అనంతపురం అర్బ¯ŒS : చౌక దుకాణ డీలర్ల సేవలను ప్రభుత్వం విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఇన్నాళ్లూ కేవలం లబ్ధిదారులకు సరుకులను మాత్రమే డీలర్లు అంది ంచేవారు. అయితే ఇప్పుడు బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లు(బీసీ)గా కూడా వారు పనిచేయనున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ద్వారా వారిని నియమించాలని ఈనెల 15న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆ దిశగా కలెక్టర్ కోన శశిధర్ చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ (డీఎల్‌బీసీ) సమావేశం నిర్వహించేందుకు ముందే ఆర్‌డీఓలు, తహశీల్దారులు తమ పరిధిలోని డీలర్లకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి చోట ఈ సమావేశం బుధవారం జరగాలని సూచించారు. బిజినెస్ కరస్పాండెంట్లుగా తీసుకునేందుకు ఉన్న నియమాలను డీలర్లకు తెలియజేసేందుకు డీఎల్‌బీసీ, నియమించుకునే బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
డీలర్లు ఏమి చేస్తారంటే...
బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండే డీలర్లు బ్యాంక్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ తమ పరిధిలో ప్రాంతంలో బ్యాకింగ్ కార్యకలాపాలు సాగిస్తారు. బ్యాంకులకు ప్రజలు చెల్లించాల్సిన రుణాలను స్వీకరించడం వాటిని బ్యాంకుల్లో జమ చేయడం. రుణం తీసుకోవాలనుకునేవారికి అవసరమైన ఫారాలు ఇవ్వడం, నిబంధనలు వివరించడం వంటి కార్యకలాపాలను బిజినెస్ కరస్పాండెంట్లు తెలియజేస్తారు. ఖాతాదారులకు , బ్యాంకులకు మధ్యవర్తులుగా వీరు వ్యవహరిస్తారు. బ్యాంకుల నియమ, నిబంధనల మేరకు వీరికి కమీష¯ŒS అందించనున్నారు.
డీలర్లకు కొత్త బాధ్యతలు
Published Thu, Nov 17 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
Advertisement
Advertisement