సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటివరకు 30 శాతం అధికంగా ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 6,775 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి రూ.8, 268 కోట్ల విలువైన 42.22 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 13 జిల్లాల్లోని 1,280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తవడంతో మూసివేసినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు రూ.5,447 కోట్లు మళ్లించినట్లు చెప్పారు. ధాన్యం రవాణా సమస్య, గన్నీ బ్యాగుల కొరత లేదని మంత్రి వెల్లడించారు.
గోదాములు ఖాళీ చేయని ఎఫ్‌సీఐ
రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ గోదాములన్నీ దాదాపుగా నిండిపోయాయని, సూర్యాపేట, సిద్దిపేట, సం గారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్‌లోని గోదాముల్లో ఖాళీ లేదని గంగుల తెలిపారు. మిల్లింగ్ అయిన బియ్యాన్ని నిల్వ చేసే పరిస్థితి కూడా లేదన్నారు. గోదాముల్లోని బియ్యాన్ని తరలించేందుకు ఎఫ్‌సీఐ రైల్వే వ్యాగన్లను పంపించకపోవడంతో మిల్లుల్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో కదలిక లేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి విన్నవించినా ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతులపై కేం«ద్రం అనుసరిస్తున్న వైఖరిమీద ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాష్ట్ర ప్రభు త్వం వానాకాలం ధాన్యం సేకరణ వేగవంతంగా చేస్తోందని చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషన అనిల్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment