స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు | Trolls On Meena Makeup Looks In Drishyam-2 | Sakshi
Sakshi News home page

ఏడుపు సీన్లలోనూ డార్క్‌ లిప్‌స్టిక్‌..

Published Mon, Mar 1 2021 11:12 AM | Last Updated on Mon, Mar 1 2021 2:02 PM

Trolls On Meena Makeup Looks In Drishyam-2 - Sakshi

చిత్రంలో మధ్య వయస్కురాలున్న  గృహిణి పాత్రలో కనిపించిన మీనా.. అందుకు తగిన విధంగా లేదని, అతిగా మేకప్‌ వేసుకుందని విమర్శిస్తున్నారు.

మోహన్‌లాల్‌ హీరోగా, జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్‌ చిత్రం ‘దృశ్యం’. 2013లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఇటీవలె ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ను తెరక్కించిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్‌ కథాంశం, సస్పెన్స్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. అయితే మోహన్‌లాల్‌కు జోడీగా నటించిన మీనాను మాత్రం​ నెటిజన్లు తెగ ట్రోల్స్‌ చేసేస్తున్నారు. ఈ చిత్రంలో మధ్య వయస్కురాలున్న  గృహిణి పాత్రలో కనిపించిన మీనా.. అందుకు తగిన విధంగా లేదని, అతిగా మేకప్‌ వేసుకుందని విమర్శిస్తున్నారు. ఎమోషనల్‌,ఏడుపుగొట్టే  సన్నివేశాల్లోనూ   చెదరని జుట్టు, డార్క్‌ లిప్‌స్టిక్‌తో కనిపించిందని ఇది రియలిస్టిక్‌ లేదని పేర్కొంటున్నారు.

అయితే నెటిజన్లు చేస్తున్న విమర్శలపై స్పందించిన దర్శకుడు జితూ..వారి అభిప్రాయాలతో తాను సైతం ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. డీ-గ్లామరస్‌ లుక్‌లో కనిపించేందుకు తాను సుముఖంగా లేనని, స్క్రీన్‌పై అలా నటించడం తనకి ఇష్టం లేదని మీనా చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో మీనా నిర్ణయంతో తాను ఏకీభవించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక జీతు జోసెఫ్‌ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేశ్‌ నటించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని, ఆల్రెడీ మూడో భాగం క్లైమాక్స్‌ రాసుకున్నానని  డైరెక్టర్‌ జీతూ వెల్లడించారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

చదవండి :
ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’!


టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement