188 మంది డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి నోటీసులు జారీ చేశారు. కొందరిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టి రిమాండ్‌కు పంపారు. తనిఖీల నేపథ్యంలో కొందరు డీలర్లు సెలవుపై వెళ్తున్నారు. ► రాష్ట్రంలో 4,700 మంది డీలర్లు రేషన్ షాపులను సరిగా తెరవడం లేదని అధికారులు గుర్తించారు. వేళలు పాటించని డీలర్లను గుర్తించి పని తీరును మార్చుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నారు. -
3 రోజులు.. 86.23 లక్షల కుటుంబాలు
సాక్షి, అమరావతి: అధికారులు, రేషన్ డీలర్లు, గ్రామ, వార్డు వలంటీర్ల కృషితో మూడు రోజుల్లోనే రాష్ట్రంలో 86.23 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత రేషన్ సరుకులు అందాయి. శనివారం ఒక్క రోజే 33.26 లక్షల మంది కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. ఇప్పటి వరకు 1.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 8,524 మెట్రిక్ టన్నుల శనగల్ని పేదలకు పంపిణీ చేశారు. రేషన్ కార్డుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పంపిణీ చేశారు. రాష్ట్రంలో 18.67 లక్షల మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు. తెల్లరేషన్ కార్డులున్న 1,47,24,017 కుటుంబాలకు సరుకులు అందుబాటులో ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియోకార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. -
అవకాశమిస్తే ‘గౌరవం’ కోసం పోరాడుతా
టేకులపల్లి: రెండున్నరేళ్ల పాటు జిల్లాలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ఎంతగానో కృషి చేశానని, మళ్లీ తనకు అవకాశం ఇస్తే పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం కోసం పోరాడుతానని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకే శేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల క్రితం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు నియమించడం జరిగిందని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేశారని పేర్కొన్నారు. ఈనెల 22న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని 23 మండలాలు 321 రేషన్ డీలర్లు సహృదయంతో ఆలోచించి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. డీలర్లకు రావాల్సి పాత బకాయిల్లో సగం సాధించామని, మధ్యాహ్న భోజనం బకాయిలు యాబై శాతం సాధించామని తెలిపారు. గౌరవ వేతనం సాధించేంత వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ఆంగోలు సంతులాల్, జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర రామ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగులోత్ హేమచందర్, బాణోతు భాస్కర్, వాంకుడోత్ వెంకటేశ్ పాల్గొన్నారు. -
బియ్యం ‘నో స్టాక్...!
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ‘పేదల బియ్యానికి’ కొరత ఏర్పడింది. అక్టోబర్ కోటా గడువు చివరి రోజైన మంగళవారం రేషన్ దుకాణాల ఎదుట ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. ఒక వైపు అదనపు కోటా కేటాయింపు లేకుండానే రేషన్ పోర్టబిలిటీ లావాదేవీలు.. మరోవైపు పూర్తి స్థాయి కోటాను డీలర్లు లిఫ్ట్ చేయకపోవడం పేదల పాలిట శాపంగా మారింది. ఫలితంగా గడువు చివరి రోజుల్లో పేదలకు బియ్యం అందని దాక్ష్రగా మారింది. హైదరాబాద్ నగరంలో స్టేట్, జిల్లా పోర్టబిలిటీ తోపాటు నేషనల్ పోర్టబిలిటీ సైతం ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీనికి తగినట్లుగా అదనపు కోటా కేటాయించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారగణం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. హైదరాబాద్ జిల్లా పరిధిలో అక్టోబర్ నెలకు గాను మొత్తం 1,37,75,936 కిలోల బియ్యం కోటా అవసరం కాగా పౌరసరఫరాల శాఖ 1,25,78,130 కిలోల బియ్యాన్ని కేటాయించింది. అందులో ఏఎఫ్ఎస్సీ కింద 10,62,390 కిలోలకు గాను 9,23,978 కిలోలు, ఎఫ్ఎస్సీ కింద 1,26,99,816 కిలోలకు గాను 1,16,44,110 కిలోలు, ఏఏపీ కింద 13,730 కిలోలకు గాను 10,042 కిలోలు కేటాయించారు. బియ్యం కోటాకు సంబంధించి సుమారు 1630 ఆర్వోలను విడుదల చేసింది. అందులో 1319 ఆర్వోలకు సంబంధించిన సరుకులు మాత్రమే డీలర్లు లిఫ్ట్ చేశారు. మిగిలిన 311 ఆర్వోలకు సంబంధించిన బియ్యం నిల్వలు లిఫ్ట్ చేయలేదని అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా ఎంఎల్ఎస్ పాయింట్లో సుమారు 3,744,57 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండగా, ప్రధాన గోదాంలో బియ్యం నిల్వలు లేకుండా పోయాయి. కార్డులు ఇలా.. హైదరాబాద్ పౌరసరఫరాల శాఖ పరిధిలో సుమారు 5,86,107 ఆహార భద్రత (రేషన్) కార్డులు ఉండగా, అందులో 21,94,444 మంది లబ్దిదారులు ఉన్నారు. మొత్తం కార్డుల్లో 30,271 ఏఎఫ్ఎస్సీ కార్డులు అందులో 80,344 యూనిట్లు, ఎఫ్ఎస్సీ కింద 5,54,520 కార్డులు అందులో 21,12,728 లబ్ధిదారులు, ఏఏపీ కింద 1316 కార్డులు అందులో 1372 యూనిట్లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సరుకుల డ్రా ఇలా. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అక్టోబర్ కోటా డ్రా లబ్ధిదారులకు చుక్కలు చూపించింది. సుమారు 20 శాతం లబ్ధి కుటుంబాలు సరుకులను డ్రా చేయలేక పోయారు. చౌకధరల దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15 వరకు నెలసరి కోటా పంపిణీ జరుగుతుంది. మొత్తం 7,06,146 లావాదేవీలు జరుగగా అందులో సరుకుల డ్రాకు చివరి రోజైన మంళవారం 13,792 లావాదేవీల ద్వారా సరుకుల డ్రా జరిగినట్లు ఆన్లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా రేషన్ పోర్టబిలిటీ పేదల బియ్యం కోటాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా పోర్ట్టబిలిటీ కింద 2,12,912 లావాదేవీలు జరగగా, అం దులో చివరిరోజు 7,577 లావాదేవీలు జరిగాయి. రాష్ట్ర పోర్టబిలిటీ కింద మొత్తం 56,884 లావాదేవీలు, అందులో చివరి రోజు 1380 లావాదేవీలు జరిగినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తమకు కేటాయించిన దుకాణాల్లో మొత్తం 4,36,360 కార్డుదారులు సరుకులు డ్రా చేసుకున్నారు. అందులో చివరి రోజైన మంగళవారం 4,835 మంది సరుకులు డ్రా చేసుకున్నట్లు ఆన్లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయిలో బియ్యం లిఫ్ట్ చేయలేదు అక్టోబర్ మాసానికి అవసరమైన రేషన్ కోటాను కేటాయించడం జరిగింది. డీలర్ల వారీగా ఆర్వోలను సైతం విడుదల చేశాం, అయితే సుమారు 20 శాతం వరకు డీలర్లు తమ కోటా పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేసుకోలేక పోయారు. మరోవైపు పొర్టబిలిటీ విధానం కూడా కొంత వరకు ప్రభావం చూపింది. – తనూజ, డీఏం. హైదరాబాద్ -
ఎవరా డీలర్లు..? ఏంటా కథ?
గతమిది దొడ్డు బియ్యం, రంగు మారిన బియ్యం, నూకల శాతం ఎక్కువగా ఉండటం, తవుడు కలిసి ఉండటం, నాణ్యత లేమి కారణంగా అధిక శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యాన్ని తినేందుకు ఇష్టపడే వారు కాదు. ఇదే అదనుగా రేషన్ మాఫియా రంగంలోకి దిగి కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి రైసుమిల్లుల్లో పాలిష్ పట్టించి అధిక ధరకు అమ్ముకుంటూ రూ.కోట్లు సంపాదించేవారు. ఈ విధంగా గతంలో పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ యథేచ్ఛగా సాగింది. ఇందులో కొందరు డీలర్లే దళారులుగా వ్యవహరించారు. ప్రభుత్వమిచ్చే ఇన్సెంటివ్‌తో పాటు అడ్డగోలుగా సంపాదించేవారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నియమితులైన టీడీపీ సానుభూతి డీలర్లు రెండు చేతులా ఆర్జించారు. తాజా పరిస్థితి ఇది రీసైక్లింగ్‌కు అవకాశం లేకుండా తినగలిగే బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేసింది. తూకంలో తేడాలు, క్షేత్రస్థాయిలో అక్రమాలు చోటు చేసుకోకుండా నేరుగా ఇంటికే బియ్యం ప్యాకెట్లను అందజేస్తోంది. ఈ బియ్యం అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. రీసైక్లింగ్ చేసుకునేందుకు చాన్స్ ఉండదు. పీడీఎస్ బియ్యం దళారులకు, అక్రమాలకు పాల్పడే డీలర్లకు అడ్డగోలుగా సంపాదించే అవకాశం లేకుండా పోయింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేసిన ఈ ముందడుగు కొందరు డీలర్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నియమితులై అక్రమాలతో కోట్లాది రూపాయలు సంపాదించిన టీడీపీ సానుభూతి డీలర్లకు అస్సలు రుచించడం లేదు. తమ ఆదాయానికి ప్రభుత్వం గండికొట్టడంతో పాటు గ్రామాల్లో రాజకీయ ఆధిపత్యాన్ని కోల్పోతున్నామన్న భయం పట్టుకుంది. ఇంకేముంది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యంపై బురద జల్లే కార్యక్రమానికి ఒడిగట్టారు. గతంలో తమ వద్ద ఉన్న బియ్యం ఫొటోలను, ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన బియ్యం ప్యాకెట్లను బయటికి వదిలి దుష్ప్రచారానికి దిగారు. పచ్చబ్యాచ్‌తో కలిసి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారానికి దిగారు. దీని వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గి, ఇంటింటికి రేషన్‌కు స్వస్తి చెప్పి, ఎప్పటిలాగే తమ చేతుల్లోనే ప్రభుత్వం పెడుతుందనేది వారి ఆశ. కానీ కుట్రదారుల పప్పులుడకలేదు. సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారాన్ని అధికారులు తిప్పికొట్టారు. ఎక్కడైతే తడిచిన బియ్యం ప్యాకెట్లు అందాయో అక్కడ వెంటనే రీప్లేస్ చేశారు. దీంతో ఎక్కడా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. నిరుపేదల కళ్లల్లో ఆనందం కనిపించింది. లెక్క తేల్చేసింది.. జిల్లాలో తెల్ల రేషన్‌కార్డుదారులు 8.31లక్షలు, అందుబాటులో ఉంచిన బియ్యం 13,341 మెట్రిక్ టన్నులు, పంపిణీ చేసిన నాణ్యమైన బియ్యం బ్యాగులు 9,36,941, వెలుగు చూసిన తడిచిన బియ్యం బ్యాగులు 30.. ఈ అంకెలు చూస్తే బియ్యం బాగోలేవని ఎవరైనా చెప్పగలరా? 9లక్షల 36వేల 941బ్యాగులలో ఇటీవల కురిసిన వర్షాలకు 30బ్యాగులు తడవడం వల్ల పాడయ్యాయి. ఈ లెక్కన పాడైన శాతమేంటో అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ సానుభూతి డీలర్ల కనుసన్నల్లో పచ్చబ్యాచ్ వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే యత్నానికి దిగింది. కానీ ప్రజలు వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహం ముందు చివరికీ వారి గొంతు మూగబోయింది. ఆ అక్రమాలకు చాన్స్ ఉండదనే టీడీపీ సానుభూతి డీలర్లు దళారుల అవతారమెత్తి కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొని రైస్‌మిల్లులకు అమ్మేవారు. ప్రభుత్వం ఈ బియ్యాన్ని కిలో రూ. 30కిపైగా కొని, కార్డుదారులకు ఒక్క రూపాయికి అందజేసేది. ఈ బియ్యాన్నే కిలో రూ. 9నుంచి రూ.10చొప్పున కొని, రైసుమిల్లులకు చేరేసరికి రూ. 20వరకు అమ్ముతున్నారు. పాలిష్ అనంతరం ఈ బి య్యాన్నే మాఫియా కిలో రూ. 50వరకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. అలాగే ప్రతి నెలా పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన బియ్యం, పంచదారతో పాటు ఇతర సరుకులు ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించేవారు. అక్కడి నుంచి కాంట్రాక్టర్ల ద్వారా నుంచి చౌక దుకాణాలకు సరుకులు తరలిస్తున్నప్పుడు అవి నీతి, అక్రమాలు చోటు చేసుకునేవి. గోదాములకు వస్తున్న సరుకుల్లో తక్కువ (షార్జేజీ) వస్తున్నాయని కొందరు డీలర్లు కోత విధిస్తుండేవారు. బియ్యం బస్తాతో కలిపి 51కిలోల తూకం ఉండాల్సి ఉండగా పరిస్థితుల ప్రకారం 4 నుంచి 6 కిలోల వరకూ కోత విధిస్తుండేవారు. తన నష్టాలను పూడ్చుకునేందుకు ఎలక్ట్రానిక్ కాటాల్లో కూడా ప్రజలను మోసం చేసేవారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బ్రేక్ పడింది. టీడీపీ సానుభూతి డీలర్ల కుట్రపై ఆరా జిల్లాలో సానుభూతి డీలర్లు 700 వరకు ఉన్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో 300 వరకు కొత్తగా నియమితులయ్యారు. వీరంతా డీలర్లుగా ఉంటూ గ్రామాల్లో రాజకీయాలు చేస్తున్నారు. భవిష్యత్ భయంతో వారంతా కొత్త విధానానికి మచ్చ తెచ్చిపెట్టి, ప్రజల్లో అనుమానాలు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నా రు. నాణ్యమైన బియ్యాన్ని నాసిరకంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, తడిచిన బియ్యాన్ని చూపించి గడ్డ కట్టేస్తున్నాయని లీకులు ఇవ్వ డం, వండితే ముద్దయిపోతుందని ప్రచారం, వలంటీర్లను సైతం బెదిరించడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఎలాగైనా ప్రభుత్వం కొత్త విధానం నుంచి వెనక్కి తగ్గి పాత పద్ధతిలో తమకు దోచుకునే అవకాశం కల్పిస్తుందనే ఎత్తుగడతో దుష్ట పన్నాగానికి దిగారు. ఇం టింటికి రేషన్ పంపిణీ ప్రారంభం కావడమే తరువాయి వీరి దుష్ప్రచారం మొదలైంది. క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల ద్వారా అనుమానాలు, అపోహాలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇదంతా అధికారుల దృష్టికి వచ్చింది. ఈ రకంగా చేసిందెవరో ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పక్కాగా వివరాలు సేకరించాక కఠిన చర్యలు తీసుకునే యోచనలో అధికారులు ఉన్నారు. డీలర్లు వారి ఉచ్చులో పడొద్దు జిల్లా వ్యాప్తంగా 2015రేషన్ డిపో డీలర్లు ఉన్నారు. వారిలో పచ్చ పార్టీకి చెందిన వారు 700వరకు ఉన్నారు. నాణ్యమైన దుష్ప్రచా రానికి దిగుతున్నది దాదాపు వీరే. అయితే, మిగతా డీలర్లు వీరి ఉచ్చులో పడితే అసలుకే ఎసరొస్తుంది. టీడీపీ సానుభూతేతర డీలర్లంతా జాగ్రత్తగా ఉండాలి. టీడీపీ డీలర్లను ప్రోత్సహిస్తే ఇబ్బంది పడటం తప్ప ప్రయోజనం ఉండదు. కొత్త విధానం వల్ల డీలర్ల వ్యవస్థకు నష్టమేమీ ఉండదు. ఎప్పటిలాగే ఇన్సెం టివ్ వస్తుంది. వారి భద్రతకు డోకా ఉండదు. కానీ టీడీపీ డీలర్ల ట్రాప్‌లో పడితే నష్టపోయే అవకాశం ఉంది. తప్పు చేస్తే చర్యలు తప్పవు డీలర్ల భద్రతకు డోకా లేదని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఇప్పటికే చెప్పారు. ఎప్పటిలాగే కొనసాగుతారు. ఇన్సెంటివ్ కూడా తగ్గదు. ఇంకా చెప్పాలంటే గతంలో 15రోజులు కష్టపడాల్సి ఉండగా ఇప్పుడు రెండు రోజులతో పని పూర్తవుతుంది. కాకపోతే, గతంలో మాదిరిగా రీసైక్లింగ్‌కు అవకాశం ఉండదు. ఇంకా ఏవైనా ఇబ్బందులుంటే చెప్పుకోవాలి. అంతే తప్ప నాణ్యమైన బియ్యంపై తప్పుడు విధానాలకు పోతే చర్యలు తప్పవు. – కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ -
కార్డు నిజం.. పేర్లు అబద్ధం
టీడీపీ హయాంలో ఆ పార్టీ మద్దతు దారులైన కొందరు డీలర్లు దోపిడీకి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ సద్వినియోగం చేసుకున్నారు. రేషన్ సరుకులు నొక్కేందుకు కొత్త దారి కనుక్కున్నారు. లబ్ధిదారులకే తెలియకుండా వారి కార్డుల్లో ఇతరుల పేర్లు చేర్పించారు. అలా అదనంగా నమోదైన వారి పేరుతో రేషన్ సరుకులు ఏళ్లుగా స్వాహా చేశారు. తాజాగా కార్డుదారుల ఆధార్ వివరాలను ప్రజాసాధికార సర్వేకు అనుసంధానం చేయడంతో వారి బొక్కుడు వ్యవహారం బయటపడింది. సాక్షి, అనంతపురం: డీలర్ల మాయలు అన్నీ ఇన్నీకావు. దోచుకునేందుకు తలోదారి వెతుక్కున్నారు. టీడీపీ హయాంలో అధికార పార్టీ అండదండలున్న వారైతే మరీ ఇష్టానుసారం వ్యవహరించారు. కార్డుదారులకే తెలియకుండా ఆన్లైన్లో మాయ చేశారు. కొందరి కార్డుల్లో కుటుంబసభ్యులుగా ప్రభుత్వ ఉద్యోగులను చేర్పించారు. అలా చేర్పించిన వారి పేరున వచ్చే బియ్యం కోటాను నొక్కుతూ వచ్చారు. టీడీపీ మద్దతుదారులైన డీలర్ల చేతి వాటం జిల్లాలో 3,003 చౌక దుకాణాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలు మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో చౌకదుకాణాల డీలర్లుగా టీడీపీ కార్యకర్తలు ఆపార్టీ సానుభూతిపరులు వ్యవహరించారు. వీరిలో కొందరు డీలర్లు చేతి వాటం ప్రదర్శించి అవినీతికి తెరలేపారు. కార్డుదారులకు తెలియకుండా ఆన్లైన్లో వారి కుటుంబ సభ్యులుగా ఇతరులను చేరుస్తూ ఆధార్‌ను ఈ–పాస్‌కు అనుసంధానం చేశారు. కార్డుల్లో అలా చేర్చిన పేర్ల మీద వచ్చే బియ్యాన్ని నొక్కేశారు. ఈ తతంగం ఏళ్లుగా సాగింది. అనుసంధానంతో వెలుగుచూస్తున్న అక్రమాలు తాజాగా ఈకేవైసీ కింద రేషన్ కార్డుల్లోని సభ్యుల ఆధార్‌ను ప్రజాసాధికార సర్వేకు అనుసంధానం చేస్తుండడంతో గతంలో డీలర్లు చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్డుల్లో డీలర్లు చేర్చిన పేర్లలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఆధార్ అనుసంధానంతో కార్డులో సభ్యునిగా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు చూపిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉన్న కార్డులకు ఆటోమేటిక్‌గా నిత్యావసర సరుకుల పంపిణీ నిలిచిపోయింది. దీంతో కార్డుదారులు ఆందోళనకు గురై తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ ఆన్లైన్లో పరిశీలిస్తే తమ కుటుంబాలకు సంబంధం లేని వ్యక్తులు కార్డుల్లో సభ్యులుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిలిచిన రేషన్ పంపిణీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే వారు తెల్లరేషన్ కార్డు పొందేందుకు అనర్హులు. కానీ కొందరు డీలర్లు తమ స్వార్థం కోసం కార్డుదారులకే తెలియకుండా వారి కుటుంబీకులుగా పలువురు ఉద్యోగుల పేర్లను చేర్చారు. ఇపుడు ప్రజాసాధికార సర్వేకు రేషన్ కార్డుల్లో సభ్యుల ఆధార్ అనుసంధానంతో పాటు, ఈకేవైసీ చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డుల్లో సభ్యులుగా వారికి రేషన్ నిలిచిపోయింది. ఇలా జిల్లావ్యాప్తంగా ఈనెలలో 12 వేల కార్డులకు రేషన్ పంపిణీ ఆగింది. వీటిలో చాలా కార్డుల్లో కార్డుదారుల కుటుంబంలో సభ్యులు కాని వారి పేర్లు నమోదయ్యాయి. తహసీల్దార్ ద్వారా రిపోర్ట్ పంపించాలి రేషన్ కార్డుల్లో వారి కుటుంబ సభ్యులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల పేరు నమోదై ఉండి రేషన్ నిలిచిపోయి ఉంటే... అలాంటి కార్డుదారులు నేరుగా తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తూ అర్జీ ఇవ్వాలి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్‌లను అర్జీతో జతచేయాలి. దీనిపై తహసీల్దారు విచారణ చేసి... ఫిర్యాదు వాస్తవమేనని నిర్ధారణ అయితే... నివేదికను జిల్లా సరఫరాల శాఖకు పంపించాలి. దాన్ని ప్రభుత్వానికి పంపించి కార్డులో సంబంధం లేని సభ్యుల పేర్లను తొలగిస్తారు. అప్పుడు రేషన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి తన తెల్లరేషన్ కార్డు(డబ్ల్యూఏపీ 121102500289) తీసుకుని డీలర్ వద్దకు వెళ్లి ఈపాస్ యంత్రంలో వేలిముద్ర వేయగానే బియ్యం రాదన్నట్లుగా చూపించింది. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు విషయం చెప్పగా.. వారు ఆన్లైన్లో పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఇతని కార్డులో సంతోష్‌కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగి పేరు నమోదై ఉంది. అందువల్లే బియ్యం రాలేదని చెప్పారు. వాస్తవంగా తమ కుటుంబంలో సంతోషకుమార్ అనే వ్యక్తే లేడని, ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు అసలే లేరని ఆంజనేయులు వాపోతున్నాడు. - ఎం.ఆంజనేయులు. శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామం. వీరికి తెల్లరేషన్ కార్డు (డబ్ల్యూఏపీ 1211002500204) ఉన్నా... డీలరు బియ్యం వేయకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. ఆన్లైన్లో పరిశీలిస్తే... ఇతని రేషన్‌కార్డులోనూ సంతోష్‌కుమార్ అనే పేరు నమోదై ఉంది. అతను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రేషన్ నిలిచిపోయినట్లు చూపుతోందని అధికారులు తెలిపారు. తమ కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న సంతోష్‌కుమార్ పేరున్న వ్యక్తి ఎవరూ లేరని, ఎవరు ఎక్కించారో అర్థం కావడం లేదని బాధితుడు వాపోయాడు. - చిక్కాల నారాయణస్వామి, శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామం. -
రేషన్ దుకాణాల్లో డిజిటల్ సేవలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : బియ్యం, కిరోసిన్, సరుకుల పంపిణీకి పరిమితమైన రేషన్ దుకాణాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల అవసరాలను తీర్చే ఈ–సేవ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు అవతరించనున్నాయి. నిత్యావసర సరుకులతోపాటు సాంకేతిక సేవలను అందించేందుకు డీలర్లను, డిజిటల్æ లావాదేవీలను వినియోగదారులకు అలవాటు చేసేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. టీ–వ్యాలెట్æ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పౌర సరఫరాల అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. సేవల కేంద్రంగా.. రేషన్ దుకాణం ఇక సేవల కేంద్రంగా మారబోతుంది. కేవలం రేషన్ బియ్యమే కాకుండా ప్రజల అవసరాలు తీర్చే ఈ–సేవ కేంద్రాలుగా మారబోతున్నాయి. జిల్లాలో 609 రేషన్ దుకాణాల పరిధిలో 3,15,443 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ఈ–పాస్ విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. నూతన విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వానికి రూ.లక్షల విలువైన బియ్యం మిగులుతోంది. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకుల పంపిణీ జరుగుతోంది. ఆ తర్వాత డీలర్లకు ఎలాంటి పనిలేక ఉపాధి లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే కమీషన్‌కు బదులుగా తమకు నెల వేతనం ఇచ్చి ఇతర సదుపాయాలతో అదనపు ఆదాయ మార్గాన్ని చూపాలని డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న డీలర్ల సాదకబాధకాలు గుర్తించిన ప్రభుత్వం, రేషన్ దుకాణాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు చిన్న మొత్తం ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులను, మీ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై రేషన్ దుకాణానికి వెళితే చాలు, ఈ విధానం ద్వారా మొబైల్ రీచార్చ్, నగదు బదిలీ, విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు, బస్సు టికెట్, సర్వీస్ చార్జీల చెల్లింపు సేవలు పొందవచ్చు. తద్వారా డీలర్లకు అదనపు ఆదాయంతో పాటు వినియోగదారులకుఆయా సేవలు మరింత చేరవయ్యే అవకాశం ఉంది. ఇప్పకే ఈ–పాస్ యంత్రాల్లో కార్డుదారుల ఆధార్ సంఖ్యను అనుసంధానించడంతో జిల్లాలో 3,15,443 కుటుంబాలకు రేషన్ దుకాణాల్లో ఈ–సేవ కేంద్రాల మాదిరిగా సేవలు అందనున్నాయి. శిక్షణకు ప్రణాళిక సిద్ధం సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగి పోతుండటంతో అందుకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకొని డీలర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా ఈ–పాస్ విధానానికి టీ–వ్యాలెట్‌ను అనుసంధానం చేయనున్నారు. జిల్లాలో 23 మండలాలు ఉండగా, ఈ పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్న డీలర్లు 609 మంది ఉన్నారు. వీరందరికీ టీ–వ్యాలెట్ ద్వారా కార్డుదారులకు ఎలాంటి సేవలు అందించవచ్చు. ఆ సేవలను ఎలా అందించాలి, అందుకు ఏం చేయాలన్న దానిపై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి జిల్లాలోని రేషన్ డీలర్లకు శిక్షణ ఇవ్వడానికి పౌర సరఫరాల శాఖ షెడ్యూల్‌ను రూపొందించింది. దీంతోపాటు టీ–వ్యాలెట్ పరికరాలు అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక వ్యాలెట్ సేవలు అందుబాటులోకి రావచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. టీ– వ్యాలెట్ అమలులోకి వస్తే రేషన్ దుకాణాలు 30 రోజులు తెరిచి ఉండనున్నాయి. -
గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఖరీఫ్, రబీ సీజన్లలో వరిధాన్యం సేకరించడానికి ప్రతీ ఏడాది ఎదురవుతున్న గన్నీ బ్యాగుల కొరతను అధిగమించడానికి సివిల్ సప్లయి కార్పోరేషన్ శాఖ కొత్త మార్గాన్ని వెతుక్కుంది. కొనుగోలుకు అవుతున్న ఖర్చులో కొంత మేరకు తగ్గించుకుని నాణ్యమైన గోనే సంచులను సేకరించడానికి రేషన్ దుకాణాలను ఎంచుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాలతో పాటు మన జిల్లా సివిల్ సప్లయి అధికారులకు రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించిన అంశంపై వారం రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఇకపై రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయగా ఖాళీ అయిన సంచులను సివిల్ సప్లయి కార్పొరేషన్‌కే అప్పగించాలని సూచించారు. ఒక్క గన్నీ బ్యాగుకు రూ.16 జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో 54 శాతం కొత్తవి, 46 శాతం వినియోగించిన గన్నీ బ్యాగులు వినియోగించాలని నిబంధనలున్నాయి. అయితే కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన గన్నీలు రైస్ మిల్లులకు చేరి, అక్కడి నుంచి బియ్యంతో అవే సంచుల్లో ఎఫ్‌సీఐకి చేరి, మళ్లీ ఎఫ్‌సీఐ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గన్నీలు కొంత మేర పాడతువుతున్నాయి. దీంతో కార్పొరేషన్ శాఖకు నష్టం వాటిల్లుతోంది. మళ్లీ కొత్తవి కొనుగోలు చేయడం భారంగా మారుతోంది. బయటి మార్కెట్లో కొత్త గన్నీలు ఒకటి రూ. 22 వరకు లభిస్తోంది. అయితే రేషన్ దుకాణాలకు బియ్యం నింపిన గన్నీలు ఖాళీ అయిన అనంతరం డీలర్లు బయట విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాలకు వచ్చిన గన్నీలు నాణ్యతగా, కొత్తగా ఉండడంతో వాటిని సివిల్ సప్లయి కార్పోరేషనే కొనుగోలు చేస్తే బాగుంటుందని, పైగా ధర కూడా తక్కువ . వెంటనే డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కో గన్నీ బ్యాగుకు రూ.16ల ధరను అధికారులు కుదుర్చుకున్నారు. డీలర్లు కూడా ఇందుకు సమ్మతం తెలుపడంతో గత కొన్ని రోజులుగా రేషన్ దుకాణాల నుంచి గన్నీల సేకరణ ప్రారంభమైంది. రేషన్ బస్తాలను సరఫరా చేసిన క్రమంలోనే అదే లారీలో ఖాళీ సంచులను పంపాలని అధికారులు డీలర్లకు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విధానంతో 75వేల గన్నీ బ్యాగులు సేకరించారు. ప్రతీ నెలా 1లక్షల వరకు గన్నీలు రేషన్ దుకాణాల నుంచి సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సేకరిస్తున్నాం రేషన్ దుకాణాల నుంచి గన్నీ బ్యాగులు సేకరించాలని రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆదేశాల ప్రకారంగా ఇటీవల రేషన్ డీలర్లతో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. నిర్ణయించిన ధర ప్రకారంగా ప్రతీ నెలా ఖాళీ గన్నీలను సివిల్ సప్లయి కార్పోరేషన్‌కు అందించాలని తెలిపాం. నాణ్యమైన గన్నీలతో పాటు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో గన్నీల కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్ర శాఖ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. – అభిషేక్, డీఎం, సివిల్ సప్లయి కార్పొరేషన్, నిజామాబాద్ -
ఈ–పాస్, ఐరిస్‌తో రూ. 917 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: ఈ–పాస్, ఐరిస్ విధానంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని, ఈ ఏడాది కాలంలో ప్రభుత్వానికి రూ. 917 కోట్ల విలువ చేసే 3.52 లక్షల టన్నుల బియ్యం ఆదా అయిందని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఈపాస్, ఐరిస్ విధానం ద్వారా ప్రతి నెలా 15 నుంచి 20% వరకు బియ్యం మిగులు ఉందని వెల్లడించారు. పౌరసరఫరాల భవన్లో రేషన్ డీలర్లతో కమిషనర్ శనివారం నిర్వహించిన సమావేశంలో సబర్వాల్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి నెలా అర్హులైన 2.83 కోట్లమందికి వేల కోట్ల రూపాయల సబ్సిడీతో కిలో రూపాయి చొప్పున 6 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు, రేషన్ డీలర్లు కలసి బియ్యాన్ని అక్రమార్కులకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణాకు సహకరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ రాందాస్‌కు ప్రత్యేక బాధ్యత లు అప్పగించామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా టాస్క్‌ఫోర్స్ బృందాలకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతి నెలా రేషన్ షాపుల్లో జరిగే లావాదేవీలపై ఈ బృందాలు నిఘా పెట్టి, రైస్ మిల్లులను తనిఖీ చేస్తాయని చెప్పారు. -
రేపటి నుంచి డీలర్ల సమ్మె
కర్నూలు(అగ్రికల్చర్): కమీషన్ వద్దని, గౌరవ వేతనం చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో చౌకధరల దుకాణాల డీలర్లు ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. అయితే.. సమ్మెలోకి వెళితే లైసెన్స్ రద్దు చేస్తామన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు భయపడేది లేదని, 16 నుంచి సమ్మెలోకి వెళ్లి తీరతామని డీలర్ల సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు. జనవరి కోటా సరుకుల పంపిణీకి డీడీలు కట్టే ప్రసక్తే లేదని, క్రిస్మస్ కానుకలు కూడా పంపిణీ చేయబోమని అంటున్నారు. మండల స్థాయిలోని గోదాములకు క్రిస్మస్ కానుకలు చేరినప్పటికీ ఇంతవరకు డీలర్లకు అందలేదు. వీటిని తీసుకోబోమని తెగేసి చెబుతున్నారు. సమ్మెలోకి వెళితే డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేసి.. మహిళా సంఘాల ద్వారా క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయించాలనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. -
కమీషన్ ‘సగమే’నా..!
ఆదిలాబాద్ మండలం రామాయి గ్రామ రేషన్ డీలర్ వినోద్ చౌదరి ప్రతీ నెల 475 కార్డులకు బియ్యం పంపిణీ చేస్తాడు. 2015 అక్టోబర్ నుంచి 2018 ఆగస్టు వరకు 3,395 క్వింటాళ్ల బియ్యాన్ని కార్డుదారులకు అందజేశాడు. జాతీయ ఆహార భద్రత చట్టం–2015 ప్రకారం క్వింటాల్‌కు రూ.50 చొప్పున, ఒక్కో కార్డు ట్రాన్సక్షన్కు రూ.17 చొప్పున కమీషన్‌ను కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈ లెక్కన ఆయనకు మూడేళ్ల కమీషన్ రూ.1,69,765 రావాలి. కానీ నెల క్రితం రూ.76,765 చెక్‌ను ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మిగతా రూ.93,000 చెల్లించాల్సి ఉన్నా.. ప్రభుత్వాల నుంచి స్పష్టత లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నాడు. అంటే ఆయనకు కమీషన్ సగమే ఇచ్చారని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్‌అర్బన్: నెల రోజుల క్రితం రేషన్ డీలర్లకు చెల్లించిన బకాయిలపై తిరకాసు మొదలైంది. ప్రభుత్వాలు చెల్లించింది పూర్తి కమీషనా..? లేక సగమేనా..? అనేది తెలియక డీలర్లలో గందరగోళం నెలకొంది. ట్రాన్సక్షన్ ప్రకారం డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ మొత్తం చెల్లించామని, లేక సగమే ఇచ్చామని అటు కేంద్ర ప్రభుత్వం గానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పష్టతనివ్వకపోవడంతో వారిని అయోమయానికి గురిచేస్తోంది. ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం కమీషన్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా జవాబు దొరకడం లేదు. కాగా, కేంద్రం నుంచి ఎంత కమీషన్ వచ్చిందో అంతే మొత్తాన్ని డీలర్లకు అందజేశామని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు పేర్కొనడంతో డీలర్లు అయోమయంలో పడ్డారు. బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సంతోషపడిన డీలర్లు తమకు వచ్చిన చెక్కులతో కంగుతిన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నగదు నిర్ణయించడం, ఏ లెక్కన కమీషన్ ఇచ్చారో స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ రూ.25కు మించి రాలేదా..? జాతీయ ఆహార భద్రత చట్టం–2015 అమల్లోకి రాకముందు కిలోకు రూ.20 పైసల చొప్పున క్వింటాల్‌కు రూ.20 డీలర్లకు కమీషన్ వస్తుండేది. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కమీషన్ రూ.70కి పెరిగింది. ఈ లెక్కన ప్రతి క్వింటాల్‌కు రూ.70 చొప్పున ప్రభుత్వాలు కమీషన్ ఇవ్వాలి. ఇందులో కేంద్రం ప్రభుత్వం రూ.35 చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.35 చెల్లించాలి. అయితే 2015 అక్టోబర్ నుంచి 2018 ఆగస్టు వరకు ప్రభుత్వాల నుంచి డీలర్లకు కమీషన్ రావాల్సి ఉంది. ఇదీ కాకుండా ఆన్లైన్ ద్వారా ఒక్కో కార్డు ట్రాన్సక్షన్ చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.17 అదనంగా ఇస్తోంది. జిల్లాలో 355 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వీరందరికీ 35 నెలలకు సంబంధించిన కమీషన్ బకాయిలు సుమారు రూ.14.74 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, ఇందులో నుంచి గత నెలలో రూ.6.74 కోట్లు విడుదల చేశారు. ఇంకా దాదాపు రూ.8 కోట్లు రావాల్సి ఉంది. అంటే ప్రస్తుతం వచ్చిన కమీషన్ సగానికి మించలేదని, క్వింటాల్‌కు రూ.22.50 వచ్చిందని డీలర్ల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. అరకొరగా.. అయోమయంగా.. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.35, రాష్ట్ర ప్రభుత్వం రూ.35 చెల్లించాలి. కానీ అరకొరగా రావడంతో డీలర్లు ఆమోమయానికి గురవుతున్నారు. ఇదెక్కడి న్యాయమని డీలర్లు గగ్గోలు పెడుతూ రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులను కలిసి ఏ లెక్కన ఈ చెక్కులు ఇచ్చారని ప్రశ్నిస్తే సమాధానం దొరకడం లేదు. డీలర్లు పంపిణీ చేసిన బియ్యానికి వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే.. జిల్లాకు రూ.14.74 కోట్లు బకాయిలు రావాలని, కండితుడుపుగా ఈ బకాయిలు ఇచ్చారని డీలర్ల సంఘం నాయకులు పేర్కొనగా, ఆహార భద్రత చట్టం ప్రకారం ఉన్న కార్డుల సంఖ్యను బట్టే కమీషన్ ఇచ్చామని, ఇంకా బకాయిలు పెండింగ్‌లో లేవని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయా.. లేదా అనే సందేశం సర్వత్రా వ్యక్తమవుతోంది. బకాయిలు పెండింగ్‌లో లేవు డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్ బకాయిలను గత నెల రోజుల క్రితం పంపిణీ చేశాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎలాంటి కమీషన్ బకాయిలు పెండింగ్‌లో లేవు. ప్రభుత్వం నుంచి మన జిల్లాకు ఎంత వచ్చిందో అంతే మొత్తం కమీషన్ నగదును చెక్కులు రూపంలో డీలర్లకు ఇచ్చేశాం. – సుదర్శన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
వైఎస్ జగన్‌ను కలిసిన రేషన్ డీలర్లు
-
కొత్త చట్టం వచ్చింది..రేషన్ డీలర్లు జాగ్రత్త
నెల్లూరు(అర్బన్): పౌర సరఫరాలకు సంబంధించి ప్రభుత్వం గత నెల 11న పాత చట్టం స్థానంలో కంట్రోలర్ ఆర్డర్– 2018 అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని జేసీ వెట్రి సెల్వి తెలిపారు. కొత్తచట్టం ప్రకారం రేషన్ డీలర్లు ఏ మాత్రం మోసాలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో రేషన్ డీలర్లకు కంట్రోలర్ ఆర్డర్–2018పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడినా..సకాలంలో డీడీలు చెల్లించకపోయినా..రేషన్ దుకాణాన్ని సమయం ప్రకారం తీయకపోయినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. గతంలో 6(ఏ) కేసులు నమోదు చేసేవారని, కొత్త చట్టం ప్రకారం 420 కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల డీలర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈపాస్ యంత్రంలో వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఐరిష్ ద్వారా సరకులు ఇవ్వాలని సూచించారు. ఐరిష్ పని చేయని చోట 15వ తేదీ తరువాత మూడ్రోజుల పాటు వీఆర్వో ద్వారా సరుకులు ఇవ్వాలన్నా రు. వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారామపురం, తడ, కొండాపురం, గూడూరు, అనంతసాగరం, రాపూరు, తదితర మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా లేదన్నారు. రేషన్ సరకులు ఇచ్చిన తరువాత పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని లక్షమందికి ఫోన్ చేసి సరుకులు సక్రమంగా ఇస్తున్నారా.. తూకాల్లో మోసాలు చేస్తున్నారా.. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయానే వివరాలు సేకరిస్తున్నారన్నారు. అందువల్ల డీలర్లు జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని నూతన ఓటర్లుగా చేర్పించేందుకు సహకారించాలని కోరారు. అనంతరం ప్రజాపంపిణీలో 100 శాతం మించి సరుకులు అందించిన ఐదుగురు డీలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల రేషన్ డీలర్లు, డీఎస్ఓ, ఏఎస్ఓ, డిప్యూటీ తహసీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు వచ్చేశాయ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రేషన్ డీలర్ల కమీషన్ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. బియ్యం పంపిణీ చేసిన డీలర్లకు పెంచిన కమీషన్‌కు సంబంధించి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో రేషన్ డీలర్‌కు ఎంత రావాల్సి ఉందనే లెక్కలు తేలుస్తున్నారు. ఇదివరకు రేషన్ బియ్యం పంపిణీపై కిలోకు 20 పైసల చొప్పున కమీషన్ ఇచ్చేవారు. అయితే కమీషన్ పెంపుతో పాటు గౌరవ వేతనాన్ని ఇవ్వాలనే డిమాండ్‌తో రేషన్ డీలర్లు ప్రభుత్వంపై దశలవారీగా వత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు ప్రభుత్వం 2015 అక్టోబర్ నుండి కేజీ బియ్యానికి కమీషన్‌ను 70 పైసలు చెల్లించేందుకు నిర్ణయించింది. ఇదివరకు చెల్లించిన 20 పైసలు పోను మిగతా 50 పైసలు ఇప్పుడు చెల్లించేందుకు నిర్ణయించడంతో బకాయి మొత్తాలను చెల్లించే చర్యల్లో వేగం పెంచారు. జిల్లా డీలర్లకు రూ.10.80 కోట్లు గతంలో ఇచ్చిన 20 పైసల కమీషన్‌ను 70 పైసలకు పెంచిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని అక్టోబర్ 2015 నుండి చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని డీలర్లకు రూ.10.80 కోట్లు చెల్లించనున్నారు. ఈ బకాయిలను తహసీల్దార్ల నివేదికల ఆధారంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో బకాయిలు చెల్లించే పీరియడ్‌లో రేషన్ డీలర్లు ఎవరైనా సెలవులో వెళ్లినా, 6ఏ కేసులు నమోదైనా, చనిపోయిన వారున్నా... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి కేసుల్లో ఇన్చార్జిలకు బకాయి కమీషన్ అందనుంది. ఈ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే బకాయిలు చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. మొదటి విడతలో ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కొనసాగుతున్న రేషన్ డీలర్లకు, రెండో విడతలో మిగిలిన వారికి బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా కాలం నాటి బకాయిలు ఇక్కడే... ప్రభుత్వం 2015 అక్టోబర్ నుండి రేషన్ డీలర్లకు పెంచిన కమీషన్ చెల్లించాలని నిర్ణయించారు. అయితే, జిల్లాల విభజనకు ముందు సమయం నాటి కమీషన్‌ను డీలర్లు అందరూమహబూబ్‌నగర్ డీసీఎస్ఓ కార్యాలయం నుండే పొందాల్సి ఉంటుంది. అయితే నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలోని ఆర్డీఓల నుండి జిల్లాల విభజన సమయం వరకు పనిచేసిన రేషన్ డీలర్ల వివరాలతో కూడిన నివేదిక పంపించాల్సి ఉంది. 2016 అక్టోబర్ 12న జిల్లాల పునర్విభజన జరిగింది. అంతకు ముందు రోజు వరకు పనిచేసిన రేషన్ డీలర్ల వివరాలను సంబంధింత ఆర్డీఓల ద్వారా నివేదిక రాగానే కమీషన్ చెల్లిస్తారు. జిల్లాల విభజన అనంతరం కమీషన్‌ను అక్కడి డీసీఎస్‌ఓల ద్వారానే పొందాల్సి ఉంటుంది. డీలర్లతో సమావేశం ప్రభుత్వం బకాయిల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్న దృష్ట్యా మొదటి విడతలో 730 మంది డీలర్లకు చెల్లింపులు చేయనున్నట్లు డీసీఎస్ఓ శారదాప్రియదర్శిని తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లోని డీసీఎస్ఓ కార్యాలయంలో శుక్రవారం ఆమె మండలానికి ఇద్దరు డీలర్లతో సమావేశమయ్యారు. ఎలాంటి కేసులు లేకుండా రెగ్యూలర్‌గా బియ్యం పంపిణీ చేసిన రేషన్ డీలర్లు 730 మంది ఉండగా కేసులు, సెలవులు, చనిపోయిన వారు 74 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి కేసులు లేని వారికి మొదటి విడతగా రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయిస్తామని ఆమె తెలిపారు. అదే పనిలో ఉన్నాం... రేషన్ డీలర్లకు బకాయి కమీషన్ డబ్బులు కిలో రేషన్ బియ్యానికి 50 పైసల చొప్పున చెల్లించనున్నాం. 2015 అక్టోబర్ నుంచి డీలర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో రేషన్ డీలర్లకు రావాల్సిన బకాయి కమీషన్ డబ్బు చెల్లింపునకు కసరత్తు చేస్తున్నాం. తహసీల్దార్లు, ఆర్డీఓల ద్వారా నివేదికలు అందాల్సి ఉంది. మా కార్యాలయ సిబ్బంది అదే పనిలో నిమగ్నమయ్యారు. – శారదా ప్రియదర్శిని, డీసీఎస్ఓ -
‘ప’రేషన్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాక్ పాయింట్ల నుంచి చౌక దుకాణాల వరకు అక్రమాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సిబ్బంది, మరోవైపు డీలర్లు ‘రేషన్’ కొల్లగొడుతున్నారు. పేదల పొట్టకొడుతూ బ్లాక్మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా కాలంగా ఇదే తంతు కొనసాగుతున్నా..పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇటు పౌరసరఫరాల శాఖ గానీ, అటు తూనికలు, కొలతల శాఖ గానీ శ్రద్ధ చూపకపోవడంతో కార్డుదారులు నష్టపోతున్నారు. రసీదులేవీ?: చౌక దుకాణంలో సరుకులు తీసుకునే కార్డుదారులకు ఈ–పాస్ మిషన్ నుంచి వచ్చే రసీదులను విధిగా ఇవ్వాలి. జిల్లాలో 2,436 చౌక దుకాణాలు ఉండగా.. ఏ ఒక్క దాంట్లోనూ రసీదులు ఇస్తున్న దాఖలాలు లేవు. రసీదులు ఇస్తే తమ అక్రమాలు బయట పడతాయనే ఉద్దేశంతో డీలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ తూకం తక్కువ ఇస్తూ కార్డుదారులను దగా చేయడం డీలర్లకు పరిపాటిగా మారింది. ఈ మోసాన్ని అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతల శాఖపై ఉంది. అయితే.. ఈ శాఖ టార్గెట్‌కు అనుగుణంగా కేసులు నమోదు చేసి..చేతులు దులిపేసుకుంటోంది. స్టాక్ పాయింట్ల నుంచే అక్రమాలు.. అక్రమాల పర్వం స్టాక్ పాయింట్ల నుంచే మొదలవుతోంది. నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ కాటాలతో తూకం వేసి డీలర్లకు సరుకులివ్వాలి. జిల్లాలోని ఏ స్టాక్ పాయింట్లోనూ ఇలా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. స్టాక్ పాయింట్లలోనే క్వింటాల్‌కు ఐదు కిలోల వరకు కోత కోసి బియ్యం ఇస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని డీలర్లు మరింత చెలరేగిపోతున్నారు. తూకంలో రెండు కిలోల డబ్బా వాడుతూ.. దాని బరువు మేర బియ్యం కాజేస్తున్నారు. 25 కిలోల బియ్యం ఇవ్వాలంటే రెండుసార్లు తూకం వేయాలి. అంటే 25 కిలోల బియ్యంలో డీలర్లు నాలుగు కిలోల వరకు కాజేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంత్యోదయ కార్డులకు విధిగా 35 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలి. అనేక మంది డీలర్లు 30 నుంచి 32 కిలోల వరకే ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 50 వేల క్వింటాళ్ల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఈ నెల నుంచి కార్డుకు రెండు కిలోల ప్రకారం ఇస్తున్న జొన్నలకు డిమాండ్ ఉంది. అయితే.. బియ్యంలో రెండు కిలోలు తగ్గించి.. ఆ మేర జొన్నలు ఇవ్వడంపై కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందే ప్యాక్ చేసి.. బియ్యం, చక్కెర, జొన్నలు తదితర సరుకులను విధిగా కార్డుదారుల ముందే తూకం వేసి ఇవ్వాల్సి ఉంది. కానీ డీలర్లు చక్కెరను ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకొని ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతి 500 గ్రాములకు 100 గ్రాముల చొప్పున కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముందుగా తూకం వేసిన సరుకులను తీసుకోరాదని, తమ సమక్షంలోనే తూకం వేయించుకోవాలనే విషయంపై కార్డుదారులకు అవగాహన కల్పించే చర్యలు కరువయ్యాయి. డీలర్లు సేవల్లో నాణ్యత పాటించకపోయినా, రసీదు ఇవ్వకపోయినా, అనుచితంగా ప్రవర్తించినా 1100కు లేదా 1800114000 నంబరుకు ఫోన్ చేయవచ్చన్న విషయం కార్డుదారులెవరికీ తెలియదు. యాక్టివ్‌లోకి తెచ్చుకోవడానికి తంటాలు రేషన్‌కార్డు ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటుందో, ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌లోకి పోతుందో తెలియని పరిస్థితి. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లోకి వెళితే.. దాన్ని యాక్టివ్‌లోకి తెచ్చుకోవాలంటే కార్డుదారులు చుక్కలు చూడాల్సి వస్తోంది. ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలని, ఈకేవైసీ వేసి ఉండాలనే నిబంధన పెట్టారు. నాలుగైదు నెలల క్రితం ఒక్క కర్నూలు నగరంలోనే 8,200 కార్డులను ఇన్‌యాక్టివ్‌లో పెట్టారు. కార్డుదారులు ప్రతి నెలా సరుకులు తీసుకుంటున్నా.. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లో పెట్టడంతో బాధితుల ఆందోళన అంతాఇంతా కాదు. యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు కార్డుదారులు అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ దాదాపు ఐదువేల మందికి సమస్య పరిష్కారం కావడం లేదు. -
కొత్త పంచాయతీల్లోనూ రేషన్ షాపులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లోనూ రేషన్ షాపులు ఏర్పాటు చేయా లని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రేషన్ కార్డుల సంఖ్య ఆధారంగా షాపులను క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. రేషన్ డీలర్ల సమస్యలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం ఈటల అధ్యక్షతన సమావేశమైంది. హైదరాబాద్‌లోని మంత్రి లక్ష్మా రెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ షాపుల ఏర్పాటు, రేషన్ డీలర్ల కమీషన్ పెంపుపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్వింటాల్ బియ్యానికి డీలర్లకు రూ.20 చెల్లిస్తున్నారని, ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం కమీషన్‌ను రూ.87కు పెంచిందని అకున్ స బర్వాల్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ. 250కి పైగా చెల్లిస్తున్నారని, డీలర్లు రూ.300 వరకు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో డీలర్లు కోరిన మేర కమీషన్ పెంచి తే ఎంతభారం అవుతుందన్న దానిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం కోరింది. రూ.300 కమీషన్ ఇవ్వాలి రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు ఈటలను సచివాలయంలో కలిశారు. ఇతర రాష్ట్రాల కన్నా ఆదర్శంగా, గౌరవంగా డీలర్లకు క్వింటాల్‌పై రూ.300 కమీషన్ ఇవ్వాలని విన్నవించారు. -
రేషన్ డీలర్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు ఈ నెల ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించారు. సమస్యల పరిష్కారంపై మంగళవారం ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో వారికి స్పష్టమైన హామీ లభించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. విడతల వారీగా బకాయిల విడుదలకు ప్రభుత్వం ఓకే చెప్పగా, కమీషన్ల పెంపు, కనీస గౌరవ వేతనంపై సీఎం కేసీఆర్ చర్చిం చి నిర్ణయం చేస్తామన్న ప్రభుత్వ హామీ నేపథ్యంలో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. కనీస వేతనాల అమలు, పెండింగ్ బకాయిల విడుదల, కమీషన్ పెంపుపై గత కొన్ని రోజులుగా డీలర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పలుమార్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల ఒకటి నుంచి డీలర్లు సమ్మెకు దిగారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వారికి నోటీసులివ్వడంతో పాటు ప్రత్యామ్నాయంగా మహిళా సంఘాలతో సరుకుల పంపిణీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. కమీషన్లు, బకాయిలపై చర్చ డీలర్లపై సస్పెన్షన్లకు సైతం ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో డీలర్లు మంగళవారం మినిష్టర్ క్వార్టర్స్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మరో దఫా చర్చలు జరిపారు. వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈ చర్చలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మరోమారు తమ సమస్యలను డీలర్లు ఏకరువు పెట్టారు. చాలా రాష్ట్రాల్లో డీలర్లకు క్వింటాల్‌పై రూ.70కి పైనే కమీషన్లు ఇస్తున్నా, రాష్ట్రంలో కేవలం రూ.20 మాత్రమే ఇస్తున్నారని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రూ.70 కమీషన్లో కేంద్ర వాటా రూ.35 ఇవ్వాల్సి ఉన్నా, దానిని ఇవ్వడం లేదని తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన 2014 అక్టోబర్ ఒకటి నుంచి మొత్తంగా రూ.300కోట్ల బకాయిలు ఉన్నాయని, వీటిని త్వరగా విడుదల చేయాలని కోరారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ కమీషన్లు పెంచుతామని, అయితే ఎంత చేయాలన్న దానిపై సీఎంతో చర్చించి నిర్ణయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. కనీస వేతనాలపై కమిటీ డీలర్ల కనీస వేతనాల అమలుపై కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ నిర్ణయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల హామీనిచ్చారు. అప్పటివరకు సమ్మె విరమించాలని కోరారు. ఒకట్రెండు రోజు ల్లో మరోసారి భేటీయై సమస్యలపై చర్చిద్దామన్నారు. దీనికి అంగీకరించిన డీలర్లు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఇక సరుకులకై డీడీలు కట్టేందుకు గడువు ముగిసినందున, 4 రోజులు గడువు పొడిగించాలని విన్నవించారు. దీనికి ఈటల ఓకే చెప్పారు. సమావేశం అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల సమ్మె విరమణ హర్షదాయకమని, వారి డిమాండ్లపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. డీలర్ల సమ్మె విరమణను పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వాగతించారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకముంది: డీలర్ల సంఘం తమ సమస్యలు పరిష్కరించి, న్యాయం చేస్తారనే నమ్మకం సీఎం కేసీఆర్‌పై ఉందని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు, దాసరి మల్లేశం అన్నారు. అందుకే సమ్మె విరమిస్తున్నామని వారు తెలిపారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -
సమ్మె విరమించిన రేషన్ డీలర్లు
సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్స్ సంఘం నేత రమేష్ ప్రకటించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిల విడుదల, కనీస వేతనంపై హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు వెళతామని రమేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ.. మాకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వాజీర్ ఖాన్ కుటుంబాన్ని అదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. డిప్యూటీ స్పీకర్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ స్పీకర్, మంత్రులకు డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. -
తెలంగాణ రేషన్ డీలర్ల సమ్మె విరమణ
-
రేషన్ డీలర్లతో చర్చలు జరపాలి
కరీంనగర్ సిటీ : తెలంగాణ ప్రభుత్వం వెంటనే రేషన్ డీలర్లతో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. శనివారం కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో గజ్వేల్‌లో డీలర్ వజీన్‌ఖాన్ ఆత్మహత్యాయత్నం చేసినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రేషన్ డీలర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమస్యలను విన్నవించుకుంటే స్పందించని ప్రభుత్వం సమ్మెను విచ్చిన్నం చేయడానికి అన్ని విధాలా బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. సమస్యలు పరిష్కరించకుండా డీడీలు కట్టాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. సస్పెన్షన్ నోటీసును చూసి గజ్వేల్‌కు చెందిన డీలర్ ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో ఉన్నాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్‌డీలర్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు కూర ధర్మరాజు, జిల్లా కార్యదర్శి సదానందం, రాష్ట్ర రేష న్ డీలర్ల మహిళా అధ్యక్షురాలు వసంత, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే హైదర్, జిల్లా కోశాధికారి గాలి గట్టయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి శరణ్‌కుమార్, నాయకులు శ్రీనివాస్, రవీందర్, లక్ష్మణ్, నరేష్, రమేశ్, ప్రతాప్, భాస్కర్, రాజేశ్వర్‌రావు, నర్సయ్య, శ్రీనివాస్, చంద్రమౌళి, అశోక్, నర్సిం హారెడ్డి, శంకర్లింగం, రాము తదితరులున్నారు. -
‘కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారు’
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా సస్పెండ్ చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని రేషనడీలర్లు శనివారం టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రేషన్ డీలర్లను తొలగిస్తే తొలగిపోయేది ప్రభుత్వమేనని అన్నారు. డీలర్లపై కక్షసాధింపు ధోరణి సహించమని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఐదేళ్ల కోసం తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వమేనని, డీలర్లు శాశ్విత ప్రాతిపదికన నియమించబడ్డారని అన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా డీలర్ల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరారు. నాలుగేళ్లుగా డీలర్లకు రావాల్సిన 417 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెల క్వింటాలకు ఇవ్వాల్సిన 87 రూపాయలను చెల్లించి, 30000 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్న డీలర్ల డిమాండ్లపై కమిటీ వేయాలన్నారు. అవసరమైతే డీలర్ల సమస్యపై న్యాయపరంగా తాను పోరాడతానని జీవన్ రెడ్డి తెలిపారు. -
రేషన్ డీలర్ల సమ్మెలో అపశ్రుతి
సాక్షి, సిద్ధిపేట : వేతనాలు డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు చేస్తున్న సమ్మెలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని వజీర్ ఖాన్ అనే రేషన్ డీలర్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతనికి గాయాలు కావడంతో యశోదా ఆసుపత్రికి తరలించారు. రేషన్ డీలర్లపై ప్రభుత్వ వైఖరితో వజీర్ మనస్తాపం చెందాడని అతని బంధువులు చెబుతున్నారు. వజీర్ ఖాన్ గజ్వేల్‌లో రేషన్ డీలర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. -
రేషన్ డీలర్ల సమ్మెలో అపశ్రుతి
-
నకిలీ వేలిముద్రల స్కాంలో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్: నకిలీ వేలిముద్రల స్కాంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. స్కాం నిందితులు రేషన్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ వేలముద్రలతో బియ్యం అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగి నలుగురు రేషన్ డీలర్లను అదుపులోకి తీసుకుంది. కాగా, నకిలీ వేలిముద్రల స్కాంలో నిందితుడు పాత సంతోష్ కుమార్‌ను పోలీసులు రెండవరోజు విచారణ జరుపుతున్నారు. సంతోష్‌ను గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం తరలించిన ఎస్సార్ నగర్ పోలీసులు ధనలక్ష్మీ కమ్యునికేషన్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వేలుముద్రలతో పాటు కొన్ని కీలక పత్రాలు, ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు స్వాదీనం చేసుకున్నారు. ఓ కంప్యూటర్, నకిలీ వేలిముద్రల తయారీ యంత్రాన్ని కూడా గుర్తించారు. కాగా ఈరోజుతో సంతోష్ పోలీస్ కస్టడీ ముగియనుంది. -
తెలంగాణలో రేషన్ డీలర్లకు నోటీసులు జారీ
-
తెలంగాణ రేషన్ డీలర్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేషన్ డీలర్లకు నోటీసులు జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేషన్‌డీలర్ల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, సస్పెన్షన్‌కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు జులై 5 నుంచి 10 వరకు నిత్యావసర సరకుల పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. స్థానికి పరిస్థితులనుబట్టి సరుకుల పంపిణీ పొడగిస్తామని వెల్లడించారు. రేషన్ డీలర్లు తమ బాధ్యతలను విస్మరించడం బాధకరమన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు సమ్మె విరమణకు అంగీకరించని నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. గ్రామాల్లోని ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) మహిళా సంఘాలతో సరుకుల పంపిణీ చేయించేలా ఏర్పా ట్లు చేస్తోంది. ఈ నెల 28 వరకు డీలర్లకు డెడ్‌లైన్ విధించడంతో అంతవరకు వేచిచూసిన తర్వాత తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ జిల్లా డీఎస్వోలు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 28 నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా ల వారీగా కార్యాచరణ సిద్ధం చేసుకురావాలని ఆదేశించారు. అదే రోజున గ్రామాల వారీగా సరుకుల పంపిణీ చేసే ప్రాంతాన్ని గుర్తించడం, మహిళా సంఘాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సరుకుల పంపిణీకి డీలర్లు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సరుకులు అందించడం బాధ్యత.. ఈ నెల 28 వరకు మీ–సేవ కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్ఓ (రీలీజ్ ఆర్డర్) తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని పౌర సర ఫరాల శాఖ మంగళవారం డీలర్లకు విజ్ఞప్తి చేసింది. పేదలకు నిత్యావసర సరుకులను సకాలంలో అం దించాల్సిన కనీస బాధ్యత రేషన్ డీలర్లపై ఉందని పేర్కొంది. తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ కం ట్రోలర్ ఆర్డర్ 2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. నిర్దేశిత గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగిస్తామంది. సకాలంలో సరుకులు ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది. -
ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చలు విఫలం
-
తెలంగాణలో రేషన్ డీలర్ల సమ్మెబాట
-
విలేజ్ మాల్స్ ఓ విఫల ప్రయోగం
చంద్రన్న విలేజ్ మాల్స్... ప్రభుత్వం ఆర్భాటంగా ఆరంభించింది. కాని చిత్తశుద్ధి లోపంతో అటు వినియోగదారులకు కొరగాకుండా, ఇటు నిర్వాహకులైన డీలర్లకు ప్రయోజనం లేకుండా ఉన్నాయి. ఆదాయం లేని మాల్స్ ఏర్పాటుకు రేషన్ డీలర్లు వెనుకంజ వేస్తున్నారు. వెయ్యికి పైగా దరఖాస్తుదారులు ముందుకొచ్చినా ఆర్నెల్లలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కేవలం వందకు మించి మాల్స్ ఏర్పాటు చేయలేకపోవడం ఇందుకు నిదర్శనం. హోల్‌సేల్ మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకోకుండా, సరుకుల ధరల నిర్ణయం, విధివిధానాల్లో డీలర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఇందుకు కారణాలు. ఇలాగే కొనసాగితే చంద్రన్న విలేజ్ మాల్స్, నాటి గృహమిత్ర పథకంలాగే చరిత్రకు పరిమితమయ్యే ప్రమాదం ఉంది. తెనాలి:రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 6,500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, వీటిని నిర్వహించే డీలర్లకు నెలకు రూ.10–15 వేల ఆదాయం కల్పించడం తమ ధ్యేయంగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత మార్చి 30న తెనాలిలో చంద్రన్న విలేజ్ మాల్ ప్రారంభ సభలో ప్రకటించారు. మంత్రి చేసిన ప్రకటన వాస్తవరూపం దాల్చనేలేదు. నిజానికి 2017 డిసెంబరులో ఆరంభించిన ఈ పథకంలో ఇప్పటికి కేవలం 100 మాల్స్ మాత్రమే నడుస్తున్నాయి. మాల్లో అన్ని రకాల సరుకులను బయట మార్కెట్ కన్నా 5–10 శాతం తక్కువ ధరలతో విక్రయించేలా చూస్తామని చెప్పిన దానికి భిన్నంగా, నూనెలు మినహా నిత్యావసరాలు దాదాపుగా బయట మార్కెట్‌కన్నా ఎక్కువగా ఉండడంతో వినియోగదారుల ఆదరణ కోల్పోతున్నాయి. కందిపప్పు కిలో బయ ట మార్కెట్లో రూ.63కు విక్రయిస్తుంటే విలేజ్ మాల్స్‌లో రూ.69కు అమ్ముతున్నారు. ఈ లెక్కన అర కిలో ప్యాకెట్‌ను రూ.37కు ఇస్తున్నారు. అంటే రెండుసార్లుగా రెండు అరకిలోల కందిపప్పును కొనుగోలు చేసే పేద వినియోగదారుడు రూ.74 చెల్లించాల్సి వస్తోంది. సబ్బులు, రవ్వలు మినహా ఇతర సరకుల ధరలు మార్కెట్‌కు మించి రూ.5–12 శాతం హెచ్చుగా ఉంటున్నాయి. మాల్ ఏర్పాటు వ్యయం, సరుకుల అమ్మకాల్లో ఇచ్చే కమీషనుపై చెప్పిన మాటలకు ఆచరణకు పొంతన లేకపోవడంతో నష్టానికి వ్యాపారం ఎలా చేస్తామంటూ, డీలర్లు సణుగుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా 2017 డిసెంబరులో ఆరంభించినపుడు 2 నెలలపాటు డీలరుకు నూనెలపై 3.4 శాతం, ఇతర సరుకులపై 8 శాతం కమీషను ఇచ్చారు. ఇదేదో బాగుందనుకుంటూ రాష్ట్రమంతా డీలర్లు ముందుకొచ్చారు. మార్చి నుంచి ప్రారంభించిన విలేజ్‌మాల్స్‌కు పప్పులు, నూనెలపై ప్యాకెట్ల లెక్కన కిలోకు రూపాయి, ఇతర సరుకులపై 3.5 నుంచి 4 శాతం కమీషనునే ఇస్తున్నారు. డీలర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా 50 శాతం మార్జిను తగ్గించేశారు. దీనితో నెలలో రూ.2 లక్షల విలువైన సరుకులు అమ్మితే రూ.8 వేలు వస్తే, అన్లోడింగ్ చార్జీలు, అదనపు అద్దె, కరెంటు బిల్లు, సహాయకుడి వేతనం, పేపర్ రోల్స్ ఖర్చులు లెక్కించుకుంటే మిగిలేదేమీ ఉండడం లేదని డీలర్ల ఆవేదన. రేషను దుకాణాన్ని చంద్రన్న విలేజ్‌మాల్‌గా తీర్చిదిద్దడానికయే వ్యయంలో 25 శాతం డీలరు, 25 శాతం ప్రభుత్వం, మిగిలిన 50 శాతం రిలయన్స్/ ఫ్యూచర్ కంపెనీ భరిస్తుందని చెప్పారు. డీలరు వాటాను ముద్ర రుణంగా ఇప్పిస్తామని నమ్మబలికారు. తర్వాత తన వాటా లేకుండా ప్రభుత్వం చేతులు దులుపుకొంది. దీంతో 50 శాతం ఖర్చును డీలర్లే భరించాల్సివచ్చింది. తీరా ఇప్పుడు చంద్రన్న బోర్డు, ర్యాక్‌లు మాత్రమే రిలయన్స్ సప్లయి చేస్తుందని, మిగిలిన ఖర్చంతా డీలరే భరించాలనీ, కావాలంటే ఆ మొత్తాన్ని రిలయన్స్ సంస్థ 8 శాతం వడ్డీకి సమకూరుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మార్పుపై డీలర్లకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు. -
తెలంగాణలో రేషన్ డీలర్ల సమ్మెబాట
-
అవేవీ అడగొద్దు..ఇచ్చింది తీసుకోండి!
సత్తెనపల్లి: మార్కెట్లో పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పేదలకు చౌకధరలకు నిత్యావసర సరుకులు అందించాల్సిన ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. రూ.185కే తొమ్మిది రకాల సరుకులు అందజేస్తామంటూ గతంలో ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటే మరిచింది. పైగా చౌక దుకాణాలను విలేజ్ మాల్స్‌గా మార్చుతామంటూ గొప్పలకు పోతోంది. దీంతో పేదలు పూట గడవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా చౌక దుకాణాలు కేవలం బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి చౌక దుకాణాల ద్వారా నిరుపేదలకు తొమ్మిది రకాల సరుకులు అందుతుండేవి. టీడీపీ అధికారంలోకి రాగానే కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, ఉప్పు, గోధుమపిండి తదితర సరుకులన్నీ పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలో మొత్తం 2,775, చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో అన్నపూర్ణ కార్డులు 1,077, అంత్యోదయ కార్డులు 74,594, తెల్లకార్డులు 13,79,094 ఉన్నాయి. తెల్ల కార్డుల వారికి ఒక్కక్క కుటుంబ సభ్యుడికి ఐదు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. 9 వస్తువులకు స్వస్తి అమ్మ హస్తం పేరుతో గతంలో రూ.185లకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను ప్రభుత్వం ప్రతినెలా చౌకదుకాణాల ద్వారా పంపిణీ చేసింది. కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో గోధుమపిండి, కిలో గోధుములు, అరకిలో పంచదార, కిలో ఉప్పు, అరకిలో చింతపండు, 250 గ్రాములు కారం, 100 గ్రాములు పసుపు ఇచ్చేవారు. ప్రసుత్తం మార్కెట్లో కిలో కందిపప్పు రూ.65, లీటర్ పామాయిల్ రూ.78, కిలో గోధుమపిండి రూ.45, కిలో గోధుములు రూ.35, అరకిలో పంచదార రూ.17, కిలో ఉప్పు రూ.14, అరకిలో చింతపండు రూ.90, కారం 250 గ్రాములు రూ.40, పసుపు 100 గ్రాములు రూ.17గా ఉన్నాయి. తొమ్మిది రకాల సరుకులు ప్రస్తుత మార్కెట్లో రూ.401 పలుకుతున్నాయి. అయితే ఇవన్నీ చౌకదుకాణంలో రూ.185లకే దక్కేవి. భగ్గుమంటున్న ధరలు చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులన్నీ ఇచ్చేటప్పుడు పేదలకు ఊరట ఉండేది. ప్రసుత్తం ప్రభుత్వం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుండటంతో మిగిలిన సరుకులను కార్డు దారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కిరోసిన్, గోధుమపిండి, చక్కెర, పామాయిల్ పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడడంతో కార్డుదారులపై అదనపు భారం పడింది. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు ఆకలి తీర్చేందుకు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా అన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని పేదలు కోరుతున్నారు. ఈ–పాస్‌తో ఇక్కట్లు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు, సిమెంట్ పనులు చేసుకునే వారి చేతి వేలిముద్రలు అరిగి పోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చౌక దుకాణాల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి తీరా తమ వంతు వచ్చాక ఈ–పాస్ యంత్రాలు సిగ్నల్ అందకపోవడం, వేలిముద్రలు పడక పోవడంతో మళ్లీ, మళ్లీ వెళ్లాల్సి రేషన్ షాపులకు వెళ్లాల్సి వస్తోందని, ఫలితంగా కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కొనలేకపోతున్నాం మార్కెట్లో ఏ సరుకులు కొనాలన్నా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చౌకదుకాణాల్లో బియ్యం మాత్రమే అందించడం వల్లన మిగిలిన సరుకులు కొనుగోలుకు ఇబ్బందిగా ఉంది. భవిష్యత్తులో ఆ బియ్యం పంపిణీ కూడా ఎక్కడ ఆపేస్తారేమోననే అనుమానం వెంటాడుతోంది.–జెట్టి కమల, మహిళ, నందిగామ -
16 నుంచి రేషన్ షాపుల మూసివేత
పెద్దఅంబర్‌పేట(ఇబ్రహీంపట్నం): రేషన్ డీలర్లు గర్జించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించాలని నిరసన గళం వినిపించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 16 నుంచి రేషన్‌షాపులను మూసివేయనున్నట్లు రాష్ట్ర రేషన్ డీలర్ల ఉమ్మడి కార్య నిర్వహణా సంఘం ప్రతినిధులు ప్రకటించారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రం గారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో గురువారం రేషన్ డీలర్ల గర్జన సభ నిర్వహించారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది డీలర్లు్ల తరలివచ్చారు. రేషన్ డీలర్లకు ప్రతినెలా రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సమస్యలపై నాలుగేళ్లుగా పౌర సరఫరాల అధికారుల కు వినతిపత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కరించ కుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలకు, ప్రజలకు మ«ధ్య వారధిగా ఉంటూ ఎన్నో ప్రభు త్వ పథకాలను విజయవంతం చేసినా ప్రభు త్వాలు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానానికి తాము వ్యతిరేకం కా దని, అదే సమయంలో తమ సంక్షేమం గురిం చి కూడా ఆలోచించాలన్నారు. కొన్నేళ్లుగా రేషన్ డీలర్లు రెండు సంఘాలుగా ఏర్పడడంతో ఐకమత్యం లోపించిందని, ఇదే అదునుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్ల తో చెలగాటం ఆడిందని, రెండు సంఘాలు ఒక్కటయ్యాయ ని, ఇక నుంచి ప్రభుత్వ ఆటలు కొనసాగవని అన్నారు. ఈ నెల 15లోపు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ఒకే విధంగా కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం భిన్నంగా నడుస్తోందన్నారు. మూడు రకాల వస్తువులనే పంపిణీ చేస్తుండగా, వాటిల్లో డీలర్లకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. సమ్మెను దృష్టిలో పెట్టుకుని రేషన్ డీలర్లు డీడీలను చెల్లించవద్దని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు, ప్రతినిధులు బత్తుల రమేశ్‌బాబు, మాధవరావు, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవీ.. ♦ రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ♦ రూ.416 కోట్ల కమీషన్ బకాయిలను జూలైలో విడుదల చేయాలి. ♦ డీలర్ల కుటుంబసభ్యులకు హెల్త్‌కార్డులు జారీ చేయాలి. ♦ ఇళ్లులేనివారికి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలి. ♦ ఎలక్ట్రానిక్ యంత్రంపై బియ్యం తూకం వేసి సరఫరా చేయాలి. ♦ ప్రజలకు అవసరమైన అన్ని సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలి. -
జులై 1 నుంచి రేషన్ డీలర్ల నిరవధిక సమ్మె
పంజగుట్ట : రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ జులై 1వ తేదీ నుండి రేషన్ డీలర్లు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐక్య రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రకటించింది. నిరవధిక సమ్మె పోస్టర్‌ను మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షులు నాయకోటి రాజు, ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దాసరి మల్లేశం, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కాచం కృష్ణమూర్తి, బత్తుల రమేష్‌లు ఆవిష్కరించారు. నాలుగు సంవత్సరాలుగా రేషన్ డలలర్లను ప్రభుత్వం ఆదుకుంటుందని వేచి చూశామని, ఇతర వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం తమను మాత్రం విస్మరించిందని ఆవేదనవ్యక్తం చేశారు. 2015 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తమకు రావల్సిన కమీషన్ ’ 400 కోట్లు విడుదల చేసి ప్రభుత్వ ఖాతాలో జమచేసిందని, తమకు రావాల్సిన కమీషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వకుండా తాత్కారం చేస్తుందని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇదే విషయంపై సంబంధిత శాఖా మంత్రికి, సివిల్సప్లై కమీషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితంలేకుండా పోయిందన్నారు. కమీషనర్ ప్రభుత్వ మెప్పు పొందేందుకు తమకు కోతలు విధిస్తున్నారని ఆరోపిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఈపాస్ మిషన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకించడంలేదని, కాని కేవలం 20 పైసల కమీషన్ ఇవ్వడంవల్ల షాపునిర్వహణ, అద్దె, విద్యుత్‌బిల్లు చెల్లించుకోలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,200 మంది రేషన్‌డీలర్లు ఉన్నారని, వారి భవిష్యత్తుగూర్చి ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31వ తేదీన హయత్‌నగర్‌లోని లక్ష్మీరెడ్డిపాలెంలో డీలర్లు, వారి కుటుంబ సభ్యులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. -
నామినీ ముసుగులో బినామీలు...?
ప్రభుత్వం విసిరిన వలలో బినామీ డీలర్లు చిక్కుకున్నారు... రేషన్ సరుకుల పంపిణీకి డీలర్‌వేలిముద్రను మాత్రమే అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్‌తో బినామీల బండారం బట్టబయలవుతోంది.నెల ప్రారంభమై ఐదురోజులు గడుస్తున్నా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రేషన్ దుకాణాలు తెరుచుకోని పరిస్థితి. సరుకుల కోసం లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు డీలర్ కోసం బినామీ లు పరుగులు పెడుతున్నారు. పౌరసరఫరాలశాఖ మాత్రం సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నంచేస్తోంది. జిల్లాలో బినామీలు ఎవరూ లేరు..సాంకేతిక సమస్యతోనే దుకాణాలు తెరుచుకోలేదని పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తోందనేవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుత్తూరు: ప్రజా పంపిణీ వ్యవస్థలో బినామీల రాజ్యం కుప్పకూలుతోంది. నామినీల ముసుగులో ఇన్నాళ్లుగా దుకాణాలు నడుపుతున్న బినామీలకు కాలం చెల్లినట్లే. ఈ పాస్ విధానం అమలులోకి వచ్చాక సరుకుల పంపిణీలో డీలర్లకు వెసులుబాటు కోసం నామినీల వ్యవస్థను ప్రవేశపెట్టారు. కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఈపాస్ యంత్రంలో డీలర్‌తో పాటు నామినీల వేలిముద్రతో కూడా సరుకులు పంపిణీ చేసేఅవకాశం ఉండేది. బినామీల పరమైన దుకాణాలు... టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ అనుయాయులు రెచ్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా అప్పటి వరకు డీలర్లుగా ఉన్న వారిని నయానో భయానో బెదిరించి దుకాణాలను తమ పరం చేసుకున్నారు. ఈ పాస్ విధానం అమలు, కిరోసిన్, చక్కెర పంపిణీని రేషన్ దుకాణాల్లో నిలిపివేశాక డీలర్లకు వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. దీంతో చాలామంది డీలర్లు వేరొకరిని తమ నామినీలుగా నమోదు చేయించి దుకాణాలను వారికి అప్పగించినట్లు సమాచారం. ఇలా దుకాణాలు నడుపుతున్న బినామీలు చేతివాటానికి తెరతీశారు. రేషన్ బియాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న సంఘటనల్లో బినామీ డీలర్లదే కీలకపాత్రగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇప్పటివరకు డీలర్లకు వెసులుబాటుగా ఉన్న నామినీ వ్యవస్థను ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం రద్దు చేసింది. తప్పనిసరిగా డీలర్ వేలిముద్ర వేస్తేనే సరుకులను పంపిణీ చేసే విధంగా పౌరసరఫరాల శాఖ సర్క్యులర్‌ను జారీ చేసింది. తెరుచుకోని దుకాణాలు... నెల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా జిల్లా వ్యాప్తంగా సుమారు 214 రేషన్ దుకాణాలు తెరుచుకోలేదు. డీలర్ వేలిముద్ర లేకుండా సరుకులు పంపిణీ చేయలేని పరిస్థితి ఉండడంతో దుకాణాలను మూసేసినట్లు సమాచారం. ఇదివరకే వేరే ఊర్లలో స్థిరపడిపోయిన అసలైన డీలర్లు వచ్చే వరకు సరుకుల పంపిణీ నిలిచిపోయినట్లే. దీంతో సరుకుల కోసం నిరుపేదలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క దుకాణం నెలకు రూ.600 వరకు పౌరసరఫరాల శాఖకు ముడుపుల రూపంలో చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారుల కనుసన్నల్లోనే బినామీల వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ దుకాణాల్లో బినామీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటిదేమీ లేదు... రేషన్ దుకాణాల్లో బినామీ డీలర్ల వ్యవహారం మా దృష్టికి రాలేదు. సాంకేతిక సమస్యల కారణంగానే జిల్లాలో కొన్ని దుకాణాలు తెరుచుకోలేదు. సమస్యను సరిదిద్ది, లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందిస్తాం. - చాముండేశ్వరి,జిల్లా పౌరసరఫరాల అధికారి, చిత్తూరు -
బినామీ డీలర్ల ప్రక్షాళనకు చర్యలు
దేవరపల్లి: బినామీ రేషన్ డీలర్ల వ్యవస్థపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో బినామీలకు చెక్ పెట్టడానికి చర్యలు చేపట్టింది. బినామీ డీలర్ల వల్ల ప్రజాపంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన అధికారులు ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈ–పోస్ యంత్రంలోని నామినీ పేర్ల్లను మే 1 నుంచి తొలగించారు. ఇప్పటివరకు డీలర్‌తో పాటు మరో ఇద్దరు పేర్లు నామినీగా చేర్చి వేలిముద్రలు ఇచ్చారు. మూడేళ్లుగా నామినీల వ్యవస్థ నడుస్తుంది. దీని కారణంగా ఒరిజినల్ డీలర్ వేరే ప్రాంతంలో ఉండి బినామీల పేరును నామినీగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో నామినీ వ్యవస్థను రద్దుచేసి ఒరిజినల్ డీలర్ల పేరు మాత్రమే యంత్రంలో ఉంచితే బినామీల సంఖ్య బయటపడుతుందని అధికారులు ఆలోచన చేశారు. ఈమేరకు మే 1 నుంచి ఈ–పోస్ యంత్రంలో డీలర్ పేరు మాత్రమే ఉంచి నామినీలను తొలగించారు. దీనిపై రేషన్ డీలర్లలో గందగోళ పరిస్థితి ఏర్పడింది. నామినీ పేరు లేకుండా దుకాణాలు నడపటం కష్టమని డీలర్లు అంటున్నారు. డీలర్లలో వృద్ధులు, అనారోగ్యవంతులు ఉన్నారని వీరు నామినీ లేకపోతే ఇబ్బంది పడతారని డీలర్ల సంఘ ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. డీలర్ రక్తసంబంధీకులను నామినీగా చేర్చాలని కోరుతున్నారు. నామినీ వ్యవస్థను పునరుద్ధరించకపోతే దుకాణాలు నిర్వహణ చేయలేమని, అవసరం అయితే దుకాణాలను స్వచ్ఛందంగా వదులుకుం టామని చెబుతున్నారు. జిల్లాలో సుమారు 2,163 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మారుమూల గ్రామాలు, కొండప్రాంతాల్లో ఈ పోస్ విధానం అమలు జరగడం లేదు. నామినీ తొలగింపుపై సీఎంను కలుస్తాం ఈ పోస్ యంత్రంలో నామినీ పేర్లు తొలగింపుపై ఈనెల 5న ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు టీఏవీవీఎల్ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నామినీ పేరు తొలగింపు పట్ల డీలర్లు ఆందోళన చెందనవసం లేదన్నారు. ఇది బినామీ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య మాత్రమేనని అన్నారు. కుటుంబంలో రక్తసంబంధీకులకు నామినీ ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. దుకాణాలను బంద్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆయన డీలర్లకు సూచించారు. -
పోరుబాటలో రేషన్ డీలర్లు !
పౌరసరఫరా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనటంలో ఎటువంటి సందేహం లేదు. రేషన్ డిపోలను ్రౖక్రమేణా ప్రైవేటుకు అప్పగిస్తుండడం ఒకఎత్తయితే, బియ్యం మినహా ఇతర అన్ని వస్తువుల సరఫరాను నిలిపివేయడం ఇప్పటికే జరిగాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ నమ్ముకుని ఉన్నటువంటి డీలర్లను ప్రభుత్వం పొమ్మనలేక పొగపెట్టి సాగనంపే ప్రయత్నాలు చేస్తుండడంతో వారు పోరుబాట పట్టే యోచనలో ఉన్నారు... సాక్షి,విజయవాడ: పేదలకు ఎంతో ఉపయుక్తంగా వుండే చౌకధరల దుకాణాల వ్యవస్థను ప్రభుత్వం క్రమేణా బలహీనం చేస్తోంది. ఇప్పటికే ఒక్క బియ్యం మినహా అన్ని వస్తువులను ఆపేసిన ప్రభుత్వం ప్రజలను క్రమంగా ప్రైవేటుకు అలవాటు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.. నామినీ తొలగింపు, హెల్పర్స్‌కు నో.... గతంలో రేషన్ డీలర్లతో పాటు ఇద్దరు నామినీల వేలిముద్రలు ఆన్లైన్లో తీసుకునేవారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ–పోస్ మిషన్ ఆపరేట్ చేసేందుకు వీలుఉండేది. అయితే ఈ విధానానికి స్వస్తి పలికి, కేవలం జీవిత భాగస్వామి మాత్రమే నామినీగా ఉండాలనే నిబంధన విధించారు. జిల్లాలో 2,147 రేషన్ దుకాణాలు ఉండగా...73 మంది డీలర్ల జీవిత భాగస్వాములు రేషన్ దుకాణం నిర్వహించే స్థితిలో లేరు. కొందరు డీలర్లు ఒంటరిగా జీవిస్తుండగా, మరికొంతమంది అనారోగ్యంతో మంచంలో ఉన్నాను. కొంతమంది ఆదాయం సరిపోక భాగస్వాములు వేరే ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే జీవిత భాగస్వామి కాకుండా హెల్పర్‌కు అవకాశం కల్పించమని డీలర్లు కోరుతుంటే, ఈ నెలలో జీవితభాగస్వామిని కూడా నామినీగా అధికారులు తొలగించారు. దుకాణం నడిపేది ఏలా ? రేషన్ డీలర్ ఒకరి వేలి ముద్ర మాత్రమే తీసుకున్నారు. ఒక్క రేషన్ డీలరే దుకాణం నడపాలంటే చాలా కష్టం అతనే కార్డుదారుడు చేత వేలిముద్ర వేయించాలి. డబ్బులు తీసుకుని సరుకులు కాటా వేయాలి, రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల హెల్పర్ ఉంటే ఉపయుక్తంగా వుంటుందన్న డీలర్ల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షనేతను కలవొద్దంటూ హుకుం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన కొంతమంది డీలర్లు ఆయన్ను కలిసి తమ సమస్యలను వివరించేందుకు సిద్ధపడ్డారు. అయితే ఈ సమాచారం తెలుగుదేశం పార్టీ నేతలకు, పౌరసరఫరాల అధికారులకు తెలిసింది. దీంతో డీలర్లు సంఘానికి చెందిన కొంతమంది నేతల్ని పిలిచి ప్రతిపక్షనేత వద్దకు వెళ్లవద్దంటూ హుకుం జారీ చేశారు. ఆ విధంగా వెళ్లిన డీలర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తమకు కొత్తనిబంధనలు పెట్టి ప్రభుత్వం మరింత ఇబ్బంది పెడుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని లేదంటే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని డీలర్ల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. మొరాయిస్తున్న ఈ–పోస్ మిషన్లు ఈ– పోస్ మిషన్లు పాతపడిపోవడంతో పాటు సాఫ్ట్వేర్ సరిగా స్పందించడం లేదు. దీంతో రేషన్ డీలర్లకు బియ్యం ఇవ్వడం ఇబ్బందిగా మారింది. ఈ–పోస్ మిషన్లు మార్చి కొత్తవి ఇవ్వమని డీలర్లు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు కేవలం ఒక్క బియ్యం మాత్రమే సరఫరా చేయడం వల్ల తమకు కనీసం ఆదాయం రావడం లేదని, అందువల్ల తమకు గౌరవ వేతనం లేదా క్లాస్–4 ఉద్యోగస్తులుగా భావించి జీతం ఇవ్వమని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. సమస్యలు పరిష్కరించకుంటేమే1 నుంచి బంద్.. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ దృష్టికి శుక్రవారం తీసుకువెళ్లాం. ఆయన వృద్ధులైన రేషన్ డీలర్లకు నామినీలు పెట్టుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మా సమస్యలు పరిష్కరించకుంటే మే1వ తేది నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం. – మండాది వెంకట్రావ్, రేషన్ డీలర్లఅసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
డీలర్లపై దొంగదెబ్బ
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లను దొంగదెబ్బ తీసింది. బియ్యం సరఫరా కోసం చెల్లించిన సొమ్ము పాత బకాయిల కింద జమచేసుకొని తమను మోసం చేశారని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : గత నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు కందిపప్పు, పచ్చిశనగపప్పు విక్రయించాలని నిర్ణయించింది. పప్పు నాణ్యత లేకపోవడంతో పాటు ప్రైవేటు మార్కెట్లో «ధరకు ఇంచుమించుగా ప్రభుత్వం ఇచ్చే ధర ఉండటంతో రేషన్ డీలర్లు సరుకు తీసుకోవడానికి ఇష్టపడలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుగానే ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేసింది. కందిపప్పు బకాయి వసూలు.... జిల్లాలో మొత్తం 2,235 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. అలానే 12.60 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. గత నెలలో ఒక్కో రేషన్ డీలర్‌కు రెండేసి క్వింటాళ్ల చొప్పున అప్పు మీద కందిపప్పు ఇచ్చారు. వాటి ఖరీదు. రూ.8000. ఈ నెలలో కందిపప్పు విక్రయించిన తరువాత సొమ్ము చెల్లిద్దామని డీలర్లు భావించారు. బియ్యం కోసం డీలర్లు పౌరసరఫరాల శాఖకు సొమ్ము చెల్లిస్తే, వాటిని ప్రభుత్వం కందిపప్పునకు జమ చేసుకుంటోంది. బియ్యానికి తిరిగి సొమ్ము చెల్లిస్తేనే సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. బియ్యానికి కట్టిన సొమ్మును కందిపప్పుకు జమ చేసుకోవడంతో డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో డీలర్‌కు సుమారు 50 నుంచి 80 క్వింటాళ్ల బియ్యం ఆగిపోయాయి. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ ప్రకారం సొమ్ము చెల్లిస్తే తొలుత పాత బకాయికి జమ చేసుకుంటుందని డీలర్లకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు బియ్యం ఆపకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 4055 క్వింటాళ్ల కందిపప్పు డీలర్లకు సరఫరా.... కందిపప్పు నాణ్యత లేకపోవడంతో పాటు సకాలంలో సరఫరా చేయకపోవడంతో మార్చి నెలలో కేవలం 13 శాతం మాత్రమే విక్రయాలు సాగించారు. ఒక్కో కార్డుకు కిలో కందిపప్పు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా డీలర్లకు అప్పు పై 4055 క్వింటాళ్లను జిల్లా వ్యాప్తంగా అధికారులు పంపిణీ చేశారు. సరఫరా చేసిన మొత్తం సరుకులో కేవలం 13 శాతం డీలర్లు విక్రయించగలిగారు. కందిపప్పు నాణ్యత లేకపోయినా బియ్యంతో పాటే వచ్చి ఉంటే ఏదో విధంగా కార్డుదారులకు డీలర్లు అమ్మేసేవారు. మార్చి 13వ తేదీ తర్వాత పప్పు సరఫరా చేశారు. 15 తరువాత సర్వర్ పనిచేయదు. అందువల్ల చౌకబియ్యాన్ని 90 శాతం మంది పేదలు 10 వ తేదీ లోగానే తీసేసుకుంటారు. డీలర్లకు 13 న కందిపప్పు సరఫరా చేయడంలో విక్రయించలేకపోయారు. నాణ్యత సరిగా లేకపోవడంతో పాటు, ప్రైవేటు మార్కెట్లో కేజీ రూ.55కు లభిస్తుండగా, రేషన్ దుకాణంలో రూ.40కు విక్రయిస్తుండటంతో చాలా మంది పేదలు కందిపప్పు తీసుకోవడానికి ఇష్టపడలేదు. బియ్యం సొమ్ము జమ వాస్తవమే ఈ నెలలో బియ్యానికి చెల్లించిన సొమ్ము గతనెలలో ఇచ్చిన కందిపప్పుకు జమ చేసుకుంటున్నారు. అదేమంటే సాఫ్ట్వేర్ అలా ఉందని అంటున్నారు. బియ్యం సకాలంలో సరఫరా చేయకపోతే పేదలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. మంగళ, బుధవారాల్లో కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌ను కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని భావిస్తున్నాం. కందిపప్పు విక్రయించే వరకు ఆ బకాయి వసూలు చేయకుండా ఆపాలి.– ఎం.శ్రీనివాస్,కృష్ణా జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ కార్యదర్శి -
ఆ'పరేషన్' టీడీపీ
ఏలూరు (మెట్రో): రేషన్ డీలర్లపై మరో పిడుగు పడింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకో నిబంధనతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న టీడీపీ సర్కారు తాజాగా షాపు ఆలస్యంగా తెరిస్తే జరిమానా విధిచేందుకు సిద్ధపడింది. దీంతో రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచీ అంతే.. తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ రేషన్ డీలర్లపై కక్ష కట్టినట్టు కనిపిస్తోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత అంటూ ఆన్లైన్ విధానం, ఈ–పోస్ యంత్రాలు ప్రవేశపెట్టి అటు డీలర్లను, ఇటు లబ్ధిదారులను అవస్థల పాల్జేసింది. ఆ తర్వాత రేషన్ తీసుకోని వారి ఇళ్లకు వెళ్లి సరుకులు ఇవ్వాలనే నిబంధనతో వేధించారు. వేలిముద్ర పడకపోతే వీఆర్ఓ వేలిముద్ర ద్వారా సరుకులు సరఫరా చేయాలని నిబంధన పెట్టారు. వీటిన్నింటితో డీలర్లు తీవ్ర అవస్థలు పడ్డారు. అయినా మింగలేక, కక్కలేక అన్న తీరుగా షాపులను నడిపిస్తున్నారు. కమీషనూ అంతంతమాత్రమే! ఇంత కష్టపడుతున్నా.. రేషన్ డీలర్లకు వచ్చే కమీషన్ అంతంతమాత్రమే. గతంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, బెల్లం, చింతపండు, మంచినూనె వంటివి అందించేవారు. అయితే ప్రస్తుత సర్కారు కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తోంది. ఒక్కోనెల పంచదార ఇస్తోంది. ఇక నూనె, పప్పులు, బెల్లం వంటి వాటి గురించి ఎప్పుడో మరిచిపోయింది. దీంతో కమీషన్ అంతగా రాని పరిస్థితి నెలకొంది. తాజాగా రూ.500 జరిమానా తాజాగా రేషన్ షాపుల్లో సమయపాలన పాటించకున్నా, షాపులు తెరవకున్నా రోజుకు రూ.500 జరిమానా విధిస్తామని సర్కారు హెచ్చరిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచాలని, ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సరుకులు పంపిణీ చేయాలని, దుకాణాలు తెరుస్తున్నదీ, లేనిదీ ఈ పోస్ యంత్రాల ద్వారా ఆన్లైన్లో నమోదు అవుతుందని వేధిస్తోంది. ఈపీడీఎస్ విధానంలో ప్రతి రోజూ ఎన్ని సరుకులు ఇస్తున్నదీ, ఎంత మంది కార్డుదారులు సరుకులు తీసుకున్నదీ, వసూలు చేసిన మొత్తం ఎంతో తెలిసిపోతుంది. దీంతో దుకాణం తెరవకుంటే ఆటోమేటిక్‌గా రూ.500 జరిమానా పడుతుంది. ఈ మొత్తాన్ని మినహాయించుకుని నెలవారీ కమీషన్ చెల్లించనున్నారు. ఇలా నాలుగుసార్లు జరిమానా పడితే రేషన్ దుకాణాన్నే రద్దు చేయాలని సర్కారు ఆదేశాలు చేయడంపై డీలర్లు మండిపడుతున్నారు. నాలుగుసార్లు జరిగితే షాపు రద్దు మొదటిసారి ఆలస్యం అయినా, షాపు తెరవకున్నా రూ.500 జరిమానా విధిస్తారు. రెండోసారి ఆలస్యమైతే రూ.1,000 జరిమానా, మూడోసారి రూ.1,500 జరిమానా, నాలుగోసారి రూ.2,000 జరిమానా విధిస్తారు. ఇక ఐదోసారి జరిమానా విధించకుండా షాపును రద్దు చేయాలని ఆదేశాలు అందాయి.– సయ్యద్ యాసిన్, జిల్లా పౌరసరఫరాల అధికారి దుకాణాలునిర్వహించలేకపోతున్నాం నెలకో నిబంధన పెడుతూ ప్రభుత్వం రేషన్ డీలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రేషన్ షాపులు కాకుండా సూపర్మార్కెట్లు అని చెప్పారు. రోజుకో నిత్యావసర వస్తువును తొలగించుకుంటూ వస్తున్నారు. రోజుకో నిబంధన పెడుతున్నారు. తాజాగా దుకాణాన్ని ఏమాత్రం ఆలస్యంగా తెరచినా రూ.500 జరిమానా విధించడం ఎంతవరకూ సమంజసం.– రాణి, రేషన్ డీలరు -
ఎక్కడి నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : రేషన్ సరుకులను కేటాయించిన షాపులో కాకుండా మరే రేషన్ దుకాణంలోనైనా తీసుకునే వెసులుబాటును (పోర్టబిలిటీని) వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పాస్) ప్రాజెక్టుపై హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా పోర్టబులిటీని అమలు చేస్తామని చెప్పారు. ఉదాహరణకు ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఏదైనా రేషన్ దుకాణంలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. వలస వచ్చే కూలీలు ఎక్కడికి వెళితే అక్కడ రేషన్ సరుకులు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డుల కోసం రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సీవీ ఆనంద్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశామని.. త్వరలో మరో 15–20 మందిపైనా నమోదు చేయనున్నామని తెలిపారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు వ్యవహారం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 రేషన్ షాపులు ఖాళీగా ఉన్నాయని, వాటికి డీలర్ల ఎంపికపై ప్రభుత్వానికి ఫైలు పంపామని, అర్హతలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ–పాస్‌తో రూ.578 కోట్లు ఆదా రాష్ట్రంలోని 17 వేల రేషన్ షాపుల్లో ఈ–పాస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని సీవీ ఆనంద్ వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేయడంలో, మిగులు సరుకులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంలో ఈ–పాస్ విధానం ఎంతో సహాయపడిందన్నారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా డీలర్ల అక్రమాలకు చెక్ పెట్టడంలో ఈ–పాస్ విజయవంతమైందని చెప్పారు. ఈ–పాస్‌కు అనుసంధానం చేసేలా 4 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చామని.. అందులో ఐరిస్ స్కానర్, బరువు తూచే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్‌తో బ్లూటూత్ అనుసంధానం, కార్డు స్వైపింగ్ సదుపాయం, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ, వాయిస్ ఓవర్ వంటి సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్లో లావాదేవీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఈ–పాస్ విధానం ప్రారంభించాక ఇప్పటివరకు 2.15 లక్షల టన్నుల బియ్యం మిగిలాయని, రూ.578.90 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఈ నెల నుంచి ఏడాదికి రూ.800 కోట్ల నుండి రూ.850 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కచ్చితంగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని, ఆ 15 రోజులు రేషన్ షాపులకు సెలవు ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులకు రేషన్ సమాచారాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా పంపిస్తామన్నారు. -
చౌక దుకాణాలు టీడీపీ లీడర్లకే !
కడప సెవెన్‌రోడ్స్ : కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్ర భుత్వ చౌక దుకాణాల కేటాయింపు విషయంలో అనుకున్నదంత అయ్యింది. అందరూ భావించిన విధంగానే అధికారులు ఎఫ్పీ షాపులు టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టారు. నిబంధనలు సైతం తుంగలో తొక్కారు. అధికార టీడీపీ నేతలు ఒత్తిళ్లకు తలొగ్గి రిజర్వేషన్లను సైతం తారుమారు చేశారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. శాశ్వత ప్రాతిపదిక మీద ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితా అంటూ తొలుత ప్రకటించి ఆ తర్వాత వాటిలో మార్పులు చేయడం ఆరోపణలకు బలమిస్తోంది. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో చాలా ఏళ్లుగా ఎఫ్పీ షాపులు ఖాళీగా ఉన్నాయి. టెంపరరీ డీలర్లు మాత్రమే కొనసాగుతూ వచ్చారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో 275 ఖాళీలను భర్తీ చేసేందుకు గతంలో పలుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే కొందరు కోర్టులను ఆశ్రయించి స్టేలు తీసుకురావడం, ఏదో ఒక విధంగా అడ్డుకోవడం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఎఫ్పీ షాపుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. రాత పరీక్ష పెట్టి డివిజన్లోని 275 షాపులకుగాను 226 వాటికి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, ఈనెల 10వ తేది కడపలో నిర్వహించిన రాత పరీక్షకు 725 మంది హాజరయ్యారు. అదే రోజు ప్రశ్నపత్రం లీకై అయిందన్న ఆరోపణలు వెల్లవెత్తాయి. అందులో వాస్తవాలు లేవంటూ అధికారులు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహిం చారు. మార్కుల జాబితాలు కూడా ప్రచురిం చకుండా ఇంటర్వ్యూకు కాల్ లెటర్లు పం పారు. బుధవారం విడుదల చేసిన జాబి తాలను పరిశీలించిన పలువురు విస్తుపోవాల్సి వచ్చింది. ఇందులో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకు చింతకొమ్మదిన్నె మండలంలోని భాకరాపేటలో ఉన్న 31వ ఎఫ్పీ షాపు ఎస్సీలకు రిజర్వు చేశారు. కాగా, గతంలో ప్రొఫెసర్స్ కాలనీలో ఉన్న 32వ నెంబరు ఎఫ్పీ షాపునకు టెంపరరీ డీలర్‌గా పని చేసి విజిలెన్స్ కేసులో కూడా ఉన్న ఓసీ వర్గానికి చెందిన వ్యక్తికి 31వ నెంబరు షాపు కేటా యించారని తెలిసింది. 31వ షాపు భాకరాపేటలో ఉండగా ఊటుకూరు అనే పేరుతో ఆ వ్యక్తికి కట్టబెట్టారని చెబుతున్నారు. స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లతో రిజర్వేషన్లను సైతం అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇక సుండుపల్లె మండలంలోని 12వ నెంబరు చౌక దుకాణానికి గంగారపు చెన్నకృష్ణ అనే వ్యక్తి ఎంపికైనట్లు అధికారులు తొలుత జాబితాను విడుదల చేశారు. అంతలోనే ఏమైందో తెలియదుగానీ జాబితాలో తన పేరు తొలగించారని గంగారపు చెన్నకృష్ణ ‘సాక్షి’ వద్ద వాపోయారు. ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. ఇంకా పలు మండలాల్లో ఇదే తంతు కొనసాగిందని తెలుస్తోంది. -
నేను ఇచ్చిన జాబితానే ఫైనల్
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించారు. తమ కార్యకర్తలకే ప్రభుత్వ ఫలాలు దక్కాలంటూ మొండికేస్తున్నారు. తాము చెప్పింది కచ్చితంగా చేసి తీరాల్సిందేనంటూ జిల్లా ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. రేషన్ డీలర్ల భర్తీ విషయంలో ఏకంగా తాము రూపొందించిన ఓ జాబితాను ఖరారు చేయాలంటూ సోమవారం మంత్రి సోమిరెడ్డి కడప రెవెన్యూ డివిజన్‌కు చెందిన ఓ అధికారిని ఆదేశించడం చర్చనీయాంశమైంది. మంత్రి ఆదేశించినట్లుగానే ఆ జాబితా ఖరారైతే మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అన్యాయం జగినట్లే అవుతుంది. ఇంటర్వ్యూలకూ హాజరు.. కడప రెవెన్యు డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 275 రేషన్ దుకాణాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి 49 రేషన్ షాపులకు దరఖాస్తులు రాలేదు. మిగిలిన వాటికి 864మంది దరఖాస్తు చేయగా, ఈ నెల 10న నిర్వహించిన రాతపరీక్షలకు 725 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సోమవారం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. వీరిలో అర్హత సాధించిన వారికి షాపులు కేటాయించాల్సి ఉంది. ఇక్కడ టీడీపీ నేతలు చక్రంతిప్పారు. రాత్రికిరాత్రే కొత్త జాబితా.. కడప రెవెన్యూ డివిజన్లో భర్తీకానున్న రేషన్‌షాపులు తమ కార్యకర్తలకే దక్కాలని నిర్ణయించిన టీడీపీ నేత ఒకరు రాత్రికి రాత్రే కొత్త జాబితాను సిద్ధం చేశారు. కేవలం రాతపరీక్షలకు హాజరవ్వడమే ప్రధాన అర్హతగా చూపించి, టీడీపీ కార్యకర్తలకు ఆయా రేషన్‌షాపులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసి.. సోమవారం హడావుడిగా కొత్త జాబితాను మంత్రి సోమిరెడ్డి వద్దకు తీసుకెళ్లి.. ఆ జాబితానే ఖరారు చేయించాల్సిందిగా కోరారు. ఇదే ఫైనల్..: రేషన్ డీలర్ల రాతపరీక్షల ఫలితాలు పక్కన పెట్టండి. నేను ఇచ్చిన లిస్టే(జాబితా) ఫైనల్ చేయండి.. అంటూ మంత్రి సోమిరెడ్డి సాయంత్రం జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారిని ఆదేశించారు. జిల్లా రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించామని, ఈ సమయంలో జాబితాను మారిస్తే నాకు ఇబ్బందులు వస్తాయని మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. మీ జాబితాను కలెక్టర్ ద్వారా ఆమోదముద్ర వేయించాలని కోరినట్లు తెలిసింది. అయితే ఇందుకు ససేమిరా అన్న మంత్రి.. నేను చెప్పింది చేయండి.. ఆ జాబితానే ఖరారు చేయండంటూ హుకుం జారీ చేయడంతో ఏమి చేయాలో తేల్చుకోలేక ఆయన సతమతమవుతున్నట్లు తెలిసింది. -
రేషన్ షాపు తెరవకపోతే రూ.500 ఫైన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చౌక ధరల దుకాణాలు తెరవకుండా రోజుల తరబడి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయని డీలర్లపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇకపై ఎవరైనా రేషన్ డీలర్ దుకాణం తెరవకపోతే ఆరోజు రూ.500 అపరాధ రుసుం చెల్లించాల్సిందే. ఒకవేళ సదరు డీలరు నగదు రూపేణా రుసుం చెల్లించకపోతే వారికిచ్చే కమీషన్ నుంచి మినహాయించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన కమిషనర్ రాజశేఖర్ ఈ మేరకు డీలర్లకు స్పష్టం చేశారు. జిల్లాలో 2870 రేషన్ షాపులున్నాయి. 12,17లక్షల మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. ఇందులో 10.84 మంది తెల్లకార్డులు కలిగిన వారున్నారు. వీరంతా నెలనెలా బియ్యం, చక్కెర, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులు తీసుకుం టుంటారు. ప్రతి జిల్లాలోనూ రేషన్ సరుకులపై ఆధారపడే నిరుపేద జనం 40 శాతం మంది ఉన్నారు. మన జిల్లాలోనూ వీరు 26 శాతంగా ఉన్నారు. మారుమూల మండలాల్లోని శివారు గ్రామాల్లో చాలాచోట్ల రేషన్ షాపులు సరిగ్గా తెరవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా తంబళ్లపల్లి, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి, గంగవరం, కల్లూరు, పుంగనూరు, మదనపల్లి, పీలేరు, ఎర్రావారిపాలెం, కలకడ, శ్రీరంగరాజపు రం, సత్యవేడు, వరదయ్యపాళెం వంటి మండలాల్లోని చాలా గ్రామాల్లో డీలర్లు సొంత పనుల్లో నిమిగ్నమై అడపాదడపా దుకాణాలు తెరవడం లేదు. ఆయా గ్రామాల ప్రజలు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. పదేపదే చెబుతున్నా.. నిబంధనల ప్రకారం రేషన్ షాపులను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 11.30 వరకూ, మధ్యాహ్నం 4 నుంచి 8 గంటల వరకూ తెరిచి ఉంచాలి. వెయ్యికి పైగా గ్రామాల్లో ఉదయం రెండు గంట లు తెరిచి సాయంత్రం దుకాణాలు మూసేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రోజూ తెరవకుండా వారంలో నాలుగైదు రోజులు మాత్రమే షాపులు తెరుస్తున్నారు. దీనివల్ల చేతిలో డబ్బులున్నపుడు సరుకులు తీసుకోవాలన్న జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసమే ఏర్పాటు చేసిన షాపులు కావడంతో తప్పనిసరిగా ప్రతి రోజూ తెరవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సోమవారం నుంచి కఠిన నిర్ణయం తీసుకుంది. మండలాల వారీగా ఏయే గ్రామాల్లో రేషన్ దుకాణాలు తెరవలేదో గుర్తించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేసుకుంంటోంది. ఏదేని గ్రామంలో ఓ డీలరు నెలలో 4 రోజులు షాపు తెరవకపోతే ఆయనికిచ్చే కమీç Ùన్ నుంచి రూ. 2 వేలు మినహాయించుకునేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించుకుంది. ప్రజలకు అందుబాటులో ఉండాలి... ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ డీలర్లు కచ్చితంగా రోజూ దుకాణాలు తెరవాలి. కార్డు హోల్డర్లకు అందుబాటులో ఉంటూ సరుకులు పంపిణీ చేయాలి. లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవు. రేషన్ దుకాణాల పనితీరు, సమయపాలనపై సమగ్రమైన వివరాలు తెప్పించుకుంటున్నాం.- చాముండేశ్వరి,జిల్లా పౌరసరఫరా శాఖ అధికారిణి. చిత్తూరు -
రేషన్ డీలర్ల కమీషన్ పక్కదారి
సాక్షి, హైదరాబాద్: చౌక ధరల దుకాణాల డీలర్లకు కమీషన్ పెంచి, పూర్తి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాగా నిధులను విడుదల చేస్తుందని బీజేపీ తెలిపింది. అయితే వాటిని డీలర్లకు ఇవ్వకుండా పాత ధరల ప్రకారం తక్కువ మొత్తం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని వేధిస్తోందని ఆరోపించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత లక్ష్యంగా క్వింటాల్ ధాన్యానికి కేంద్రం రూ.35 చొప్పున కమీషన్ చెల్లిస్తోందని, అంతే మొత్తాన్ని రాష్ట్రం చెల్లించాల్సి ఉందని, కానీ కేంద్రం పూర్తి నిధులిస్తే పాత ధర రూ.20 ప్రకారమే డీలర్లకు చెల్లిస్తూ మిగతా మొత్తాన్ని మినహాయించు కుంటోందని ఆరోపించింది. దీంతో సరిపడా ఆదాయంలేక డీలర్లు తీవ్రంగా నష్టపోయి రోడ్డునపడే పరిస్థితి తలెత్తిందన్నారు. వారి బాధలు చెప్పుకోవడానికి ప్రయత్నించినా ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం ఇవ్వటం లేదని పేర్కొంది. బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సుధాకరశర్మలతో కలిసి శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిన కేంద్రం వాటా నిధులతోపాటు తన వాటా నిధులను ప్రస్తుత రేట్ల ప్రకారం సమకూర్చి పూర్తి కమీషన్‌ను డీలర్లకు అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ సగటు మనిషి, రైతు అనుకూలంగా ఉంటే దాన్ని టీఆర్ఎస్ మంత్రులు ఎద్దేవా చేయటం వింతగా ఉందన్నారు. రూ.లక్ష వరకు ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత ఇంటికి ఒకరికేనని మాటతప్పిన రాష్ట్రప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేయటం వింతగా ఉందన్నారు. -
డీలర్ల డిలే..!
ప్రతి వ్యాపారి తాము జరిపే లావాదేవీల వివరాలను(రిటన్స్) నిర్దేశిత గడువులోపు సమర్పించాల్సి ఉంటుంది. అయితే డివిజన్లో చాలా మంది వ్యాపారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో వ్యాపారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదనే ఉద్దేశంతో ప్రభుత్వపరంగా కొంత చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చి ఆరునెలలు గడిచిపోతుండటం, ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటి నుంచి వెంటపడకపోతే మార్చి నెలాఖరు నాటికి బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉందనే ఆలోచన వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్లో మొదలైంది. దీంతో సక్రమంగా రిటర్నులు సమర్పించని వారి లిస్టు తయారీ చేసి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. చిత్తూరు కార్పొరేషన్: జీఎస్టీ నిబంధనల ప్రకారం ఒక కోటి లోపు వార్షిక వ్యాపారం (టర్నోవర్) ఉన్నవారు కాంపోజిషన్ పథకం కిందికి వస్తారు. ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా చేసేవారు, ఈ–కామర్స్ లావాదేవీలు నిర్వహించేవారు, రూ.2.5 లక్షల పనిచేసే కాం ట్రాక్టర్లు తదితరుల విషయంలో వార్షిక టర్నోవర్ ఎంతున్నా రెగ్యులర్ డీలర్‌గానే పరిగణనలోకి తీసుకుంటారు. రిటర్నుల దాఖలులో మీనమేషాలు.. కాంపోజిషన్ పథకం కిందకు వచ్చే వ్యాపారులు మూడు నెలలకు బకసారి చొప్పున జీఎస్టీ–4 పేరుతో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంది. రెగ్యులర్ డీలర్లు అయితే ప్రతినెలా జరిగిన వ్యాపార లావాదేవీలను పేర్కొంటూ మరుసటి నెల 21వ తేదీలోగా 3బీ పేరుతో రిటర్నులు నమోదు చేయాల్సి ఉంది. రెండు విభాగాల వ్యాపారులూ రిటర్నులను ఆన్లైన్లో సమర్పించాలి. అయితే రెండు కేటగిరీలకు చెందిన వ్యాపారుల్లో అత్యధిక శాతం మంది నిర్దేశించిన గడువులోగా రిటర్నులు దాఖలు చేయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. నవంబరు నెల వరకు జరిపిన లావాదేవీలను డిసెంబర్ 15లోగా సమర్పించాల్సి ఉన్నా, ఇంకా 25 శాతం వ్యాపారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలో మొత్తం 23,561 మంది డీలర్లు ఉన్నారు. ఇందులో జీఎస్టీ పరిధిలో 17,223 మంది, కాంపోజిషన్ పరిధిలో 6,388 మంది వస్తారు. కొత్త చట్టం వచ్చి ఆరునెలలు గడిచినా వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో, సరిదిద్దాలని పన్నులశాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. తొలిదశలో రెగ్యులర్ డీలర్ల విషయంలో ఒత్తిడి పెంచాలని తర్వాత కాంపోజిషన్ డీలర్ల విషయంలో ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు. కాంపోజిషన్ డీలర్ల పరంగా 6,388 మంది ఉండగా, అందులో ఎంత మంది ఐటీసీ తీసుకుంటున్నారనే విషయం అధికారుల వద్ద అందుబాటులో లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం నిర్దేశించిన గడువులోగా రిటర్నులు సమర్పించని వ్యాపారులపై రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఒకేసారి జరిమానాలకు వెళ్లకుండా తొలుత నోటీసులు జారీచేసి, కొంత గడువు ఇచ్చిన తర్వాత జరిమానా విధించాలని అధికారులు భావిస్తున్నారు. 1 నుంచి ఈ వేబిల్లు అమలు.. ఫిబ్రవరి 1 నుంచి ఈ–వేబిల్లు అమలు అవుతుంది. ప్రసుత్తం ట్రయిల్ రన్లో ఉంది. సకాలంలో రిట్నర్నులు ఫైల్ చేయని డీలర్లకు నోటీసులు అందిస్తున్నాం. గడువు దాటిన తర్వాత ఆన్లైన్లో ఆటోమేటిక్‌గా జరిమానా పడుతుంది. రిట్నర్నులు ఫైల్ చేయకపోతే జరిమానా విధిస్తాం.– ఓంకార్‌రెడ్డి, జేసీ, వాణిజ్యపన్నుల శాఖ. -
కేజ్రీవాల్ నిర్ణయం.. ప్రజల ఆకలి తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రజలను పస్తులు ఉంచుతూ.. విమర్శలకు తావునిస్తోంది. ఆధార్ డేటా ఆధారంగా రేషన్ కోసం ప్రవేశపెట్టిన బయో మెట్రిక్ విధానం విఫలం కావటంతో .. ఐరిష్ స్కాన్, ఓటీపీల ద్వారా రేషన్ సరుకులు అందిస్తామని ప్రకటించించింది. అయితే రెండువారాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు దిగింది. బయో మెట్రిక్ విధానం... అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న ఓ కొత్త నిర్ణయం ప్రకటించింది. ఆధార్ కార్డులోని డేటాతో వేలి ముద్రలు సరిపోతేనే రేషన్ అందిస్తామని స్పష్టం చేసింది. రేషన్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించి.. అర్హులైనవారికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సర్కార్ ప్రకటించింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవేం పట్టించుకోని ప్రభుత్వం ఢిల్లీలోని 2,255 రేషన్‌షాపులకు ఈ-పీవోఎస్(e-PoS.. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను అందించింది. అయితే ఆధార్డేటాతో కొందరు లబ్ధిదారుల వేలిముద్ర మ్యాచ్ కాలేదు. దీంతో రేషన్ ఇచ్చేందుకు డీలర్లు నిరాకరించగా.. లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేశారు. విషయం అధికారుల దృష్టికి రావటంతో తక్షణ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా కంటిపాపల్ని స్కాన్ చేసి కొత్తగా పాస్వర్డ్లు ఇస్తామని, తద్వారా రేషన్ పొందొచ్చని ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 15న తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. తీరా కార్యాలయానికి వెళ్లిన లబ్ధిదారులు మళ్లీ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులెవరూ అక్కడ లేరని, ఉన్నవారు కూడా స్పందించటం లేదని, తాము పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివరణ... విమర్శలపై ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పందించారు. వైఫై కనెక్టివిటీ మూలంగానే సమస్య ఉత్పన్నమైందని.. పునరుద్ధరించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొత్తం 15 లక్షల మంది రేషన్ లబ్ధిదారుల్లో 98 శాతం మంది రేషన్ తీసేసుకున్నారని.. 2 శాతం(26, 650 మంది) మాత్రం అందుకోలేకపోయారని ఆయన చెబుతున్నారు. ఖండించిన రేషన్ డీలర్లు... అయితే రేషన్ డీలర్లు మాత్రం మంత్రి వాదనను కొట్టిపడేస్తున్నారు. రేషన్ డీలర్ల సంఘం సెక్రెటరీ సౌరభ్ గుప్తా స్పందిస్తూ... ‘‘ నా సొంత వైఫైతో కనెక్ట్ చేసినా మెషీన్లు పని చేయటం లేదు. బేల్(BEL) నుంచి వచ్చిన ఇంజనీర్లు యాంటీనాలు ఇచ్చారు. కానీ, అవి కూడా ఇప్పుడు పని చేయటం లేదు’’ అని తెలిపారు. అంతేకాదు 98 శాతం మందికి రేషన్ అందుతుందా? అన్న ప్రశ్నకు గుప్తా నుంచి సరైన సమాధానం అందలేదు. ఈ గొడవలేమీ లేకుండా మాన్యువల్‌గా రేషన్ సరుకులు ఇవ్వాలని షాపులకు ఆదేశాలు అందినప్పటికీ.. అవి కూడా సక్రమంగా అమలు కావటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. బీజేపీ విమర్శలు.. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న వ్యవస్థను కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయోగాలతో చెడగొట్టి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని తివారీ విమర్శించారు. (ఎన్డీటీవీ సర్వే కథనం ప్రకారం...) -
చౌకగా పనిచేయలేం
ఈ–పాస్ వచ్చాక రేషన్ షాపుల నిర్వహణ వ్యయ ప్రయాసగా మారింది. అదనపు పనివారు, అన్‌లోడింగ్‌చార్జీలు, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. డీడీలు కట్ట డం నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు డీలర్లు చెబుతున్నారు. కమీషన్ చాలా తక్కువగా ఉందని, క్వింటాల్ బియ్యానికి రూ.150కి పెంచాలని, నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరించాలని కోరుతున్నారు. కురబలకోట : చౌక దుకాణాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని డీలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీడీలు కట్టడం నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నియోజక వర్గంలో 150 మంది డీలర్లు ఉన్నారు. నెలలో 15 రోజుల సరుకులు ఇవ్వడానికే సమయం సరిపోతోందని చెబుతున్నారు. ప్రభు త్వ పథకాల అమలులో భాగస్వామం కావాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కమీషన్ పెంచాలని, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌కు సరఫరా చేస్తున్న సరుకుల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ–పాస్ వచ్చాక పని భారం పెరిగి వ్యయప్రయాసలు ఎక్కువయ్యాయని వాపోతున్నారు. కనీస ఆదాయం లేక కాలం గడుపుతున్న తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యయప్రయాసలు రేషన్ షాపుల నిర్వహణ వ్యయ ప్రయాసగా మారింది. షాపు బాడుగ, కూలీల ఖర్చు, కరెంట్ చార్జీలు, అదనపు పనివారు, అన్‌లోడింగ్‌చార్జీలు, బ్యాంకు చలానాతో పాటు ఇతర ఖర్చులుతడిసి మోపెడవుతున్నాయి. డీలర్‌కు ఇచ్చే కమీషన్ కూడా తక్కువే. విధిలేక వదలలేక చేస్తున్నాం. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతాం –గోపాల్ రెడ్డి, డీలర్ల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు కమీషన్ పెంచాలి క్వింటాల్ బియ్యానికి రూ.70 కమీషన్ ఇస్తున్నారు. దీన్ని రూ.150కి పెం చాలి. కూలీలతో పాటు షాపు నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. కార్డుకు సర్‌చార్జీ కింద రూ.10 ఇవ్వాలి. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ప్రభుత్వ పథకాల్లో సహకరిస్తున్నా కష్టానికి తగ్గ ఫలితం లేదు –ఎస్ఎం.బాషా, డీలర్ల సంఘం నాయకుడు, కురబలకోట -
దిగొచ్చిన రేషన్ డీలర్లు
సాక్షి, హైదరాబాద్: డిమాండ్లు పరిష్కరించా లంటూ సమ్మె బాట పట్టిన పౌరసరఫరాల రేషన్ డీలర్లలో చాలామంది ప్రభుత్వ హెచ్చ రికతో వెనక్కి తగ్గారు. సరుకులు తీసుకోని డీలర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సీఎం ఆదేశించడం, డిసెంబర్ నెల సరుకుల కోసం శనివారం లోగా డీడీలు కట్టాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ గడువు విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు డీడీలు కట్టడంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం వరకు 13 వేల 200 మంది డీలర్లు డీడీలు కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 200 రేషన్ దుకాణాలుండగా వాటిలో వెయ్యి షాపులకు రెగ్యులర్ డీలర్లు లేరు. మరో 3 వేల మంది డీలర్లు మాత్రమే డీడీలు చెల్లించాల్సి ఉంది. మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది డీలర్లు డీడీలు కట్టలేదని చెబుతున్నారు. అయితే మీ–సేవా కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల కొందరు డీడీలు కట్టేలక పోయారని తెలుస్తోంది. డీలర్లు సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఈ నెల సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా చాలామంది డీలర్లు డీడీలు కట్టిన నేపథ్యంలో సరుకుల పంపిణీకి ఇబ్బందులు తొలగిన ట్లేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల డీడీలు కట్టేందుకు డీలర్లకు 4వ తేదీ వరకు గడువు పెంచాలని, డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, సభ్యుడు ఆనంద్ శని వారం పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌సీవీ ఆనంద్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. డీలర్లందరూ డీడీలు కట్టాలని సంఘం తరఫున కోరుతున్నామన్నారు. -
డీడీ కట్టకుంటే రేషన్ డీలర్షిప్ తొలగించండి
సాక్షి, హైదరాబాద్: సమ్మెలో పాల్గొంటున్న రేషన్ డీలర్లు డిసెంబర్ నెలలో బియ్యం పంపిణీకి డీడీలు కట్టకపోతే వెంటనే వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. పేదలకు రేషన్ పంపిణీకి సహకరించని వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా బియ్యం పంపిణీ చేయాలన్నారు. సమ్మె పేరుతో కొంత మంది రేషన్ డీలర్లు డీడీలు కట్టకపోవడంతో డిసెంబర్ నెలలో పేదలకు నిత్యావసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతి భవన్లో పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్‌లతో ఈ అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 వేల మంది డీలర్లలో 25 జిల్లాలకు చెందిన దాదాపు 7 వేల మంది డీలర్లు మాత్రమే డీడీలు కట్టి పంపిణీకి సిద్ధంగా ఉన్నారని, మిగిలిన వారు వేతనాలు పెంచాలని, హెల్త్ కార్డులు అందించాలనే డిమాండ్లతో డీడీలు కట్టలేదని, అక్కడ డిసెంబర్ నెలలో సరుకులు ఇచ్చే పరిస్థితి లేదని ఈ సందర్భంగా వారు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్... డీడీలు కట్టిన డీలర్లకు సరుకులు య«థావిధిగా సరఫరా చేయాలని, కట్టని డీలర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. డీడీలు కట్టని ప్రాంతాల్లో ప్రజలకు సరుకులు అందని పరిస్థితి రావద్దని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగించాలని సూచించారు. డీలర్ల సమ్మె పిలుపునకు అర్థం లేదని, అందుకే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. -
రేషన్ డీలర్ల ఆందోళన బాట
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు సమ్మె సైరన్ మోగించారు. దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం బుధవారం నుంచి చౌక ధరల దుకాణాలు మూసి వేసి పౌర సరఫరాల గోదాముల వద్ద సరుకులు బయటికి రాకుండా ఆందోళనకు దిగనున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఇప్పటికే నవంబర్‌కు సంబంధించి రేషన్ కోటాకు డీడీలు కట్టిన డీలర్లు రేషన్ లిఫ్టింగ్‌ను నిలిపివేశారు. మంగళవారం ఈ మేరకు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తోపాటు, ఖమ్మం, వైరా, నల్లగొండ, కోదాడ పౌర సరఫరాల గోదాముల వద్ద డీలర్లు ఆందోళనకు దిగారు. రేషన్‌కు నగదు బదిలీ యోచన రద్దు, డీలర్లకు ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం గ్రేటర్లో రూ.60 వేలు, కార్పొరేషన్లో రూ.50 వేలు, మున్సిపాలిటీలో రూ.30 వేల చొప్పున ఇవ్వాలని, ఆహార భద్రత చట్టం ప్రకారం సరుకులపై కమీషన్ పెంపు, డీలర్లకు హెల్త్ కార్డులు, చనిపోతే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెండింగ్ బకాయిల విడుదల, గోడౌన్స్‌లో వేబ్రిడ్జి ద్వారా సరుకుల తూకం తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సమ్మెకు దిగిన డీలర్లతో చర్చలు జరిపి సాధ్యమైన హమీలతో విరమింపజేయడమా, లేక డీలర్లపై ఎస్మా చట్టం ప్రయోగానికి సిద్ధం కావడమా అనే దానిపై యోచిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు బదిలీ చేస్తే ఏలా ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే రేషన్‌కు నగదు బదిలీపై సర్వే నిర్వహిస్తున్న పౌర సరఫరాల శాఖ.. డీలర్ల సమ్మె సమయంలోనే ప్రయోగాత్మకంగా చేపట్టాలని యోచిస్తోంది. హామీ ఇచ్చే వరకు సమ్మె ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలపై లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాయి కోటిరాజు, ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి, కార్యదర్శి అనంద్ స్పష్టం చేశారు. -
నగదు బదిలీ అమలు చేస్తే ఉద్యమమే!
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకుల పంపిణీ బదులు నగదు బదిలీని వర్తింపజేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. నగదు బదిలీని అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించింది. ఆదివారం ఈ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటిరాజు, కార్యదర్శి ఆనంద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. నగదు బదిలీతో రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ డీలర్ల కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల నలుగురు రేషన్ డీలర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా 14 జిల్లాలో ఈపాస్ మిషన్ల ద్వారానే రేషన్ సరుకులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లలోని 50 కేజీల బియ్యం బ్యాగు డీలర్ వద్దకు వచ్చే సరికి 47 కిలోలకే పరిమితమవుతోందన్నారు. గోదాముల్లో జరిగే అవకతవకలకు డీలర్లను బాధ్యులు చేయడం సరికాదన్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఇందులో రేషన్ డీలర్ల జాతీయ అధ్యక్షుడు దేశ్‌ముఖ్ కాకా, కార్యదర్శి విశ్వంభర్తోపాటు ప్రహ్లాద్‌మోదీ పాల్గొంటారని తెలిపారు. సభ అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. -
కిరోసిన్ ఆవిరవుతోంది
♦ పంపిణీ కాకుండా డీలర్ల వద్ద 3 లక్షల లీటర్ల నిల్వ ♦ జూన్ నెల నుంచి ఇదే పరిస్థితి ♦ ప్రమాద భయంతో రేషన్ డీలర్లు ప్రభుత్వ అర్ధంతర ఉత్తర్వులతో డీలర్ల వద్ద మూడు నెలలుగా కిరోసిన్ నిల్వ అలాగే ఉంటోంది. జూన్ నుంచి పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే డీలర్లకు సరఫరా అయిన కిరోసిన్ పంపిణీని ఆపేసింది. ఇది పక్క దారి పడుతున్నట్లు సమాచారం. మదనపల్లె రూరల్ : జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా చౌక దుకాణ డీలర్లకు కిరో సిన్ సరఫరా చేశారు. అంతలోనే పొగ రహిత రాష్ట్రంగా ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ ఆగిపోయింది. ప్రభుత్వం పంపిణీ చేసిన కిరోసిన్‌ను ఏం చేయా లో తెలియక డీలర్లు సతమతమవుతున్నారు. డీలర్ల వద్ద నిల్వ ఉన్న కిరోసిన్ ఇటు లబ్ధి్దదారులకు అందక, అటు ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోవడంతో డీలర్లకు దిక్కుతోచడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల్లో బియ్యం, కిరోసిన్, పంచదార, గోధు మ, కంది పప్పు, ఉప్పు, చింతపండు పంపిణీని ప్రారంభించారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కిలో బియ్యం రూపాయికి ఇస్తూ పంచదార, కిరోసిన్‌తో పాటు తొమ్మిదిరకాల వస్తువులను పంపిణీ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదట్లో వీటిని కొనసాగించినా, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ–పోస్ విధా నం అమలులోకి తెచ్చి రేషన్ దుకా ణాల్లో ఒక్కొక్క సరుకుకు కోత విధిం చింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం చక్కెరపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఇస్తున్న చక్కెర పంపిణీని నిలి పేసింది. ప్రస్తుతం చౌక దుకాణాల్లో బియ్యం, గోధుమపిండి మాత్రమే సరఫరా చేస్తున్నారు. జూన్ వరకు తెలుపు రంగు రేషన్‌కార్డులు ఉన్న గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2లీటర్లు, ఉన్న వారికి లీట ర్లు పంపిణీ చేసే వారు. ఉన్నట్లుండి కిరోసిన్ పంపిణీ నిలిపేసిన ప్రభుత్వం డీలర్ల వద్ద ఉన్న కిరోసిన్‌ను ఏంచేయాలనే దానిపై మార్గదర్శకాలు ఇవ్వలేదు. లక్షలాది లీటర్లు డీలర్ల వద్దే నిల్వ ఉండిపోయాయి. కొన్నిచోట్ల ప్రభుత్వం తిరి గి తీసుకోదన్న ధీమాతో కొందరు బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు సమాచా రం. కిరోసిన్‌ను తమకే పంపిణీ చేయా లని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఆగస్టు 1నుంచి రేషన్ డీలర్ల నిరవధిక సమ్మె
- హైదరాబాద్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం హైదరాబాద్: రేషన్ డీలర్ల సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హైదరాబాద్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. శనివారం బషీర్ బాగ్‌లో ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నగర అధ్యక్షుడు దాసరి మల్లేశం నిరవ ధిక సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలపై పలుమార్లు సంబంధిత అధికారులను, మంత్రులను కలసి వినతిపత్రాలను సమర్పించినా స్పందన కరువైందన్నారు. ఈ నెలాఖరులోగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌గౌడ్, కృష్ణమూర్తి, గోపాలకృష్ణ, నందగోపాల్, ప్రసాద్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వారిపై అధికార పార్టీ కక్ష సాధింపు..
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. 17మంది రేషన్ డీలర్లపై కక్షసాధింపునకు పాల్పడ్డారు. వీరి రేషన్ షాపులపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి బయో మెట్రిక్ మిషన్లను తీసుకెళ్లారు. డీలర్లపై ఫిర్యాదులొచ్చాయని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తుండడంతో వీరిపై అధికారులు దాడులు చేశారు. కాగా, అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష కౌన్సిలర్లను కూడా వదలడంలేదు. స్థానిక 18వ వార్డు కౌన్సిలర్ సుబారాయుడు ఇంటిపై గత రాత్రి వందల సంఖ్యలో పోలీసులు దాడులు చేశారు. ఇంట్లో ఉన్న రూ.5.5 లక్షలను తీసుకెళ్లారు. ఆ డబ్బుకు ఆధారాలు చూపినా పట్టించుకోకుండా తీసుకెళ్లారని కౌన్సిలర్ వాపోయారు. నంద్యాల ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ ఈ విధమైన దారుణాలకు ఒడిగట్టిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
'డీలర్స్ గౌరవ వేతనం పెంచే పరిస్థితి లేదు'
హైదరాబాద్: రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అయితే వారికి గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అరెస్టు అయి గోషా మహల్ స్టేడియంలో ఉన్న రేషన్ డీలర్లను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు వారి ఆందోళనకు సంఘీబావం తెలిపారు. అక్కడినుంచే మంత్రి ఈటలకు ఫోన్ చేసి వారి సమస్యలపై మాట్లాడారు. గౌరవ వేతనం అంశంపై నిర్ణయం పెండింగ్‌లో ఉందని, కొందరు బోగస్ డీలర్లు ఉన్నందున వారిని తొలగించి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారని ఈటల సమాధానమిచ్చారు. -
బినామీలను ఏరేద్దాం!
రేషన్ డీలర్లపై స్పెషల్ డ్రైవ్ సాక్షి, హైదరాబాద్: చౌక ధరల దుకాణాల సంస్కరణలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. బినామీ రేషన్ దుకాణాల వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆ శాఖ యంత్రాంగం నిఘా పెట్టింది. దీనిలో భాగంగా బినామీ డీలర్లను గుర్తించే పనిలో ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపింది. బినామీ రేషన్ డీలర్ల ఏరివేత పైలెట్ ప్రాజెక్టును గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ షాపుల్లో చేపట్టనున్నారు. పౌరసరఫరాల కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపిన వివరాల మేరకు, బినామీల ఏరివేతకు ఆయా ఏసీఎస్ఓ ఆఫీసులకు చెందిన ఏరియా ఇన్స్పెక్టర్లు అన్ని రేషన్ షాపుల్లో తనిఖీలు చేస్తారు. డీలర్‌కు జారీ చేసిన ఫారం బితో పాటు, షాపు నిర్వహణ తీరు తెన్నులను పరిశీలిస్తారు. వారు డీలర్లకు ఇచ్చిన పత్రాలను తమ ఆఫీసులోని పత్రాలతో సరిపోలుస్తారు. ఈ పని పది రోజుల్లో పూర్తి చేస్తారు. ఈపాస్ మిషన్‌లో డీలర్ వ్యాపారం చేస్తున్నాడా, లేదా అని నిర్ధారణ చేసే సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ షాపుల పనితీరుపై గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా డీసీఎస్ ఓలు, ఏసీఎస్ఓలు, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమీక్ష జరి పారు. కాగా 6 నెలలుగా రేషన్ తీసుకోని లబ్ధిదారుల కార్డులను రద్దు చేయనున్నారు. -
284 మంది రేషన్ డీలర్లకు షోకాజ్ నోటీసులు
కాకినాడ సిటీ: జిల్లా వ్యాప్తంగా 284 మంది రేష¯ŒS డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు షాపులను తెరిచి కార్డుదారులకు రేష¯ŒS సరుకులు పంపిణీ ప్రారంభించాల్సి ఉంది. మంగళవారం చాలామంది డీలర్లు ఉదయం 10 గంటలు దాటినా షాపులు తెరవలేదు. బయోమెట్రిక్ విధానం కారణంగా ఎవరెవరు షాపులు తెరిచి సరుకులు ఇస్తున్నారో ఆ¯ŒSలై¯ŒSలో తెలుస్తుంది. అసలే ఎండాకాలం కావడం... కార్డుదారులు ఇబ్బంది పడతారనే ఆలోచన లేకుండా డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు సబ్‌కలెక్టర్, ఆర్డీవోలు వారి డివిజన్ల పరిధిలోని షాపులు తెరవని డీలర్లకు షోకాజ్ నోటీసుల జారీకి చర్యలు చేపట్టారు. -
సాగర్‌పై సస్పెన్షన్ వేటు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు డెప్యూటీ తహసీల్దార్ ఎల్.విద్యాసాగర్‌పై సస్పెన్షన్ వేటు పడినట్టు సమాచారం. ఇటీవల కలెక్టర్, రెవెన్యూ అసోసియేషన్ మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజా వ్యవహారం చర్చనీయాంశమైంది. డెప్యూటీ తహసీల్దార్ హోదాలో విద్యాసాగర్ తమను వేధిస్తున్నారంటూ రేషన్ డిపో డీలర్లు కలెక్టర్ కె.భాస్కర్‌కు శనివారం ఫిర్యాదు చేయడంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ‘విద్యాసాగర్ మమ్మల్ని ఏమేయ్.. ఒసేయ్ అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఐదు కిలోల బియ్యం తగ్గినా వేధిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే డిపోకు తాళం వేస్తానని బెదిరిస్తున్నారు’ అంటూ రేషన్ డీలర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏలూరు ఆర్డీఓకు ఆదేశాలిచ్చారు. తిట్లు.. వేధింపులు భరించలేకపోతున్నామని ఫిర్యాదు ఏలూరు మండలానికి చెందిన రేషన్ డీలర్లు, గుమాస్తాలు విద్యాసాగర్ పెట్టే బాధలు భరించలేకపోతున్నామని కలెక్టర్ ఎదుట వాపోయారు. తమ తల్లిదండ్రులను సైతం చెప్పుకోలేని విధంగా తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి నెలా ఒక్కొక్క రేషన్ డిపో నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారని, లంచం ఇవ్వకపోతే డిపోకు తాళాలు వేస్తామని బెదిరిస్తూ బండబూతులు తిడుతున్నారని వారు ఆరోపించారు. గర్బిణి అని కూడా చూడకుండా తనను నోటికి వచ్చినట్టు దూషించి.. 10 కేజీల బియ్యం ఎందుకు తగ్గాయని నిలదీశారని ఈపిచర్ల గంగ అనే డీలర్ వాపోయారు. బస్తాను ఎలుకలు కొరికివేయడం వల్ల బియ్యం కారిపోయి కింద పడ్డాయని, వాటిని పక్కకు తీసి ఉంచానని, వెనక్కి పంపిద్దామనే ఉద్దేశంతో పంపిణీ చేయకుండా డిపోలోనే ఉంచేసినట్టు చెప్పినా వినకుండా కేసు రాస్తే డిపో రద్దవుతుందని అంటూ బెది రించారని ఆమె ఆరోపించింది. డిపో రద్దయితే జీవనోపాధి పోతుందనే భయంతో రూ.5 వేలను సాగర్‌కు లంచంగా ఇచ్చామని, రెండు రోజుల తరువాత మళ్లీ వచ్చి డిపో రికార్డుల తనిఖీ అంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ‘చంద్రబాబైనా, జిల్లా కలెక్టరైనా నాకు గొప్పకాదు. నేను చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే ఏదో పేరుతో డిపోను రద్దు చేయిస్తానని భయపెడుతున్నారు’ అని డీలర్లు ఎస్.సత్యవతి, ఆర్.విమలాదేవి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, ప్రసాద్, శ్రీరేఖ తదితరులు కలెక్టర్‌కు వివరించారు. తన తల్లి కోడూరు పార్వతి పక్షవాతంతో బాధపడుతోందని, సహాయం గా తాను డిపోలో పనిచేస్తుంటే సాగర్ వచ్చి బినామీ పేరుతో డిపో నడుపుతున్నావంటూ తన తల్లిని బెదిరించారని, కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని డీలర్ కుమార్తె రమాదేవి వాపోయింది. గతంలో కూడా చెప్పడానికి వీలులేని దుర్భాషలాడుతూ.. లంచాలు ఇవ్వకపోతే డిపోకు తాళం వేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పలువురు డీలర్లు చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ఎవరికీ, ఏ ఒక్కరూ లంచం ఇవ్వాల్సిన పనిలేదని, ఎవరైనా లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రేషన్ డిపోల్లో గతంలో అక్రమాలు జరిగేవని, ఈ–పాస్ విధానం అమల్లోకి రావడంతో ఆ పరిస్థితి లేదన్నారు. డీలర్లు ఎవరికీ బయపడాల్సిన పనిలేదని, ఎవరైనా బెదిరిస్తే తన దృష్టికి తీసుకు వస్తే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ ఏలూరు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. తక్షణమే నివేదిక సమర్పించాలని కోరారు. ఇదిలావుంటే.. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో విద్యాసాగర్ ఇటీవల కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. వర్క్ టు రూల్ పాటిస్తామని ప్రకటించడంతోపాటు కలెక్టర్‌పై ఆరోపణ లు చేశారు. వాటిని కలెక్టర్ తిప్పికొట్టగా, ఆ తర్వాత తహసీల్దార్ల ఒత్తిడితో వర్క్ టు రూల్ చేస్తామన్న అల్టిమేటమ్ నుంచి విద్యాసాగర్ వెనక్కి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగర్‌పై ఒకేసారి డీలర్లంతా వచ్చి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. -
రేషన్ డీలర్ల ద్వారా వృద్ధాప్య పింఛన్లు పంపిణీ
అమరావతి: రేషన్ డీలర్ల ద్వారా వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ గురువారం రేషన్ డీలర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మార్చి లేదా ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారానే పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు డీలర్లకు హామీ ఇచ్చారని సమాచారం. -
రేషన్ డీలర్ల మౌన ప్రదర్శన
నల్ల బ్యాడ్జీలతో నిరసన సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లు బుధవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. డీలర్లు శాంతియుతంగా హైదరాబాద్‌లో ఆమరణ దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేయడం దారుణమని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, నెలకు రూ.30వేల వేతనం ఇవ్వాలని, హెల్త్‌కార్డులు అందించాలని, బ్యాంకింగ్ కార్పొరేట్ ఏజంట్‌గా గుర్తించాల ని, మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరి హారం అందించాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నంచేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మయ్య, ప్రధాన కార్యదర్శి వి.వంశీకృష్ణారావు, కోశాధికా రి జిల్లా కృష్ణమూర్తి, వావిలాల ఆనందం, నాయిని రవీందర్, బుర్ర మల్లేశం, శీలం మునిరెడ్డి, వాసాల శ్రీనివాస్, గుడ్ల సుభాష్, ఎం.మహేశ్, ఎం.భూమేశ్, కె.శ్రీనివాస్, విజయ, ఎం.రాజు, లక్ష్మణ్, ఎండీ.బాబు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్ల ఆమరణ దీక్ష భగ్నం
హైదరాబాద్: రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్య క్షుడు బత్తుల రమేశ్‌బాబు చేస్తున్న నిరశన దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. రమేశ్ బాబుతోపాటు సంఘ నాయకులను బలవంతం గా అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలిం చారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.30 వేల వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని రమేశ్‌బాబు సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగారు. మంగళవారం పోలీసులు బలవంతపు అరెస్టులకు దిగారు. డీలర్లు అరెస్టు లను ప్రతిఘటిస్తూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో డీలర్ల ప్రతిఘటనల మధ్య దాదాపు 40 మంది డీలర్ల నాయకులను, డీలర్లను అరెస్టు చేశారు. రెండో రోజు దీక్షకు పలువురి మద్దతు: రమేశ్ బాబు రెండో రోజు దీక్షకు పలు పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, టీటీడీపీ ప్రధాన కార్య దర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాములు, టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి, మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు దీక్షా శిబి రాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. దీక్షలను ద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రెండు రోజులుగా దీక్షలు చేస్తున్నా డీలర్ల డిమాండ్లపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. డీలర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే డీలర్లు రోడ్డెక్కే పరిస్థితి వచ్చేది కాదని గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, హెల్త్‌కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలర్ల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రసాదుగౌడ్, గోపాలకృష్ణ, నందగోపాల్, బి కృష్ణహరి, దినేశ్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
ఇక ఆధార్ ఆధారిత చెల్లింపులు
రేషన్ డీలర్లు తప్పనిసరి అమలు చేయాలి రెండు వారాల్లోగా అన్ని బ్యాంకులకు యాప్ సౌకర్యం సదస్సులో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరకాల : ప్రస్తుతం ఏపీజీవీ బ్యాంకు ద్వారా జరుగుతున్న ఆధార్ ఆధారిత చెల్లింపులను రెండు వారాల్లో మిగతా బ్యాంకులకు వర్తింపజేస్తామని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఆధార్ ఆధారిత చెల్లింపుల కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చెల్లింపులు సులువవుతాయని, వ్యాపారాలు సజావుగా సాగుతాయని ఆయన పేర్కొన్నారు. పరకాలలోని మయూరి గార్డెన్స్‌లో వరంగల్ రూరల్ఆర్డీఓ మహేందర్‌జీ అధ్యక్షతన గురువారం ‘నగదు రహిత లావాదేవీలు – ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ’పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కలెక్టర్ హాజరై ఆధార్ ఆధారిత చెల్లింపుల యాప్ వివరాల ను వెల్లడించారు. స్వైపింగ్ యంత్రాల కొరత కారణంగా ఏపీజీవీబీ ఖాతాలు ఉన్న వ్యాపారస్తులు ఆధార్ ఆధారిత చెల్లింపుల యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రూ.2వేలు వెచ్చించి యంత్రం కొనుగోలు చేస్తే నగదు చెల్లిం పులు సులువవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు రేషన్ డీలర్లు కూడా యాప్ ద్వారా లావాదేవీలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం తహసీల్దార్ కార్యాలయాల్లో రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, ఆ నగదును తిరిగి వారి డిపాజిట్లో జమ చేస్తామని వెల్లడించారు. అయితే, పలువురు తమకు ఏపీజీవీబీల్లో ఖాతాలు లేవని చెప్పడంతో రెండు వారాల్లోగా మిగతా బ్యాంకుల ద్వారా కూడా ఆధార్ ఆధారిత చెల్లింపులు జరిగేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా స్వైపింగ్ యంత్రాలు ఇవ్వడం లేదని చెప్పగా ఆధార్ ఆధారిత లావాదేవీ లకు అలవాటైతే అన్ని సమస్యలు తీరుతాయని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు. వేలిముద్ర, ఆధార్ నంబర్.. ఆధార్ ఆధారిత చెల్లింపుల కోసం యంత్రాలు ఉపయోగించే సమయంలో వినియోగదారుడి వేలిముద్ర, ఆధార్ కార్డు నెంబర్ యాప్‌లో నమోదు చేస్తే సరిపోతుందని కలెక్టర్ పాటిల్ తెలిపారు. ఆధార్ నంబర్ నమోదు చేయగానే బ్యాంకు అకౌంట్ నంబర్ కనిపిస్తుందని.. దీంతో నగదు చెల్లింపు సు లువవుతుందని పేర్కొన్నారు. ఇక కరెంట్ అకౌంట్ లేని వ్యాపారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఎస్బీఐ, ఎస్బీహెచ్ మేనేజర్లను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీజీవీబీ జనరల్ మేనేజర్ రవికిరణ్, రీజినల్ మేనేజర్ విశ్వప్రసాద్, టెక్నికల్ చీఫ్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్బీఐ మేనేజర్ ఆర్.శేషగిరి, ఎస్బీహెచ్ జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డి, మేనేజర్ మురళీకృష్ణ, జెడ్పీటీసీ పి.కల్పనాదేవి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ కుమారస్వామి, కమిషనర్ ఆర్.పరమేశ్ పాల్గొన్నారు. -
అప్పులోనూ అడ్డంగా దోపిడీ
– కొందరు రేషన్ డీలర్ల చేతివాటం – ఇవ్వని సరుకులు ఇచ్చినట్లుగా వేలిముద్రలు – వాటి మొత్తాన్ని రసీదులో చూపిస్తున్న వైనం – వచ్చే నెల లబ్ధిదారుని ఖాతాల్లో ఈ మొత్తం బదిలీ -------------------------------------------------------------- అనంతపురంలో నివాసముంటున్న కె.రమణ తన కార్డు తీసుకుని రేషన్ షాపునకు వెళ్లాడు. 15 కేజీ బియ్యం(రూ.15), అర కేజీ చక్కెర(రూ.8) ఇచ్చారు. వాటికి రూ.23 అవుతుంది. అయితే డీలర్ మాత్రం వీటితో పాటు కిలో గోధుమ పిండి (రూ.16.50), లీటరు కిరోసిన్ (రూ.19) కూడా ఇచ్చినట్లు ఈ–పాస్‌లో వేలిముద్ర వేయించుకున్నాడు. అన్ని సరుకులకు కలిపి రూ.58.50 పైసలకు రసీదు ఇచ్చాడు. తనకు రెండు సరుకులు ఇచ్చి నాలుగు సరుకులు ఇచ్చినట్లు రసీదు ఇవ్వడంతో రమణ కంగుతిన్నాడు. వెంటనే డీలర్లని ప్రశ్నిస్తే.. రెండ్రోజుల్లో మిగిలిన సరుకులు ఇస్తామంటూ పంపి వేశాడు. ఇది ఒక్క రమణ సమస్యే కాదు.. తెల్లకార్డు కలిగిన లబ్ధిదారులందరిదీ. డీలర్ల అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ------------------------------------------------------------ చౌక దుకాణాల్లో జరిగే అక్రమాలు అరికట్టాలని, డీలర్ల అవినీతికి చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా డీలర్లు ఏదో ఒక దారి వెతుక్కుంటూనే ఉన్నారు. తమకు అడ్డు లేదని నిరూపిస్తున్నారు. తెల్లకార్డుదారుల సొమ్మును అడ్డంగా దోచుకుంటూ దొరల్లా చెలమణి అవుతున్నారు. అప్పుగా సరుకులు ఇమ్మంటే... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కార్డుదారులకు డిసెంబర్ నెల సరుకులు అప్పుగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీన్ని కొందరు డీలర్లు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. తమ తెలివి తేటలతో చేతివాటం ప్రదర్శిస్తూ, కార్డుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సరుకులను అప్పుగా ఇస్తూ... అందలోనూ దోపిడీకి తెరతీయడం అందరూ విస్తుపోయేలా చేస్తోంది. ఇదే అంశం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. అదెలాగంటే... ఎన్ని సరుకులు ఇస్తే అన్నింటికే ఈ-పాస్‌లో వేలిముద్ర వేయించుకోవాలి. ఇది నిబంధన. అయితే అందుకు విరుద్ధంగా కొందరు డీలర్లు తమ అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. రెండు సరుకులు ఇచ్చేసి అన్ని సరుకులు ఇచ్చినట్లుగా వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ–పాస్‌లో ఇచ్చినట్లుగా ఉంది కాబట్టి సరుకులు కార్డుదారుని చేరినట్లు ఆన్లైన్లో నమోదవుతుంది. దోపిడీ జరిగే తీరు ఇలా.. గత నెల వరకు ఇచ్చిన సరుకులకే కార్డుదారులు డబ్బులు ఇచ్చేవారు. ప్రస్తుత నెలలో సరుకులను అప్పుగా డీలర్లు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని వచ్చె నెలలో ఇచ్చే సరుకుల మొత్తాన్ని కలసి కార్డుదారుని ఖాతా నుంచి తమ ఖాతాకు బదిలీ చేసుకుంటారు. రమణ విషయం తీసుకుంటే అతనికి ఇచ్చిన సరుకులు రెండు. అందుకు అయిన మొత్తం రూ.23. అయితే నాలుగు సరుకులు ఇచ్చినట్లుగా రూ.58.50 పైసలకు రసీదు ఇచ్చాడు. అంటే వచ్చే నెలలో ఈ మొత్తం రమణ ఖాతా నుంచి డీలర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇక్కడ ఇవ్వని సరుకులు గోధుమ పిండి(రూ.16.50), కిరోసిన్(రూ.19). మొత్తం రూ.25.50 పైసలు డీలర్ సునాయసంగా నొక్కేస్తున్నాడనేది స్పష్టమవుతోంది. అనంతపురం ఆర్డీఓ మలోల ఏమంటున్నారంటే... కార్డుదారునికి ఇచ్చిన సరుకులకు మాత్రమే డీలర్ రసీదు ఇవ్వాలి. ఇవ్వని సరుకులు కూడా ఇచ్చినట్లుగా నమోదు చేయడం నేరం. అలా ఎవరైనా డీలరు అధికంగా వసూలు చేస్తున్నా, ఇవ్వని సరుకులు ఇచ్చినట్లు రసీదు ఇస్తుంటే వెంటనే మా దృష్టికి లేదా తహశీల్దారు దృష్టికైనా తీసుకువస్తే సదరు డీలర్‌పై చర్యలు తీసుకుంటాం. -
డీలర్లకు కొత్త బాధ్యతలు
అనంతపురం అర్బ¯ŒS : చౌక దుకాణ డీలర్ల సేవలను ప్రభుత్వం విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఇన్నాళ్లూ కేవలం లబ్ధిదారులకు సరుకులను మాత్రమే డీలర్లు అంది ంచేవారు. అయితే ఇప్పుడు బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లు(బీసీ)గా కూడా వారు పనిచేయనున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ద్వారా వారిని నియమించాలని ఈనెల 15న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆ దిశగా కలెక్టర్ కోన శశిధర్ చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ (డీఎల్‌బీసీ) సమావేశం నిర్వహించేందుకు ముందే ఆర్డీఓలు, తహశీల్దారులు తమ పరిధిలోని డీలర్లకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి చోట ఈ సమావేశం బుధవారం జరగాలని సూచించారు. బిజినెస్ కరస్పాండెంట్లుగా తీసుకునేందుకు ఉన్న నియమాలను డీలర్లకు తెలియజేసేందుకు డీఎల్‌బీసీ, నియమించుకునే బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. డీలర్లు ఏమి చేస్తారంటే... బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండే డీలర్లు బ్యాంక్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ తమ పరిధిలో ప్రాంతంలో బ్యాకింగ్ కార్యకలాపాలు సాగిస్తారు. బ్యాంకులకు ప్రజలు చెల్లించాల్సిన రుణాలను స్వీకరించడం వాటిని బ్యాంకుల్లో జమ చేయడం. రుణం తీసుకోవాలనుకునేవారికి అవసరమైన ఫారాలు ఇవ్వడం, నిబంధనలు వివరించడం వంటి కార్యకలాపాలను బిజినెస్ కరస్పాండెంట్లు తెలియజేస్తారు. ఖాతాదారులకు , బ్యాంకులకు మధ్యవర్తులుగా వీరు వ్యవహరిస్తారు. బ్యాంకుల నియమ, నిబంధనల మేరకు వీరికి కమీష¯ŒS అందించనున్నారు. -
విజయ నూనె విక్రయించరట!
- సర్కారు ఆదేశాలు పట్టించుకోని రేషన్ డీలర్లు - ప్రైవేటు కంపెనీలవి విక్రయిస్తున్న వైనం - భారీగా పడిపోయిన ‘విజయ’ అమ్మకాలు.. సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ పామాయిల్’ను విక్రయించాలన్న ఆదేశాలను రేషన్ డీలర్లు బేఖాతర్ చేస్తున్నారు. ఆయిల్‌ఫెడ్ ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్న విజయ నూనెను తిరస్కరిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై విజయ నూనెను డీలర్లు పట్టంచుకోవడం లేదని, లాభార్జనే ధ్యేయంగా డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు పర్యవేక్షణ లోపం, మామూళ్ల మత్తులో కొందరు అధికారులు ఉండటంతో ‘విజయ’కు చుక్కెదురైందన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం విజయ పామాయిల్‌ను రేషన్ దుకాణాల్లో విక్రయించాలని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అమలులోకి రాలేదు. నెలకు 17,600 మెట్రిక్ టన్నులు.. రాష్ట్రంలోని 17,226 రేషన్ దుకాణాల పరిధిలో 88.31 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. ఆ కార్డుల కింద 2.80 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ నూనెను కార్డుదారులకు నెలకు రెండు లీటర్ల చొప్పున 17,600 మెట్రిక్ టన్నులు విక్రయించడానికి వీలుంటుంది. కానీ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 1,342 మెట్రిక్ టన్నులు.. సెప్టెంబర్‌లో 414 మెట్రిక్ టన్నులే విక్రయించారు. అంటే ప్రభుత్వం ఆదేశిస్తే సెప్టెంబర్‌లో కేవలం 2.35 శాతం అమ్మకాలు మాత్రమే చేశారు. ప్రైవేటు కంపెనీల పామాయిల్‌కు కమీషన్ ఎక్కువగా ఉండటంతో డీలర్లు వాటినే విక్రయిస్తున్నారు. ప్రైవేటు పామాయిల్ ప్యాకెట్ విక్రయిస్తే రూ.8 వరకు లాభం వస్తుం డగా.. విజయ పామాయిల్ వల్ల రూ.3 వరకు మాత్రమే లాభం ఉంటుంది. దీనికి తోడు విజయ నూనెను కొనుగోలు చేయాలంటే డీలర్లు ముందుగా డబ్బు చెల్లిం చాలి. ప్రైవేటు కంపెనీలు తర్వాత చెల్లించే వెసులుబాటు కల్పించడంతో డీలర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఆదేశాలకూ దిక్కులేదు సర్కారు ఆదేశాలను రేషన్ డీలర్లు పట్టించుకోకపోవడంతో విజయ పామాయిల్ ప్రజలకు చేరడం లేదు. ప్రభుత్వం డీలర్లకు మరోసారి ఆదేశాలు ఇవ్వాలి. డిమాండ్‌కు తగ్గట్లుగా విజయ ఆయిల్‌ను అందించగలం. అవసరమైతే మరో రెండు షిఫ్టులు పెట్టి ప్యాకింగ్ చేయించగలం. - బి.రాజేశం, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ -
రేషన్ దుకాణాల్లో ప్రైవేటు దందా
• బయటి సరుకుల్ని లబ్ధిదారులకు అంటగడుతున్న వైనం • వాటిలో కాలం చెల్లిన వస్తువులే అధికం • కొనుగోలు చేయాల్సిందేనని డీలర్ల ఒత్తిడి • టీడీపీ నేత అనుచరులే సరఫరా చేస్తున్న వైనం • చౌకదుకాణంలో అమ్మకానికి ఉంచిన సంతోర్, ఊర్వశీ సబ్బులు రాయచోటి రూరల్: ఆదాయమే పరమావధిగా రేషన్ డీలర్లు కొందరు ప్రైవేటు దందాకు తెరలేపారు. దీనికి అధికారపార్టీ జిల్లాస్థారుు నేత అండదండలు ఉండటంతో రెచ్చిపోరుు మరీ కాలంచెల్లిన సరుకులను లబ్ధిదారులకు బెదిరించి మరీ అంటగడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ చౌకదుకాణా ల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం, కందిపప్పు, పంచదార లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్నిషాపుల్లో డీలర్లు సొంత వ్యాపారం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించే వస్తువులతో పాటు ప్రైవేటు సరుకులను కూడా విక్రరుుస్తున్నారు. అంతేకాక ఆ సరుకులు కొనుగోలు చేయాల్సిందేనని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 1,740 రేషన్‌షాపులు ఉండగా, వాటి పరిధిలో 7,06,472 రేషన్‌కార్డులు వినియోగంలో ఉన్నారుు. అందులో సగానికి పైగా షాపుల్లో ఈ ప్రైవేటు దందా నడుస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల డీలర్లు ఈ దందా చేస్తున్నట్లు తెలిసింది. పైగా రేషన్ డీలర్లు ఇచ్చే వస్తువుల తూకం కూడా తక్కువగా ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 5 కిలోల బియ్యం బ్యాగు తూకం వేయగా, అది సంచీతో పాటు 4,880 గ్రాములు మాత్రమే ఉండటం గమనార్హం. టీడీపీ నాయకుల అనుచరులే అంతా! ఈ వ్యవహారమంతా జిల్లాలోని రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో టీడీపీలో ఉన్న పెద్ద నాయకుని అనుచరులే చేస్తున్నట్లు సమాచారం. ప్రతినెలా 1వ తేదీకి ముందే సంతోర్ సబ్బులు, ఊర్వశీ బట్టల సబ్బులు, కారంపొడి ప్యాకెట్లు, షాంపులు, రవ్వ, గోధుమపిండి తదితర వస్తువులను ఆయా చౌకదుకాణాలకు చేర్చుతారు. అరుుతే ఇటీవల పలువురు డీలర్లు ఆ వస్తువులు అమ్మేందుకు నిరాకరించడంతో, తమకు అనుకూలంగా ఉండే వారి చౌకదుకాణాలకు మాత్రమే పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. కాలం చెల్లిన వస్తువులే అధికం డీలర్లు అమ్ముతున్న వస్తువుల్లో ఇడ్లీ, ఉప్మారవ్వ ప్యాకెట్‌పై జూన్ 8, 2016లో తయారు చేసినట్లు ఉంది. దీనికిందనే ఈ వస్తువును రెండునెలల లోపు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉందన్న ఉంది. దీంతో తెలిసిన వాళ్లు ఇవి కాలంచెల్లిన వస్తువులు కదా అని డీలర్లను ప్రశ్నించినా, అందరూ అమ్మినట్లే మేమే అమ్ముతున్నామని చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌకదుకాణాల్లో ఇంత వ్యవహారం జరుగుతున్నా, అధికారులు మా త్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై రాయచోటి తహసీల్దార్ గుణభూషన్‌రెడ్డి, రాయచోటి డివిజన్ పుడ్ ఇన్సపెక్టర్ భాస్కర్లను వివరణ కోరగా చౌకదుకాణాల్లో ప్రైవేటు వస్తువులు అమ్ముతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అలా అమ్ముతుంటే వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. -
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో రేషన్ పంపిణీ నిమిత్తం ఈ పోస్, ఈ వేమెంట్ అమలు చేసినప్పటి నుంచి ఆర్థికంగా డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. తూనికలు, కొలతల శాఖ స్టాంపింగ్, సర్వీసింగ్ పేరుతో రూ.300, రూ.600 వసూలు విధానాన్ని నిలుపుదల చేయాలని కోరారు. ఈ పోస్, కాటాల రిపేరు నిమిత్తం రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారని, దీనిని నిలుపుదల చేయాలన్నారు. డీలర్లకు ఆహారభద్రతా చట్టం ప్రకారం రూ.87 కమీషన్‌ను పూర్తిగా అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీని కలిసిన అనంతరం వారు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి డి.శివశంకరరెడ్డిని కూడా కలిసి వినతిపత్రం అందించారు. సంఘ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు కానుమోలు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి వెంకట నరసింహారావు పాల్గొన్నారు. -
అ‘కాట’కట
* రేషన్ డీలర్ల కాటాల ధ్రువీకరణకు నగదు వసూలు చేస్తున్న అధికారులు * ఆవేదన వ్యక్తం చేస్తున్న డీలర్లు తాడేపల్లి రూరల్: రేషన్ షాపు యజమానుల జేబులు ఖాళీ చేసేందుకు అధికారులు, రాజకీయ నాయకులు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.16 లక్షలు తమ జేబుల్లో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏటా రేషన్‌షాపు యజమానులు ప్రభుత్వం కాటాలను తనిఖీలు చేసి ముద్రలు వేస్తారు. దీని నిమిత్తం ప్రభుత్వం కూడా లీగల్ మెట్రాలజీ డిపార్టుమెంటు నుంచి జీవో నంబర్ 767 విడుదల చేసి, ఒక్కో రేషన్ డీలర్ నుంచి రూ. 300 లు వసూలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలకు పంపించింది. గుంటూరు జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధంగా ఒక్కో రేషన్ డీలర్ వద్ద రూ. 900 వసూలు చేస్తున్నారు. ఎవరైనా జీవో గురించి ప్రశ్నిస్టే కాటాలు పరిశీలించినట్టు ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా వేధిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక రేషన్ డీలర్లు అధికారులు అడిగిన సొమ్ము చెల్లించి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. దీనిపై ముద్ర వేసేందుకు వచ్చి మెట్రాలజీ అధికారులను ప్రశ్నిస్తే, మాకు తెలియదు జిల్లా కేంద్రంలో వసూలు చేయమన్నారని చెబుతున్నారు. రేషన్ డీలర్లు మాత్రం రూ. 300 మెట్రాలజీ డిపార్టుమెంటుకు, మరో రూ. 300 ముద్రలు వేసిన సిబ్బందికి వెళుతుందని, మిగిలిన రూ. 300 ఎవరు తీసుకుంటున్నారో తెలియదని అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తే రేషన్ డీలర్లు తమపై దౌర్జన్యం చేస్తూ షాపులు మూయిస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికే ఎంఎల్సీ పాయిట్ల నుంచి వచ్చే సరుకు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, కొత్తగా ఈ దోపిడీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ–పాస్ యంత్రాలకు ప్రభుత్వమిచ్చిన యంత్రాలు పని చేయకపోవడంతో, తమ సొంత సిమ్‌లు వేస్తున్నామని, దీంతో రెండు వందల బిల్లు అవుతుందని వాపోతున్నారు. -
రేషన్ డీలర్ల ఆమరణ దీక్ష విరమణ
సమస్యల పరిష్కారానికి మంత్రి ఈటెల హామీ హన్మకొండ : తమను ప్రభుత్వ ఉద్యోగులుగానైనా గుర్తించాలని, లేదా నెలకు కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాల ని డిమాండ్ చేస్తూ హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ముగిసింది. రేషన్ డీలర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దీక్ష విరమింపజేయించేందుకు టీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిని శిబిరం వద్దకు పంపించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి దీక్ష చేపడుతున్న డీలర్లకు మంత్రి ఈటెల రాజేందర్‌తో ఫోన్లో మాట్లాడించారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, దీక్ష విరమింపజేయాలని మంత్రి ఈటెల ఫోన్లో కోరారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి.. రమేష్‌బాబు, మోహన్‌కు నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేయించారు. అంత కు ముందు దీక్ష శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్లఅశోక్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్యతో పాటు ఆయా పార్టీల నాయకులు సందర్శించి సంఘీబావం తెలిపారు. -
డిప్యూటీ సీఎం ఇంటిని ముట్టడించిన రేషన్ డీలర్లు
అడ్డుకున్న పోలీసులు ఇంటి ముందు బైఠాయించి నిరసన హన్మకొండ : తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ. 20 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించారు. న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని కోరుతూ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్, ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డీలర్లు హన్మకొండ టీచర్స్‌కాలనీలోని డిప్యూటీ సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరారు. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు కడియం శ్రీహరి ఇంటి వద్దకు చేరుకుంటున్న డీలర్లను అడ్డుకున్నారు. అయితే తాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడమని, శాంతియుతంగా నిరసన తెలుపుతామని డీలర్లు పోలీసులకు తెలిపి వారు అక్కడికి చేరుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి నేరుగా డీలర్ల వద్దకు వచ్చి వారి డిమాండ్లు తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు వెళ్లిపోయారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పోతురాజు రమేష్, డీలర్లు గోపాల్‌రావు, లింగయ్య, వీరన్న, రాథకృష్ణ, మహేష్, మోహన్, సంధ్యారెడ్డి పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన నాయకులు హన్మకొండ ఏకశిల పార్కు వద్ద చేపట్టిన రేషన్ డీలర్ల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతి కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకుడు ఈవీ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు దీక్ష చేపట్టిన బత్తుల రమేష్‌బాబు, చిలగాని మోహన్‌కు సంఘీబావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం చొరవ చూపి డీలర్ల కోర్కెలు నెరవేర్చాలని కోరారు. కాగా, జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, దుగ్గొండి జెడ్పీటీసీ సభ్యుడు సుకినే రాజేశ్వర్‌రావు కూడా దీక్షలకు సంఘీభావం తెలిపారు. -
రేషన్ డీలర్ల ఆమరణ దీక్ష ప్రారంభం
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి రూ.20వేల కనీస వేతనం ఇవ్వాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్‌బాబు హన్మకొండ : తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు జిల్లా కేంద్రంలో నిరసన బాట పట్టారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ సోమవారం హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద ఆమరణ దీక్షను చేపట్టారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందిం చకపోవడంతో ఆమరణ దీక్షకు పూనుకున్నట్లు వారు తెలిపారు. తమకు రూ.20వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎం ఎల్సీ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు వచ్చే ప్రతి బస్తాలో 1 కిలో నుంచి 2 కిలోల బియ్యం తక్కువగా ఉంటోందన్నారు. అయినా తాము ఎవరికీ చెప్పుకోకుండా నష్టాన్ని భరిస్తున్నామని రమేష్‌బాబు, మోహన్ వివరించారు. రేషన్ డీలర్లు పెద్దసంఖ్యలో తరలిరావడంతో దీక్షా శిబిరం కిక్కిరిసింది. దీక్షకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మె ల్యే దనసరి ఆనసూయ సంఘీబావం తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల జీవి తాలతో ఆటలాడుకుంటోందని విమర్శించారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఎస్.మోహన్, జి.గోపాల్‌రావు, వాణిరాంరాజు, పుష్పదయాకర్, సీ.హెచ్.రాజేందర్‌రెడ్డి, వి.విజయ్‌పాల్, ఎ.వెంకటేశ్వర్లు, బి.మహేష్, కాడపాక పాణి, కె.శ్రీనివాస్, సీ.హెచ్.శ్రీశైలం, పులి రాములు, ఎం.రాజయ్య, డి.భిక్షపతి, గోరంట్ల వెంకటనారాయణ, తదితరులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.