
రేషన్ డీలర్ల ఆమరణ దీక్ష భగ్నం
హైదరాబాద్: రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్య క్షుడు బత్తుల రమేశ్‌బాబు చేస్తున్న నిరశన దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. రమేశ్ బాబుతోపాటు సంఘ నాయకులను బలవంతం గా అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలిం చారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.30 వేల వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని రమేశ్‌బాబు సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగారు. మంగళవారం పోలీసులు బలవంతపు అరెస్టులకు దిగారు. డీలర్లు అరెస్టు లను ప్రతిఘటిస్తూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో డీలర్ల ప్రతిఘటనల మధ్య దాదాపు 40 మంది డీలర్ల నాయకులను, డీలర్లను అరెస్టు చేశారు. రెండో రోజు దీక్షకు పలువురి మద్దతు: రమేశ్ బాబు రెండో రోజు దీక్షకు పలు పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు.
బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, టీటీడీపీ ప్రధాన కార్య దర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాములు, టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి, మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు దీక్షా శిబి రాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. దీక్షలను ద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రెండు రోజులుగా దీక్షలు చేస్తున్నా డీలర్ల డిమాండ్లపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. డీలర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే డీలర్లు రోడ్డెక్కే పరిస్థితి వచ్చేది కాదని గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, హెల్త్‌కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రసాదుగౌడ్, గోపాలకృష్ణ, నందగోపాల్, బి కృష్ణహరి, దినేశ్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు.