దృశ్యం, విరాట పర్వం కూడా ఓటీటీలోకే! డీల్‌ ఎంతో తెలుసా! | Venkatesh Narappa And Drushyam 2 OTT Deal Is 76 Crore | Sakshi
Sakshi News home page

OTT: దృశ్యం, విరాట పర్వం కూడా ఓటీటీలోకే! డీల్‌ ఎంతో తెలుసా!

Published Tue, Jul 13 2021 4:42 PM | Last Updated on Wed, Jul 14 2021 8:07 AM

Venkatesh Narappa And Drushyam 2 OTT Deal Is 76 Crore - Sakshi

విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారప్ప. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన అసురన్‌ మూవీకి నారప్ప రీమేక్‌. సూరేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 20 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న సంగతి తెలిసిందే. అమెజాన్‌ ప్రైం నారప్పకు 40 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘నారప్ప, దృశ్యం-2’లను ఓటీటీకి భారీ మొత్తంలో సురేష్‌ బాబు ఢీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 76 కోట్లకు అమ్ముడు పోయాయట. ఇక ‘దృశ్యం 2’ అయితే శాటిలైట్‌, డిజిటల్‌, డైరెక్ట్‌-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్‌ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే నారప్ప, దృశ్యం 2 తో పాటు రానా ‘విరాట పర్వం’ కూడా నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement