దృశ్యం-2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌? | Drushyam 2 Released On Fathers Day Special | Sakshi
Sakshi News home page

దృశ్యం-2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

Published Mon, Apr 5 2021 12:53 AM | Last Updated on Mon, Apr 5 2021 1:08 AM

Drushyam 2 Released On Fathers Day Special - Sakshi

అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే  కథాంశంతో ‘దృశ్యం 2’ సినిమా సాగుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్‌ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కేరళలో జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’ సినిమాను ఫాదర్స్‌ డే సందర్భంగా జూన్‌ 20న విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. కుటుంబం కోసం ఓ తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది కాబట్టి ఆ రోజు అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement