
‘దృశ్యం 2’ సినిమా ప్రకటన సందర్భంగా వెంకటేశ్, జీతు, సురేష్ బాబు
‘దృశ్యం’ సీక్వెల్ ‘దృశ్యం 2’ చిత్రానికి సిద్ధం అయ్యారు వెంకటేశ్. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘దృశ్యం’ (2013). ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలయింది. మలయాళ ‘దృశ్యం’ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు వెంకటేశ్. సీక్వెల్‌లో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అది నిజమే. మలయాళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment