ఆగస్టు 1నుంచి రేషన్‌ డీలర్ల నిరవధిక సమ్మె | Ration dealers to go on strike from 1st august | Sakshi
Sakshi News home page

ఆగస్టు 1నుంచి రేషన్‌ డీలర్ల నిరవధిక సమ్మె

Published Sun, Jul 16 2017 3:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

Ration dealers to go on strike from 1st august

- హైదరాబాద్‌ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం
హైదరాబాద్‌:
రేషన్‌ డీలర్ల సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హైదరాబాద్‌ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. శనివారం బషీర్‌ బాగ్‌లో ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నగర అధ్యక్షుడు దాసరి మల్లేశం నిరవ ధిక సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలపై పలుమార్లు సంబంధిత అధికారులను, మంత్రులను కలసి వినతిపత్రాలను సమర్పించినా స్పందన కరువైందన్నారు. ఈ నెలాఖరులోగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వీరేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌గౌడ్, కృష్ణమూర్తి, గోపాలకృష్ణ, నందగోపాల్, ప్రసాద్‌ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement