
వెంకటేశ్, మీనా
హీరో వెంకటేశ్ మంచి జోష్‌లో ఉన్నారు. సినిమాల మీద సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్’కు తెలుగు రీమేక్) సినిమా షూట్‌ను పూర్తి చేసిన వెంకటేశ్ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్ చెప్పారు. మలయాళ ‘దృశ్యం 2’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ తొలి భాగంలో భార్యాభర్తలుగా నటించిన వెంకటేశ్, మీనాలే సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబందం ప్రకటించింది. ఇప్పుడు నదియా, మీనా కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు వెంకటేశ్ ‘ఎఫ్–3’ సినిమాతో బిజీ అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment