రేషన్ డీలర్ల మౌన ప్రదర్శన
నల్ల బ్యాడ్జీలతో నిరసన
సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లు బుధవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. డీలర్లు శాంతియుతంగా హైదరాబాద్‌లో ఆమరణ దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేయడం దారుణమని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, నెలకు రూ.30వేల వేతనం ఇవ్వాలని, హెల్త్‌కార్డులు అందించాలని, బ్యాంకింగ్ కార్పొరేట్ ఏజంట్‌గా గుర్తించాల ని, మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరి హారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇందిరాపార్క్ వద్ద డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నంచేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మయ్య, ప్రధాన కార్యదర్శి వి.వంశీకృష్ణారావు, కోశాధికా రి జిల్లా కృష్ణమూర్తి, వావిలాల ఆనందం, నాయిని రవీందర్, బుర్ర మల్లేశం, శీలం మునిరెడ్డి, వాసాల శ్రీనివాస్, గుడ్ల సుభాష్, ఎం.మహేశ్, ఎం.భూమేశ్, కె.శ్రీనివాస్, విజయ, ఎం.రాజు, లక్ష్మణ్, ఎండీ.బాబు పాల్గొన్నారు.