
సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'దృశ్యం2' న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్థరాత్రి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ..జార్జ్ కుట్టి, అతని కుటుంబం కథతో ముందుకు వస్తున్నామని, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, సిద్దిక్, ఆశా శరత్, మురళి గోపీ, అన్సిబా, ఎస్తేర్, సైకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2013లో విడుదలైన దృశ్యం మొదటి పార్ట్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మొదటి పార్ట్‌లో ఎక్కడైతే కథ ఆగిందో సెకండ్ పార్ట్‌లో అక్కడినుంచి కంటిన్యూ కానుంది.
థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అది కాకుండా గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ప్రకటించినా కరోనా కారణంగా షూటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యింది. కాగా మోహన్‌లాల్ తదనంతరం జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే ‘రామ్’ అనే మరో చిత్రానికి సైన్ చేశారు.
Georgekutty and his family are coming soon on @PrimeVideoIN#Drishyam2OnPrime #HappyNewYear2021 #MeenaSagar #JeethuJoseph @antonypbvr @aashirvadcine @drishyam2movie #SatheeshKurup pic.twitter.com/5l7cfCdCS3
— Mohanlal (@Mohanlal) December 31, 2020