రేషన్ డీలర్ల ఆమరణ దీక్ష ప్రారంభం
-
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
-
రూ.20వేల కనీస వేతనం ఇవ్వాలి
-
సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్‌బాబు
హన్మకొండ : తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు జిల్లా కేంద్రంలో నిరసన బాట పట్టారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ సోమవారం హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద ఆమరణ దీక్షను చేపట్టారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందిం చకపోవడంతో ఆమరణ దీక్షకు పూనుకున్నట్లు వారు తెలిపారు. తమకు రూ.20వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎం ఎల్‌సీ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు వచ్చే ప్రతి బస్తాలో 1 కిలో నుంచి 2 కిలోల బియ్యం తక్కువగా ఉంటోందన్నారు. అయినా తాము ఎవరికీ చెప్పుకోకుండా నష్టాన్ని భరిస్తున్నామని రమేష్‌బాబు, మోహన్ వివరించారు.
రేషన్ డీలర్లు పెద్దసంఖ్యలో తరలిరావడంతో దీక్షా శిబిరం కిక్కిరిసింది. దీక్షకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మె ల్యే దనసరి ఆనసూయ సంఘీబావం తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల జీవి తాలతో ఆటలాడుకుంటోందని విమర్శించారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఎస్.మోహన్, జి.గోపాల్‌రావు, వాణిరాంరాజు, పుష్పదయాకర్, సీ.హెచ్.రాజేందర్‌రెడ్డి, వి.విజయ్‌పాల్, ఎ.వెంకటేశ్వర్లు, బి.మహేష్, కాడపాక పాణి, కె.శ్రీనివాస్, సీ.హెచ్.శ్రీశైలం, పులి రాములు, ఎం.రాజయ్య, డి.భిక్షపతి, గోరంట్ల వెంకటనారాయణ, తదితరులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.