సాక్షి, విజయవాడ: రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు తినే రేషన్‌లో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చే వాటికన్నా..క్వాలిటీతో ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వంపై 350 కోట్ల భారం పడ్డా నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలపై భారం పడకుండా డీలర్లకు 22 కోట్లు కమీషన్ రూపంలో ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. ఉచిత రేషన్ రూపంలో డీలర్లు ఇచ్చే కమీషన్ 270 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించిందని, రేషన్ డీలర్లకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని కొడాలి నాని తెలిపారు. (చదవండి: ‘అది తెలిసే మొహం చాటేశారు’)
Comments
Please login to add a commentAdd a comment