శ్రీకాకుళం పాతబస్టాండ్ : నిత్య అవసరాల సరుకుల సరఫరా రేషన్ డీలర్లు సమ్మెబాట పడుతున్నారు. మొన్న టివరకూ ఆర్టీసీ కార్మికులు, ఇప్పుడు డీల ర్లు. ప్రస్తుత సర్కారు హయాంలో పెరుగుతున్న వేధింపులు, కొరవడుతున్న ఉద్యోగ భద్రత, కొత్త విధానాలతో సమస్యలు సృష్టించడంతో విసిగెత్తిపోతున్న డీలర్లు ఇక ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. వీటిపై పలు సార్లు రాష్ట్ర స్థాయి ఆధికారులను కలసి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఉద్యమానికి సన్నద్ధం కావా ల్సి వచ్చింది. మూడు దశల్లో ఉద్యమాలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 16నుంచి 25లోగా తీయాల్సిన డీడీ లు తీయకూడదనీ, 20నుంచి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టాల ని, మూడో దశలో 25నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేర కు డీలర్ల సంఘ జిల్లా ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు సమ్మె నోటీసులు అందజేశారు.
ఈపాస్‌తో ఇక్కట్లు
జిల్లాలో 1960 చౌక డిపోలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 7.4లక్షల రేషను కార్డులకు ప్రతినెల సరుకులు అందజేస్తున్నారు. ప్రధానంగా బియ్యం, పంచదార, కిరోసిన్ వంటివి అందజేస్తున్నారు, వీటికి తోడుగా ఒక్కోసారి పామాయిల్, కందిపప్పు, ఇతర సరుకులు కూడా విక్రయిస్తున్నారు. జిల్లాలో 242 డిపోల్లో ఈ పాస్ విధానం ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. రెండు నెలలు గడిచినా ఈ విధానం ఇంకా గాడిలో పడలేదు, పలు లోపాలవల్ల సరకులు సకాలంలో లబ్ధిదారులకు అందించలేకపోతున్నారు. అయినా జూన్ నెల నుంచి అన్ని డిపోల్లోనూ ఈ పాస్ విధానం అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇవీ డీలర్ల సమస్యలు
డీలర్లు ప్రధానంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి విడుదలవుతున్న సరకులు కచ్చితమైన పరిమాణంలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
పెరిగిన ఖర్చులకు తగినట్టు కమీషన్ లేక ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్నారు.
ఈ పాస్ విధానంలో లోపాలు సవరించకపోవడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
నిర్ణీత పనివేళలు లేకపోవడం... వారాంతపు సెలవు లేకపోవడం.
రేషన్‌సరకుల గౌడౌన్ ఆద్దె ఖర్చులు, హమాలీలు చార్జీలు భారంగా మారాయి.
రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి.
ప్రధాన డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆహార భద్రతా పథకాన్ని అనుసరించి క్వింటాలుకు రూ. 70లు కమీషన్ అందజేయాలి,
ఈ పాస్ అమలు చేస్తున్న డిపోల్లో క్వింటాలుకు రూ. 87లు అందజేయాలి, ఈ జీఓని కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి
సమయపాలన ఉండాలి, వారంలో ఒక రోజు సెలవు, మిగిలిన రోజుల్లో ఉదయం 7 నుంచి 11 వరకు, మద్యాహ్నం 4 నుంచి 8 గంటలకు అనుమతించాలి.
ఎంఎల్‌ఎస్ పొయింట్ల వద్ద తూనికలు కచ్చితంగా ఉండేలా, రవాణా తరుగులేకుండా చూడాలి,
హమాలీ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి.
ఇటీవల ఎక్కువైన రాజకీయ వేధింపులు ఆపాలి.
ప్రతి డీలరుకు కనీస వేతనం రూ. 10వేలకు తక్కువ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి,
ఇక డీలర్ల వంతు
Published Sun, May 17 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement
Advertisement