జీతూ జోసెఫ్
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. ఇటీవలే ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కించారు జీతు. ఈ సినిమా నేరుగా అమేజాన్ ప్రై మ్‌లో విడుదలయింది. ఈ సినిమా కూడా విశేష ప్రశంసలు అందుకుంటోంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. తాజాగా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని ప్రకటించారు దర్శకుడు జీతు. ఆల్రెడీ మూడో భాగం కై్లమాక్స్ రాసుకున్నానని తెలిపారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment