drushyam
-
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్‌లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్‌లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్‌లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
పెను విషాదం తర్వాత చిన్న గ్యాప్.. మళ్లీ కెమెరా ముందుకు మీనా
నటి మీనా చిన్న విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో అగ్ర కథానాయిగా రాణించిన విషయం తెలిసిందే. కాగా ఈమె నటిగా ఫుల్‌ఫామ్‌లో ఉండగానే విద్యాసాగర్ అనే బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలాంటిది నటి మీన జీవితంలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ ఈ ఏడాది కరోనా కారణంగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు. దీంతో నటి మీనా బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఆ మధ్య నటి కుష్భు, సంఘవి, రంభ తదితరులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా ఇటీవల మానసిక వేదన నుంచి బయటపడటానికి నటి మీనా విదేశీ పర్యటన చేసి వచ్చారు. దీంతో కాస్త తేరుకున్న ఆమె మళ్లీ చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యారు. గతంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. అలా ఆమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేయాల్సి ఉంది. దీంతో పాటు మలయాళంలో మోహన్‌లాల్ సరసన దృశ్యం–3 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం మీనా ఒక ప్రచార చిత్రంలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. చదవండి: (నాకు బలహీనతలు ఉన్నాయ్.. ఆ కామెంట్స్ చాలా బాధించాయి) -
Drushyam 2 : వరుణ్ మర్డర్ కేసు నుంచి రాంబాబు బయటపడ్డాడా?
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దృశ్యం 2’. సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంగా తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలైంది. ఇందులో వెంకటేశ్ థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. వరుణ్ మర్డర్ కేసు విషయంలో రాంబాబు ఫ్యామిలీపై పోలీసు నిఘ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ హత్యను రాంబాబే చేశాడని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఈ కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది తెలియాలంటే నవంబర్ 25న ‘దృశ్యం 2’ చూడాల్సిందే. -
ఆ చీకటి ఙ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు : వెంకటేశ్
Venkatesh Drushyam 2 Movie Release Date Confirmed: వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం-2' రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం 2’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. The truth has begun to unveil itself. But the question is - has it left a permanent scar on Rambabu? Watch #Drushyam2OnPrime, Nov. 25 on @PrimeVideoIN ▶️https://t.co/mL68iUtwzC#MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/YTkirX6oBH — Venkatesh Daggubati (@VenkyMama) November 12, 2021 -
రీమేక్ అంత వీజీ కాదు
భాష వేరు. కాని భావం ఒక్కటే. హీరో వేరు. కాని హీరోయిజం ఒక్కటే. అక్కడ హిట్ అయితే ఇక్కడ ఎందుకు కాదు. చలో... రీమేక్ చేద్దాం. కాని రీమేక్ అంత వీజీ కాదు. అది లైఫ్ ఇవ్వగలదు. ఫ్లాప్ చేయగలదు. కనెక్ట్ అయినవీ కానివీ వచ్చినవీ రాబోతున్నవీ ఈ సండే రోజున రీ విజిట్... బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ తాజాగా అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది. అందుకే దీనిని చాలామంది రీమేక్ చేయడానికి ఉత్సాహపడ్డారు. తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రిమేక్ చేశారు. ఇక్కడే జటిలమైన సమస్య వస్తుంది. యథాతథం తీయాలా? ఏమైనా మార్పులు చేయాలా? చేస్తే నచ్చుతుందా... చేయకపోతే నచ్చుతుందా... యథాతథంగా తీస్తే కొత్తగా ఏం చేశారని అంటారు. మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. అందువల్ల కొందరు దర్శకులు రీమేక్‌ల జోలికి రారు. కొందరు సక్సెస్‌ఫుల్‌గా తీస్తారు. ‘అంధాధున్’ కథ హిందీలో గోవాలో నడుస్తుంది. రీమేక్‌లో ప్రారంభంలోనే గోవా అని వేస్తారు. గోవాలో తెలుగు కథ ఎందుకు జరుగుతుంది? వైజాగ్‌లో తీసి ఉంటే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు వచ్చే సందేహం. కథ కనెక్ట్ కావచ్చు. కాని ఈ రీమేక్‌లో నేటివిటి కనెక్ట్ అయ్యిందా అనేది సమస్య. ఇద్దరు దర్శకులు గతంలో రీమేక్ సినిమాల్లో ఇద్దరు దర్శకులు పేరు పొందారు. వారు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి. తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమా బాగానే ఆడింది. దాని రైట్స్ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కొన్నారు. కాని దర్శకుడు కోడి రామకృష్ణ దానిని యథాతథంగా తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి కథలో మార్పులు, యాస, స్థానికత మార్చారు. అదే ‘మంగమ్మ గారి మనవడు’. సూపర్‌హిట్ అయ్యింది. మరో హిట్ ‘ముద్దుల మావయ్య’ కూడా రీమేక్. కాని తమిళ సినిమా ‘అరువదై నాల్’ ఆధారంగా తీసిన ‘మువ్వ గోపాలుడు’ పూర్తిగా కనెక్ట్ కాలేదు. రీమేక్‌లలో కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతాయో కొన్ని ఎందుకు కావో చెప్పలేము. తమిళంలో విసు తీసిన ‘అవళ్ సుమంళిదాన్’ సినిమాను రవిరాజా పినిశెట్టి ‘పుణ్యస్త్రీ’ పేరుతో మార్పుచేర్పులు చేసి సూపర్‌హిట్ చేశారు. రవిరాజా పినిశెట్టి ఇచ్చిన భారీ రీమేక్‌లలో ‘చంటి’, ‘పెదరాయుడు’ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భీమినేని శ్రీనివాసరావు ఈ పల్స్ పట్టుకున్న డైరెక్టర్‌గా పేరు పొందారు. గ్యారంటీ కథలు సినిమా కోట్ల రూపాయల వ్యవహారం. కథ విన్నప్పుడు అది తెర మీద ఎలా వస్తుందో ఎలా హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విన్నప్పటి కథ చూసినప్పుడు తేలిపోయి భారీ ఫ్లాప్ కావచ్చు. అందుకే హీరోలు రీమేక్‌ల వైపు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో హిట్ అవుతుందన్న ఒక గ్యారంటీతో. పైగా ఆ కథకు ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసిపోతుంది. నాగార్జున ‘విక్రమ్’ (హిందీ ‘హీరో’) తో తెరంగేట్రం చేసినా వెంకటేశ్ కాలక్రమంలో రీమేక్‌ల మీదే పూర్తిగా దృష్టి పెట్టినా ఇదే కారణం. ఒక్కోసారి టాప్ హీరోలకు కూడా రీమేక్‌ల అవసరం ఏర్పడుతుంది. చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇవి నాలుగూ రీమేకులే. ఇప్పుడు ఆయన మలయాళం హిట్ ‘లూసిఫర్’లో నటిస్తున్నారు. మోహన్‌బాబుకు మలయాళం నుంచి రీమేక్ చేసిన ‘అల్లుడు గారు’ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. బి.గోపాల్ దర్శకుడిగా తీసిన ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేసింది. కాని అదే బి.గోపాల్ వెంకటేశ్ హీరోగా చేసిన ‘చినరాయుడు’ రీమేక్ విఫలం అయ్యింది. ఆ సినిమాలోని తమిళదనం తెలుగుకు పడలేదు. తర్వాతి కాలంలో రాజశేఖర్ రీమేక్‌లకు కేరాఫ్‌గా మారాడు. అనూహ్య ఫలితాలు కచ్చితంగా హిట్ అవుతుందని రీమేక్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘వాల్టర్ వెట్రివల్’ను చిరంజీవి, శ్రీదేవితో ‘ఎస్పి పరశురామ్’గా రీమేక్ చేస్తే భారీ పరాజయం నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగు రీమేక్ ‘శంకర్‌దాదా జిందాబాద్’ కనెక్ట్ కాలేదు. వెంకటేశ్ ‘జెమిని’ నిరాశ పరిచింది. నాగార్జున ‘చంద్రలేఖ’ అంతే. ‘బాజీగర్’ రీమేక్‌గా తీసిన రాజశేఖర్ ‘వేటగాడు’ పరాజయం పొందింది. తమిళంలో భారీ హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ను రవితేజాతో ‘నా ఆటోగ్రాఫ్’ తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి రీమేక్ చేసిన వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’, మనోజ్ మంచు ‘రాజూ భాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’, సందీప్‌కిషన్ ‘రన్’, పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’, విష్ణు మంచు ‘డైనమైట్’, అల్లరి నరేశ్ ‘సిల్లీ ఫెలోస్’ అంతగా మెచ్చుకోలు పొందలేదు. తమిళ ‘96’ తెలుగులో ‘జాను’గా వస్తే బాగుందని పేరు వచ్చినా జనం చూడలేదు. అందుకే రీమేక్‌లో తెలియని రిస్క్ ఉంటుందని అంటారు. కొనసాగుతున్న రీమేక్స్ అయినా సరే రీమేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ‘నారప్ప’ వచ్చింది. తాజాగా ‘మాస్ట్రో’ వచ్చింది. ‘ఉమామహ్వేర ఉగ్రరూపస్య’, ‘కపటధారి’, ‘తిమ్మరుసు’, ‘రాక్షసుడు’, ‘గద్దలకొండ గణేశ్’, ‘వకీల్‌సాబ్’... ఇవన్నీ రీమేక్స్ పట్ల ఆసక్తిని నిలిపి ఉంచాయి. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’, ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ అవుతున్నాయి. మరాఠిలో నానా పటేకర్ నటించగా పెద్ద హిట్ అయిన ‘నటసామ్రాట్’ తెలుగులో ప్రకాష్‌రాజ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తయారవుతోంది. ‘దృశ్యం 2’ రానుంది. గోడకు బంగారు చేర్పు అవసరం. ఇక్కడ గోడ కథ. గోడ గట్టిగా ఉంటే బంగారానికి దాని మీద వాలే శక్తి పెరుగుతుంది. కథను బాగా రాయడం తెలిస్తే రీమేక్‌ల అవసరం ఉండదు. తెలుగులో గట్టి సినీ కథకులు ఉన్నారు. తెలుగు సినిమాలు పరాయి భాషలో రీమేక్ అవుతున్నాయి. మన రంగంలో ఇతరులకు కథలిచ్చేలా ఎక్కువగా, కథలు తీసుకునేలా తక్కువగా ఉండాలని కోరుకుందాం. ‘ -
దృశ్యం 2 థియేటర్లోనే!, రిలీజ్ ఎప్పుడంటే..
ఇటీవల విడుదలైన మలయాళం సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం 2’ అదే పేరుతో తెలుగులో రీమేక్ అయిన విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా, తెలుగులో వెంటటేశ్, మీనా లీడ్ రోల్లో కనింపిచనున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంతో డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తాజా సమాచారం ప్రకారం దృశ్యం 2ను మేకర్స్ ఓటీటీలో కాకుండా థియేటర్లో విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓటీటీ డిల్‌ను కూడా క్యాన్సిల్ చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ‘దృశ్యం 2’ను దసరా సందర్భంగా అక్టోబర్ 13న రిలీజ్‌ను డేట్ మేకర్స్ ఫిక్స్ చేశారట. -
OTT: ఓటీటీకి లవ్‌స్టోరీ, టక్ జగదీశ్, సీటీమార్, డీల్ ఎంతంటే!
కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినప్పటికి నిర్మాతలు ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం లేదు. అంతేగాక ఇప్పుడు కొన్ని సినిమాలను ఓటీటీలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు కొందరు నిర్మాతలు. తమ సినిమాలు థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ సాధించి వసూలు చేసే మొత్తం కంటే కూడా ఓటీటీ సంస్థలు ఇంట్రటెస్టింగ్ ఆఫర్స్‌తో ముందుకొస్తున్నాయి. దీంతో ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మరిన్ని సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్దమవుతున్నాయంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తాజా బచ్ ప్రకారం యేయే సినిమాలు ఓటీటీ ఎంత ఆఫర్లు పలుకుతున్నాయో ఓ సారి ఇక్కడ ఓ లుక్కేయండి. సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డీల్ వెంకటేశ్ దృశ్యం 2 డిస్నీ హాట్ స్టార్ 36 కోట్లు నితిన్ మాస్ట్రో డిస్నీ హాట్ స్టార్ 28 కోట్లు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు 39 కోట్లు నాని టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియో 37 కోట్లు గోపీచంద్ సీటీమార్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు 16 కోట్లు అంచనా శర్వానంద్ మహా సముద్రం నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు 21 కోట్లు ఇవే కాక మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి సిద్ధమైనట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఇఫ్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ పుంజుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అందుకే అప్పటి వరకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఆపకుండా ఓటీటీకే ఇచ్చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. -
దృశ్యం, విరాట పర్వం కూడా ఓటీటీలోకే! డీల్ ఎంతో తెలుసా!
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారప్ప. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ మూవీకి నారప్ప రీమేక్. సూరేష్బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 20 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైం నారప్పకు 40 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘నారప్ప, దృశ్యం-2’లను ఓటీటీకి భారీ మొత్తంలో సురేష్ బాబు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 76 కోట్లకు అమ్ముడు పోయాయట. ఇక ‘దృశ్యం 2’ అయితే శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే నారప్ప, దృశ్యం 2 తో పాటు రానా ‘విరాట పర్వం’ కూడా నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. -
వెంకటేశ్ఎంట్రీతో ఆ సినిమాను వదులుకున్న రజనీకాంత్!
సూపర్ స్టార్ రజనీకాంత్, దృశ్యం రీమేక్ లో కనిపించాలనుకున్నారా...? మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను,రిపీట్ చేయాలనుకున్నారా? తలైవా తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది.మరి దృశ్యం రీమేక్ లో ఆయన కనిపించలేకపోయారు? అందుకు కారణం వెంకటేశ్ అట. మాలీవుడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ క్రియేట్ చేసిన వండర్ దృశ్యం. ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలిభాగం తమిళం, కన్నడం, హిందీ, తెలుగు తో పాటు సిన్హాలా, అలాగే చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. దృశ్యం మొదటి భాగం రీమేక్ లో లోకనాయకుడు కమల్ హాసన్ నటించారు.అయితే కమల్ కంటే ముందే,ఈ రీమేక్ లో నటించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తిని చూపించారు.అందుకు తగ్గట్లే తమిళ నిర్మాత కలైపులి థానుతో కలసి చర్చలు జరిపారు.అన్ని కుదిరి ఉంటే రజనీకాంత్ దృశ్యం తమిళ,తెలుగు రీమేక్ లో నటించాల్సింది. కాని వెంకటేశ్ ఎంట్రీతో సూపర్ స్టార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. దృశ్యం మొదటి భాగానికి సంబంధించి తెలుగు,తమిళ భాషల్లో నటించేందుకు రజనీకాంత్ మొదట ఇంట్రెస్ట్ చూపించారు. కాని ఎప్పుడైతే వెంకటేష్ తెలుగు వర్షన్ కు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేయడం , షూటింగ్ కూడా స్టార్ట్ చేసారని తెలియడంతో తన నిర్ణయం మార్చుకున్నారు. తెలుగు , తమిళ వర్షన్స్ కలిపి దృశ్యం మొదటి భాగంలో నటించాలనుకున్నారు రజనీకాంత్. అప్పుడే తమ ప్రాజెక్ట్ వల్ల నిర్మాతకు లాభం ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్క తమిళ రీమేక్ కు మాత్రమే అయితే నో అని చెప్పారట. ఇక సూపర్ స్టార్ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వైపు చూస్తే,ఈ దీపావళికి అన్నాత్తే అనే కొత్త చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి అమెరికా వెళ్లారు తలైవా.ఇప్పుడు అక్కడి నుంచి ఇండియాకు రిటర్న్ అయ్యారు తలైవా.వచ్చి రావడంతోనే అన్నాత్తే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు రజనీకాంత్. -
దృశ్యం- 2పై కీలక అప్డేట్..
హీరో వెంకటేశ్ శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్’కు తెలుగు రీమేక్) సినిమా షూట్‌ను పూర్తి చేసిన వెంకటేశ్ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్ చెప్పారు. ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే దృశ్యం 2ను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించినా నిర్మాత సురేశ్ బాబు వాటిని ఖండించారు. అయితే తాజాగా సినిమాల విడుదలకు ఆలస్యం అవుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేసి, థియేటర్లు తెరుచుకున్న తరువాత 'నారప్ప'ను రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెంటకేష్ వెల్లడించినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన రూపొందిన సినిమానే దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్‌గాతెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ జంటగా నటించారు. చదవండి : తారక్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎంత తీసుకుంటున్నారంటే.. చిరు, పవన్, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు? -
స్పీడు పెంచిన వెంకటేశ్
హీరో వెంకటేశ్ మంచి జోష్‌లో ఉన్నారు. సినిమాల మీద సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్’కు తెలుగు రీమేక్) సినిమా షూట్‌ను పూర్తి చేసిన వెంకటేశ్ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్ చెప్పారు. మలయాళ ‘దృశ్యం 2’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ తొలి భాగంలో భార్యాభర్తలుగా నటించిన వెంకటేశ్, మీనాలే సీక్వెల్లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబందం ప్రకటించింది. ఇప్పుడు నదియా, మీనా కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు వెంకటేశ్ ‘ఎఫ్–3’ సినిమాతో బిజీ అవుతారు. -
దృశ్యం-2 రిలీజ్ డేట్ ఫిక్స్?
అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో ‘దృశ్యం 2’ సినిమా సాగుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’ సినిమాను ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కుటుంబం కోసం ఓ తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది కాబట్టి ఆ రోజు అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. -
కేరళలో ‘దృశ్యం 2’ కీలక సన్నివేశాలు
కుటుంబంతో సహా కేరళ వెళ్లారు రాంబాబు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికేనా? అంటే కథ ప్రకారం అంతే. ఇంతకీ రాంబాబు అండ్ ఫ్యామిలీ ఏం చేసింది? పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారు? అనే విషయం ‘దృశ్యం 2’లో తెలుస్తుంది. ‘దృశ్యం’ చూసినవాళ్లకు విషయం ఏంటో తెలుసు. ఆ సినిమాలో కేసు క్లోజ్ అయిపోతుంది. రాంబాబు కుటుంబం హ్యాపీ ఫీలవుతుంది. కానీ మళ్లీ కేసు రీ ఓపెన్ అవ్వడమే ‘దృశ్యం 2’ కథ. మలయాళ ‘దృశ్యం’కి సీక్వెల్ ఇది. తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ప్రస్తుతం మలి భాగం ‘దృశ్యం 2’లోనూ నటిస్తున్నారు. వెంకటేశ్ పాత్ర పేరు రాంబాబు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో మొదలైంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వెంకటేష్ సినిమాలో రానా, సమంత?
ఈ మధ్యకాలంలో రీమేక్‌ల వైపు మొగ్గు చూపిస్తున్నారు హీరో వెంకటేష్. ఆయన నటించిన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ అసురాస్ రీమేక్‌గా తీసిన నారప్ప చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మలయాళ సూపర్ హిట్ చిత్రం దృశ్యం రీమేక్‌లోనూ వెంకటేష్ నటిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి షూటింగ్ ప్రారంభం అయ్యింది. మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం-2’ ఓటీటీలో విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సమంత కూడా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్య పాత్రల్లో విరద్దరూ కనిపిస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న ఎఫ్-3 సినిమా సెట్స్‌పై ఉంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. చదవండి : (స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు) (ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. దమ్ముందా?) -
స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు
మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఇటీవలె ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ను తెరక్కించిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. అయితే మోహన్‌లాల్‌కు జోడీగా నటించిన మీనాను మాత్రం నెటిజన్లు తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. ఈ చిత్రంలో మధ్య వయస్కురాలున్న గృహిణి పాత్రలో కనిపించిన మీనా.. అందుకు తగిన విధంగా లేదని, అతిగా మేకప్ వేసుకుందని విమర్శిస్తున్నారు. ఎమోషనల్,ఏడుపుగొట్టే సన్నివేశాల్లోనూ చెదరని జుట్టు, డార్క్ లిప్‌స్టిక్‌తో కనిపించిందని ఇది రియలిస్టిక్ లేదని పేర్కొంటున్నారు. అయితే నెటిజన్లు చేస్తున్న విమర్శలపై స్పందించిన దర్శకుడు జితూ..వారి అభిప్రాయాలతో తాను సైతం ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. డీ-గ్లామరస్ లుక్‌లో కనిపించేందుకు తాను సుముఖంగా లేనని, స్క్రీన్‌పై అలా నటించడం తనకి ఇష్టం లేదని మీనా చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో మీనా నిర్ణయంతో తాను ఏకీభవించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని, ఆల్రెడీ మూడో భాగం క్లైమాక్స్ రాసుకున్నానని డైరెక్టర్ జీతూ వెల్లడించారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. చదవండి : ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’! టాలీవుడ్లో తీవ్ర విషాదం.. -
దృశ్యం త్రీ కూడా ఉంది
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. ఇటీవలే ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కించారు జీతు. ఈ సినిమా నేరుగా అమేజాన్ ప్రై మ్లో విడుదలయింది. ఈ సినిమా కూడా విశేష ప్రశంసలు అందుకుంటోంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. తాజాగా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని ప్రకటించారు దర్శకుడు జీతు. ఆల్రెడీ మూడో భాగం కై్లమాక్స్ రాసుకున్నానని తెలిపారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. -
సూపర్ హిట్ చిత్రాలు.. సీక్వెల్‌కు రెడీ
కొన్ని కథలు భలే ఉంటాయి. ఇంకోసారి వినాలనిపించేలా. ఇంకా ఉంటే బావుండు అనిపించేలా. సినిమాకు సీక్వెల్ పుట్టడానికి ఇదో కారణం. బాక్సాఫీస్ విజయం, కాంబినేషన్లు చేసే మ్యాజిక్ కూడా కొన్నిసార్లు సినిమా సీక్వెల్‌కి కారణం అవుతాయి. కథను కొనసాగించే స్కోప్ ఉంటే.. సీక్వెల్ తీయొచ్చు. అలాంటి కథలు కొన్ని ఉన్నాయి. వాటితో సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. సీక్వెల్ కథేంటో చూద్దాం. బంగార్రాజు ఈజ్ బ్యాక్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో 2016 సంక్రాంతికి బాక్సాఫీస్ హిట్ సాధించారు నాగార్జున. బంగార్రాజుగా ఆయన ఎనర్జీ స్క్రీన్ మీద బాగా పండింది. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కనుంది. ‘బంగార్రాజు’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. బంగార్రాజు నేపథ్యం ఏంటి? అనేది ఈ సినిమా ప్రధానాంశం. మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తారు. కేబుల్ ఆపరేషన్ స్టార్ట్ అనుకోకుండా ఎదురైన ఆపదను కేబుల్ ఆపరేటర్ రాంబాబు తెలివిగా తప్పించాను అనుకుంటాడు. కానీ పోలీసులు ఈ కుటుంబాన్ని అనుమానిస్తుంటారు. మరి ఇప్పటికైనా ఆ ఆరోపణల నుంచి బయటపడ్డారా? ‘దృశ్యం 2’ వచ్చేవరకూ ఆగాలి. వెంకటేశ్ హీరోగా 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ తెరకెక్కుతోంది. కేబుల్ ఆపరేటర్ రాంబాబు పాత్రలో మళ్లీ కనిపించనున్నారు వెంకటేశ్. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయనున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డోస్ డబుల్ మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ పెద్ద హిట్ అయింది. చురుకైన బబ్లూగా స్క్రీన్ మీద కామెడీ బాగా పండించారు విష్ణు. ఇప్పుడు దాని డోస్ పెంచనున్నారు. ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఢీ 2 : డబుల్ డోస్’ టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో నటిస్తూ, నిర్మించనున్నారు విష్ణు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డబుల్ ఇస్మార్ట్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హై ఎనర్జిటిక్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే సీక్వెల్ ఉంటుందని దర్శకుడు పూరి పేర్కొన్నారు. ఈ సీక్వెల్‌కి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. చిత్రం 1.1 ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు తేజ. కేవలం నలభై లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అయింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు తేజ. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ను ప్రకటించారు తేజ. ఈ సినిమా ద్వారా సుమారు 45 మంది కొత్తవాళ్లను పరిచయం చేయనున్నారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. గూఢచారి రిటర్న్స్ ఏజెంట్ గోపీగా అడివి శేష్ చేసిన సాహసాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ యంగ్ గూఢచారిని సూపర్ హిట్ చేశారు. అడివి శేష్ కథను అందించి, హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్ తిక్కా దర్శకుడు. చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. రెండో భాగానికి కూడా కథను అందిస్తున్నారు అడివి శేష్. రాహుల్ పాకాల దర్శకుడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. సందడి రెండింతలు సంక్రాంతి అల్లుళ్లుగా ‘ఎఫ్ 2’ చిత్రంలో సందడి చేశారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి థియేటర్స్‌లో నవ్వులు పూయించారు. ఇప్పుడు ఈ సందడిని రెండింతలు చేయనున్నారు. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ సిద్ధమవుతోంది. మొదటి చిత్రంలో కనిపించిన వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ భార్యాభర్త గొడవ, కాబోయే భార్యాభర్త మధ్య అలకలతో సాగింది. రెండో భాగంలో వెంకీ, వరుణ్ డబ్బు చుట్టూ తిరిగే పాత్రలు చేస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మాత. ఆగస్ట్ 27న ‘ఎఫ్ 3’ రిలీజ్ కానుంది. రెండో కేసు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విక్రమ్ గత ఏడాది ఓ కేసుని సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు. ఇప్పుడు రెండో కేస్ పని పట్టడానికి రెడీ అయ్యారు. హీరో నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘హిట్: ది ఫస్ట్ కేస్’. శైలేష్ కొలను దర్శకుడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ : ది సెకండ్ కేస్’ రానుందని చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంకొన్ని సీక్వెల్స్ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ!, కల్కి, జాంబీ రెడ్డి’ చిత్రాలకు కూడా సీక్వెల్స్ ఉండొచ్చు. సీక్వెల్ చేసే ఉద్దేశం ఉన్నట్లు ఆయనే స్వయంగా పేర్కొన్నారు. చదవండి : దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు ‘అలా నటించడం ఆనందంగా ఉంది’ -
"దృశ్యం 2" రీమేక్ షురూ
‘దృశ్యం’ సీక్వెల్ ‘దృశ్యం 2’ చిత్రానికి సిద్ధం అయ్యారు వెంకటేశ్. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘దృశ్యం’ (2013). ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలయింది. మలయాళ ‘దృశ్యం’ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు వెంకటేశ్. సీక్వెల్లో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అది నిజమే. మలయాళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. -
దృశ్యం సీక్వెల్‌కి సై అన్న విక్టరీ
మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించడంతో తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేశారు. తాజాగా మోహన్ లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా శుక్ర వారం నేరుగా అమేజాన్‌లో విడుదలయింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా తెలుగులో రీమేక్ కానుందని సమాచారం. మొదటి భాగంలో నటించిన వెంకటేశ్ ఈ సీక్వెల్లోనూ చేసేందుకు పచ్చజెండా ఊపారట. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారట. -
ఫ్యాన్స్‌కు మోహన్‌లాల్ న్యూ ఇయర్ గిఫ్ట్
సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'దృశ్యం2' న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్థరాత్రి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ..జార్జ్ కుట్టి, అతని కుటుంబం కథతో ముందుకు వస్తున్నామని, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, సిద్దిక్, ఆశా శరత్, మురళి గోపీ, అన్సిబా, ఎస్తేర్, సైకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2013లో విడుదలైన దృశ్యం మొదటి పార్ట్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మొదటి పార్ట్‌లో ఎక్కడైతే కథ ఆగిందో సెకండ్ పార్ట్‌లో అక్కడినుంచి కంటిన్యూ కానుంది. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అది కాకుండా గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ప్రకటించినా కరోనా కారణంగా షూటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యింది. కాగా మోహన్‌లాల్ తదనంతరం జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే ‘రామ్’ అనే మరో చిత్రానికి సైన్ చేశారు. Georgekutty and his family are coming soon on @PrimeVideoIN#Drishyam2OnPrime #HappyNewYear2021 #MeenaSagar #JeethuJoseph @antonypbvr @aashirvadcine @drishyam2movie #SatheeshKurup pic.twitter.com/5l7cfCdCS3 — Mohanlal (@Mohanlal) December 31, 2020 -
ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్‌కు రెడీ!
తిరువనంతపురం: 2013 లో విడుదలైన మోహన్ లాల్ ‘దృశ్యం’ చిత్రం భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చేసిన ఉత్తమ థ్రిల్లర్లలో ఒకటి. ఈ సినిమా మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ఉండబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఆగస్టు 17 నుంచి ఈ చిత్రం షూటింగ్‌కు మోహన్‌లాల్ అంగీకరించారని, దీనికి సంబంధించి ఈ వారాంతంలో పరిశ్రమలోని నిపుణులు, నిర్మాతలతో సమావేశం నిర్వహించే ఆలోచనల్లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. (ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్) ఈ సమావేశంలో కరోనా సంక్షోభ పరిస్థితిని అధిగమించడానికి తీసుకోవలసిన భద్రతా చర్యలు, ఇతర ఆర్థిక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దృశ్యం 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించబోయే మిగిలిన తారాగణాన్ని త్వరలో ప్రకటించనున్నారు. గత నెలలో కేరళ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించిన క్రమంలో సినిమా షూటింగ్‌ల కోసం అనుమతించింది. సునామి అనే మలయాళ చిత్రం జూన్ మధ్యలోనే కొంతమంది సిబ్బందితో తిరిగి షూట్ ప్రారంభించింది. ఇదిలావుండగా, మోహన్ లాల్ ‘మరక్కర్: అరబికడాలింటే సింహాం’ సినిమా ఏప్రిల్‌లో తెరపైకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. దీని తరువాత జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ‘రామ్’ అనే మరో చిత్రానికి సంతకం చేశారు. ఈ చిత్రంలోని ప్రధాన భాగాలను విదేశాలలో చిత్రీకరించాల్సిన అవసరం ఉన్నందున వచ్చే ఏడాది షూటింగ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్) -
దృశ్యం 2
మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం’ (2013). థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు జీతూ జోసెఫ్ ప్రకటించారు. మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటిస్తారట. మిగతా నటీనటులు మారతారని తెలిపారు. కేరళలో సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను ఆరంభించాలనుకుంటున్నారట. -
దృశ్యం డైరెక్టర్‌తో నిత్యామీనన్
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యింది సీనియర్ నటి శ్రీ ప్రియ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె, తన రెండో ప్రయత్నంగా కూడా ఓ థ్రిల్లర్ సినిమానే ఎంచుకుంది. రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ ప్రియ ప్రస్తుతం ఓ స్ట్రయిట్ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమాలో లేడి ఓరియంటెడ్ సినిమాల కేరాఫ్ అడ్రస్ నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఘటన పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. లవ్ కం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా తన మార్క్ థ్రిల్లర్ గా రూపొందిస్తోంది శ్రీ ప్రియ. సన్ మూన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఘటనను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిత్యా మీనన్‌తో పాటు క్రిష్, నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
ఇదో.. హారర్.. థ్రిల్లర్!
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుండటంతో ఈ తరహా చిత్రాలను క్యాష్ చేసుకునే పని మీద చాలామంది ఉన్నారు. ఈ ట్రెండ్‌ని అనుసరిస్తూ, హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. శ్రీకాంత్, కామ్నా జెఠ్మలాఠిట జంటగా ‘వీడికి దూకుడె క్కువ’ చిత్రంతో నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బెల్లం రామకృష్ణారెడ్డి ఇప్పుడీ హార ర్ చిత్రంతో దర్శకునిగా మారారు. కార్తీక్, కశ్మీర జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల అయింది. కథ: ఓ పాప తన తండ్రి ప్రతి రోజు రాసుకుంటున్న డైరీ చదవడంతో ప్రస్తుతంలో ఉన్న కథ ఐదేళ్ల వెనక్కి వెళుతుంది. అఖిల్ (కార్తీక్), అభినయ (కశ్మీర) ఇద్దరూ బీటెక్‌లో ఉన్నప్పుడే ప్రేమలో పడతారు. జాబ్ వచ్చాక తల్లితండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే... అభినయ జీవితంలో పెను విషాదం. ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు. అందర్నీ కోల్పోయి అనాథగా మారిన అభినయ జీవితానికి అండగా నిలుస్తాడు అఖిల్. ఈలోగా బీటెక్ పూర్తి కావడం, ఇద్దరికీ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం చకచకా జరిగిపోతాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ సమక్షంలో ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. అఖిల్, అభినయలకు మరో ఫ్రెండ్ పెళ్లిళ్ల బ్రోకర్ అయిన అన్వేష్ (మధు) అన్ని వేళలా తోడుగా నిలుస్తాడు. ఇలా కాలం వేగంగా పరుగులు తీస్తుంది. వీరిద్దరి ప్రతిరూపంగా పుట్టిన హనీతో అఖిల్, అభినయల జీవితం రంగులకలగా సాగిపోతూ ఉంటుంది. ఇంతలో ఉద్యోగార్థం యూరోప్ ట్రిప్‌కు వెళ్లడానికి అఖిల్ సిద్ధమవుతాడు. కానీ, అభినయ, హనీలకు అతను వెళ్లడం ఇష్టం ఉండదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత గానీ అఖిల్ ఇండియాకు రాడు. కూతురు హనీ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా వెళ్లాల్సిందే అనుకుంటాడు అఖిల్. ఎయిర్‌పోర్ట్‌కు వెళుతుండగా కారు ప్రమాదంలో అతను చనిపోయాడని టీ వీలో బ్రేకింగ్ న్యూస్. ఈ వార్త చూసిన అన్వేష్ ఈ విషయం అభినయకు చెప్పడానికి వెళతాడు. కానీ అక్కడ ఇద్దరూ అన్వేష్‌తో ఫోన్లో మాట్లాడటం చూసి షాక్ కు గురవుతాడు. అసలు అఖిల్ నిజంగా చనిపోయాడా? లేదా అని రూఢి చేసుకోవడానికి మార్చ్యురీకి వెళతాడు. నిజమే అక్కడ ఉన్నది అఖిల్ శవమే. అతని ఐడీ కార్డ్, చొక్కా అన్వేష్‌కి ఇస్తారు మార్చ్యురీ సిబ్బంది. ఈ విషయం చెబుదామని అఖిల్ ఇంటికి వెళ్లిన అన్వేష్‌కు ఆ ఇంటి నుంచి రకరకాల శబ్దాలు, ఓ పాప అరుపులు, వినిపించడంతో అక్కడి నుంచి పారిపోతాడు. గందరగోళానికి గురైన అన్వేష్ తర్వాత రోజు మార్చ్యురీకి వెళితే అఖిల్ శవం ఉండదు. అఖిల్ చనిపోయాడా? లేదా? అనేది మిగతా కథ. ‘ప్రాణం’, ‘వాన’ చిత్రాల ద్వారా సంగీతదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ప్రాణం’ కమలా కర్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ‘ఏ కలలో...’ పాట బాగుంది. సంతోష్ కెమెరా పనిత నం కనిపిస్తుంది. -
అందరికీ కనెక్ట్ అయ్యే దృశ్యకావ్యం
‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 20 ఏళ్లు ఉద్యోగం చేశాను. చిన్నతనం నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా డెరైక్టర్ కావాలనే అభిలాష నా మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ ఇష్టాన్ని వదులుకోలేక ఇక్కడ రిస్క్ అని తెలిసినా సరే , సినిమాల్లోకి వచ్చా’’ అని దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘దృశ్యకావ్యం’ ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.... సినిమా నిర్మాణం గురించి నాకంత అవగాహన లేదు. దర్శకత్వం గురించి కూడా అనుభవం లేదు. అందుకే ముందు నిర్మాతగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. శ్రీకాంత్, కామ్నా జెఠ్మలాని జంటగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే సినిమా నిర్మించాను. అప్పుడే ప్రొడక్షన్‌తో పాటు మిగతా విభాగాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆ అనుభవాలే ‘దృశ్యకావ్యం’ తీయడానికి ఉపయోగపడ్డాయి. ‘వీడికి దూకుడెక్కువ’ సినిమా తర్వాత దర్శకుడిగా నన్ను నేను పరీక్షించుకుందామని కథ కోసం అన్వేషిస్తున్న సమయంలో ఓ ఐడియా తట్టింది. ఆ స్క్రిప్ట్ వర్క్ కోసమే ఏడాది పాటు టైం తీసుకున్నాను. చాలా సింపుల్ స్టోరీ లైన్. నిత్య జీవితంలో మన కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలు.. తీవ్ర రూపం దాలిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది. కథే హీరో! దర్శకునిగా నాకిది తొలి సినిమా అని చెప్పాను. అందుకే, కథ నాకు బాగుందని అనిపించినా, ఇతరులు ఏమంటున్నారో తెలుసుకోవాలని, కొంతమందికి చెప్పాను. స్టోరీ లైన్ బాగుందని మెచ్చుకున్నారు. కానీ హీరో, హీరోయిన్లుగా కాస్త తెలిసిన వాళ్లయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అల్రెడీ తెలిసినవాళ్లే నటిస్తే... కథ ఎలివేట్ అవ్వదు. అదే, కొత్తవాళ్లు నటిస్తే, ఈ కథ వాళ్లకే జరుగుతున్న ఫీల్ చూసేవాళ్లకి కలుగుతుంది. అందుకే కొత్తవాళ్లతోనే తీయాలనుకున్నాను. కంటెంట్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నా దృష్టిలో ఈ సినిమాకి కథే హీరో. ఈ కథలో కనిపించే ముఖ్య తారలను చూసినప్పుడు ఫ్రెష్‌నెస్ కనిపించాలి. కార్తీక్, కశ్మీరలను హీరో, హీరోయిన్లుగా ఎన్నుకోవడానికి కారణం అదే. ఇద్దరూ అద్భుతంగా నటించారు. ప్రీ-ప్రొడక్షన్‌కి ఏడాది! ఏదో సినిమా తీశాంలే అని కాకుండా ఒక బలమైన ముద్ర పడే సినిమానే తీయాలనుకున్నాను. అందుకే ఏడాది పాటు ప్రీ-ప్రొడక్షన్‌కి కేటాయించాను. రెండు నెలల పాటు మా కెమెరామ్యాన్ సంతోష్‌తో కలిసి సినిమా ఎలా తీయాలి? అని చర్చించడంతో పాటు షాట్స్, టేకింగ్ మీద వర్క్‌షాప్ చేశాం. అది ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. నాలుగైదు నెలల్లోనే అనుకున్న విధంగా సినిమాని పూర్తి చేయగలిగాం. వీనులవిందు... కనులకింపు ‘ప్రాణం’ ఫేమ్ కమలాకర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రాతో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ఆయువు పట్టు. ఆరు పాటలు, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. పాటలు వీనుల విందుగానే కాకుండా కనువిందుగా కూడా ఉంటాయి. కామెడీ కథానుసారంగానే సాగినట్లు పాటలు కూడా అలానే ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్టు ఎవరూ ఊహించలేరు! ఈ కథలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.. తదుపరి ఏం జరుగుతుందో ఊహించలేరు. ముఖ్యంగా క్లైమ్యాక్స్ని. నాకు తెలిసినవాళ్ల దగ్గర క్లైమ్యాక్స్ చెప్పకుండా మిగతా కథ చెప్పాను. క్లైమ్యాక్స్ ఏంటని అడిగితే.. అందరూ రకరకాలుగా చెప్పారు. కానీ, ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్‌ని ఎవరూ ఊహించలేకపోయారు. ‘దృశ్యకావ్యం’కి అదో ప్లస్ పాయింట్. కథనే నమ్ముకున్నా! ‘దృశ్యకావ్యం’ రిలీజ్ దగ్గర పడుతున్నా, నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే కథపై ఉన్న గ్రిప్ అలాంటి ది. నా వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. కష్టపడితే కచ్చితంగా ఫలితం దక్కుతుందన్న నమ్మకం ఉంది. నేనే కాకుండా మా టీమ్ మెంబర్స్ అందరూ ఈ సినిమాను ఓన్ చేసుకుని చేశారు. అందుకే క్వాలిటీ ఔట్పుట్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని 200 సెంటర్లలో విడుదల చేస్తున్నాం. ఢిల్లీ, ముంబై, కోలకతాలలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలా అనుకుంటే నేనిక్కడికి వచ్చేవాణ్ణే కాదు! కథలో ఉన్న పొటెన్షియాలిటీని బట్టి ఏ నిర్మాతైనా ఖర్చు పెట్టాలి. పేపర్ మీద ఎయిర్పోర్ట్ అని రాసుకుంటే ఆ సన్నివేశాన్ని అక్కడే తీయాలి. రాజీపడి పోయి వేరే ఎక్కడో తీస్తే సీన్ పేలవంగా ఉంటుంది. కాఫీ డేలో తీయాల్సిన సన్నివేశాలు అక్కడే తీయాలి. అలాగే, కాకా హోటల్స్‌లో తీయాల్సిన సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలి. ఏదైనా సీన్ డిమాండ్ మేరకే చేయాలి. అందుకే అనవసరంగా ఖర్చుపెట్టకూడదు.. అలాగని పెట్టాల్సిన చోట రాజీపడకూడదు. అలా రాజీపడాలనుకుంటే నేనిక్కడకు వచ్చి ఉండేవాణ్ణి కాదు. ఓ నిర్మాతగా ఎక్కడ ఏం కావాలో, ఎక్కడ అక్కర్లేదో ముందు తెలుసుకోవాలి. నాకా విషయం మీద పూర్తి అవగాహన వచ్చేసింది. అలాగే, ఓ దర్శకునిగా ఏమేం చేయాలో తెలుసుకున్నాను. ఇకనుంచి సినిమా పరిశ్రమలోనే కొనసాగుతా. ఓ మంచి కథ ఉంది. ‘దృశ్యకావ్యం’ కథకు పూర్తి భిన్నమైన కథ అది. ఆ చిత్రవిశేషాలు త్వరలోనే చెబుతాను. ఇప్పుడు నేను ప్రేక్షకులకు కోరుకునేది ఒక్కటే. ఒక మంచి సినిమా తీయడానికి మా వంతు కృషి చేశాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఓ ప్రేక్షకుడిలా ఈ సినిమా తీశాను చిన్నతనం నుంచి నేను చాలా సినిమాలు చూశాను. ముఖ్యంగా కె.రాఘవేంద్రరావు, కె.బాలచందర్ సినిమాలంటే చాలా ఇష్టం. నా స్టోరీని ఓ డెరైక్టర్‌గా కాకుండా ఓ ప్రేక్షకునిగా చూశా. అందుకే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా టేకింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నా. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా ఉండవు. కామెడీ పేరుతో ద్వంద్వార్థ సంభాషణలు పెట్టలేదు. నందు అనే అప్‌కమింగ్ రైటర్‌తో కలిసి ఈ చిత్రానికి సంభాషణలు రాశాను. అందరూ చక్కగా చూసి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఎ, బి, సి అనే సెంటర్లు తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ టైటిల్ ‘దృశ్యకావ్యం’ అని పెట్టి ట్రైలర్స్, పోస్టర్స్‌లో భయపెడుతున్నావేంటి? అని చాలా మంది అడుగుతున్నారు. అయినా సినిమా అంతా భయపెట్టే అంశాలు ఉండవు. ఓ ఇంజినీరింగ్ కాలేజి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ ఇది. ఈ సినిమా ప్రథమార్ధం అంతా మంచి లవ్‌స్టోరీతో, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్రల కామెడీతో హాయిగా సాగుతుంది. ఇంగ్లిషు కూడా సరిగ్గా రాకుండా డొనేషన్లు కట్టి ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యే ‘జబర్దస్’్త బ్యాచ్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సినిమా ఊహించని మలుపు తిరుగుతుంది. -
దృశ్యకావ్యం... ఆద్యంతం ఉత్కంఠభరితం
‘‘‘దృశ్యకావ్యం’లోని ప్రధాన తారాగణంతో పాటు టెక్నీషియన్స్‌కు కూడా ఎటువంటి స్టార్ వాల్యూ లేదు. కంటెంట్ మీద నమ్మకంతో తీసిన సినిమా ఇది’’ అని దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు.... పుష్యమి ఫిలిం మేకర్స్‌పై ఇది రెండో సినిమా. ఇదే బ్యానర్‌పై శ్రీకాంత్, కామ్నా జెఠ్మలానీ జంటగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించాం. రెండో సినిమాగా కొత్త తారాగణంతో, టెక్నీషియన్లతో ‘దృశ్యకావ్యం’ రూపొందించాను. ఎంటర్టైన్ చేస్తూనే, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. వరంగల్, హైదరాబాద్, ఇంకా పలు లొకేషన్లలో 90 రోజుల్లో పూర్తి చేశాం. ‘ఎవడి గోల వాడిదే’, ‘వాన’, ‘ప్రాణం’ చిత్రాల ఫేమ్ కమలాకర్ ఈ చిత్రానికి మంచి స్వరాలు అందించారు. ఇప్పటికే మ్యూజికల్‌గా మంచి హిట్ సాధించింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చే చిత్రం ఇది. మొదటి 20 నిమిషాలు పాత్రల పరిచయం తదితర దృశ్యాలతో సాగుతూ, ఆ తర్వాత ప్రతి నిమిషం ఆసక్తికరంగా సాగుతూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ‘దృశ్యకావ్యం’ అని టైటిల్ ఎందుకు పెట్టామో క్లయిమాక్స్‌లో తెలుస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రం కనువిందుగా ఉంటుంది. హృదయానికి హత్తుకునే చిత్రం కూడా. ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఏ కథతో సినిమా చేయబోతున్నానో త్వరలో చెబుతాను. దర్శకత్వమే కాకుండా కొత్త కథలతో దర్శకులు వస్తే వాళ్లతో కూడా సినిమా నిర్మించడానికి రెడీ. -
'దృశ్యం' లాగా ఆధారాలను మాయం చేశాడు!
పాట్నా: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన దృశ్యం సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యాడో హంతకుడు. హత్యా నేరాన్ని కప్పిపుచ్చేందుకు సినిమాలో హీరో వేసిన ఎత్తులను బాగా ఒంటబట్టించుకొని పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. కాని చివరికి అందరు నేరస్తుల లాగే చట్టానికి దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పాట్నాలోని వైశాలి ప్రాంతానికి చెందిన రజనీష్ సింగ్‌ను వారం క్రితం జరిగిన సృష్టీ జైన్ అనే మహిళ హత్య కేసులో అరెస్టు చేశారు. విచారణలో రజనీష్ వెల్లడించిన నిజాలు పోలీసులను విస్తుగొలిపేలా చేశాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పిలిపించి ఆమెను కాల్చి చంపిన రజనీష్ ఆధారాలను ధ్వంసం చేయడానికి దృశ్యం సినిమాను అనుకరించాడు. తన మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేసి పోలీసులు పట్టుకునే అవకాశం ఉందని భావించి దానిని ఓ ట్రక్కులోకి విసిరేశాడు. అయితే ఆ మొబైల్ ట్రక్కులో వేయగానే పగిలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే తన మోటార్ సైకిల్‌ను సైతం గంగా నదిలో పడేశాడు. ఇందుకోసం రూ 500 చెల్లించి ఓ బోట్‌ను మాట్లాడుకొని వెళ్లి మరీ నదిలో బైక్‌ను పడేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న రజనీష్ ఓ మ్యాట్రీమోని సైట్ ద్వారా సృష్టి జైన్‌ను తనకు వివాహం కానట్లు నమ్మించి పాట్నాకు రప్పించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. -
'దృశ్యం' చెక్కిన జీవితమిది
ఇప్పటి వరకు గడిచిన తన జీవితాన్ని రెండు భాగాలు చేస్తే.. దృశ్యం సినిమాకు ముందు, తర్వాత అని చెప్పాల్సి ఉంటుందని అంటోంది నటి కృతికా జయరామ్. వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో హీరో పెద్ద కూతురిగా నటించింది కృతిక. కథలోని కీలక మలుపులకు కారణమయ్యే పాత్ర పోషించిన కృతిక ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతోంది. సిటీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కృతికతో ముచ్చటించినప్పుడు పలు విషయాలు పంచుకున్నారిలా.. నృత్యం మార్చిన దృశ్యం మేం తమిళులమే అయినా బెంగళూర్‌లో స్థిరపడ్డాం. నాన్న బిజినెస్. అమ్మ హౌస్‌వైఫ్. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం. మలయాళీ నృత్యకారులు మిథున్ శ్యామ్ దగ్గర శిక్షణ పొందాను. ఒకసారి కేరళ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చాను. అప్పుడు నన్ను చూసిన ఒక మలయాళ దర్శకులు 'నువ్వు సినిమాల్లో రాణిస్తావం'టూ ప్రోత్సహించారు. అంతే కాకుండా దృశ్యం సినిమా ఆడిషన్లు జరుగుతున్నాయని చెప్పి తన వంతుగా నన్ను రికమెండ్ చేశారు. జర్నలిజం కోర్సు చేస్తున్న నేను ఆ సినిమాకి ఎంపికవడంతో జీవితం కీలకమలుపు తిరిగింది. అవకాశాలొస్తున్నాయి 'దృశ్యం' సూపర్ హిట్టవడంతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో 'రామయ్యా వస్తావయ్యా'లో అవకాశం వచ్చింది. ఇక అక్కడి నుంచి సినిమా రంగంలో ప్రొఫెషనల్ అయిపోయాను. ప్రస్తుతం దర్శకుడు మారుతి, నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న 'రోజులు మారాయి' సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాను. ప్రధాన పాత్రలని కాదు.. మంచి అభినయ ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. నేనెంతో ఇష్టపడే క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో నటించే అవకాశం వస్తే.. అంతకన్నా కావాల్సిందేముంది? నా అభిమాన నటీనటులు నిత్యామీనన్, అల్లు అర్జున్. -
దృశ్యం చెప్పిన కధ!
-
మోహన్‌లాలే కారణమంటున్న కమల్!
ఓ చిన్న కథ. కూతురు అనుకోకుండా ఓ ఆపదలో పడితే, తండ్రి తన కూతురినే కాక మొత్తం కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అది ఎలా అన్నది ఇప్పటికి నాలుగు భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ సినిమా కథ ‘దృశ్యం’ అని. ఎక్కడో మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు హాట్ కేక్. ఈ సినిమా తెలుగు వెర్షన్లో వెంకటేశ్ హీరోగా నటించి ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కమల్‌హాసన్ ‘పాపనాశమ్’ పేరుతో తాజాగా తమిళంలో చేసి విజయం సాధించారు.కానీ ఆయన లాంటి పెద్ద నటుడు ఇంత సామాన్యమైన కథను చేయడానికి పరోక్ష కారణం మాత్రం మోహన్‌లాల్. ఆయన ఈ సినిమాను తమిళంలో కమల్‌హాసనే చేయాలని కోరుకున్నారు. ఆ సంగతి తెలిసిన కమల్, ‘‘‘దృశ్యం’ రీమేక్‌లో ప్రధాన పాత్ర నేను చేస్తే బాగుంటుందని మోహన్‌లాల్ అన్నారట. ఇంత మంచి కథకు నా పేరు సూచించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఈ సినిమా ఎవరైనా వేసుకోవాలనుకునే మంచి చొక్కా లాంటిది’’ అన్నారు. -
ఫోన్ చేతిలో ఉందని... ఫొటో తీసేయడమేనా?
ఒకప్పుడు ఫోన్ నాలుగు గోడలకు పరిమితం. ఇప్పుడు ఎక్కడికెళితే, అక్కడకు తీసుకెళ్లొచ్చు. ముచ్చటగా ఏదైనా దృశ్యం కనిపిస్తే, ఆ ఫోన్లో ఉన్న కెమెరాతో బంధించొచ్చు. కానీ, తీయకూడనవి తీస్తే? కొన్ని జీవితాలు ఇబ్బందులపాలవుతాయ్. మలయాళ ‘దృశ్యం’ చిత్రంలో చెప్పిన పాయింట్ ఇదే. ఈ చిత్రం తమిళ రీమేక్ ‘పాపనాశం’లో కమల్‌హాసన్, గౌతమి నటించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ గురించి కమల్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఏది పడితే అది తీసే హక్కు ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి మనోభావాలతో సంబంధం లేకుండా ఫొటోలు తీస్తున్నారు’’ అని కమల్ అన్నారు. ఓ సెలబ్రిటీగా ఇలాంటి సంఘటనలు నాకు చాలా ఎదురయ్యాయని కమల్ చెబుతూ -‘‘సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలని అందరికీ ఉంటుంది. కానీ, వాళ్ల అనుమతి తీసుకోవాలి. కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఫొటో తీసేస్తారు. ఆ తర్వాత ‘ఫొటో తీసుకోవచ్చా?’ అంటారు. వింతగా ఉంటుంది’’ అన్నారు. -
హిందీ ‘దృశ్యం’లో..!
మోహన్‌లాల్, మీనా జంటగా రూపొందిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’లో పోలీసాఫీసర్ పాత్రను ఆశా శరత్ చేశారు. ఇదే పాత్రను తెలుగు ‘దృశ్యం’లో నదియా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో పోలీసాఫీసర్ పాత్రను ఆశా శరత్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీలోనూ ‘దృశ్యం’ తెరకెక్కనుంది. ఈ రీమేక్‌లో పోలీసాఫీసర్ పాత్రను టబు చేయనున్నారని సమాచారం. హీరోగా అజయ్ దేవగన్ నటించనున్నారు. -
ఇక సైఫ్ అలీఖాన్ వంతు!
దేశమంతటా సినిమా రంగంలో ఇప్పుడు ఆ సినిమా కథే హల్చల్ చేస్తోంది. ఆ చిత్రం మల్లూవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ ప్రేక్షకులతో హిట్ టాక్ని సొంతం చేసుకుంది. శాండిల్‌వుడ్‌లో కూడా అదే రిపీట్ అయింది. మూడు భాషలలో విజయం సాధించిన 'దృశ్యం' సినిమా కథ కోలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ కథపైన బాలీవుడ్ కన్నేసింది. ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ కొడితే చాలు, దానిని అన్ని భాషలలో రీమేక్ చేసేస్తున్నారు. బడా హీరోలు, నిర్మాలు ఆ కథల హక్కుల కోసం బారులు తీరుతున్నారు. 'దృశ్యం' విషయంలో కూడా అదే జరుగుతోంది. మొదట ఈ మూవీని మళయాలంలో మోహన్‌లాల్‌తో నిర్మించారు. అక్కడ ప్రేక్షకులు మెచ్చుకున్నారు. హిట్ కొట్టింది. తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో రీమేక్ చేశారు. అందరికీ నచ్చేసింది. కన్నడంలో రవిచంద్రన్‌తో తెరకెక్కించారు. అక్కడ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో కమల్‌హాసన్‌తో రూపొందిస్తున్నారు. దేశంలోని ముఖ్యమైన భాషలలో ఇక హిందీయే మిగిలి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ కూడా ఈ కథను పరిశీలిస్తోంది. 'దృశ్యం'పై బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కన్నేశాడు. -
వాళ్లంతా వెంకటేశ్ పేరే చెప్పారు: శ్రీప్రియ
‘‘యాభై ఏళ్ల మా సంస్థ చరిత్రలో తొలిసారి లేడీ డెరైక్టర్‌తో నిర్మించిన చిత్రం ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక్కడే కాదు.. విదేశాల్లోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది’’ అని డి. రామానాయుడు చెప్పారు. వెంకటేశ్, మీనా జంటగా శ్రీప్రియ దర్శకత్వంలో రామానాయుడు సమర్పణలో డి. సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మించిన ‘దృశ్యం’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ- ‘‘నటుడిగా నాలో ఆత్మవిశ్వాసం పెంచిన చిత్రం ఇది. నా కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. ‘‘మలయాళ ‘దృశ్యం’ని తెలుగులో రీమేక్ చేస్తు, హీరోగా ఎవరైతే బాగుంటుందని నా స్నేహితురాళ్లు జయప్రద, జయసుధ, రాధికను అడిగితే.. వెంకటేశ్ పేరు చెప్పారు. తనతో సినిమా చేయడం ఓ మంచి అనుభవం’’ అని శ్రీప్రియ తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ, రాజ్‌కుమార్ సేతుపతి, మీనా, నదియా తదితరులు చిత్రవిజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
తమిళ దృశ్యం తెరకెక్కేనా?!
-
విక్టరీ దృశ్యం
-
దృశ్యం చిత్రంపై వెంకటేష్‌తో చిట్‌చాట్
-
అందుకనే ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నా!
మీనా నవ్వితే... పూసింది పూసింది పున్నాగ! మీనా మాట్లాడితే... రేపల్లె మళ్లీ మురళి విన్నది! మీనా కవ్విస్తే... ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు! మీనా కెరీర్లో ఎన్ని హిట్టు పాటలున్నాయో... ఎన్ని హిట్టు సినిమాలున్నాయో... నిజంగా మీనా కెరీర్... ఓ సుందరకాండ! బాలనటిగా మొదలుపెట్టి... దక్షిణాదిలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మీనా పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు కామా పెట్టారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత ‘దృశ్యం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక వరుసగా సినిమాలు చేస్తానంటున్న మీనా చెప్పిన సంసారం ముచ్చట్లు, కెరీర్ కబుర్లు... పెళ్లయిన తర్వాత సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు... ఎందుకని? మీనా: దాదాపు మూడు, నాలుగేళ్లు మాత్రమే సినిమాలు చేయలేదు. ఆ నాలుగేళ్లూ మావారే నాకు మంచి కంపెనీ. రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఏది నచ్చితే అది చేసేంత తీరిక. నిజం చెప్పాలంటే నేను జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది పెళ్లి తర్వాతే. అప్పటివరకు పరిగెత్తి పరిగెత్తి సినిమాలు చేశాను. దాంతో పెళ్లి తర్వాత రిలీఫ్‌గా అనిపించింది. మీ శ్రీవారి గురించి చెబుతారా? మీనా: మావారి పేరు విద్యాసాగర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా ఇద్దరి మనస్తత్వాలూ ఒకటే. నాకు సరదాగా ఉండటం ఇష్టం. ఆయనకు కూడా అంతే. అయితే నాకన్నా నాలెడ్జబుల్ పర్సన్. నాకు తెలియని ఎన్నో విషయాలను ఆసక్తిగా చెబుతుంటారు. ఆయన దగ్గర నాకు నచ్చిన విషయాల్లో అదొకటి. మీది ప్రేమ వివాహమా? మీనా: అదేం కాదు కానీ, ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. అయితే, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మే ఆయన ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయ నను వద్దనుకోవడానికి కారణాలేవీ కనిపించలేదు. అందుకని ఒప్పుకున్నా. పెళ్లి తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులొచ్చాయా? మీనా: మార్పంటే.. నాకు నేనుగా కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను. ఒక దశ తర్వాత మన ప్రాధాన్యతలేంటో మనకు తెలిసిపోతాయ్. అలాగే, సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నా. బయటకు నేను పెద్ద స్టార్‌ను కావచ్చు. ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. భార్యగా, తల్లిగా మిగతా ఆడవాళ్లు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారో నేనూ అంతే. పదిహేను, ఇరవయ్యేళ్లు బిజీగా సినిమాలు చేశారు కదా.. ఒక్కసారిగా ‘జాబ్ లెస్’ గా ఉండడం బాధగా అనిపించలేదా? మీనా: మొదట్లో అంత తీరిక బాగానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం ఏదో ఒక వ్యాపకం లేకుండా ఉండలేం అనిపించింది. నా భర్త, పాపకు తగిన సమయం కేటాయిస్తూనే, అడపా దడపా సినిమాలు చేయాలనుకున్నాను. భార్య, తల్లి... బాధ్యతలు ఎలా అనిపిస్తున్నాయి? మీనా: చెప్పాలంటే పెళ్లయిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. జీవితం గురించి బోల్డన్ని విషయాలు తెలిశాయి. ఇక, అమ్మ అయిన తర్వాత అయితే జీవితం ఇంకా అద్భుతంగా ఉంది. మా పాప పేరు నైనిక. పాపకు మూడేళ్లు వచ్చేశాయి. మాటలు రాకముందు తనెందుకు ఏడుస్తుందో తెలియక సతమతమయ్యేదాన్ని. ఇప్పుడు ఫరవాలేదు. ఇవన్నీ చూశాక, నన్ను పెంచడానికి మా అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో అనిపించింది. ‘నేను కరెక్ట్‌గానే పెంచుతున్నానా’ అని అమ్మను చీటికీ మాటికీ అడుగుతుంటాను. పాపకు ఏం తినిపించాలి? ఎలాంటి దుస్తులు వేయాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ నాకు టెన్షనే. షూటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడు మీ అమ్మాయిని మిస్ అయిన ఫీలింగ్ కలగదా.. మిమ్మల్ని సినిమాల్లో చూసి తనెలా స్పందిస్తుంది? మీనా: నాతో పాటు షూటింగ్స్‌కు తీసుకెళ్లిపోతుంటాను. ఒకవేళ ఇంట్లో వదిలి వెళితే నాకు మనశ్శాంతిగా ఉండదు. టీవీలో నా సినిమాలొస్తే ‘అమ్మా... నువ్వే’ అని గుర్తుపడుతోంది. నేను విడిగా బయటికెళ్లినప్పుడు అందరూ గుర్తుపట్టి, ‘హాయ్ మీనాగారు’ అని పలకరిస్తారు. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ, నా సొంత కూతురే నన్ను గుర్తుపడితే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత. మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే కూతురు.. మీకు కూడా అంతేనా? మీనా: (నవ్వుతూ) ఏమోనండి.. ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు . మీ మాతృభాష తమిళమనీ, కాదు తెలుగు అనీ చాలామంది అంటారు? అసలు మీ మాతృభాష ఏంటి? మీనా: మా అమ్మగారు మలయాళీ. నాన్న గారు తెలుగువారు. నేను పుట్టి, పెరిగింది చెన్నయ్‌లోనే. ఇంట్లో ఎక్కువగా తమిళమే మాట్లాడతాం. మీ కెరీర్ విషయంలో మీ అమ్మా, నాన్న సపోర్ట్ చాలా ఉంది కదా? మీనా: నాకు అన్ని విధాల అండ మా అమ్మే. ఏది ఒప్పో.. ఏది తప్పో వివరించి చెప్పేది. నాన్న సపోర్ట్ లేకపోతే అసలు నా కెరీర్ సాఫీగా సాగేది కాదు. మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే అమ్మాయి కాబట్టి, చాలా గారాబంగా పెంచారా? మీనా: ఎక్కడ స్ట్రిక్ట్‌గా ఉండాలో అక్కడ ఉంటారు. మిగతా సమయాల్లో మామూలుగా ఉంటారు. మరి.. మీ మీరెలాంటి మదర్? మీనా: మా అమ్మా, నాన్న నన్ను పెంచినట్లుగానే మా అమ్మాయిని నేను పెంచాలనుకుంటున్నా. అన్ని విషయాలూ నేర్పించి, మంచి గైడ్‌గా ఉండాలన్నది నా కోరిక. మా అమ్మా నాన్న తప్పొప్పులు చెప్పి, ‘నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి’ అనేవారు. మా అమ్మాయి విషయంలో నేనూ అదే చేస్తా. మీ సినిమాల విషయంలో మీ భర్త జోక్యం ఎంతవరకూ ఉంటుంది? మీనా: ఆయన జోక్యం అసలు ఉండదు. ఎందుకంటే, నాకో పది అవకాశాలొస్తే నేనే రెండు, మూడు మినహా ఒప్పుకోవడం లేదు. పాత్రల ఎంపిక పరంగా నేనంత జాగ్రత్తపడుతున్న విషయం ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఇన్వాల్వ్ కారు. ఓకే... ఇటీవల విడుదలైన ‘దృశ్యం’ విషయానికొద్దాం... మలయాళంలో మీరే చేసిన పాత్రను మళ్ళీ తెలుగులో చేసినప్పుడు ఎలా అనిపించింది? మీనా: మలయాళ సినిమా అంతా అయ్యాక చూసినప్పుడు ‘ఇది బాగుంది కానీ, ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు’ అనుకున్నా. ఇప్పుడు మళ్లీ తెలుగులో అదే పాత్ర చేస్తూ, ఆ బెటర్మెంట్ ఉండేలా చూసుకున్నాను. గతంలో వెంకటేశ్‌తో ‘చంటి’, ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. చాలా విరామం తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం పట్ల మీ ఫీలింగ్? మీనా: వెంకీగారితో మళ్లీ యాక్ట్ చేయడం ఆనందం అనిపించింది. షూటింగ్ అంతా కూల్‌గా సాగింది. అయితే గతంలో నేనాయనతో సినిమాలు చేసినప్పుడు పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అప్పట్లో నేను మితభాషిని. ఇప్పుడు చాలా మారాను. మితభాషిని అన్నారు... ఎందుకని? మీనా: మద్రాసులోనే పెరిగినందువల్ల తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడితే.. ఎవరి మనసైనా నొచ్చుకుంటుందేమో... అపార్థం చేసుకుంటారేమోనని భయం. కొంచెం అమాయకంగా కూడా ఉండేదాన్ని.. అభద్రతాభావం ఉండేది. అందుకని నా పనేంటో నేనేంటో అన్నట్లుగా ఉండేదాన్ని. కలుపుగోలుగా ఉంటే, అడ్వాంటేజ్ తీసుకుంటారేమోనని భయం. దాంతో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. దానివల్ల ‘మీనాకు తలబిరుసుతనం’ అన్నవాళ్లు ఉన్నారు. వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి పరిస్థితిని అయినా అధిగమించగలననే ధైర్యం ఏర్పడింది. ఆ తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచీ ఈ రంగంలో ఉన్నారు. ఏదైనా పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలున్నాయా? మీనా: వ్యక్తిగతంగా ఏమీ లేవు. కానీ, డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని మంచి సినిమాలు వదులుకున్నాను. అది మాత్రం ఎప్పటికీ బాధగా ఉంటుంది. నేను వదులుకున్న సినిమాల్లో ‘నరసింహ’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర ఒకటి. ఆ సినిమా అప్పుడు రజనీకాంత్ సార్ ఫోన్ చేసి, ‘నువ్వు చేస్తున్నావ్.. కంగ్రాట్స్’ అన్నారు. మా అమ్మకు ఆ పాత్ర అంత సంతృప్తిగా అనిపించలేదు. డేట్సూ లేవు. కారణాలేవైనా ఓ మంచి పాత్ర వదులుకున్నా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను శివాజీ గణేశన్గారే పరిచయం చేశారు. ‘నరసింహ’లో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒకవైపు శివాజీ సార్, మరోవైపు రజనీ సార్ నటించిన సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటా. అలాగే, కృష్ణవంశీ కంటిన్యూస్‌గా రెండు నెలలు డేట్స్ అడగడంతో ‘నిన్నే పెళ్లాడతా’ మిస్సయ్యా. అప్పుడు నాలుగు భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఒక సినిమాకు వరుసగా 20 రోజులు డేట్స్ ఇవ్వడమే గగనంగా ఉండేది. అలాంటిది 2 నెలలా అని ఆలోచనలోపడ్డాను. కరెక్ట్‌గా ప్లాన్ చేసి చెప్పమని కృష్ణవంశీని అడిగితే ‘కరెక్ట్‌గా ప్లాన్ చేసే చెబుతున్నా.. రెండు నెలలు కావాల్సిందే’ అన్నారు. దాంతో వదులుకోక తప్పలేదు. రజనీకాంత్‌తో బాలనటిగా చేసి, ఆయన పక్కనే హీరోయిన్గా చేశారు కదా.. ఎలా అనిపించింది? మీనా: రజనీ సార్‌తో తమిళంలో ‘అన్బుళ్ల రజనీకాంత్’ సినిమా చేసినప్పుడు ఆయన నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేవారు. నాకు బాగా నిద్ర వచ్చినప్పుడు, జో కొట్టేవారు కూడా. ఇక, నేను హీరోయిన్గా చేయడం మొదలుపెట్టిన తర్వాత దర్శకుడు ఆర్.వి. ఉదయ్‌కుమార్ ఒక కథ చెప్పి, రజనీగారి పక్కన యాక్ట్ చేయాలన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ, ఆయన సీరియస్‌గానే చెబుతున్నారని తెలుసుకుని, ‘అసలు రజనీ సార్ నాతో చేస్తారా’ అన్నాను. కానీ, రజనీ సార్ కూడా చేస్తానన్నారట. వాస్తవానికి ఉదయ్‌కుమార్‌గారు ఆ సినిమాకు అడిగినప్పుడు, నేను తెలుగులో ఫుల్ బిజీ. పైగా, ఉదయ్‌కుమార్‌గారు అడిగిన డేట్స్ కమల్ హాసన్‌గారి సినిమాకిచ్చాను. అందుకని, ‘ఇది జరగదులే’ అనుకున్నాను. ఓ రోజు ఏవీయం శరవణన్‌గారు ఫోన్ చేసి, ‘ఈ సినిమా చేయాలి’ అన్నారు. ఎలాగోలా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాను. అదే ‘ముత్తు’ సినిమా. మొదటిరోజు షూటింగ్ అప్పుడు రజనీ సార్‌తో ‘ఏం మాట్లాడాలి.. ఎలా మెలగాలి’ అని సతమతమయ్యాను. సూపర్‌స్టార్ పక్కన చేస్తున్నామన్న థ్రిల్ ఓ వైపు.. భయం మరోవైపు.. ఇలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేదాన్ని. కొన్నిరోజుల తర్వాత అడ్జస్ట్ అయ్యాను. శివాజీ గణేశన్‌తో బాలనటిగా చేశారు కదా.. ఆ అనుభవాలు గుర్తున్నాయా? మీనా: తమిళ సినిమా ‘నెంజంగళ్’ అది. శివాజీ సార్ చుట్టూ, నా చుట్టూనే ఆ సినిమా తిరుగుతుంది. అప్పుడు నా వయసు మూడున్నరేళ్లు ఉంటుందేమో. అసలు సినిమా అంటే ఏంటో తెలియదు. డైలాగ్స్ నేర్పించేవారు.. చెప్పేసేదాన్ని. ఈ షూటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి చెబుతాను. లంచ్ టైమ్‌లో శివాజీ సార్ గదికి వెళ్లిపోయేదాన్ని. ఎందుకంటే, ఆయనకు ఇంటి నుంచి చికెన్ 65 లాంటి వెరైటీలు వచ్చేవి. వాటి కోసం వెళ్లిపోయేదాన్ని. మా అమ్మేమో ‘రోజూ వెళితే బాగుండదు’ అని మందలించేది. దాంతో ఎప్పుడైనా ఒక రోజు వెళ్లకపోతే... శివాజీ సారే ‘ఏంటీ ఇవ్వాళ్ల రాలేదు.. రారా.. కలిసి భోంచేద్దాం’ అని పక్కన కూర్చోబెట్టుకుని, నేను తినేవరకూ ఊరుకునేవారు కాదు. చిన్నప్పుడే సినిమాల్లోకి రావడం వల్ల చదువుకునే తీరిక చిక్కి ఉండేది కాదేమో? మీనా: ప్రైవేట్‌గా ఎం.ఏ హిస్టరీ చేశాను. అమ్మా, నాన్నకు చదువంటే ఇష్టం. వాళ్ల కోరిక తీర్చడం కోసమే చదువుకున్నాను. కానీ, సినిమాలు చేస్తూ, చదవడం అంత సులువు కాదు. ‘కర్తవ్యం’లో చిన్న పాత్ర చేశారు కదా.. వెంటనే హీరోయిన్ ఎలా అయ్యారు? మీనా: ఈతరం ఫిలింస్ పోకూరి బాబురావుగారు ఏదో సినిమాకి హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. నేను వెళితే స్క్రీన్ టెస్ట్ చేసి, తీసుకున్నారు. అలా హీరోయిన్గా తెలుగులో ‘నవయుగం’ నా తొలి సినిమా. మీ కెరీర్లో కీలకంగా నిలిచిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ జ్ఞాపకాలు...? మీనా: ముందు ఆ సినిమా చేయకూడదనుకున్నా. ఎందుకంటే అంతకుముందు చేసిన ‘నవయుగం’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘ప్రజల మనిషి’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఇక చదువుకుందామనుకున్నాను. అమ్మా, నాన్న కూడా అదే మంచిదనుకున్నారు. అప్పుడు హరిగారని ఓ అసిస్టెంట్ డెరైక్టర్ వచ్చి, క్రాంతికుమార్‌గారు ఓ సినిమా చేయాలనుకుంటున్నారని, నన్ను తీసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. మాకు ఇంట్రస్ట్ లేదని అమ్మ చెప్పింది. ‘ఈ ఒక్క సినిమా ట్రై చేయండి. చాలా మంచి కేరెక్టర్. ఓ తాత, మనవరాలి కాంబినేషన్లో జరిగే కథ. మీకు క్రాంతికుమార్‌గారి గురించి తెలియడం లేదు. చాలా గొప్ప డెరైక్టర్’ అన్నారు. సరేనని వెళ్లాం. కొద్దిగా మేకప్ వేసి, ఆ తర్వాత మేకప్ లేకుండా ఫొటోషూట్ చేసి, ఓకే అన్నారు. ‘అయ్యో.. ఓకే అయ్యిందా’ అనుకున్నా. కట్ చేస్తే ఆ సినిమా బాగా ఆడడం, నేను 200 చిత్రాల దాకా చేయడం జరిగిపోయాయి. ఆ సినిమా సమయంలో అక్కినేని నాగేశ్వరరావుగారు సలహాలిచ్చేవారా? మీనా: ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మన కోసం ఎవరూ వెయిట్ చేయకూడదు’ అని ఏయన్నార్ గారు చెప్పారు. ఆయన నాకిచ్చిన మొదటి సలహా అది. ఆ సినిమా విడుదలైన తర్వాత... ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు అంతగా అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. చివరిసారిగా నాగేశ్వరరావు గారిని ఎప్పుడు కలిశారు? మీనా: చెన్నైలో గత ఏడాది జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగకు అన్ని భాషలకు చెందిన వాళ్లూ వచ్చారు. చెన్నైలోనే ఏయన్నార్‌గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేనూ పాల్గొన్నా. ఆయనను చూడడం అదే చివరిసారి. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘మనం’ ఇటీవల చూసినప్పుడు, కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. కథానాయికల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది కదా. ఆ స్టార్ హోదా నుంచి పక్కకు రావాల్సొచ్చినప్పుడు చాలామంది ఎంతో బాధపడతారు. మరి మీరెలా? మీనా: కథానాయికల కెరీర్ చాలా తక్కువ కాలమని నాకు తెలుసు. అయినప్పటికీ నేను పది, పదిహేనేళ్లు చేయగలిగాను. ఉన్నంతవరకూ మంచి సినిమాలు చేయగలిగాను. మొత్తం నాలుగు భాషల్లోనూ 200కి పైగా సినిమాలు చేశాను. ఇక, ఇంతకన్నా ఏం కావాలి? దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలందరి సరసన చేశారు కదా.. అప్పట్లో ఎలా అనిపించింది? మీనా: అసలా ఫేమ్‌ను గ్రహించే తీరిక ఉండేది కాదు. ఇంత పెద్ద స్టార్స్‌తో చేస్తున్నాం, ఇన్ని మంచి పాత్రలు చేస్తున్నాం అని ఎప్పుడూ ఆలోచించలేదు. వరుసగా సినిమాలు చేయడం, చేయబోయే సినిమాల కథలు వినడంతోనే సరిపోయేది. పెళ్లయిన తర్వాతే నా కెరీర్ వైభవం గురించి ఆలోచించే తీరిక చిక్కింది. అది కూడా ఎక్కడైనా బయటికెళ్లినప్పుడు ‘సినిమాలు ఎందుకు మానేశారు? మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం’ అని అందరూ అంటున్నప్పుడు, ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటుంటాను. మీనాకు తలబిరుసుతనం అనే వ్యాఖ్యలు విని, బాధపడేవారా? మీనా: మొదట్లో నాకు తెలియలేదు. ఆ తర్వాత తర్వాత తెలిసింది. ‘మన గురించి ఎందుకలా అనుకుంటున్నారు’ అని ఆలోచించేదాన్ని. ఆ తర్వాత తేలికగా తీసుకునేదాన్ని. మనమేంటో మనకూ, మన కుటుంబానికీ తెలుసు. బయటివాళ్లకు తెలియకపోతే ఏంటిలే అనుకునేదాన్ని. కానీ, నాతో ఫ్రెండ్స్ అయిన తర్వాత ‘మీరింత స్వీట్ పర్సనా? చాలా బాగా మాట్లాడుతున్నారే. కానీ, మీ గురించి మేం వేరేలా అనుకున్నాం’ అనేవారు. పోనీలే.. ఇప్పుడైనా తెలుసుకున్నారు కదా అనేదాన్ని. ఒకప్పుడు స్లిమ్‌గా ఉండేవారు... ఇప్పుడలా ఉండాలనుకోవడం లేదా? మీనా: పాప పుట్టిన తర్వాత బరువు పెరిగాను. మావారైతే నా బరువు గురించి ఆటపట్టిస్తుంటారు. మా పాప అన్నప్రాసన గుళ్లో చేస్తే, ఆ ఫొటోలు బయటికొచ్చాయి. అప్పుడు నేనింకా లావుగా ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత నా గురించి నేను ఆలోచించడం మానేశాను. ఇప్పుడు మా నైనికకు మూడేళ్లు వచ్చేశాయ్. మాటలు వచ్చేశాయ్ కాబట్టి, తనకేం కావాలో చెబుతోంది. అందుకని టెన్షన్ తగ్గింది. ఇక, ఇప్పుడు నా గురించి కూడా ఆలోచించడం మొదలుపెడతా. - డి.జి. భవాని -
సినిమారివ్యూ: 'దృశ్యం'
నటీనటులు: వెంకటేశ్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నిర్మాతలు: డి సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి సంగీతం: శరత్ సినిమాటోగ్రఫి: ఎస్ గోపాల్ రెడ్డి ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేశ్ దర్శకత్వం: శ్రీ ప్రియ పాజిటివ్ పాయింట్స్: ఆకట్టుకునే కథ, భావోద్వేగానికి గురి చేసే డైలాగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెగిటివ్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడంలో 'విక్టరీ' వెంకటేశ్ ది ఓ ఢిఫరెంట్ స్టైల్. రీమేక్ చిత్రాల్లో నటించి భారీ హిట్లను తన ఖాతాలో వెంకటేశ్ వేసుకున్న సంగతి తెలిసిందే. కాని ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు వెంకటేశ్ కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అయితే రీమేక్ చిత్రాలు నిరాశ పరిచినా.. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యం' చిత్రాన్ని ఎంపిక చేసుకుని.. అదే పేరుతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్, మీనాలు జంటగా నిర్మాత డి సురేశ్, రాజ్ కుమార్ సేతుపతిలు రూపొందించిన 'దృశ్యం' చిత్రం జూలై 11వ తేదిన విడుదలకు సిద్దమైంది. సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపులతో వచ్చిన 'దృశ్యం' ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తాం. కథ: పోలీస్ అధికారులైన నదియా, నరేశ్ లకు వరుణ్ (రోషన్) అనే కుమారుడు ఉంటాడు. వరుణ్ కనిపించకుండా పోయాడనే విషయం నదియా, నరేశ్ లకు తెలుస్తుంది. దాంతో వరుణ్ ఆచూకీ కోసం వేట మొదలెడుతారు పోలీసులు. అయితే ఈ విచారణలో రాజావరం అనే కుగ్రామంలో ఓ కేబులు ఆపరేటర్ రాంబాబు (వెంకటేశ్) కుటుంబాన్ని అనుమానిస్తారు. వరుణ్ ఆచూకీ తెలుసుకునేందుకు రాంబాబు కుటుంబాన్ని విచారిస్తారు. అయితే రాంబాబు కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి కారణమేంటి? రాంబాబు కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? వరుణ్ కనిపించకుండా పోవడానికి రాంబాబు కుటుంబానికి సంబంధమేమిటి. సంతోషంగా భార్య, ఇద్దరు కూతుర్లతో జీవితాన్ని వెళ్లదీస్తున్న రాంబాబు కుటుంబానికే ఈ సమస్య ఎందుకు ఎదురైంది. పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి రాంబాబు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు రాంబాబు కుటుంబం సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? పోలీస్ ఆఫీసర్లకు తమ కుమారుడి ఆచూకీ దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 'దృశ్యం'. నటీనటుల ఫెర్ఫార్మెన్స్: రాంబాబుగా వెంకటేశ్ మరోసారి ఓ విభిన్నమైన పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేబుల్ ఆపరేటర్ గా, ఓ కుటుంబ పెద్దగా వెంకటేశ్ చక్కటి ఎమోషన్స్ పలికించారు. సమస్యల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు పాత్ర ద్వారా వెంకటేశ్ సగటు ప్రేక్షకుడ్ని మరోసారి మైమరిపించారు. ఇమేజ్ కు భిన్నంగా పాత్రలను ఎంచుకోవడంలో వైవిధ్యం చూపే వెంకటేశ్ మరోమారు రాంబాబు పాత్ర ద్వారా తన సత్తాను చాటారు. గత కొద్దికాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తూన్న వెంకటేశ్... 'దృశ్యం' ద్వారా మంచి అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత మీనా మరోసారి తనదైన నటనను ప్రదర్శించారు. 'దృశ్యం' ద్వారా మీనా టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించినట్టే. కాకపోతే అర్జంటుగా కొంచెం లావు తగ్గాల్సిందే. మంచి ఫెర్ఫార్మెన్స్ తో గతంలో ఆకట్టుకున్న మీనా.. మరోసారి 'దృశ్యం' ద్వారా చేరువయ్యారనే చెప్పవచ్చు. వెంకటేశ్ కూతుళ్లుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ లు మంచి మార్కులే సొంతం చేసుకున్నారు. చిన్న పాత్రైనా నరేశ్ ప్రాధాన్యత ఉన్న పాత్రతో అదరగొట్టేశారు. క్లైమాక్స్ లో నరేశ్ నటన బాగుంది. నదియా పాత్ర ఓకే అనిపించినా.. మరికొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. నదియా క్యాస్టూమ్స్, మేకప్ విషయంలో కొత్త అశ్రద్ద చేశారా అనే ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో కానిస్టేబుల్ గా నటించిన రవి కాలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నెగిటివ్ షేడ్స్ తో రవి కాలే ఆకట్టుకున్నారు. రాంబాబును, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసే పాత్రలో రవి కాలే నటన సూపర్ అని చెప్పవచ్చు. వెంకటేశ్ అసిస్టెంట్ గా సప్తగిరి తన హాస్యంతో పర్వాలేదనింపించారు. పరుచూరి వెంకటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్ లు తమ పాత్రల స్వభావం, పరిధి మేరకు న్యాయం చేకూర్చారు. సాంకేతిక నిపుణుల పనితీరు: కథ డిమాండ్ మేరకు శరత్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా సెంటిమెంట్, భావోద్వేగాలకు గురిచేసేందుకు అవసరమైన టెంపోను బ్యాక్ గ్రౌండ్ స్కోరును మెయింటెన్ చేయడంలో శరత్ సఫలమయ్యారు. ఇక డార్లింగ్ స్వామి అందించిన డైలాగ్స్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. సున్నితంగా, సహజంగా ఉండే డైలాగ్స్ అందించిన డార్లింగ్ స్వామి.. సెంటిమెంట్ సీన్లలో డైలాగ్స్ తో తన మార్క్ ను ప్రదర్శించారు. ఇక సగటు ప్రేక్షకుడిలో ఓ ఫీల్ నింపే విధంగా 'దృశ్యం' చిత్రాన్ని రూపొందించడంలో అలనాటి నటి శ్రీప్రియ సక్సెస్ అయ్యారు. అయితే ఈ చిత్ర తొలి భాగంలోనూ, రెండవ భాగంలోనూ కథనంలో వేగం మందగించడం ప్రేక్షకుడ్ని కొంత అసహనానికి గురి చేసేలా ఉంది. ఎడిటింగ్ కు దర్శకురాలు ఇంకాస్త పదను పెట్టి ఉంటే కథనంలో వేగం మరింత పెరిగేదనే ఫీలింగ్ కలిగింది. కెమెరా పనితనం గొప్పగా లేకున్నా.. ఓకే రేంజ్ లో ఉంది. అక్కడక్కడా తడబాటుకు గురైనా.. సస్పెన్స్, థ్రిలింగ్ అంశాలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించారు. అయితే క్లైమాక్స్ లో ఈ చిత్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా.. ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తిని పంచడంలో దర్శకురాలు శ్రీప్రియ సఫలమయ్యారు. ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా.. సానుకూల అంశాలు ఎక్కువగా డామినేట్ చేశాయి. ఓవరాల్ గా ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలతో పోల్చుకంఉటే 'దృశ్యం' ఓ ఫీల్ గుడ్ చిత్రంగా నిలవడం ఖాయం. ట్యాగ్: 'దృశ్యం' ప్రేక్షకుల్లో ఓ చక్కటి అనుభూతిని నింపే ఓ సదృశ్యం! -- రాజబాబు అనుముల Note: Preview Show at Cinemax on Wednesday Follow @sakshinews -
మరోసారి కమల్‌తో గౌతమి
విశ్వ నటుడు కమల్ హాసన్‌తో నటి గౌతమి మరోసారి జతకట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ జంట ఇంతకు ముందు కురుదిపుణళ్, దేవర్ మగన్ చిత్రాల్లో అలరించిన విషయం తెలిసిందే. అప్పుడు తెరపై జీవించిన ఈ సంచలన జోడీ ఇప్పుడు ఒకరి కోసం ఒకరన్నట్లుగా సహజీవనం చేస్తున్నారు. కాగా కమల్ ప్రస్తుతం ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన నటన పరాకాష్టకు మరో ఉదాహరణగా ఈ చిత్రం తెరపై ఆవిష్కృతం కానుంది. తదుపరి కమల్ మల యాళ చిత్రం దృశ్యం రీమేక్‌లో నటించనున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో నటి మీనా, రేవతి, సిమ్రాన్ తదితర పేర్లు వార్తలకెక్కాయి. ఈ ప్రచారాలను నటి మీనాతో సహా అందరూ ఖండించారు. ఆ పాత్రకు నటి గౌతమి పోషించనున్నారనేది తాజా సమాచారం. -
మీరు చేస్తేనే బావుంటుంది
ఈ మధ్యకాలంలో దక్షిణాదిన అన్ని భాషలవారి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘దృశ్యం’. మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన ఈ మలయాళ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రీమేక్ కానుంది. కన్నడంలో కూడా పునర్నిర్మితం కానుంది. శాండిల్‌వుడ్‌లో క్రేజీ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్న రవిచంద్రన్ ఈ చిత్రంలో నటించబోతున్నారు. కన్నడంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. వాసు ఈ రీమేక్‌ని తెరకెక్కించనున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, రాక్‌లైన్ వెంకటేష్, జగ్గేష్, సుదీప్ తదితరులు ఈ సినిమా ‘మీరు చేస్తేనే బాగుంటుంది’ అని రవిచంద్రన్‌తో అన్నారట. మలయాళ ‘దృశ్యం’ని చూడగానే చాలా థ్రిల్ అయ్యానని, ఈ రీమేక్‌లో నటించే అవకాశం నాకే రావడం ఆనందంగా ఉందని రవిచంద్రన్ పేర్కొన్నారు.