మరోసారి కమల్‌తో గౌతమి | gautami once again to act with kamal | Sakshi
Sakshi News home page

మరోసారి కమల్‌తో గౌతమి

Published Sat, Mar 8 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

మరోసారి కమల్‌తో గౌతమి

మరోసారి కమల్‌తో గౌతమి

విశ్వ నటుడు కమల్ హాసన్‌తో నటి గౌతమి మరోసారి జతకట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ జంట ఇంతకు ముందు కురుదిపుణళ్, దేవర్ మగన్ చిత్రాల్లో అలరించిన విషయం తెలిసిందే. అప్పుడు తెరపై జీవించిన ఈ సంచలన జోడీ ఇప్పుడు ఒకరి కోసం ఒకరన్నట్లుగా సహజీవనం చేస్తున్నారు. కాగా కమల్ ప్రస్తుతం ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు.
 
 ఆయన నటన పరాకాష్టకు మరో ఉదాహరణగా ఈ చిత్రం తెరపై ఆవిష్కృతం కానుంది. తదుపరి కమల్ మల యాళ చిత్రం దృశ్యం రీమేక్‌లో నటించనున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో నటి మీనా, రేవతి, సిమ్రాన్ తదితర పేర్లు వార్తలకెక్కాయి. ఈ ప్రచారాలను నటి మీనాతో సహా అందరూ ఖండించారు. ఆ పాత్రకు నటి గౌతమి పోషించనున్నారనేది తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement