మీరు చేస్తేనే బావుంటుంది | ravichandra acting in drushyam remake | Sakshi
Sakshi News home page

మీరు చేస్తేనే బావుంటుంది

Published Fri, Feb 7 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

మీరు చేస్తేనే బావుంటుంది

మీరు చేస్తేనే బావుంటుంది

 ఈ మధ్యకాలంలో దక్షిణాదిన అన్ని భాషలవారి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘దృశ్యం’. మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన ఈ మలయాళ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రీమేక్ కానుంది. కన్నడంలో కూడా పునర్నిర్మితం కానుంది. శాండిల్‌వుడ్‌లో క్రేజీ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్న రవిచంద్రన్ ఈ చిత్రంలో నటించబోతున్నారు. కన్నడంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. వాసు ఈ రీమేక్‌ని తెరకెక్కించనున్నారు.
 
  ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, రాక్‌లైన్ వెంకటేష్, జగ్గేష్, సుదీప్ తదితరులు ఈ సినిమా ‘మీరు చేస్తేనే బాగుంటుంది’ అని రవిచంద్రన్‌తో అన్నారట. మలయాళ ‘దృశ్యం’ని చూడగానే చాలా థ్రిల్ అయ్యానని, ఈ రీమేక్‌లో నటించే అవకాశం నాకే రావడం ఆనందంగా ఉందని రవిచంద్రన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement