silent performance
-
రేషన్ డీలర్ల మౌన ప్రదర్శన
నల్ల బ్యాడ్జీలతో నిరసన సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లు బుధవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. డీలర్లు శాంతియుతంగా హైదరాబాద్‌లో ఆమరణ దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేయడం దారుణమని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, నెలకు రూ.30వేల వేతనం ఇవ్వాలని, హెల్త్‌కార్డులు అందించాలని, బ్యాంకింగ్ కార్పొరేట్ ఏజంట్‌గా గుర్తించాల ని, మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరి హారం అందించాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నంచేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మయ్య, ప్రధాన కార్యదర్శి వి.వంశీకృష్ణారావు, కోశాధికా రి జిల్లా కృష్ణమూర్తి, వావిలాల ఆనందం, నాయిని రవీందర్, బుర్ర మల్లేశం, శీలం మునిరెడ్డి, వాసాల శ్రీనివాస్, గుడ్ల సుభాష్, ఎం.మహేశ్, ఎం.భూమేశ్, కె.శ్రీనివాస్, విజయ, ఎం.రాజు, లక్ష్మణ్, ఎండీ.బాబు పాల్గొన్నారు. -
అమ్మకు ఘన నివాళి
పెరియపాలెం: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వాడవాడలా కార్యకర్తలు, అన్నాడీఎంకే నిర్వాహకులు, ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం ఉదయం పెరియపాలెంలో ఎల్లాపురం యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి పి.రవిచంద్రన్ నేతృత్వంలో వందలాది కార్యకర్తలు నల్లరిబ్బన్లు పెట్టుకుని అమ్మ జయలలిత చిత్రపటాన్ని చేతబట్టి మౌనప్రదర్శన చేశారు. అమ్మ అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరువయ్యాయని ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుమ్మిడిపూండి ఎమ్మెల్యే కె.ఎస్.విజయకుమార్ అన్నారు. అమ్మ ఆశయాలను కొనసాగించడం మన ముఖ్య లక్ష్యమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీ బస్టాండ్ వద్దకు రాగానే అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గ్రామంలోని అన్ని ప్రధాన వీధుల్లో మౌన ప్రదర్శన చేశారు. ర్యాలీలో యూనియన్ మాజీ చైర్మన్ అమ్మణి మహేంద్రన్, పార్టీ నాయకులు వడమధురై కొదండన్, యూనియన్ అమ్మపేరవై కార్యదర్శి రమేష్, పెద్దసంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. స్థానిక ఈహెచ్.రోడ్డులో 38 వార్డు అన్నాడీఎంకు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చిత్ర పటాన్నిపెట్టి ప్రత్యేక పూజలుచేసి అమ్మ అత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అంజలి ఘటించారు. మాజీ కౌన్సిలర్ ఎస్.సంతానం, పార్టీ నాయకులు పి.అంకయ్య, పెరుమాళ్, నరేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.