Ravichandran
-
బాసూ రెడీయా...
‘ఏం బాసూ రెడీయా.. వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మార్క్ ఆంటోని’ అనే డైలాగ్స్‌తో ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ ఆరంభం అయింది. విశాల్ పలు షేడ్స్‌లో టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఇది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మంచివాడిగా, విలన్‌గా, గుండుతో స్టైలిష్‌గా, తండ్రిని కాపాడుకోవాలనుకునే వ్యక్తిగా... ఇలా పలు షేడ్స్‌లో విశాల్ కనిపిస్తారు. ఓ టైమ్ మిషన్ కాకుండా ఓ ఫోన్ హీరోని గతానికి తీసుకెళ్తే తనేం చేశాడనే కథాంశంతో ‘మార్క్ ఆంటోని’ని రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు. -
అందంతో మెస్మరైజ్ చేస్తున్న తాన్యా రవిచంద్రన్ ( లేటెస్ట్ ఫోటోలు )
-
నయనతార చెల్లెలు తాన్యా రవిచంద్రన్ (ఫొటోలు)
-
ప్రముఖ నటుడు రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్
శివాజీనగర: బెంగళూరు నగర విశ్వవిద్యాలయం ప్రప్రథమంగా స్నాతకోత్సవంలో కన్నడ సినీ నటుడు, క్రేజీ స్టార్ వి. రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. సోమవారం సెంట్రల్ కాలేజీ ఙ్ఞానజ్యోతి సభా మందిరంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా రవిచంద్రన్ సహా 30మంది వివిధ రంగాల ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను బహుకరించారు. మంత్రి సీఎన్ ఆథ్వథ్ నారాయణ మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా సినిమాలో చూపించడం ఆయన కళ అని అన్నారు. -
నటి రాధికా కుమారస్వామి రీ ఎంట్రీ
బెంగళూరు : కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాధికా కుమారస్వామి..కన్నడ నటుడు రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న రాజేంద్రపొన్నప్ప అనే చిత్రంలో కథాయినాయికగా ఎంపికై ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు పదకొండేళ్ల తరువాత రవిచంద్రన్, రాధికా కుమారస్వామిలు జంటగా మళ్లీ తెరపైన కనిపించబోతున్నారు. రవిచంద్రన్ స్వతహాగా రాసిన కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈశ్వరి ప్రోడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభిచనున్నట్లు రవిచంద్రన్ తెలిపారు. ఛాయగ్రహకుడుగా జి.ఎస్.వి. సీతారామ్, సంగీత దర్శకుడుగా గౌతమ్‌శ్రీవత్సవ్ సహకారం అందజేయనున్నారు. కాగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాధిక పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయిన కుమార స్వామిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేసిన సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. -
అప్పుడు సీత.. ఇప్పుడు ద్రౌపది!
సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది? అనడిగితే... చాలామంది అంజలీదేవి పేరు చెబుతారు. ‘లవకుశ’ సినిమాలో అంత అద్భుతంగా నటించారామె. నాటి తరంలో సీత పాత్రలో అంజలీదేవి మెప్పిస్తే నేటి తరంలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు నయనతార. ఆ సినిమా తర్వాత నయనతార గ్లామరస్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాదు.. నటనకు అవకాశమున్న సంప్రదాయబద్ధమైన పాత్రలూ చేయగలరనే అభిప్రాయం బలపడింది. ఇప్పుడీ బ్యూటీకి కన్నడ ‘కురుక్షేత్ర’లో ద్రౌపదిగా నటించే ఛాన్స్ వచ్చిందట. తమిళంలో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రంలో నటించే విషయమై హామీ ఇవ్వలేదట. అయితే మంచి అవకాశం కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేసి, గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఊహించవచ్చు. ఈ నెల 23న ‘కురుక్షేత్ర’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఒకవేళ నయన అంగీకరిస్తే, ‘సూపర్’ తర్వాత కన్నడంలో ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్, భీష్ముడిగా అమ్రీష్, కర్ణుడిగా రవిచంద్రన్ నటించనున్నారు. -
అమ్మకు ఘన నివాళి
పెరియపాలెం: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వాడవాడలా కార్యకర్తలు, అన్నాడీఎంకే నిర్వాహకులు, ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం ఉదయం పెరియపాలెంలో ఎల్లాపురం యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి పి.రవిచంద్రన్ నేతృత్వంలో వందలాది కార్యకర్తలు నల్లరిబ్బన్లు పెట్టుకుని అమ్మ జయలలిత చిత్రపటాన్ని చేతబట్టి మౌనప్రదర్శన చేశారు. అమ్మ అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరువయ్యాయని ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుమ్మిడిపూండి ఎమ్మెల్యే కె.ఎస్.విజయకుమార్ అన్నారు. అమ్మ ఆశయాలను కొనసాగించడం మన ముఖ్య లక్ష్యమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీ బస్టాండ్ వద్దకు రాగానే అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గ్రామంలోని అన్ని ప్రధాన వీధుల్లో మౌన ప్రదర్శన చేశారు. ర్యాలీలో యూనియన్ మాజీ చైర్మన్ అమ్మణి మహేంద్రన్, పార్టీ నాయకులు వడమధురై కొదండన్, యూనియన్ అమ్మపేరవై కార్యదర్శి రమేష్, పెద్దసంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. స్థానిక ఈహెచ్.రోడ్డులో 38 వార్డు అన్నాడీఎంకు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చిత్ర పటాన్నిపెట్టి ప్రత్యేక పూజలుచేసి అమ్మ అత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అంజలి ఘటించారు. మాజీ కౌన్సిలర్ ఎస్.సంతానం, పార్టీ నాయకులు పి.అంకయ్య, పెరుమాళ్, నరేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆత్మహత్యను అడ్డుకున్న కుక్క!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సేలం జిల్లాలో వాళప్పాడి అగ్రహారానికి చెందిన రవిచంద్రన్ (50) అనే కూలీ ఒక కుక్క (పేరు బిసీ)ను పెంచుకుంటున్నాడు. ఇంట్లో గొడవలతో మనస్తాపం చెందిన రవి మూడు రోజుల క్రితం ఇల్లు వదిలి వె ళ్లాడు. బిసీ గురువారం అతని వాసన పసిగడుతూ వీధుల్లోకి వచ్చింది. ఊరి శివార్లలోని తాళ్ల పరిశ్రమలో రవిని కనుగొంది. రవి దగ్గరికి వెళ్లగా అతను బిసీని చేరదీయకపోవడంతో కుక్కకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటికి పరుగులు పెట్టింది. నిద్రపోతున్న రవిచంద్రన్ కొడుకు కుమార్‌ను లేపి రవి ఉన్నచోటుకి తీసుకెళ్లింది. అప్పటికే రవిచంద్రన్ ఉరి వేసుకునేందుకు తాళ్లు సిద్ధం చేసుకున్నాడు. కుమార్ వెంటనే తండ్రికి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. యజమానిని కాపాడిన బిసీకి కుటుంబ సభ్యులంతా మంచి విందునిచ్చారు. -
స్టార్ హీరో న్యూ లుక్ అదుర్స్!
బెంగళూరు: కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన కొత్త చిత్రం హెబ్బులి పోస్టర్‌ను గురువారం అధికారికంగా విడుదల చేసారు. హెబ్బులి ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో తొలిసారి విభిన్నంగా కనిపించినందుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో హీరో కిచ్చా సుదీప్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విభిన్నంగా కనిపించడానికి సుదీప్ పలు జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. విభిన్నమైన హెయిర్ స్టయిల్, సరికొత్త కాస్టూమ్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి నటిగా అటు అభినయంతోనూ, అందాల ఆరబోతతోనూ మంచి మార్కులు తెచ్చుకున్న అమలాపాల్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది. పెళ్లయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి మునుపటి జోరుతో సినిమాలు చేసుకుపోతోంది. అయితే హీరోయిన్ పాత్ర తీరు తెన్నులు ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఇప్పటి వరకు సినియా యూనిట్ గోప్యంగా ఉంచడం విశేషం. గజకేసరి చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ నిర్దేశకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రేజీ స్టార్ రవిచంద్రన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. -
తండ్రి కోసం తనయుడు యాగం
తండ్రి కోసం తనయుడి యాగం ఆయన బలి అవుతున్నారా..? రామకృష్ణన్ అనుమానం వివరణకు కరుణ డిమాండ్ చెన్నై : ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలి అవుతున్న చందంగా మంత్రి ఓ పన్నీరు సెల్వం పరిస్థితి మారుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన్ను నిర్బంధంలో ఉంచినట్టుగా పుకార్లు బయలు దేరాయి. ఇక, తండ్రి కోసం అన్నట్టు శతృవినాస యాగాన్ని ఓపీఎస్ తనయుడు రవిచంద్రన్ నిర్వహించడం గమనార్హం. ఇక, తన నిజాయితీని నిరూపించుకునేందుకు జయలలిత కొత్త నాటకాన్ని రచించి ఉన్నారని సీపీఎం నేత రామకృష్ణన్ విమర్శించారు. మంత్రులపై బయలు దేరిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. అన్నాడిఎంకేలో జయలలిత తదుపరి స్థానంలో ఉన్న మంత్రి, పార్టీ కోశాధికారి ఓ పన్నీరు సెల్వం ప్రస్తుతం సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇందుకు ఎన్నికల్లో వంద సీట్ల వరకు తన మద్దతు దారులకు ఇప్పించుకుని, తదుపరి తన బలాన్ని చాటుకునే వ్యూహంతో ఉన్నట్టు ఆయనపై బయలు దేరిన ఆరోపణలు కారణంగా పరిగణించ వచ్చు. అదే సమయంలో రోజుకో రూపంలో పన్నీరుకు వ్యతిరేకంగా, నత్తం విశ్వనాథన్ తదితర మంత్రులకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలతో అన్నాడీఎంకేలో ఏమి జరుగుతున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉన్నది. తిరునల్వేలిలో అజ్ఞాతంలో ఉన్న పన్నీరు మద్దతు దారుడు ఓఎస్ మురుగన్ బండారాలు సైతం వెలుగులోకి రావడంతో ఓ పీఎస్‌కు కష్టాలు చుట్టుముట్టినట్టే. వంద కోట్ల మేరకు పూడిక తీత పనుల్లో అవినీతి జరిగినట్టు, ఇందుకు ఓఎస్ మురుగన్సూత్రదారుడిగా ఆరోపణలు వస్తున్నా, మంత్రులపై రోజుకో కథనం వెలువడుతున్నా, అన్నాడీఎంకేలో ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత , తాజాగా మంత్రుల భరతం పట్టే విధంగా వ్యవహరిస్తుండటం చర్చకు తెర లేపి ఉన్నది. అలాగే, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంను నిర్బంధంలో ఉంచినట్టుగా ప్రచారం , పుకార్లు బయలు దేరి ఉండటం గమనార్హం. అలాగే, అన్నాడీఎంకేను చీల్చి ఎంజీయార్ అన్నాడీఎంకే ఏర్పాటు కసరత్తుల్లో ఉండబట్టే ఆయన్ను నిర్బంధంలో ఉంచినట్టుగా పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పుకార్ల నేపథ్యంలో పన్నీరు సెల్వం పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కనున్నట్టుగా ప్రచారం కూడా సాగినా, ఎంతకూ ఆయన రాలేదు. రెండు రోజుల క్రితం మాత్రం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పళనియమ్మాల్ను పరామర్శించి ఆగమేఘాలపై విమానంలో చెన్నైకు వచ్చినట్టు తదుపరి ఆయన ఇంటి కి లేదా, నగరంలోని ఓ హోటల్‌కు పరిమితమైనట్టుగా మద్దతు దారులు వ్యాఖ్యానిస్తుండడం గమనించాల్సిన విషయమే. తాజాగా, మంత్రులకు వ్యతిరేకంగా వెలువడుతున్న కథనాలను సైతం తమకు అనుకూల అస్త్రంగా మలచుకునేందుకు ప్రతి పక్షాలు సిద్ధమైనట్టున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా సీఎం జయలలిత కొత్త నాటకాన్ని రచించినట్టుందని సీపీఎం నేత రామకృష్ణన్ వ్యాఖ్యానించారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఓపీఎస్‌ను బలి చేయడానికి సిద్ధమైనట్టుందని ఆరోపించారు. ఇక, డిఎంకే అధినేత ఎం కరునానిధి పేర్కొంటూ, మంత్రులపై ఇస్తున్న కథనాలు, ఆరోపణలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, శతృవినాసం కాంక్షిస్తూ ఓపీఎస్ తనయుడు రవిచంద్రన్ శ్రీవిల్లి పుత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో యాగం చేయడం కొసమెరుపు. -
‘బంజారా’లో తారల తళుకులు
‘డివైన్ ఫెస్టివల్’ను ప్రారంభించిన అంబరీష్, రవిచంద్రన్, యష్ సాక్షి, బెంగళూరు : నగరంలోని ప్రముఖ బంజారా మెల్టింగ్ పాట్ రెస్టారెంట్లో శాండల్‌వుడ్ ప్రముఖ తారలు తళుక్కుమన్నారు. బంజారా మెల్టింట్ పాట్లో ‘డివైన్ ఫెస్టివల్’ పేరిట ఏర్పాటైన ఫుడ్ ఫెస్టివల్ ను నటులు అంబరీష్, రవిచంద్రన్, యష్‌లు శుక్రవారం రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఫుడ్ ఫెస్టివల్లో ఏర్పాటైన విభిన్న ఆహారపదార్థాలను వీరు రుచి చూశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ప్రకాష్ శెట్టి మాట్లాడుతూ....నగర వాసులకు కోస్టల్, ఇండియన్, పాన్ ఏషియన్ రుచులను అందజేసేందుకు ఈ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిష్ రవా ఫ్రై, పనీర్ కే సికంజీ, చిల్లీ బేసిల్ మష్రూమ్, ముర్గ్ లాల్వారీ కబాబ్ తదితర ప్రత్యేక వంటకాలను ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఆహర ప్రియుల కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈనెల 15 నుంచి 30 వరకు తమ రెస్టారెంట్లో ఈ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుందని ప్రకాష్ శెట్టి వెల్లడించారు. -
180 కోట్ల శంకర్ మనోహరుడు స్టిల్స్
-
దీపావళికి 180 కోట్ల శంకర్ ‘మనోహరుడు’
దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనానికి ఈ దీపావళి తెర తీయనుంది. తొలిసారిగా ఓ దక్షిణ భారతీయ భాషా సినిమా చైనాలో విడుదల కానుంది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే చిత్రాలను రూపొందించే దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా రూపొందిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఈ దీపావళికి చైనాలో ఏకంగా 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలపై, థియేటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండే చైనాలో విడుదలవుతున్న తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రంగా ‘ఐ’ చరిత్రకెక్కనుంది. గతంలో విక్రమ్‌తో ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’), కమలహాసన్‌తో ‘దశావతారం’ చిత్రాలను నిర్మించిన ‘ఆస్కార్ ఫిలిమ్స్’ అధినేత వి. రవిచంద్రన్ ఈ విషయం ఆదివారం నాడు వెల్లడించారు. తెలుగు పత్రికా విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ చిత్రం గురించి తొలిసారిగా అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ విధంగా వెల్లడించారు. 12 గంటలు మేకప్... రిఫ్రిజిరేటర్లో విక్రమ్ ఇప్పటికి రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు సగానికి పైగా ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషిస్తున్నారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందిస్తున్నారు. ‘‘ఈ సినిమా కోసం హీరో విక్రమ్ పడిన శ్రమ, చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనిది. ఒక స్పెషల్ గెటప్ కోసం ఆయనకు మేకప్ చేయడానికే దాదాపు 12 గంటలు పట్టేది. అయినా, ఆయన ఓపిగ్గా ఉండేవారు. మేకప్ వేసిన తరువాత పూర్తి ఏ.సి.లోనే ఆయన ఉండాల్సి వచ్చేది. అందు కోసం దాదాపు పది అడుగుల ఎత్తున్న ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది నిర్మించాం. ఈ గెటప్ కోసం ప్రత్యేకంగా ఆయన 125 కిలోల స్థాయికి బరువు పెరిగారు. తెరపై ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతారు’’ అని రవిచంద్రన్ తెలిపారు. మూడెకరాల సెట్... పాటకు 40 రోజులు... ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక ట్రైలర్‌నూ, ఒక పాటనూ ఆయన విలేకరుల కోసం ప్రత్యేకంగా ముందుగా చూపించారు. హీరో నీళ్ళపై నడిచే ఆశ్చర్యకరమైన దృశ్యాలున్న ఈ సినిమా పాటలు, ఫైట్ల కోసం శంకర్ డబ్బునూ, కాలాన్నీ లెక్కచేయలేదట. ఒక విచిత్రమైన ఘట్టంలో, అపూర్వమైన గెటప్‌తో హీరో వచ్చే ఒక సిట్యుయేషనల్ సాంగ్ కోసం ఏకంగా మూడెకరాల్లో ఒక సెట్ వేసి, 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. అలాగే, చైనాలో తీసిన ఒక సైకిల్ ఫైట్‌కు కూడా దాదాపు 40 రోజులు కష్టపడ్డారు. ‘‘ఈ సినిమా మీద నాకున్న నమ్మకం అపారం. ప్రతి ఘట్టం తెరపై చూడగానే ‘అయ్’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఉంటుంది. అందుకే సినిమాకు ‘ఐ’ అని పేరు పెట్టాం’’ అని ఆయన చెప్పారు. చైనా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా అమీ జాక్సన్ నటిస్తున్నారు. భారతీయ ‘జేమ్స్ కామెరూన్’ ‘‘దీన్ని కేవలం సాంఘిక చిత్రమనో, యాక్షన్ సినిమా అనో, ప్రేమ కథా చిత్రమనో, థ్రిల్లర్ అనో - ఒక గాటన కట్టి చెప్పలేం. రేపు ఈ చిత్రం చూసినప్పుడు నా మాటల్లో నిజం అందరికీ తెలుస్తుంది’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 285 రోజుల పైగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా మునుపటి ‘అపరిచితుడు’ కన్నా వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఎన్నో విశేషాలతో, ప్రాణం పెట్టి తీసిన ఈ సాంకేతిక అద్భుతం చూశాక శంకర్‌ను ‘భారతీయ జేమ్స్ కామెరూన్ (ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు)’ అనాలని అనిపిస్తుంది. ఈ సినిమా ఇలా రావడం ఆ తిరుమల వెంకటేశ్వరుడి కృప. నన్నడిగితే ఈ భారీ చిత్రానికి నేను కాదు... ఆయనే నిర్మాత’’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు జాకీ చాన్... చెన్నైకి ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్! ‘‘సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుతున్నారు. సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేస్తున్నాం’’ అని రవిచంద్రన్ తెలిపారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం తెలుగు ఆడియో రిలీజ్‌కు తన చిరకాల పరిచయస్థుడైన యాక్షన్ హీరో జాకీచాన్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలో జరిపే తమిళ ఆడియో రిలీజ్‌కు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌ను ఆహ్వానిస్తున్నారు. ‘‘చెన్నైలో భారీ వేదికపై ఆడియో రిలీజ్ జరపాలని ప్రయత్నిస్తున్నాం. అన్ని వివరాలూ మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు కానున్నాయి’’ అని రవిచంద్రన్ ‘సాక్షి’కి చెప్పారు. భారీ ఎత్తున విడుదల తమిళంలో తయారైన ఈ టెక్నికల్ వండర్‌ను ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘తెలుగులో ‘మనోహరుడు’గా వస్తున్న ఈ చిత్ర డబ్బింగ్ దాదాపు పూర్తయింది. శ్రీరామకృష్ణ సంభాషణలు, రామజోగయ్యశాస్త్రి, తదితరులు పాటలు అందిస్తున్నారు’’ అని రవిచంద్రన్ చెప్పారు. మీడియా ముందుకెన్నడూ రాని రవిచంద్రన్ తొలిసారి ఈ చిత్రం గురించి పలు విషయాలు పంచుకోవడం గమనార్హం. -
15న తిరుమణం ఎన్నుం నిఖా
తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువజంట జయ్, నజ్రియా నజీమ్ నటించిన చిత్రం తిరుమణం ఎన్నుం నిఖా చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా నాజర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన అనిస్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. చిత్ర దర్శకుడు అనిస్ మాట్లాడుతూ తిరుమణం ఎన్నుం నిఖా రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్టైనర్ కథా చిత్రమన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే జయ్, నజ్రియా మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఆ ప్రేమ పెళ్లికి దారి తీసిందా? లేదా? అన్నదే చిత్ర ఇతివృత్తమని తెలిపారు. చిత్రం ఆస్కార్ ఫిలింస్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని తెలిపారు. రంజాన్ వేడుకలను చెన్నై నగరంలో ఒకరకంగాను, ఉత్తర చెన్నై రాయపురంలో మరో విధంగాను నిర్వహిస్తారన్నారు. ఈ రెండు ప్రాంతాల రంజాన్ నిజ వేడుకలను తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం కోసం చిత్రీకరించామని తెలిపారు. చిత్ర ఆలస్యానికి ఇదే కారణంగా పేర్కొన్నారు. అదే విధంగా మోహరం వేడుకలను యథాతథంగా చిత్రీకరించామని చెప్పారు. చిత్రంలో పలువురు నూతన తారలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి నటింప చేశామని వెల్లడించారు. కరెక్టుగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని లేటెస్ట్ కాదల్‌కోట్టై గా చెప్పవచ్చునని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన సంగీత బాణీలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. -
‘ఐ’ అదిరింది
‘ఐ’ అదిరింది అని అంటుందెవరో కాదు ఆ చిత్ర నిర్మాత, ఆస్కార్ రవిచంద్రన్. చిత్రాన్ని వెండితెరపై చూసి ప్రేక్షకులు ఇదే మాట అంటారని స్పష్టం చేస్తున్నారాయన. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో అద్భుత చిత్రం ‘ఐ’. విలక్షణ నటుడు విక్రమ్, అందాల భామ ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. బ్రహ్మాండం అంటే శంకర్ చిత్రాల్లోనే చూడాలనడం అతిశయోక్తి కాదు. ఆయన గత చిత్రాలను చూసిన వారెవరైనా ఇదే మాట అంటారు. అదే కోవలో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందుతున్న చిత్రం ‘ఐ’. ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌ను నిర్మాత తన సొంత స్టూడియోలో ఇటీవల వేసుకుని చూశారట. అనంతరం ఆయన అన్న మాటనే ‘ఐ’ అదిరింది అని, ఇంతకుముందు శంకర్ విక్రమ్‌ను అన్నియన్ చిత్రంలో మూడు కోణాల్లో చూపించి ఆహా అనిపించారు. ఈ ‘ఐ’ చిత్రంలో విక్రమ్‌ను ఆరు గెటప్‌లలో చూపించి అబ్బుర పరిచారని నిర్మాత పేర్కొన్నారు. ఇందులో విక్ర మ్ కళాశాల యువకుడిగా, బాడీ బిల్డర్‌గా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారని చెప్పారు. ఈ పాత్రల పోషణ కోసం విక్రమ్ చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనన్నారు. పాత్ర స్వభావాన్ని బట్టి నటుల నుంచి అభినయాన్ని రాబట్టడంలోను, వారి పాత్ర రూపకల్పన లోను శంకర్ అత్యంత శ్రద్ధ చూపిస్తారన్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ‘ఐ’ చిత్రం ఉంటుందని ఆస్కార్ రవిచంద్రన్ అన్నారు. -
మీరు చేస్తేనే బావుంటుంది
ఈ మధ్యకాలంలో దక్షిణాదిన అన్ని భాషలవారి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘దృశ్యం’. మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన ఈ మలయాళ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రీమేక్ కానుంది. కన్నడంలో కూడా పునర్నిర్మితం కానుంది. శాండిల్‌వుడ్‌లో క్రేజీ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్న రవిచంద్రన్ ఈ చిత్రంలో నటించబోతున్నారు. కన్నడంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. వాసు ఈ రీమేక్‌ని తెరకెక్కించనున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, రాక్‌లైన్ వెంకటేష్, జగ్గేష్, సుదీప్ తదితరులు ఈ సినిమా ‘మీరు చేస్తేనే బాగుంటుంది’ అని రవిచంద్రన్‌తో అన్నారట. మలయాళ ‘దృశ్యం’ని చూడగానే చాలా థ్రిల్ అయ్యానని, ఈ రీమేక్‌లో నటించే అవకాశం నాకే రావడం ఆనందంగా ఉందని రవిచంద్రన్ పేర్కొన్నారు. -
‘మిర్చి’సినిమా రీమేక్‌లో చేస్తున్న సుదీప్
‘‘రవిచంద్రన్‌గారు ప్రధాన పాత్రలో నేనో సినిమాకి దర్శకత్వం వహించబోతున్న మాట నిజమే. ఈ సినిమా గురించి చెప్పగానే ఆయన ఓకే చెప్పడానికి ఒక్క నిమిషం కూడా తీసుకోలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 19న షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు కన్నడ నటుడు, దర్శకుడు సుదీప్. వీర మడకరి, కెంపెగౌడ, జస్ట్ మాత్ మాతల్లి.. ఇలా సుదీప్ పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో రీమేక్స్ శాతం ఎక్కువ. కాగా, రవిచంద్రన్ కీలక పాత్రలో తను నటించి, దర్శకత్వం వహించబోతున్న చిత్రం తెలుగు ‘మిర్చి’కి రీమేక్ అని సమాచారం. ఈ చిత్రాన్ని ఎన్. కుమార్ నిర్మించబోతున్నారట. తెలుగు ‘మిర్చి’ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఆల్రెడీ రీమేక్ రాజాగా కన్నడంలో గుర్తింపు ఉన్న సుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటంతో అంచనాలు ప్రారంభమయ్యాయి. క్రేజీ స్టార్ రవించంద్రన్, సుదీప్ కాంబినేషన్ కూడా కావడంతో క్రేజ్ నెలకొంది.