సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. కమీషన్ టన్నుకు 700 నుండి 1400 రూపాయలకు పెంపుదల చేసింది. కమీషన్ పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.245 కోట్ల భారం పడనుంది.
డీలర్ల కమీషన్ పెంపు జీవోను జేఏసీ ప్రతినిధులకు మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. 17 వేలకు పైగా రేషన్ డీలర్ల కుటుంబాకు లబ్ధి కలుగనుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించాలని పిలుపునిచ్చారు.
చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment