పెరియపాలెం: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వాడవాడలా కార్యకర్తలు, అన్నాడీఎంకే నిర్వాహకులు, ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం ఉదయం పెరియపాలెంలో ఎల్లాపురం యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి పి.రవిచంద్రన్ నేతృత్వంలో వందలాది కార్యకర్తలు నల్లరిబ్బన్‌లు పెట్టుకుని అమ్మ జయలలిత చిత్రపటాన్ని చేతబట్టి మౌనప్రదర్శన చేశారు. అమ్మ అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరువయ్యాయని ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుమ్మిడిపూండి ఎమ్మెల్యే కె.ఎస్.విజయకుమార్ అన్నారు. అమ్మ ఆశయాలను కొనసాగించడం మన ముఖ్య లక్ష్యమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీ బస్టాండ్ వద్దకు రాగానే అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
గ్రామంలోని అన్ని ప్రధాన వీధుల్లో మౌన ప్రదర్శన చేశారు. ర్యాలీలో యూనియన్ మాజీ చైర్మన్ అమ్మణి మహేంద్రన్, పార్టీ నాయకులు వడమధురై కొదండన్, యూనియన్ అమ్మపేరవై కార్యదర్శి రమేష్, పెద్దసంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. స్థానిక ఈహెచ్.రోడ్డులో 38 వార్డు అన్నాడీఎంకు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చిత్ర పటాన్నిపెట్టి ప్రత్యేక పూజలుచేసి అమ్మ అత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అంజలి ఘటించారు. మాజీ కౌన్సిలర్ ఎస్.సంతానం, పార్టీ నాయకులు పి.అంకయ్య, పెరుమాళ్, నరేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమ్మకు ఘన నివాళి
Published Thu, Dec 8 2016 4:03 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
Advertisement
Advertisement